ఇప్పటివరకూ మనం పాటలు, వార్తలు లాంటివి మాత్రమే వినేవాళ్లం. ఇక ముందు మనకిష్టమైన పుస్తకాలను కూడా ఆడియో రూపంలో వినవచ్చు. అదీ వినిసొంపైన, మధురమైన గొంతులతో.. అవును...కేంద్ర ప్రభుత్వం ఆడియో లైబ్రరీని రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం డిజిటల్ గా దొరుకుతున్న పుస్తకాలు సైతం 'నేషనల్ డిజిటల్ లైబ్రరీ పోర్టల్' ద్వారా ప్రత్యేక ఆడియో బుక్స్ రూపంలో అందుబాటులోకి రానున్నాయి.
బీజేపీ 2014 మేనిపెస్టో లో చెప్పిన విధంగా ఆన్ లైన్ లైబ్రరీని 156 ఇన్ స్టిషన్ లో తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు మరింత శ్రమను తగ్గించి, వారికి పుస్తకాల మీద ఆసక్తిని పెంచే నిమిత్తం 'నేషనల్ డిజిటల్ లైబ్రరీ పోర్టల్' ద్వారా ఆడియో బుక్స్ ను అందుబాటులోకి తేనుంది. దీనికోసం పేరొందిన సెలబ్రిటీల వాయిస్ లను ఉపయోగించుకోనుంది. వారి మాటలతో పిల్లలకి పుస్తకాలపై ఆసక్తిని పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఈ ఆడియో లైబ్రరీని ప్రవేశపెట్టనుంది.
ఫోన్ ముందో, ల్యాప్ టాప్ ముందో కూర్చొని ఎంతసేపని చదువుతాం.. కళ్లు లాగి, త్వరగా అలసిపోయినట్టు అవుతుంది కదా..అందుకే ఎంచక్కా రేడియాలో పాటలు వింటూ ఎలా పనిచేసుకుంటామో అలానే ఇకముందు పుస్తకాలను కూడా వింటూ ఎంజాయ్ చేయొచ్చు. దీనికోసమే కొత్తగా ఆడియో డిజిటల్ లైబ్రరీ త్వరలోనే మన ముందుకు రానుంది.
ప్రఖ్యాత యాడ్ గురు, మెక్ కాన్ వరల్డ్ గ్రూప్ సీఈవో ఈ ఆలోచనను మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీ ముందు ప్రతిపాదించారు. దీనిపై సానులకూంగా స్పందించిన స్మృతి, నేషనల్ డిజిటల్ లైబ్రరీ పోర్టల్ ద్వారా ప్రత్యేక ఆడియో బుక్స్ ను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అమితాబ్ బచ్చన్ లాంటి ప్రఖ్యాత సెలబ్రిటీలతో పుస్తకాలకు ఆడియో ఇప్పించనున్నారు.