- మహిళా సమాఖ్య భవనాన్నిఎంపిక చేసిన అధికారులు
- మినీ మునిసిపాలిటీలో తహసీల్దార్ కార్యాలయం
హన్మకొండ ఆర్డీవో కార్యాలయం కడిపికొండలో..
Published Wed, Oct 5 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
హన్మకొండ అర్బన్ : నూతన జిల్లాల ముసాయిదా ప్రకటన ప్రకారం ప్రస్తుత జిల్లా కేంద్రంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు పనులు ఓ కొలిక్కి వస్తున్నాయి. వరంగల్ కలెక్టరేట్ కోసం నక్కలగుట్టలోని నీటి పారుదల శాఖ భవనం ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా హన్మకొండ ఆర్డీవో కార్యాలయం, కాజీపేట తహసీల్దార్ కార్యాలయం భవనాలు ఫైనల్ çచేస్తూ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
కడిపికొండలో ఆర్డీవో ఆఫీస్
కొత్తగా ఏర్పడనున్న హన్మకొండ రెవెన్యూ డివిజన్ నూతన జిల్లాల ముసాయిదా కార్యాలయాన్ని హన్మకొండ మండలం కడిపికొండలోని ఐకేపీ మండల సమా ఖ్య కార్యాలయ భవనంలో ఏర్పాటు చేయనున్నారు. ఈజీఎస్ ఎపీవో కార్యాలయం కోసం ఈ భవనాన్ని నిర్మించగా.. ఈ గ్రామం గ్రేటర్‌లో కలవడంతో హన్మకొండ ఏపీవో కార్యాలయం అవసరం లేకుండా పోయింది. దీంతో ఈ భవనాన్ని ఐకేపీ మండల సమాఖ్య కోసం కేటాయిం చారు. కానీ, మండల సమాఖ్య కూడా పూర్తిగా మెప్మా పరిధిలోకి రావడంతో ప్రస్తుతం కార్యాలయం ఖాళీగా ఉంటోంది. దీంతో ప్రభుత్వం భవనమైన ఇందులో హన్మకొండ ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుచేస్తే ఇబ్బందులు ఉండవన్న అంచనాతో అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అలాగే, కాజీపేట మునిసిపల్ కాంప్లెక్స్‌లో కాజీపేట తహసీల్దార్ కార్యాలయంను తాత్కాలికంగా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ రెండు కార్యాలయాల ప్రతిపాదనలకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. కాగా, ప్రస్తుతం ఉన్న వరంగల్ ఆర్డీవో కార్యాలయాన్ని అదే భవనంలో కొంతకాలం కొనసాగిస్తారు.
Advertisement
Advertisement