Digital Library
-
వైద్య విద్యార్థులకు వరం.. డిజిటల్ లైబ్రరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యవిద్యకు సంబంధించిన అత్యాధునిక పుస్తకాలు, వివిధ రకాల అరుదైన చికిత్సలకు సంబంధించిన వీడియోలు, వేలాది జర్నల్స్‌తో కూడిన డిజిటల్ లైబ్రరీ (ఈ–లైబ్రరీ)ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వైఎస్సార్ మెడ్‌నెట్ కన్సార్షియం పేరుతో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ, ఆయుష్, పారా మెడికల్, నర్సింగ్ కోర్సులకు సంబంధించి వేలాది రకాల అత్యాధునిక పాఠ్యపుస్తకాలు, జర్నల్స్, అరుదైన చికిత్సలు, ట్రీట్మెంట్ ప్రొటోకాల్‌కు సంబంధించిన వీడియోలు ఉంచారు. ప్రతి విద్యార్థి డిజిటల్ లైబ్రరీని సులభంగా వినియోగించుకునేందుకు మైలాఫ్ట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం యూనివర్సిటీ రూ. 4 కోట్లు వెచ్చించింది. మైలాఫ్ట్.. యూజర్ ఫ్రెండ్లీ యాప్.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 2008లోనే డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. కానీ పరిమిత సంఖ్యలో మాత్రమే అక్కడ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. లైబ్రరీలో మాత్రమే దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో లైబ్రరీ పనివేళల్లో వెళ్లేందుకు కుదరకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. పరిస్థితి గమనించిన ప్రస్తుత వర్సిటీ అధికారులు అత్యాధునిక పరిజ్ఞానంతో మైలాఫ్ట్ (మై లైబ్రరీ ఆన్ ఫింగర్ టిప్స్) అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు, టీచింగ్ వైద్యులు, ఎక్కడినుంచైనా తమ మొబైల్లో సైతం లాగిన్ అయ్యి డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీన్లో 21 వేలకు పైగా ఈ–బుక్స్, 22,433కు పైగా ఈ– జర్నల్స్, 11,000 పైగా వీడియోలు ఉన్నాయి. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రతి విద్యార్థి ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా డిజిటల్ లైబ్రరీని ఆధునీకరించాం. మైలాఫ్ట్ యూజర్ ఫ్రెండ్లీ యాప్ ద్వారా విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎక్కడి నుంచైనా, తమ మొబైల్స్‌లో సైతం లాగిన్ అయ్యే అవకాశం కల్పించాం. డిజిటల్ లైబ్రరీ వినియోగంపై అన్ని కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ వి.రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ సద్వినియోగం చేసుకోవాలి మైలాఫ్ట్ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు టెక్నికల్ సిబ్బందితో కలిసి జోనల్ వారీగా సదస్సులు నిర్వహించి యాప్ వినియోగంపై ఫ్యాకలీ్ట, విద్యార్థుల్లో అవగాహన కలి్పస్తున్నాం. వేలాది ఈ–బుక్స్, ఈ–జర్నల్స్, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. – డాక్టర్ కె.సుధ, కో ఆర్డినేటర్, కన్సార్షియం, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మోడల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ విద్యారంగంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్లో ప్రతిబింబించాయి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, డిజిటల్ లైబ్రరీలు, పీఎం శ్రీ స్కూళ్ల ఏర్పాటుసహా మరికొన్ని కార్యక్రమాలకు రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిగా మారాయి. ‘టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమాన్ని కేంద్రం ఈ బడ్జెట్లో పొందుç³రిచింది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంజనీరింగ్ విద్యాసంస్థలు అకడమిక్ ఎక్సలెన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంపై సమష్టిగా దృష్టి సారిస్తాయి. అయితే, రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డు ద్వారా ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తోంది. రాష్ట్ర వర్సిటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం వంటి సంస్థలన్నీ కలిపి పరస్పర సహకారం అందించుకుంటూ ముందుకు వెళ్లేలా దీన్ని అమలు చేస్తున్నారు. డిజిటల్ లైబ్రరీలు, నైపుణ్యాభివృద్ధికి చర్యలు ప్రతి పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసి యువతకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. రాష్ట్రంలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుపై ప్రభుత్వం ఇంతకుముందే దృష్టి సారించింది. దీంతోపాటు ఉన్నత విద్యామండలి ద్వారా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)ను ఏర్పాటు చేయించి విద్యార్థులకు పలు సబ్జెక్టు అంశాలను అందుబాటులోకి తెచ్చింది. కాగా, నైపుణ్యాభివృద్ధి కోసం ‘స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ల’ ఏర్పాటుకు కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి ఏర్పాట్లు చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు చదువులు పూర్తయ్యే నాటికే పూర్తి నైపుణ్యాలు కలిగి ఉండేలా తీర్చిదిద్దడంతో పాటు బయటకు వచ్చిన తరువాత కూడా అప్‌స్కిల్లింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 స్కిల్ హబ్‌లు, 26 స్కిల్ కాలేజీలు, రెండు స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయిస్తోంది. నాడు–నేడు తరహాలో.. దేశంలో కొత్తగా భారతీయ భాషా యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. స్థానిక భాషల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తోంది. కాగా, పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రం జాతీయ స్థాయిలో 14,500 స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ బడ్జెట్లో రూ.4,000 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో నాడు–నేడు పథకం కింద అన్ని విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏకంగా రూ.16 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. -
కలెక్టర్ సాబ్.. మీరు చేసిన పనికి హ్యాట్యాఫ్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ధర్మవరం జెడ్పీ హైస్కూల్... ఎస్.కోట మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరిన ఆ విద్యాలయం ఇప్పుడు ఆధునికీకరణకు అద్దం పడుతోంది. ధర్మవరం జెడ్పీ హైస్కూల్ స్టూడెంట్‌నని అక్కడి విద్యార్థులు ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. దానికి రెండు కారణాలు... ఒకటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు. మరొకటి అక్కడి పూర్వ విద్యార్థి, పల్నాడు జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్ కృషి. విద్యాబుద్ధులు నేర్పడమే గాక తాను ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యానికి బీజం వేసిన పాఠశాలకు గురుదక్షిణ సమర్పించిన తీరు స్ఫూర్తిదాయకమైంది. సొంతంగా రూ.8.5 లక్షలు ఖర్చు చేసి డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చారు. ఏదో చేశామంటే చేశామని గాకుండా ఆధునికీకరణ, సౌకర్యాల కల్పన, పుస్తకాల బహూకరణ... ఇలా ప్రతి విషయంలోనూ ఆయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. లోతేటి శివశంకర్ పదో తరగతి (1995–96 బ్యాచ్) వరకూ ధర్మవరం జెడ్పీ హైస్కూల్లో చదివారు. తర్వాత ఐఏఎస్ సాధించి వివిధ హోదాల్లో పనిచేస్తున్నా ఆ స్కూల్‌ను ఆయన మరచిపోలేకపోయారు. అత్యున్నత సర్వీసు సాధించడంలో తనను స్ఫూర్తి ప్రదాతగా భావిస్తున్న విద్యార్థులకు తన వంతు తోడ్పాటు అందించడానికి ఇతోధికంగా కృషి చేస్తున్నారు. అప్పటికే తన పదో తరగతి బ్యాచ్ స్నేహితులతో కలిసి బాహుదా సేవాసంఘాన్ని ఏర్పాటు చేశారు. ధర్మవరం గ్రామంలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. తిత్లీ తుఫాన్ సమయంలో దెబ్బతిన్న విద్యుత్తు వ్యవస్థను రెండ్రోజుల్లోనే పునరుద్ధరించగలిగారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా గ్రామంలో వైద్య సేవలు అందేలా ఆ సంఘం విశేష కృషి చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలతో ధర్మవరం జెడ్పీ హైస్కూల్‌కు రూపురేఖలు మారాయి. మన బడి నాడు–నేడు కార్యక్రమం ఎంతో దోహదం చేసింది. ఆర్నెల్ల క్రితం ఆ పాఠశాలను సందర్శించిన శివశంకర్... అక్కడి విద్యార్థుల విద్యా మనోవికాసానికి ఉపయోగపడేలా డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తండ్రి పేరుతో రూ.8.5 లక్షల విరాళం.. డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడానికి పాఠశాల ప్రాంగణంలోనే ఒక హాల్‌ను శివశంకర్ ఎంపిక చేశారు. తన తండ్రి లోతేటి సన్యాసప్పడు పేరుతో రూ.8.5 లక్షల విరాళంగా సమకూర్చారు. ఆ నిధులతో చక్కని మార్చుల్స్, సీలింగ్, గోడలకు పుట్టీ, పెయింటింగ్‌తో ఆహ్లాదంగా ఆ హాల్‌ను అభివృద్ధి చేశారు. ఏసీ సౌకర్యంతో పాటు స్టడీ టేబుళ్లు, కుషన్ కుర్చీలు సమకూర్చారు. రెండు కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇక పుస్తకాలను సమకూర్చడంలో శివశంకర్ తన వంతు కృషి చేశారు. తాను చదువుకున్న, సేకరించిన పుస్తకాలను లైబ్రరీకి ఇచ్చేశారు. చలం మాస్టారి సహకారంతో వైజ్ఞానిక, సాహిత్య, పోటీ పరీక్షల పుస్తకాలన్నీ అందుబాటులోకి తెచ్చారు. అవన్నీ భద్రంగా ఉంచేందుకు ప్రత్యేక కప్‌బోర్డులను ఏర్పాటు చేశారు. అత్యధిక కాలం లైబ్రరీలో పుస్తక పఠనంలోనే గడిపిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను విద్యార్థులు స్పూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ డిజిటల్ లైబ్రరీకి ఆయన పేరుతోనే నామకరణం చేశారు. అంతేకాదు పుస్తక పఠనం వైపు విద్యార్థుల ఆసక్తిని పెంచడానికి పోటీ కూడా పెట్టారు. రానున్న దసరా సెలవుల్లో బాహుదా సేవాసంఘం సభ్యులు వారికి పోటీ పరీక్ష నిర్వహించనున్నారు. అందులో అత్యుత్తమ ప్రతిభ చూపిన తొలి 20 మంది విద్యార్థులను ఐదు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో విజ్ఞాన యాత్రకు తీసుకెళ్తానని శివశంకర్ హామీ ఇవ్వడం విశేషం. -
అరచేతిలో ఈ- పాఠం
