రైల్వే ఉద్యోగుల రెఫరల్‌ ఆస్పత్రిగా ‘గౌరీగోపాల్‌’ | gowrigopal appoints railway employees referral hospital | Sakshi
Sakshi News home page

రైల్వే ఉద్యోగుల రెఫరల్‌ ఆస్పత్రిగా ‘గౌరీగోపాల్‌’

Published Thu, Jul 6 2017 9:43 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

gowrigopal appoints railway employees referral hospital

గుంతకల్లు : గుంతకల్లు రైల్వే డివిజన్‌లోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అత్యవసర సేవలు కర్నూలులోని గౌరీ గోపాల్‌ ఆస్పత్రిలో పొందొచ్చు. అత్యవసర, మెరుగైన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ‘గౌరీ గోపాల్‌’ ఆస్పత్రిని రెఫరల్‌ హాస్పిటల్‌గా ఎంపిక చేస్తూ రైల్వే జనరల్‌ మేనేజర్‌ అనుమతి ఇచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ గుంతకల్లు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నంద్యాల, డోన్‌ తదితర ప్రాంతాల్లో పని చేస్తున్న రైల్వే ఉద్యోగుల దృష్ట్యా కర్నూలు నగరంలోని గౌరి గోపాల్‌ హాస్పిటల్‌లో వైద్యపరీక్షలు చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని రైల్వే జనరల్‌ మేనేజర్‌ను బుధవారం జరిగిన సంఘ్‌ సమావేశంలో కోరినట్లు ఆయన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement