కేఎంసీలో అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్
Published Sat, May 27 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM
కర్నూలు(హాస్పిటల్): భారత వైద్య విధాన మండలి నిబంధనల మేరకు కర్నూలు మెడికల్ కళాశాలలో అభివృద్ధి పనుల కోసం జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన తన ఛాంబర్‌లో కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో తీర్మానాల వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్‌రామప్రసాద్ వివరించారు. కళాశాలలో డిజిటల్ ల్రైబరి కోసం రూ.10లక్షలు, లైబ్రరీలో వసతుల కోసం రూ.7లక్షలు మంజూరు చేశారన్నారు. సెమినార్ హాల్స్‌లో ఏసీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఓల్డ్ సీఎల్‌జీలోని స్టాఫ్‌క్లబ్ ఆధునీకరణ కోసం రూ.2లక్షలు, ల్యాబ్‌లలో కెమికల్స్ కొనుగోలుకు రూ.11లక్షలు, లైబ్రరీకి జనరల్స్, ఇంటర్‌నెట్ నెట్స్, కంప్యూటర్స్ కొనుగోలుకు రూ.25లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. కళాశాల పరీక్ష హాలులో జామర్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారన్నారు. కమిటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, సభ్యులుగా తనతో పాటు డాక్టర్ కృష్ణానాయక్, డాక్టర్ భాస్కరరెడ్డి, డాక్టర్ పద్మ విజయశ్రీ ఉంటారని తెలిపారు. సమావేశంలో జేసీ-2 రామస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, డాక్టర్ వెంకటరమణ, ఎన్‌ఐసీ రాజశేఖర్ పాల్గొన్నారు.
Advertisement