‘నారింజ’కు భారీగా వరదనీరు | heavy rain water to narinja project | Sakshi
Sakshi News home page

‘నారింజ’కు భారీగా వరదనీరు

Published Wed, Sep 21 2016 7:44 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

నారింజ ప్రాజెక్టు

నారింజ ప్రాజెక్టు

జహీరాబాద్‌: జహీరాబాద్‌ ప్రాంతంలో బుధవారం  మోస్తారుగా వర్షం కురిసింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి జహీరాబాద్‌ మండలంలో  2.6 సెం.మీ, కోహీర్‌ మండలంలో 3.6 సెం.మీ, ఝరాసంగం  మండలంలో 1.8 సెం.మీ  వర్షపాతం నమోదైంది. గత వారం  రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకే జహీరాబాద్‌ సమీపంలో గల నారింజ ప్రాజెక్టులోకి సామర్థ్యం  మేరకు నీరు వచ్చి చేరింది.

ప్రాజెక్టు షటర్ల పైనుంచి  కొద్ది మేర  నీరు బయటకు పోయింది.మంగళవారం రాత్రి జహీరాబాద్‌, కోహీర్‌  మండలాల్లో కురిసిన వర్షాలకు నారింజ ప్రాజెక్టులోకి తిరిగి కొంత నీరు వచ్చి చేరింది. వచ్చి చేరిన నీరు ప్రాజెక్టు గేటు షటర్ల పైనుంచి  ప్రవహిస్తుంది. సుమారు రెండు అంచుల  మేర  నీరు బయటకు పోతుంది. మయటకు పోతున్న నీరు నారింజ జలం కర్ణాటకలోని కరంజా ప్రాజెక్టులోకి పోయింది.

గత రెండు సంవత్సరాల  నుంచి వర్షాభావంతో నారింజ ప్రాజెక్టులోకి చుక్క నీరు రాలేదు. ఈ సంవత్సరం మాత్రం  వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో సామర్థ్యం మేరకు  ప్రాజెక్టులోకి నీరు వచ్చి  చేరడంతో రైతులు  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్‌ ప్రాంతం నుంచి నారింజ జలాలు కర్ణాటక ప్రాంతంలోకి పోతుండడంతో అ ప్రాంత రైతులు సంతోషం  వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోహీర్‌ మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు కూడా గతంలో కురిసిన వర్షాలకు సామర్థ్యం మేర  నీటితో నిండింది. దీంతో అదనపు నీరు కర్ణాటకకు పోతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement