railway jone
-
విశాఖకు రైల్వేజోన్ ప్రకటించకపోవడంపై వైఎస్ఆర్సీపీ నిరసన
-
రైల్వే జోన్ పిల్: ఏపీకి నోటీసులు
హైదరాబాద్: విశాఖపట్నంకు రైల్వే జోన్‌ను కోరుతూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిగింది. దీనిపై ప్రతివాదులైన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం ఈ కేసును విచారిస్తామని హైకోర్టు వాయిదా వేసింది. -
విశాఖకు రైల్వే జోన్ వస్తుంది: వెంకయ్య
విశాఖపట్నం: విశాఖపట్నంకు రైల్వే జోన్ వస్తుందని, విశాఖ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. విశాఖపట్నంలో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విభజన తర్వాత ఆంద్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న కృషిని వివరించారు. అలాగే విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ త్వరలోనే కార్యరూపం దాలుస్తుందన్నారు. -
చేతగాని సీఎం ఏపీకి శాపం
♦ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపాటు ♦ సీఎం పీఠాన్ని కదిలించేలా రైల్వే జోన్ కోసం ఉద్యమించాలని పిలుపు సాక్షి, విశాఖపట్నం: చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి శాపమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ముఖ్యమంత్రి, టీ డీపీకి చెందిన కేంద్ర మంత్రులు ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌ను తీసుకురాలేని దద్దమ్మలని ఘాటుగా విమర్శించారు. రైల్వే జోన్ సాధన కోసం విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం రోజా, తిరుపతి ఎంపీ వరప్రసాద్ సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు పరిస్థితి కేంద్రం వద్ద తేలు కుట్టిన దొంగలా తయారైందన్నారు. టీడీపీలో మగాళ్లు లేరని తెలిసే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాయలసీమ గడ్డపై పుట్టి ఉంటే, కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. ఎన్నిక లు పెడితే మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలతో చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయేలా ఫలితాలొస్తాయన్నారు. అమర్నాథ్ దీక్షకు తమ అధినేత జగన్‌తో పాటు పార్టీ అంతా అండగా ఉంటుందన్నారు. సీఎం పీఠాన్ని, ఢిల్లీలో నేతలను కదిలించేలా రైల్వే జోన్ కోసం ఉద్యమించాలని రోజా కోరారు. ముఖ్యమంత్రి, కేంద్రంలో ఏపీ మంత్రుల చేతగానితనం వల్ల విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేరడం లేదని ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. సత్తాలేకే ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. -
క్షీణిస్తున్న గుడివాడ అమర్నాథ్ ఆరోగ్యం
విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. ఆదివారం పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు దీక్షా స్థలిని సందర్శించి బాలరాజుకు సంఘీభావం తెలిపారు. అమర్నాథ్ చేపట్టిన ఉద్యమ దీక్షకు రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతోంది. కాగా అమర్నాథ్ చేపట్టిన దీక్ష నాలుగు రోజులకు చేరుకోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. అమర్నాథ్కు వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన బీపీ లెవల్స్ తగ్గుతున్నట్లు తెలిపారు. మరోవైపు విభజన చట్టంలో పేర్కొన్న హామీపై ప్రభుత్వం నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. -
'టీడీపీలో మగాళ్లు లేరు కాబట్టే..'
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీలో మగాళ్లు లేరు కాబట్టే.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకెళ్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని ఆమె సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా ఇరుక్కున్నాడు కాబట్టే.. ఆంధ్రప్రదేశ్‌ను ఆయన కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు రూ. 10 వేల కోట్లు ఇవ్వమని కోరితే.. కేంద్రం రూ.700 కోట్లు ఇచ్చిందని రోజా తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్ కోసం నాలుగురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న గుడివాడ అమర్నాథ్కు ఆదివారం సంఘీభావం తెలిపిన రోజా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు చేతగాని దద్దమ్మలు కావడం వల్లే రాష్ట్రానికి రైల్వే జోన్‌ను తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు. వారు దద్దమ్మలు కావడం వల్లే తాము పోరాడాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు సీఎం కావడం ఏపీకి శాపం అని రోజా విమర్మించారు. మంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు పోటీపడి దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఉత్తరాంధ్ర మంత్రులకు రైల్వేజోన్ వ్యవహారం పట్టదా అని ఆమె నిలదీశారు. అడ్డదిడ్డంగా మాట్లాడే అచ్చెన్నాయుడు ఏనాడైనా రైల్వే జోన్ కోసం పోరాడారా అని రోజా ఈ సందర్భంగా ప్రశ్నించారు. రైల్వే జోన్ వస్తే ఉద్యోగవకాశాలు పెరుగుతాయని, పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయన్న ఆమె.. రైల్వే జోన్ సాధించే వరకు వైఎస్ఆర్ సీపీ పోరాడుతుందని, దీనికి అందరూ కలిసిరావాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం విభజన హామీలను రాష్ట్రానికి తీసుకురాలేకపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. కేంద్ర పథకాల నిధులను రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారని, ప్రజలు దీనిని గమనించాలని ఆయన కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటివరకూ ప్రత్యేక హోదా ప్రకటించకపోవడం శోచనీయం అని వరప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ఉంటే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. -
పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు..
విశాఖపట్నం: ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్షకు ఒంగోలు వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మద్దతు తెలిపారు. అమర్నాథ్ చేపట్టిన దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరిన సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా రైల్వే జోన్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు అవుతున్నా రైల్వే జోన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాలపై పలుమార్లు ప్రధానమంత్రిని కలిసినా, పార్లమెంట్లో లేవనెత్తినా కూడా ఫలితం మాత్రం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. కేవలం 200 కోట్లతో 2018 నాటికి పోలవరాన్ని ఎలా పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనూ రైల్వే జోన్, ప్రత్యేక హోదా, పోలవరం అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
రాజధాని రైలు’ కూత పెట్టేనా..!
25 రైల్వే బడ్జెట్‌పై డివిజన్ ప్రజల ఆశలు నడికూడి-శ్రీకాళహస్తికి రెండో విడత నిధుల కోసం ఎదురుచూపులు నూతన రైళ్ల కోసం, డివిజన్లో డబ్లింగ్, విద్యుదీకరణకు నిధులు మంజూరయ్యేనా..! రాష్ట్రానికి నూతన రాజధాని ఏర్పాటు చేశాక మొదటిసారి కేంద్రప్రభుత్వం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. డివిజన్‌కు కేటాయించే నిధులు, నూతన రైల్వే లైన్లు, కేటాయించే ట్రైన్ల పైనే రాజధాని ప్రాంత అభివృద్ధి ఆధారపడి ఉంది. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా నవ్యాంధ్రప్రదేశ్ పరిధి వరకూ ఏర్పాటు చేసే నూతన రైల్వే జోన్‌పై అనిశ్చితి కొనసాగుతోంది. నగరంపాలెం : నూతన రైల్వేజోన్ కేంద్ర కార్యాలయం రాజధానికి సమీపంలోని గుంటూరు జిల్లాలోనే ఏర్పాటు చేసేలా బడ్జేట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రధానమంత్రి ప్రయార్టీ ప్రాజెక్టు కింద డివిజన్లో జరగుతున్న భారీ ప్రాజెక్టు నడికుడి - కాళహస్తి నూతన రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తి కావాలంటే రెండో దశ పనులకు ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరగాలి. రీసర్వే జరిగాలి గుంటూరు- నంద్యాల విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నందున డబ్లింగ్పనులకు, నల్లపాడు -బీబీనగర్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. మాచర్ల నుంచి మహబూబ్‌నగర్ మీదుగా రాయచూర్ వరకూ నూతన రైల్వే లైన్‌కు గతంలో సర్వే జరిగి ఆగిపోయింది. దీనికి రీసర్వే చేసి పనులు చేపడితే ముంబయికి దగ్గర మార్గంగా మారుతుంది. అన్ని ప్రాంతాల నుంచి.. : నూతన రాజధాని ప్రాంతానికి రైల్వే కనెక్టవీటి కోసం సత్తెనపల్లి పెదకూరపాడు నుంచి హెరిటేజ్ అమరావతి మీదుగా రాజధాని అమరావతిని కలుపుతూ మంగళగిరికి ఒక మార్గం, కృష్ణా జిల్లాలోని కొండపల్లికి ఒక మార్గం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి నేరుగా రాజధాని ప్రాంతానికి రావడం వీలవుతుంది. ప్రయాణికుల రద్దీ మేరకు..: రాజధాని ఏర్పాటుతో డివిజన్లో గుంటూరుకు ప్రయాణికుల రద్దీ పెగుతుంది. దీంతో డివిజన్ పరిధిలో సర్కులర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు పెంచాల్సిన అవసరం ఉంది. విజయవాడ-మంగళగిరి-గుంటూరు - తెనాలికి, వినుకొండ-గుంటూరు-తెనాలికి ఎక్కువ సర్కులర్ రైళ్లు నడపాల్సిన అవసరం ఉంది. దీనికోసం గుంటూరు రేపల్లే వరకూ డబ్లింగ్ విద్యుదీకరణకు నిధులు మంజూరు చేయాల్సి ఉంది. విజయవాడ నుంచి తెనాలి మీదుగా వెళుతున్న నవజీవన్, టాటా తదితర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంగళగిరి మీదుగా న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా నడపాలి. గుంటూరు- తిరుపతి, గుంటూరు-చెన్నైకి పగటిపూట ఇంటర్సిటి ఎక్స్‌ప్రెస్, గుంటూరు-మైసూరుకు బెంగళూరు మీదుగా ఎక్స్‌ప్రెస్, గుంటూరు- మాచర్ల, వినుకొండ-గుంటూరుకు ఫాస్ట్ ప్యాసింజర్లు, గతంలో తెనాలి- సికింద్రాబాద్‌కు నడిచే నాగార్జున ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు మచిలీపట్నం-యశ్వంతపూర్, కాకినాడ-ముంబయి లోకమాన్యతిలక్, నర్సాపూర్-నాగర్సోల్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రోజూ నడపాలి. కోట్ పిట్లు పెంచాలి : గుంటూరు స్టేషన్ నుంచి నూతన రైళ్లు నడపాలంటే కోచ్ పిట్లు కావాల్సి ఉంది. ప్రస్తుతం గుంటూరు స్టేషన్‌లోని రెండు కోచ్ పిట్లలో ఆరు రైళ్ల వరకూ శుభ్రం చేసే అవకాశం ఉంది. వీటి సంఖ్య పెంచి మరిన్ని రైళ్లకు అందుబాటులోకి తేవాల్సి ఉంది. మాచర్ల, రేపల్లే స్టేషన్లను నూతన రైళ్లు నడిపేలా అభివృద్ధి పర్చాల్సి ఉంది. నిధులు భారీగా అవసరం : డివిజన్ ప్రధాన రైల్వేస్టేషన్ అయిన గుంటూరు రైల్వేస్టేషన్‌ను ఎ-గ్రేడ్ నుంచి ఎ-1 గ్రేడ్ స్థాయికి పెంచేందుకు నిధులు మంజూరుచేయాల్సి ఉంది. డివిజన్లో ఉద్యోగుల వైద్య సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన రైల్వే హెల్త్ యూనిట్‌ను 25 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి. ఉద్యోగుల క్వార్టర్ల కోసం నిధులు మంజూరుచేయాల్సి ఉంది. నూతన రైళ్లు నడపాలి : డివిజన్లో నూతన రైళ్లు ఎక్కువుగా కేటాయించాలని సౌత్‌సెంట్రల్ రైల్వే మజ్దూరు యూనియన్ గుంటూరు డివిజను సెక్రటరీ హనుమంతరావు కోరారు. గుంటూరు-తిరుపతి, గుంటూరు-చెన్నైకు పగటిపూట ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపటం వలన నిత్యం 2,000 మంది ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలిపారు. గుంటూరు రాజధాని ప్రాంతంగా మారడంతో అద్దెలు పెరిగాయని, ఉద్యోగులు తమ జీతంలో 60 శాతం అద్దెలకే ఖర్చుచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం గుంటూరులోనే 2000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా 220 క్వార్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. గత బడ్జెట్లో క్వార్టర్ల మెయింటనెన్స్ నిధులు మంజూరు చేయకపోవడంతో 100 క్వార్టర్ల వరకూ శిథిలావస్థకు చేరుకున్నట్లు తెలిపారు. -
విశాఖకు రైల్వే జోన్‌పై పరిశీలన: రైల్వే మంత్రి
విశాఖపట్నం: విశాఖపట్నానికి రైల్వే జోన్ మంజూరు చేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజలను సంతోష పెట్టేలా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తుపాన్ విపత్తు నుంచి విశాఖ ప్రజలు మనోధైర్యంతో కోలుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖ వాసులకు అభినందనలు తెలిపారు. ప్రజలను మనోభావాలను గుర్తించామని త్వరలోనే వాటిని నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సురేష్ ప్రభు అత్త హఠాన్మరణం చెందడంతో ఆయన విశాఖకు ప్రత్యేక రైలులో వచ్చారు. -
విశాఖను రైల్వే జోన్ గా ప్రకటించాలి- వైఎస్ఆర్ సీపీ
విశాఖ: విశాఖపట్నం ను రైల్వేజోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వైఎస్ఆర్ సీసీ భారీ ధర్నా చేపట్టింది. జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ ఆధ్వర్యంలో జిల్లా లోని దొండపర్తి డీఆర్ఎమ్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో పాడేరు ఎమ్మెల్యే దిడ్డి ఈశ్వరి, నియోజక వర్గ ఇంచార్జ్ లు, దళిత, మైనార్టీ నేతలు పాల్గన్నారు.