
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. సోమవారం ఉదయం 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, నడకదారిన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీనివాసుని 95,714 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెళిపారు.