జోరుగా హరితహారం
♦ మేడ్చల్ మండలం లక్ష్మీనగర్‌లో మొక్కనాటిన
♦ సీఎం కార్యాలయు హరితహారం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్
మేడ్చల్: హరితహారంలో ప్రతిఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని సీఎం కార్యాలయ హరితహారం ఓఎస్‌డీ ప్రియాంకవర్గీస్ అన్నారు. ఆమె శనివారం మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లి గ్రామంలో నిర్వహించిన హరితహారం ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీనగర్‌లో మొక్క లు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు. తమ ఇళ్ల వద్ద, గ్రామాల్లో తప్పనిసరిగా మొక్కలు నాటాలని సూచించారు.
గుండ్లపోచంపల్లిలో భారీ ర్యాలీ..
గుండ్లపోచంపల్లిలో హరితహారం కార్యక్రవూన్ని విజయువంతం చేయూలని భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, నాయుకులతో కలిసి ప్రియూంక వర్గీస్ పాల్గొన్నారు. కార్యక్రవుంలో గ్రావు సర్పంచ్ బేరి ఈశ్వర్, వూర్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయుణ, ఎంపీపీ విజయులక్ష్మి , ఎంపీటీసీ సభ్యుల ఫోరం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, తహసిల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ నాయుకుడు వుల్లికార్జున్ వుుదిరాజ్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రవుంలో ప్రియాంకవర్గీస్‌తో పాటు ఆమె ఇద్దరు పిల్లలు ఉత్సాహంగా మొక్కలు నాటారు.