అర్ధనగ్నంగా నర్సింహస్వామికి సేవ
సత్రశాల (రెంటచింతల) : అర్ధనగ్నంగా ట్రాక్టర్లపై వెళ్తున్న వీరంతా రెంటచింతల మండలం పాలువాయి గ్రామానికి చెందిన వడ్డెర సామాజిక వర్గీయులు. వీరు ప్రతి మూడేళ్లకోసారి నాలుగు రోజుల పాటు అర్ధనగ్నంగా గ్రామంలో తిరుగుతూ నర్సింహస్వామికి సేవ చేస్తారు. అనంతరం కుటుంబ సమేతంగా సత్రశాలకు వెళ్లి మొక్కు తీర్చుకుంటారు. ఈ ఏడాది కృష్ణా పుష్కరాలు కూడా తోడవడంతో పుష్కర స్నానానికి అర్ధనగ్నంగానే ట్రాక్టర్లపై సత్రశాలలోని పుష్కర ఘాట్‌కు తరలివెళ్లారు.