విశాఖపట్నం: విశాఖ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం కాకరపాడు గ్రామంలో అగ్ని సాక్షిగా తాళికట్టిన భర్తే భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. గురువారం ఉదయం రామన్న అనే వ్యక్తి తన భార్య రంభ(35)ను చంపేశాడు. కుటుంబకలహాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.