in pedavegi
-
హరితహారంలో భాగస్వాములమవుదాం
ఏలూరు అర్బన్: జిల్లాలో హరితహారం కార్యక్రమం అమలులో పోలీసు అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పెదవేగి మండలంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో బుధవారం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, సమతుల్యతలో మొక్కల పాత్ర అనిర్వచనీయమని చెప్పారు. వాతావరణ పరిరక్షణకు ఉద్యమ స్ఫూర్తితో ప్రజలంతా మొక్కలు పెంచాలని కోరారు. ఎస్బీ డీఎస్పీ పి.భాస్కరరావు, ఏలూరు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం డీఎస్పీలు గోగుల వెంకటేశ్వరరావు, నర్రా వెంకటేశ్వరరావు, కె.వెంకట్రావు, టి.పూర్ణచంద్రదావు, పోలీసు శిక్షణ కేంద్రం డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
ఏలూరు అర్బన్ : పెదవేగి మండలానికి చెందిన ఓ వివాహిత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. సాయల మరియమ్మ, మంగయ్య దంపతులు పెదవేగి మండలం ముండూరులో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కొంత కాలంగా మరియమ్మ తనను ఎవరో పిలుస్తున్నారని, తమతో వచ్చేయమని చెవిలో చెబుతున్నారని కుటుంబసభ్యులతో చెబుతోంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఏదో పీడ ఆవరించిందని భావించి తాయిత్తులు, గండాలు కట్టించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మంగళవారం ఉదయం ఇంటిలో ఎవరూలేని సమయంలో శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు బాధితురాలి భర్త, తండ్రి త్సవటపల్లి బాలాస్వామికి సమాచారం అందించడంతో వారు బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
వరుణదేవా.. కరుణించరావా..
పెదవేగి రూరల్ : వర్షాలు విస్తారంగా కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని పెదవేగిలో పోతురాజుబాబుకు, గంగానమ్మకు గ్రామస్తులంతా కలిసి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతురాజుబాబుకు, గంగానమ్మకు 101 బిందెలతో అభిషేకం చేశారు. ఇలా చేస్తే విస్తారంగా వర్షాలు కురిసి, పాడి పంటలు పొంగి పొర్లుతాయని గ్రామస్తులు నమ్మకంగా తెలిపారు.