
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కీర్తినగర్ మెట్రో స్టేషన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు రైల్వే ఉద్యోగులు ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. మరో ఇద్దరు వారికి సహకరించారు. మొత్తం నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త నుంచి వేరుగా ఉంటున్న ఓ ఒంటరి మహిళను ఉద్యోగం ఇప్పిస్తానంటూ రైల్వే ఉద్యోగి ఒకరు నమ్మించాడు. తన కుమారుడి బర్త్‌డే వేడుకకు రావాలంటూ ఆహ్వానించాడు.
ఈనెల 21వ తేదీన కీర్తినగర్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్న ఆమెను రాత్రి 10.30 గంటల సమయంలో ఆ ఆవరణలోనే ఉన్న రైల్వే ఎలక్ట్రికల్ సిబ్బంది గదికి తీసుకెళ్లాడు. ఇప్పుడే వస్తానంటూ వెళ్లి, మరో ఫ్రెండ్‌ను తీసుకొచ్చాడు. బయట మరో ఇద్దరు సహోద్యోగులు కాపలా కాస్తుండగా వీరు ఆమెపై అత్యాచారం చేశారు. శనివారం ఉదయం బాధితురాలు రైల్వే అధికారులకు తన ఆవేదనను వివరించింది. అధికారుల ఆదేశాల మేరకు, పోలీసులు బాధ్యులైన నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment