మదనపల్లె: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ శివారులోని నక్కలదిన్నె తండాకు చెందిన మురళీనాయక్ వద్ద రమేష్‌నాయక్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే, రమేష్ భార్యతో మురళీనాయక్ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో రమేష్ నాయక్ భార్యతో గొడవలు జరిగేవి. పెద్దల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది.
ఈ నేపథ్యంలోనే రమేష్‌నాయక్ మరొకరి వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనికి కుదిరాడు. ఇది మురళీనాయక్‌కు నచ్చలేదు. అతన్ని చంపేందుకు ప్లాన్ వేశాడు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో మరికొందరితో కలసి స్థానిక గంగమ్మ గుడి వద్ద కాపు కాశాడు. ట్రాక్టర్‌పై వస్తున్న రమేష్‌ను ఆపి కత్తులతో పొడిచి చంపి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.