అవగాహనతో ఆరోగ్యం
- గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే
- సాక్షి గుడ్‌హెల్త్ మెగా షో ప్రారంభం
- పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానీకం
గుంటూరు మెడికల్ : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన కల్పించుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సూచించారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్ గుడ్‌హెల్త్ మెగా షో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. గుంటూరు నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుడ్‌హెల్త్ మెగా షోను కాంతిలాల్ శనివారం ముఖ్య అతిథి హాజరై ప్రారంభించారు.
అనంతరం ఆయన మా ట్లాడుతూ వైద్య రంగంలో అత్యాధునిక వైద్య పద్ధతులు రోజూ వస్తూ ఉన్నాయని, వాటిని ప్రజలకు పరిచయం చేసేందుకు హెల్త్‌షో ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. మీడియా మిత్రులకు కూడా వైద్య పరీక్షలు చేయించేందుకు ‘సాక్షి’ చొరవ చూపించి హెల్త్ షో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ‘సాక్షి’ ఏర్పాటు చేసిన హెల్త్ షోను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ‘సాక్షి’ మీడియా గ్రూప్ డైరెక్టర్ రాణిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో ‘సాక్షి’ హెల్త్ షో ఏర్పాటు చేశామన్నారు.
ఆరోగ్య అంశాలన్నీ ఒకేచోట...
సాయిభాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, ప్రముఖ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యపరమైన అంశాలన్నీ ఒకేచోట చేరువ చేసి ప్రజలకు ఆరోగ్యం అందించేందుకు ‘సాక్షి’ హెల్త్ షో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రోజులు జరిగే ఈ హెల్త్ షోలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వేదాంత హాస్పిటల్ అధినేత డాక్టర్ చింతా రామకృష్ణ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులు ఎలా వస్తాయి, రోగులకు ఎలాంటి వైద్య సేవలు గుంటూరులో లభిస్తున్నాయనే విషయాలను వివరించేందుకు ఈ హెల్త్ షో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. హెల్ప్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కె.కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ఈ హెల్త్‌షో ఆధునిక వైద్య పద్ధతులను ప్రజలకు చేరువ చేస్తుందన్నారు.
కారుమూరి సూపర్ స్పెషాలిటీ అధినేత, ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ కారుమూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం వల్లే చాలా మంది అర్ధాంతంగా జీవితాలు ముగి స్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. గుం టూరు సిటీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ చక్కా శివరామకృష్ణ, శ్రీరామచంద్ర పిల్లల, దంత వైద్యశాల నిర్వాహకుడు డాక్టర్ టి.చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ పువ్వాడ తిరుమల రవిచందర్, మల్లికా స్పయిన్ సెంటర్ అధినేత డాక్టర్ జె.నరేష్‌బాబు, శ్రీరేణుకా నేత్రాలయం సూపర్‌స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిర్వాహకురాలు డాక్టర్ యడ్ల గాయత్రి, దంత వైద్య నిపుణులు డాక్టర్ చింతా వాసవి, శ్రీబాలాజీ ఫిజియోథెరపీ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగసతీష్ తదితరులు ఆయా వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు.
ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జోనల్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు వచ్చాక ఇన్సూరెన్స్ గురించి ఆలోచించేకంటే, ముందస్తుగానే బీమా చేయించుకుంటే నిశ్చింతగా ఉండవచ్చని సూచించారు. సాక్షి డెప్యూటీ జనరల్ మేనేజర్ రంగనా«థ్, ఈవెంట్ మేనేజర్ భరత్ కిషోర్, రీజనల్ మేనేజర్ జి.వెంకటరెడ్డి, జిల్లా మేనేజర్ కె.చిత్తరంజన్, కల్యాణి యాడ్ ఏజెన్సీ నిర్వాహకులు కె.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సాక్షి గుడ్‌హెల్త్ మెగా షో రెండోరోజైన ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు కొనసాగనుంది.