కిరాణా షాపులో చోరీ
Published Tue, Nov 22 2016 2:39 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్ క్రైం : నగరంలోని రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల గాజుల్‌పేట్‌లో శంకర్ కిరాణ షాపులో సోమవారం చోరీ జరిగింది. తెలిసిన వారే చోరీ చేసినట్లు షాపు నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాజు ల్‌పేట్‌కు చెందిన శంకర్ తన ఇంట్లో ముందు భాగంలో కిరాణం నడుపుతూ వెనుక గదిలో భార్య లలితతో కలిసి నివాసం ఉంటాడు. ఆయ న ఇంట్లో ప్రవీణ్ ఏడాది క్రితం అద్దెకు దిగాడు. మొదట్లో ప్రవీణ్ శంకర్ కుటుంబంతో బాగానే ఉండడంతో అతడిని నమ్మి స్వేచ్ఛనిచ్చారు.
ఇదే అదునుగా భావించి రెన్నెళ్ల క్రితం లలితకు చెందిన రెండు మాసాల బం గారాన్ని చోరీ చేశాడు. దీనిని చూసిన శంకర్ అతడిని ఇంట్లోనుంచి వెళ్లగొట్టారు. దీనిని మనస్సులో పెట్టుకున్న ప్రవీణ్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు దుకాణంలో చొరబడి కౌంటర్‌లో ఉన్న రూ.8 వేల నగదు, రిచార్జీ కూపన్లు, బీరువాలో దాచిపెట్టిన రెండు తులాల బంగారు నగలు(కమ్మలు, చైన్), ఐదు తులాల వెండి, పట్టు చీరలు, రూ.80వేల నగ దు, షాపులోని సామగ్రి ఎత్తుకుపోయాడు.
ఉదయం 5 గంటలకు కిరాణ షాపు తెరిచే శంకర్ తలుపులు తెరిచి ఉండడం చూసి అవాక్కయ్యాడు. వెంట నే విషయాన్ని రెండో టౌన్ పోలీసులకు తెలియజేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అక్కడే ఓ నైటి పడి ఉండడం అది ప్రవీణ్ భార్యకు చెందినదిగా లలిత గుర్తుపట్టింది. చోరీ అతడే చేసి ఉంటాడని అనుమానించారు. పోలీసులు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బోస్ కిరణ్ తెలిపారు.
Advertisement
Advertisement