మచిలీపట్నం: రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికతతో విద్య, అభ్యసన వ్యవస్థల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలకు వరకూ అంతా డిజిటల్ పాఠానికి అలవాటు పడ్డారు. అందుకు తగ్గట్లుగా విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు అందరికీ ఉపయోగపడేలా కృష్ణా యూనివర్సిటీ అధికారులు ఈ–విజ్ఞాన భాండాగారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్ అబ్దుల్ కలామ్ పేరిట అత్యాధునిక సౌకర్యాలతో డిజిటల్ లైబ్రరీని గత విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. తద్వారా డిగ్రీ, పీజీ పట్టాలతో బయటకు వెళ్లే విద్యార్థులు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా సాంకేతికతతో కూడిన విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అవకాశం కలి్పంచారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, వివిధ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు అభ్యసించే సుమారు వెయ్యి మంది విద్యార్థులు సెంట్రల్ లైబ్రరీ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో సాంకేతికతను జోడించారు. చదువుతున్న కోర్సులకు రిఫరెన్స్‌గా సుమారు ఒక లక్షకు పైగా ఈ–బుక్స్ అందుబాటులో ఉంచారు. కంప్యూటర్ల ద్వారా విద్యార్థులు వీటిని వినియోగించుకునేలా తగిన ఏర్పాట్లు చేశారు. ఒకే సారి వందమంది విద్యార్థులు లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుకునేలా సీటింగ్ సమకూర్చారు. అంతేకాక ఇక్కడ లభ్యమయ్యే ఈ–బుక్స్ విద్యార్థులు తమ మొబైల్ లేదా వ్యక్తిగత కంప్యూటర్ ద్వారా ఎక్కడి నుంచైనా ఓపెన్ చేసుకుని చదువుకునే వెసులుబాటును కల్పించారు. విద్యార్థి ఐడీ నంబర్‌తో పాటు లైబ్రేరియన్ ఇచ్చే పాస్‌వర్డ్‌తో ఈ–బుక్స్ ఓపెన్ అయ్యే విధంగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులో ఉంచారు. అలాగే లైబ్రరీలో ఉచిత వైఫై అందుబాటులో ఉండటం విద్యార్థులకు మేలు చేకూరుస్తోంది. పరిశోధనలకు వీలుగా.. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లకు కృష్ణా యూనివర్సిటీ వేదికగా నిలుస్తుండటంతో పరిశోధన విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. వీరికి సౌకర్యవంతంగా ఉండేలా సెంట్రల్ లైబ్రరీలో 20 వేలుకు పైగా ఈ–జర్నల్స్ అందుబాటులో ఉంచారు. స్కాలర్స్‌తో పాటు బోధన చేసే అధ్యాపకులు కూడా వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా ఉపయోగం.. ప్రతి రోజూ లైబ్రరీకి వస్తాను. సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. లైబ్రరీలో ఎన్నో సాహిత్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతో పాటు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నాలాంటోళ్లకు లైబ్రరీ ఎంతో ఉపయోగపడుతుంది. – వి. రాశీ వేణి, ఎంఏ ఇంగ్లిష్ విద్యార్థి, క్యాంపస్ కాలేజీ మ్యాగజైన్లతో ఎంతో మేలు.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెలువడే మ్యాగజైన్స్‌ను తెప్పిస్తున్నాం. వివిధ పోటీ పరీక్షల మెటీరియల్ కూడా లైబ్రరీలో ఉంది. వీటి వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. వర్సిటీ వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ లైబ్రరీ నిర్వహణపై ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. – డాక్టర్ జ్యోతిర్మయి, లైబ్రరీ కో–ఆర్డినేటర్ విద్యార్థులకు ప్రయోజనం.. క్యాంపస్ చదువులపై ఎంతో ఇష్టపడి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మేలు చేసేలా వర్సిటీ ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నాం. డాక్టర్ ఏపీజే అబ్డుల్ కలామ్ లైబ్రరీ విద్యార్థులకు ఎంతో ఉపయోపడుతుంది. ఇకపై ఎక్కువ పుస్తకాలు ఈ–బుక్స్గానే అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కువ మంది విద్యార్థులు సది్వనియోగం చేసుకునేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. – డాక్టర్ ఎం రామిరెడ్డి, రిజిస్ట్రార్, కృష్ణా యూనివర్సిటీ -
హైదరాబాద్ డీఈఓకు జాతీయ పురస్కారం
గన్‌ఫౌండ్రీ: కరోనా కష్టకాలంలో విద్యార్థుల కోసం రూపొందించిన డిజిటల్ లైబ్రరీ వెబ్‌సైట్‌కు వచ్చిన విశేష స్పందనకు చక్కటి గుర్తింపు దక్కింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ఈ మేరకు శనివారం హైదరాబాద్ డీఈఓ రోహిణీకి పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్భంగా టీఎన్జీఓస్ పాఠశాల విద్యాశాఖ విభాగం నగర అధ్యక్షుడు కేఆర్.రాజ్‌కుమార్, కార్యదర్శి ఎం.భాస్కర్ ఆధ్వర్యంలో విద్యాశాఖ ఉద్యోగులు ఆమెను ఘనంగా సన్మానించారు. -
యుద్ధ ప్రాతిపదికన డిజిటల్ లైబ్రరీలు పూర్తి చేయాలి: సీఎం జగన్
-
యుద్ధ ప్రాతిపదికన డిజిటల్ లైబ్రరీలు
సాక్షి, అమరావతి: యుద్ధ ప్రాతిపదికన వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది జూన్ నాటికి తొలి దశ డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణ పనుల పురోగతిపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్‌టాప్, యూపీఎస్, ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు డెస్క్‌టాప్ టేబుల్స్, సిస్టం చెయిర్స్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఐరన్ ర్యాక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. డిజిటల్ లైబ్రరీల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఫేజ్–1 లో మిగిలిపోయిన డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలను ఫేజ్ 2లో కవర్ అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసినట్లవుతుందని, ఇంకా మొదలు కాని చోట్ల పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించిన పనులపై మరింత ధ్యాస పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతోనే వర్క్ ఫ్రం హోం సులువవుతుందని పేర్కొన్నారు. ఫేజ్ –1లో 4,530 గ్రామాల్లో ఏర్పాటవుతున్న డిజిటల్ లైబ్రరీలకు అవసరమైన నెట్ కనెక్టివిటీ ఫిబ్రవరి 2022 నాటికి పూర్తవుతుందని అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవు: సీఎస్ సమీర్ శర్మ -
