అలా మాట్లాడే ‘హీరో’లు కావాలి
సాక్షి,సిటీబ్యూరో: పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ భాష అమలుకు నోచుకోకపోవడం పెద్ద లోపం. ఒక్క సంస్కృతి, సంప్రదాయాలే కాదు.. సాంఘిక శాస్త్రం, సైన్స్ వంటి బోధనాంశాల్లోనూ తెలంగాణం కనిపించాలి. అన్ని రకాల మాధ్యమాల కంటే ఇప్పటికీ సినిమాయే బలమైన మాద్యమంగా ఉంది. ఇంతకాలం విలన్ భాషకే తెలంగాణ యాసను పరిమితం చేసిండ్రు. ఇక నుంచైనా తెలంగాణ భాష, యాసలో మాట్లాడే హీరోలు ఉన్న సినిమాలు రావాలె. తల్లి భాష తెలంగాణ యాసను కాపాడుకునేందుకు అన్ని విధాలుగా కృషి జరగలవలసి ఉంది.
-డాక్టర్ కాలువ మల్లయ్య, రచయిత