
కీసర టోల్‌ప్లాజా వద్ద బారులు దీరిన కార్లు, ఇతర వాహనాలు
అర కిలోమీటరు మేర బారులు దీరిన కార్లు
కంచికచర్ల: కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద అర కిలోమీటరు మేర కార్లు బారులుదీరాయి. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో సొంత ఊళ్లకు వచ్చిన వారంతా తిరిగి తమ వాహనాల్లో మంగళవారం హైదరాబాద్ బయలుదేరారు. ఈ నేపథ్యంలో కీసర టోల్‌ప్లాజా వద్ద అరకిలోమీటరు మేర కార్లు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది.
అనంతరం టోల్‌ప్లాజా మేనేజర్ జయ ప్రకాశ్ మాట్లాడుతూ రోజుకు సుమారు 12 వేల కార్లు హైదరాబాద్ వైపునకు వెళ్తున్నాయని, దీనివల్ల టోల్‌ప్లాజాకు రూ.6 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పారు.