వర్క్ ఫ్రం విలేజ్ : సీఎం జగన్
సాక్షి అమరావతి: వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌లో భాగంగా గ్రామాల నుంచే పని చేసే పరిస్థితి రావాలని, ఇందులో భాగంగా ప్రతి విలేజ్ డిజిటల్ లైబ్రరీకి అంతరాయం లేని బ్యాండ్ విడ్త్‌తో ఇంటర్నెట్ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తాజాగా వస్తున్న టెక్నాలజీని వినియోగించుకోవాలని, అన్ని విషయాల్లో ఈ డిజిటల్ లైబ్రరీలు యువతకు దిక్సూచిగా మారాలని సూచించారు. వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు వైఎస్పార్ డిజిటల్ లైబ్రరీలు అన్ని విధాలా ఉపయోగపడాలని, అందుకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జనవరికి 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం డిజిటల్ లైబ్రరీల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్‌టాప్ కంప్యూటర్లు, సిస్టం ఛైర్లు, ప్లాస్టిక్ ఛైర్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఐరన్ రాక్స్, పుస్తకాలు, మేగజైన్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో మూడు దశల్లో 12,979 పంచాయతీల్లో వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. జనవరి నాటికి తొలి దశలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తవుతుందని, ఉగాది నాటికి కంప్యూటర్ పరికరాలతో సహా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2022 డిసెంబర్ నాటికి ఫేజ్–2, 2023 జూన్ నాటికి మూడో దశ డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తయ్యేలా లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయ బ్యాండ్ విడ్త్‌తో కూడిన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ సమీక్షలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఎం మధుసూధన్ రెడ్డి, ఏపీటీఎస్ ఎండీ ఎం నందకిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఒక్క బటన్ నొక్కగానే యావత్ ప్రపంచం కళ్లెదుట కనిపించేలా చేసే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఇంటర్నెట్. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు, ఐటీ కంపెనీల ఉద్యోగులకు దీని అవసరం అంతా ఇంతా కాదు. వేగవంతమైన ఇంటర్నెట్తో ఎక్కడి నుంచి అయినా పని చేసే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటి దాకా నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ వ్యవస్థ త్వరలో గ్రామాల నడిబొడ్డుకు రాబోతోంది. ఏకంగా 12,979 గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీల రూపంలో అద్భుతం సృష్టించబోతోంది. సరికొత్త ప్రపంచానికి బాటలు వేయనుంది. -
Digital Library: అరచేతిలో పుస్తక భాండాగారం
సాక్షి, కమ్మర్పల్లి(నిజామాబాద్): కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఏడాది నుంచి గ్రంథాలయాలు మూతపడి ఉన్నాయి. ఒకవేళ తెరిచినా పాఠకులు రాలేని పరిస్థితి నెలకొంది. తెరుచుకున్న సమయంలో పాఠకులు రావడానికి ఆసక్తి చూపడం లేదు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులు తమకు కావలసిన పుస్తకాలను చదవలేక పోతున్నారు. సెల్‌ఫోన్, ఇంటర్నెట్లో మునిగిపోతున్న విద్యార్థులు, యువకులు, ఉద్యోగాన్వేషణలో ఉన్న అభ్యర్థులకు కేంద్రం అరచేతిలోనే విజ్ఞానాన్ని అందించే ‘డిజిటల్ లైబ్రరీ’ని అందుబాటులోకి తెచ్చింది. నిరుద్యోగులు, యువకులు సద్వినియోగం చేసుకునేలా పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను డిజిటలైజేషన్ చేసి ‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. దీంతో అరచేతిలో డిజిటల్ లైబ్రరీ రూపుదిద్దుకుంది. ఇందులో 4 కోట్లకు పైగా పుస్తకాలు పాఠకులకు ఉపయోగపడి, అవసరమయ్యే విజ్ఞానాన్ని పంచనున్నాయి. ఖరగ్‌పూర్ ఐఐటీ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అనుమతితో ఖరగ్‌పూర్ ఐఐటీ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నెట్లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పేరుతో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసింది. ఇందులో విషయ నిపుణుల వీడియోలను పొందుపరిచారు. పాఠశాల, కళాశాల, ఇంజనీరింగ్, వైద్య, న్యాయ విద్య, సాహిత్యం, సంస్కృతం ఇలా అన్ని రకాల స్టడీ మెటీరియల్‌ను ఇంగ్లీష్, హిందీతో పాటు, ఇతర భాషల్లో ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. పోటీ పరీక్షలకు కావలసిన అన్ని అంశాలను పొందుపరిచారు. పాఠశాల పుస్తకాలు(సీబీఎస్ఈ సిలబస్), లిట్రేచర్, మెడిసిన్, లా మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ పుస్తకాలు, మత గ్రంథాలు వివిధ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాలన్ని పీడీఎఫ్ ఫార్మాట్లో ఉండగా, సైట్ ఒపెన్ చేసి చదువుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వినియోగం ఇలా... స్మార్ట్ ఫోన్, ల్యాప్‌ట్యాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్ల ద్వారా డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునేలా తీర్చిదిద్దారు. ఇంటర్నెట్ గూగుల్‌లో ‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ టైప్ చేస్తే డిజిటల్ లైబ్రరీ తెరుచుకుంటుంది. ఈమెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మనకు కావలసిన అంశాలను ఎంచుకొని చదువుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లైబ్రరీలో వీడియోల ద్వారా సైతం విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని టైప్ చేసి డిజిటల్ లైబ్రరీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వినియోగదారులు సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటే కొత్త పుస్తకాలు అందుబాటులోకి వస్తే ఈ మెయిల్ ద్వారా మెసేజ్ వస్తుంది. ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయాల పరిస్థితి... ఉమ్మడి జిల్లాలో 44 గ్రంథాలయాలు ఉండగా, 85 వేల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. సుమారు 6 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కరోనాకు ముందు ఇవి పాఠకులతో కళకళలాడేవి. కరోనాతో గ్రంథాలయాలు వెలవెలబోయాయి. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు, యువకులకు కేంద్రం అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. చదవండి: ఫోన్ పోతే ఇలా తేలికగా కనిపెట్టొచ్చని తెలుసా? -
జనాభా లెక్కన డిజిటల్ లైబ్రరీ వసతులు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న డిజిటల్ లైబ్రరీల్లో వసతుల కల్పన చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి పెరుగుతున్న డిమాండ్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. ఈ లైబ్రరీల్లో జనాభా ప్రాతిపదికన కంప్యూటర్ ఉపకరణాలను ఏర్పాటు చేయనున్నారు. జనాభా వెయ్యిలోపు ఉన్న గ్రామాల్లో 2 డెస్క్‌టాప్‌లు, వెయ్యి నుంచి 3 వేలలోపు ఉన్నచోట 4, ఆపైన ఉన్నచోట 6 డెస్క్‌టాప్‌లను ఏర్పాటు చేయనున్నుట్లు ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్‌శాఖ ముఖ్య కార్యదర్శి జె.జయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. తొలుత 6 కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. తర్వాత జనాభా, డిమాండ్ ఆధారంగా కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కంప్యూటర్ ఉపకరణాలను సమకూర్చడానికి ఒక్కో లైబ్రరీకి రూ.2 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు వ్యయం అవుతుందని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) అంచనా వేసింది. మొదట 4,530 గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ఈ డిజిటల్ లైబ్రరీ పనులను ఈ నెల 15లోగా ప్రారంభించి మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ డిజిటల్ లైబ్రరీ నిర్మాణ పనుల్ని పంచాయతీరాజ్‌శాఖ చేపట్టనుండగా, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ డిజిటల్ లైబ్రరీలకు అవసరమైన ఫర్నిచర్, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు వంటివాటి ఏర్పాటును ఆయా సచివాలయాలు చూసుకుంటాయని జయలక్ష్మి తెలిపారు. -
తొలి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం: సీఎం జగన్
-
ఐటీశాఖ, డిజిటల్ లైబ్రరీపై సీఎం వైస్ జగన్ సమీక్ష
-
తొలి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ శాఖ, డిజిటల్ లైబ్రరీపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గ్రామాలకు మంచి సామర్థ్యం గల ఇంటర్నెట్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తోపాటు.. గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపయోగకరంగా డిజిటల్ లైబ్రరీలు ఉండాలని అధికారులకు సూచించారు. డిజిటల్ లైబ్రరీల్లో కామన్ ఎంట్రన్స్ టెస్టులతోపాటు.. అన్ని రకాల పోటీల పరీక్షలకు అందుబాటులో స్టడీ మెటీరియల్ ఉండాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలకూ ఇంటర్నెట్ సదుపాయం అందించాలని, నిరంతరం ఇంటర్నెట్ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని, తొలి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆగస్టు 15న పనులు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈలోగా స్థలాలు గుర్తించి హ్యాండోవర్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ నాటికి డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా.. ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఈ సమావేశంలో మంత్రి గౌతమ్‌రెడ్డి, ఐటీ, ఫైబర్ నెట్, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. -
ఒక్క క్లిక్ చాలు..
విజయనగరం: కరోనా మహమ్మారి కాలు బయట పెట్టనీయడంలేదు. కాలక్షేపానికి మొబైల్ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. కానీ పుస్తక ప్రియులు గ్రంథాలయాలకు వెళ్లలేక ఏదో కోల్పోయినట్టు భావిస్తున్నారు. అంతేనా... పోటీపరీక్షలకోసం సన్నద్ధమయ్యే విద్యార్థులు... పాఠశాలలకు వెళ్లలేని విద్యార్థులు... వీరందరిదీ ఇదే సమస్య. వీరికోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన వెబ్సైట్, మొబైల్ యాప్‌ను రూపొందించింది. అందులో కావలసినన్ని పుస్తకాలను నిక్షిప్తం చేసింది. ఇంకెందుకాలస్యం... వాటినెలా వినియోగించుకోవచ్చో చూద్దాం. మానవ వనరుల మంత్రిత్వశాఖ(ఎంహెచ్ఆర్డీ), జాతీయ గ్రంథాలయ సంస్థ ప్రత్యేకంగా ఎన్డీఎల్ ఇండియా (జాతీయ డిజిటల్ గ్రంథాలయ భారతదేశం) వెబ్సైట్, మొబైల్ యాప్‌ను రూపొందించారు. ఇందులో పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు అవసరమైన పుస్తకాలను చదువుకోవచ్చు. సివిల్స్, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల కోసం పుస్తకాలను కొనకుండా, గ్రంథాలయాలకు వెళ్లకుండానే ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇదెంతో ఉపయోగకరం. 4 కోట్లకు పైగా పుస్తకాలు డిజిటల్ గ్రంథాలయంలో ఎన్నో పుస్తకాలు దర్శనమిస్తాయి. తెలుగు సహా.. 12కు పైగా భాషల్లో నాలుగు కోట్లకు పైగా రకరకాల పుస్తకాలు పొందుపరిచారు. ఎందరో ప్రముఖుల కు సంబంధించిన 3 లక్షల వరకు మహానీయుల జీవిత చరిత్ర పుస్తకాలతోపాటు పోటీ పరీక్షల పుస్తకాలు, యూనివర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నపత్రాలు, సమాధాన పుస్త కాలు, కంప్యూటర్ సైన్స్, బీఎడ్, డీఎడ్, ఛాత్రోపాధ్యాయుల శిక్షణ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పరిశోధన సంస్థలు, ప్రభుత్వరంగ పుస్తకాలతోపాటు సాహిత్య పుస్తకాలను ఇందులో చూడొచ్చు. ఆర్టికల్స్, వీడియో, ఆడియోల రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఎన్డీఎల్ ఇండియా మొబైల్‌యాప్‌లో... ఎన్డీఎల్ ఇండియా ద్వారా డిజిటల్ పుస్తకాలను చదువుకోవడం చాలా సులభం. గూగుల్‌లో ఎన్డీఎల్ ఆఫ్ ఇండియా అని టైప్ చేసి వెబ్ పేజీని ప్రారంభించాలి. అందులో ఈ–మెయిల్ ఐడీ సాయంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తాము చదువుతున్న విశ్వవిద్యాలయం, అవసరమైన పుస్తకాల జాబితాను ఎంపిక చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నమోదుకు ఇచ్చిన మెయిల్‌కు గ్రంథాలయం లింక్ వస్తుంది. అందులో క్లిక్ చేసి లాగిన్, పాస్వర్డ్ ఎంటర్ చేసి, అంతర్జాలంలోకి వెళ్లొచ్చు. తర్వాత అవసరమైన పుస్తకాలను ఎంపిక చేసుకొని చదువుకోవచ్చు. లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో ఎన్డీఎల్ ఇండియా అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఇందులో వెబ్సైట్ మాదిరిగా కాకపోయినా, కొంచెం వేరుగా ఉంటుంది. అయినా అన్నిరకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఐఐటీ, జేఈఈ, గేట్ వంటి పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం ఇందులో ప్రత్యేకంగా ఐచ్ఛికాలను ఏర్పాటు చేశారు. -
కేఎంసీలో అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్
కర్నూలు(హాస్పిటల్): భారత వైద్య విధాన మండలి నిబంధనల మేరకు కర్నూలు మెడికల్ కళాశాలలో అభివృద్ధి పనుల కోసం జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన తన ఛాంబర్లో కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో తీర్మానాల వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్రామప్రసాద్ వివరించారు. కళాశాలలో డిజిటల్ ల్రైబరి కోసం రూ.10లక్షలు, లైబ్రరీలో వసతుల కోసం రూ.7లక్షలు మంజూరు చేశారన్నారు. సెమినార్ హాల్స్‌లో ఏసీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఓల్డ్ సీఎల్జీలోని స్టాఫ్‌క్లబ్ ఆధునీకరణ కోసం రూ.2లక్షలు, ల్యాబ్‌లలో కెమికల్స్ కొనుగోలుకు రూ.11లక్షలు, లైబ్రరీకి జనరల్స్, ఇంటర్నెట్ నెట్స్, కంప్యూటర్స్ కొనుగోలుకు రూ.25లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. కళాశాల పరీక్ష హాలులో జామర్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారన్నారు. కమిటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, సభ్యులుగా తనతో పాటు డాక్టర్ కృష్ణానాయక్, డాక్టర్ భాస్కరరెడ్డి, డాక్టర్ పద్మ విజయశ్రీ ఉంటారని తెలిపారు. సమావేశంలో జేసీ-2 రామస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, డాక్టర్ వెంకటరమణ, ఎన్ఐసీ రాజశేఖర్ పాల్గొన్నారు. -
ప్రవేశ పరీక్షలకు ఒకే సంస్థ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు యూజీసీలో సంస్కరణలకు శ్రీకారం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారి కోసం డిజిటల్ లైబ్రరీ నాణ్యమైన విద్యతోనే యువత సాధికారత సాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నొక్కి చెప్పారు. దేశంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులకు తెరతీసే చర్యలను ఆయన బుధవారం బడ్జెట్లో ప్రకటించారు. ఈ సంస్కరణల్లో అత్యంత కీలకమైంది.. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం అన్ని రకాల ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు స్వయం ప్రతిపత్తి గల ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ఏర్పాటు. ఈ ఏజెన్సీ రాకతో సీబీఎస్ఈ, ఏఐసీటీఈ వంటి సంస్థలకు పరీక్ష నిర్వహణ బాధ్యతల నుంచి వెసులుబాటు కలుగుతుందని జైట్లీ చెప్పారు. బడ్జెట్లో పాఠశాల విద్య, అక్షరాస్యతకు రూ.46,356 కోట్లు, ఉన్నత విద్యకు రూ.33,329 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. – న్యూఢిల్లీ ‘స్వయం’ ద్వారా 350 ఆన్లైన్ కోర్సులు మన దేశంలో పాఠశాలలు సాధిస్తున్న వార్షిక ఫలితాలను కచ్చితంగా తెలుసుకునేందుకు ఒక పటిష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఉందని జైట్లీ చెప్పారు. శాస్త్రీయ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా సరళమైన కోర్సులను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యలో నాణ్యతను పెంచేందుకు, మన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యనందించేందుకు ‘ఇన్నోవేటివ్ ఫండ్’ను ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో విద్యాపరంగా వెనుకబడ్డ 3,479 ప్రాంతాలపై ఇకపై మరింత దృష్టి పెడతామన్నారు. ఐసీటీ ద్వారా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ‘స్వయం’వేదిక ద్వారా అత్యుత్తమ నాణ్యతతో కూడిన 350 ఆన్లైన్ కోర్సులను అందిస్తామన్నారు. డీటీహెచ్ చానళ్లలోనూ ఆన్లైన్ కోర్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. యూజీసీలో సంస్కరణలకు శ్రీకారం చుడతామని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అక్రిడిటేషన్, ర్యాంకింగ్‌ల ఆధారంగా విద్యాసంస్థలకు గుర్తింపు, స్వయం పాలిత(అటానమస్) హోదా ఇవ్వనున్నట్లు తెలిపారు. 110 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు జార్ఖండ్, గుజరాత్‌లోఎయిమ్స్‌లు ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారు. మెడికల్ సైన్సెస్‌లో పీజీ సీట్లను పెంచుతామన్నారు. దేశవ్యాప్తంగా 600కుపైగా జిల్లాల్లో ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలను విస్తరింపజేస్తామని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందగోరే యువతకు సహకరించేందుకు 110 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. వొకేషనల్ విద్యకు రూ.2,200 కోట్లు కేటాయించారు. రూ.4,000 కోట్లతో స్కిల్ అక్విజిషన్, నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ ప్రోగ్రామ్(సంకల్ప్)ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తోలు, పాదరక్షల పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 10 ప్రపంచస్థాయి విద్యాసంస్థలు జాతీయస్థాయిలో డిజిటల్ లైబ్రరీని అభివృద్ధిపర్చాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యామిషన్‌లో భాగంగా ఐసీటీ కింద ఈ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, పరిశోధకులకు ఇది కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనివర్సిటీలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ హిమాలయన్ స్టడీస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో 10 ప్రపంచస్థాయి విద్యాసంస్థలను నెలకొల్పనున్నారు. పరిశోధనలు చేసే ప్రొఫెసర్ల కోసం ప్రత్యేక కేటాయింపులు చేశారు. బడ్జెట్ హైలైట్స్ ► ‘టెక్ (టీఈసీ–ట్రాన్స్ఫామ్, ఎనరై్జస్,క్లీన్ ఇండియా)’ఎజెండాతో బడ్జెట్ ► రూ.2.5 లక్షలు–రూ.5 లక్షల మధ్య ఆదాయంపై పన్ను 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు ► రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఆదాయంపై 10 శాతం సర్‌చార్జీ విధింపు ► ఎల్ఎన్జీపై కస్టమ్స్ పన్ను 2.5 శాతానికి తగ్గింపు ► రాజకీయ పార్టీలకు రూ.2 వేలకు పైబడిన నగదు విరాళాలపై నిషేధం. కేవలం చెక్కులు, ఇతర డిజిటల్ రూపాల్లోనే స్వీకరించాలి ► ఆర్బీఐ ఆధ్వర్యంలో ఎలక్టోరల్ బాండ్ల జారీ ► వయోవృద్ధులకు ఆధార్ ఆధారిత ఆరోగ్య కార్డులు, కనీసం 8 శాతం రాబడినిచ్చే పథకం ► ఎఫ్‌డీఐలను ప్రోత్సహించేందుకు ‘ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ)’ రద్దు ► రైల్వే అనుబంధ సంస్థలైన ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీ, ఐఆర్‌సీఓఎన్‌లు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ ► డిజిటల్ పేమెంట్ల పర్యవేక్షణకు ‘పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు’ ఏర్పాటు ► ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రైల్వే భద్రతా నిధి ఏర్పాటు. ► రైల్వేల్లో అభివృద్ధి పనులకు రూ.1.31 లక్షల కోట్లు. ఇందులో కేంద్ర నుంచి రూ.55 వేల కోట్లు. ► స్థిరాస్తులపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను గడువు మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు ► ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.72,000 కోట్లు.. డిజిటల్ పేమెంట్లకు ప్రోత్సాహమిచ్చేలా పీవోఎస్ యంత్రాలు, ఐరిస్ రీడర్లపై పన్ను మినహాయింపు ► వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15.8 శాతం, పరోక్ష పన్నుల వసూళ్లు 8.3 శాతం పెరుగుతాయని అంచనా. ► మౌలిక సదుపాయాలపై పెట్టుబడి రూ.3.96 లక్షల కోట్లకు పెంపు.. రూ.2 వేల కోట్ల కార్ఫస్ ఫండ్‌తో డెయిరీ ప్రాసెసింగ్ ఫండ్ ఏర్పాటు ► మహిళా, శిశు సంక్షేమ పథకాలకు రూ.1.84 లక్షల కోట్లు.. గ్రామీణ, వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.87 లక్షల కోట్లు ► పేదలకు 2019 నాటికి కోటి గృహాల నిర్మాణం ► ఎస్టీలకు రూ.31,920 కోట్లు, మైనారిటీ వ్యవహారాలకు రూ.4,195 కోట్లు ► రైలు, రోడ్డు, నౌకాయాన రంగాలకు రూ.2.41 లక్షల కోట్లు ► దేశంలో బ్రాడ్‌బ్యాండ్ కవరేజీ విస్తృతి కోసం ‘భారత్ నెట్’ప్రాజెక్టుకు రూ.10,000 కోట్లు -
ఇక పుస్తకాలను వినొచ్చు!
ఇప్పటివరకూ మనం పాటలు, వార్తలు లాంటివి మాత్రమే వినేవాళ్లం. ఇక ముందు మనకిష్టమైన పుస్తకాలను కూడా ఆడియో రూపంలో వినవచ్చు. అదీ వినిసొంపైన, మధురమైన గొంతులతో.. అవును...కేంద్ర ప్రభుత్వం ఆడియో లైబ్రరీని రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం డిజిటల్ గా దొరుకుతున్న పుస్తకాలు సైతం 'నేషనల్ డిజిటల్ లైబ్రరీ పోర్టల్' ద్వారా ప్రత్యేక ఆడియో బుక్స్ రూపంలో అందుబాటులోకి రానున్నాయి. బీజేపీ 2014 మేనిపెస్టో లో చెప్పిన విధంగా ఆన్ లైన్ లైబ్రరీని 156 ఇన్ స్టిషన్ లో తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు మరింత శ్రమను తగ్గించి, వారికి పుస్తకాల మీద ఆసక్తిని పెంచే నిమిత్తం 'నేషనల్ డిజిటల్ లైబ్రరీ పోర్టల్' ద్వారా ఆడియో బుక్స్ ను అందుబాటులోకి తేనుంది. దీనికోసం పేరొందిన సెలబ్రిటీల వాయిస్ లను ఉపయోగించుకోనుంది. వారి మాటలతో పిల్లలకి పుస్తకాలపై ఆసక్తిని పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఈ ఆడియో లైబ్రరీని ప్రవేశపెట్టనుంది. ఫోన్ ముందో, ల్యాప్ టాప్ ముందో కూర్చొని ఎంతసేపని చదువుతాం.. కళ్లు లాగి, త్వరగా అలసిపోయినట్టు అవుతుంది కదా..అందుకే ఎంచక్కా రేడియాలో పాటలు వింటూ ఎలా పనిచేసుకుంటామో అలానే ఇకముందు పుస్తకాలను కూడా వింటూ ఎంజాయ్ చేయొచ్చు. దీనికోసమే కొత్తగా ఆడియో డిజిటల్ లైబ్రరీ త్వరలోనే మన ముందుకు రానుంది. ప్రఖ్యాత యాడ్ గురు, మెక్ కాన్ వరల్డ్ గ్రూప్ సీఈవో ఈ ఆలోచనను మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీ ముందు ప్రతిపాదించారు. దీనిపై సానులకూంగా స్పందించిన స్మృతి, నేషనల్ డిజిటల్ లైబ్రరీ పోర్టల్ ద్వారా ప్రత్యేక ఆడియో బుక్స్ ను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అమితాబ్ బచ్చన్ లాంటి ప్రఖ్యాత సెలబ్రిటీలతో పుస్తకాలకు ఆడియో ఇప్పించనున్నారు.