క్షీణిస్తున్న గుడివాడ అమర్నాథ్ ఆరోగ్యం | gudivada amarnath, who is fighting for special railway jone.. health in critical condition | Sakshi
Sakshi News home page

క్షీణిస్తున్న గుడివాడ అమర్నాథ్ ఆరోగ్యం

Published Sun, Apr 17 2016 6:38 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

క్షీణిస్తున్న గుడివాడ అమర్నాథ్ ఆరోగ్యం

క్షీణిస్తున్న గుడివాడ అమర్నాథ్ ఆరోగ్యం

విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా  ప్రత్యేక రైల్వేజోన్ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. ఆదివారం పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు దీక్షా స్థలిని సందర్శించి బాలరాజుకు సంఘీభావం తెలిపారు. అమర్నాథ్ చేపట్టిన ఉద్యమ దీక్షకు రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతోంది.

కాగా అమర్నాథ్ చేపట్టిన దీక్ష నాలుగు రోజులకు చేరుకోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. అమర్నాథ్కు వైద్యపరీక్షలు  నిర్వహించిన డాక్టర్లు ఆయన బీపీ లెవల్స్ తగ్గుతున్నట్లు తెలిపారు. మరోవైపు విభజన చట్టంలో పేర్కొన్న హామీపై ప్రభుత్వం నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement