హరితహారంలో భాగస్వాములమవుదాం
ఏలూరు అర్బన్: జిల్లాలో హరితహారం కార్యక్రమం అమలులో పోలీసు అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పెదవేగి మండలంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో బుధవారం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, సమతుల్యతలో మొక్కల పాత్ర అనిర్వచనీయమని చెప్పారు. వాతావరణ పరిరక్షణకు ఉద్యమ స్ఫూర్తితో ప్రజలంతా మొక్కలు పెంచాలని కోరారు. ఎస్బీ డీఎస్పీ పి.భాస్కరరావు, ఏలూరు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం డీఎస్పీలు గోగుల వెంకటేశ్వరరావు, నర్రా వెంకటేశ్వరరావు, కె.వెంకట్రావు, టి.పూర్ణచంద్రదావు, పోలీసు శిక్షణ కేంద్రం డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.