మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం | woman raped by cab driver in delhi | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం

Published Sun, Dec 7 2014 10:33 AM | Last Updated on Tue, Aug 14 2018 3:14 PM

మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం - Sakshi

మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. నిర్భయ ఉదంతం అనంతరం కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై ఆగడాలు ఆగడం లేదు. శుక్రవారం రాత్రి మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.

గుర్గావ్లో ఓ ఫైనాన్స్ సంస్ధలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి విధులు ముగించుకున్నఅనంతరం స్నేహితులతో కలసి భోజనం చేశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తన ఇంటికి వెళ్లడానికి ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన క్యాబ్ను అద్దెకు తీసుకున్నారు. ఇంటికి వెళుతున్న సమయంలో ఆమె కారులో నిద్రపోయారు. నిద్రలేచి చూసేసరికి నిర్మానుష ప్రదేశంలో కారు ఆగిఉంది.  డ్రైవర్ మహిళా ఉద్యోగిని బంధించి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. ఆమెను ఇంటి సమీపంలో వదిలి వెళ్లిపోయాడు. ఆ సయమంలో బాధితురాలు కారు నెంబర్ ప్లేట్ను ఫోటో తీసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్యాబ్ కంపెనీని, నిందితుడిని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement