illegal affair
-
అమ్మా.. నేనేం పాపం చేశా!
మహాబూబాబాద్, సాక్షి: కన్నతల్లే ఆ పిల్లల పాలిట మృత్యు దేవతగా మారింది. తన భర్త మరణించాక మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అయితే తన సుఖానికి పిల్లలే అడ్డొస్తున్నారని భావించి వాళ్లను లేకుండా చేయాలనుకుంది. ఈ ప్రయత్నంలో ఆ చిట్టితల్లిని విషమిచ్చి ఆ కన్నతల్లి చేజేతులారా చంపేసుకుంది. డోర్నకల్ మండలంలోని జోగ్య తండ గ్రామ పంచాయతీ పరిధిలోని మంగళ్ తండాకు చెందిన వాంకుడోత్ వెంకటేష్(30) నాలుగు నెలల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో ఆయన భార్య ఉష, ఇద్దరు పిల్లలు నిత్యశ్రీ (05) అబ్బాయి వరుణ్ తేజ (07)ల అత్తింట్లోనే ఉంటోంది. ఈ నెల 5వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటూ పిల్లలిద్దరూ కిందపడి పోయారు. వాంతులు, విరోచనాలు కావడంతో కంగారు పడిపోయిన వెంకటేష్ తల్లి.. పిల్లలను ఏం జరిగిందని వాకబు చేసింది. అమ్మ కూల్‌డ్రింక్ తాగించిందని అమాయకంగా చెప్పారు ఆ ఇద్దరూ. ఆ తర్వాత బాబాయ్ రాంబాబు సహాయంతో పిల్లలను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల చికిత్స అనంతరం పిల్లల శరీరంలో గడ్డిమందు అవశేషాలు ఉన్నాయని వైద్యులు తెలపడంతో బంధువులు ఉషను నిలదీశారు. పిల్లలకు కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి తాగించినట్లు ఒప్పుకుందామె. ఈలోపు పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు ఏమైనా జరిగితే తనను చంపేస్తారన్న భయంతో.. ఉష ఎలుకల మందు తాగింది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పిల్లల బాబాయ్ ఫిర్యాదు చేయడంతో.. డోర్నకల్ పోలీసులు ఈ నెల 10న హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుమారు రెండువారాల తర్వాత వరుణ్‌తేజ్ కోలుకోగా.. పరిస్థితి విషమించి నిత్యశ్రీ ఆదివారం మృతి చెందింది. దీంతో కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఆమెను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఆ అధికారితో ఉష సంబంధం!నిత్యశ్రీ పోస్టుమార్టంను పర్యవేక్షించిన డోర్నకల్ సీఐ బీ రాజేశ్.. దగ్గరుండి ఆ చిన్నారి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులకు అప్పగించే క్రమంలో జోగ్యతండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉషను తీసుకు రావాలంటూ ఆగ్రహంతో స్థానికులు ఊగిపోయారు. ఆంబులెన్స్‌కు అడ్డుపడి ధర్నా చేపట్టారు. స్థానికంగా ఉన్న ఓ పోలీస్ అధికారితో ఉష సంబంధం ఉందని, ఆ అధికారి చెప్పడంతోనే ఆమె ఈ ఘోరానికి పాల్పడిందని ఆరోపించారు. చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలా.. 12 గంటలు ధర్నా కొనసాగించారు. ఈ తరుణంలో గ్రామ పెద్దలతో పోలీసులు చర్చలు జరిపారు. నిత్యశ్రీ మృతికి కారణమైన పోలీస్ అధికారిపై విచారణ జరిపించి.. ఈ విషయంలో అయన పాత్ర ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించగా.. నిత్యశ్రీ మృతదేహాన్ని బంధవులకు అప్పగించారు. -
నీవు లేక నేనుండలేనని..
కుత్బుల్లాపూర్: ప్రేమికుడిని మరిచిపోలేని ఓ వివాహిత మనస్తాపంతో భనవంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్బషరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన మేరకు.. ఎంఎన్‌రెడ్డి నగర్లో నివాసముంటున్న ఓ వివాహిత (25)కి పెళ్లికి ముందే మరొకరిని ప్రేమించింది. ఈ నేపథ్యంలో ప్రియుడిని మరిచిపోలేక శుక్రవారం రాత్రి తాము నివాసముంటున్న భవనం 5వ అంతస్తు నుంచి ఆమె కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపతున్నారు. -
భర్త వివాహేతర సంబంధం లైవ్ లో పట్టుకున్న భార్య
-
వివాహేతర సంబంధం.. యువకుడి దారుణ హత్య
రంగారెడ్డి: చేతులు, కాళ్లు తాళ్లతో బిగించి.. గోనెసంచిలో వేసి.. నడుముకు రాయికట్టి చెరువులో పడేసి యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ యాదయ్యగౌడ్ కథనం ప్రకారం.. సోమవారం ఉదయం మండల పరిధిలోని హైతాబాద్ చెరువులో ఓ గోనె సంచిలో మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. యువకుడి తలపై కొట్టి, కాళ్లు, చేతులు తాళ్లతో బిగించి, నడుముకు బండరాయి కట్టి గోనెసంచిలో వేసి పడేసినట్లు గుర్తించారు. మృతుడిని మండల పరిధిలోని సంకెపల్లిగూడ గ్రామానికి చెందిన కుమ్మరి ప్రవీణ్(31)గా గుర్తించారు. వివాహేతర సంబంధమే కారణమా..? ప్రవీణ్‌కు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమ గా మారింది. హత్యకు అక్రమ సంబంధమే కారణమై ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతుడి సోదరుడు కుమ్మరి ప్రశాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మరొకరితో వివాహేతర సంబంధం.. ఎన్నిసార్లు చెప్పినా భార్య మారకపోవడంతో..
నల్గొండ: భార్య మరొకరితో సఖ్యతగా మెలుగుతోందని మనస్తాపంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మఠంపల్లి మండలం రఘనాథపాలెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథపాలెం గ్రామానికి చెందిన ముత్యాలంపాటి సిద్దయ్య(36)కు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన హసీనాతో 14ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. సిద్దయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా హసీనా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సఖ్యతగా మెలుగుతోందని సిద్దయ్య అనుమానించాడు. ఇదే విషయంపై పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అయినా, హసినా తీరులో మార్పు రావడం లేదని కొద్ది రోజుల క్రితం ఇంట్లో మళ్లీ గొడవ జరిగింది. దీంతో హసీనా ఇద్దరు కుమారులను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. సిద్దయ్య ఇద్దరు కుమారులు పక్కనే ఉంటున్న చిన్నాన్న ఇంట్లో ఉంటున్నారు. ఎన్ని సార్లు నచ్చచెప్పినా భార్య తీరులో మార్పు రాలేదని మనస్తాపంతో సిద్దయ్య తెల్ల వారుజామున ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత సిద్దయ్య సోదరుడి కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే మృతిచెందాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్నగర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భార్య మరొకరితో వెళ్లిపోతే.. ఈ భర్త ఏం చేశాడంటే..
మడకశిర రూరల్: మాయమాటలతో తన భార్యను లేవదీసుకుపోయిన యువకుని చిత్రపటానికి చెప్పుల హారం వేసి ఓ భర్త వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం క్యాంపురం గ్రామానికి చెందిన నేత్రావతి, అంజి భార్యాభర్తలు. బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే ఓ తోటలో కూలి పనులతో జీవనం సాగించేవారు. ఇదే గ్రామానికి చెందిన దివాకర్ సైతం బెంగళూరులో కూలి పనులు చేస్తుండేవాడు. నేత్రావతిపై కన్నేసిన దివాకర్ ఆమెతో పరిచయం పెంచుకుని పది రోజుల క్రితం తనతో పాటు లేవదీసుకుపోయాడు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన అంజి క్యాంపురానికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు వివరించాడు. ఈ క్రమంలోనే కసి తీర్చుకోవాలని అంజి.. శనివారం రాత్రి దివాకర్ చిత్రపటానికి చెప్పులు వేసి సైకిల్‌పై డప్పు వాయిద్యాల మధ్య గ్రామంలో ఊరేగించాడు. ఇది చూసిన స్థానికులు దివాకర్ చిత్రపటంపై ఉమ్మేసి చెప్పుతో కొట్టారు. దివాకర్ ఇంటి ఎదుట పాదరక్షలు వేసిన చిత్రపటాన్ని ఉంచారు. -
రాజేష్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
సాక్షి, రంగారెడ్డి: హయత్‌నగర్‌లో దారుణంగా హత్యకు గురైన రాజేష్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి. సుజాతతో వివాహేతర సంబంధం కారణంగానే.. ఆమె భర్త రాజేష్‌ను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఈలోపు నాగేశ్వర్రావు పెద్ద ట్విస్టే ఇచ్చాడు. తన భార్యది సూసైడ్ కాదని.. రాజేష్ చంపాడంటూ సాక్షి టీవీతో చెప్పాడు. ‘‘నా భార్యను రాజేషే చంపాడు. విషం తెచ్చి బలవంతంగా నా భార్యకు తాగించాడు. నేను కానీ.. నా కొడుకులు కానీ రాజేష్‌ను కొట్టలేదు. కొన్ని నెలలుగా నా భార్యను రాజేష్ టార్చర్ పెడుతున్నాడు’’ అని సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడాయన. ఇదిలా ఉంటే ఈ కేసులో వివాహేతర సంబంధమే రాజేష్ హత్యకు కారణమనే విషయాన్ని పోలీసులు దాదాపుగా ధృవీకరించుకున్నారు. ప్రభుత్వ టీచర్ అయిన సుజాతతో రాజేష్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పురుగుల మందు తాగిందని పేర్కొంటూ.. ఈ నెల 24వ తేదీన సుజాతను ఆస్పత్రిలో చేర్పించాడు నాగేశ్వరరావు. చికిత్స పొందుతూ సోమవారం ఆమె కన్నుమూసింది. అయితే ఆమె విషం తాగిందని చెబుతున్న సమయానికి ముందు ఆమె ఇంటి వద్ద రాజేష్ కనిపించాడని, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ద్వారా తెలుస్తోంది. మరోవైపు రాకేష్ హత్య కేసులో హయత్‌నగర్ పోలీసులు నాగేశ్వర్రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజేష్‌ను నాగేశ్వరరావు కొట్టి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ప్రీతి
అనకాపల్లి: ఉమ్మడి విశాఖ జిల్లాలో సంచలనం రేపిన భర్తను హతమార్చిన భార్య కేసులో నిందితురాలితోపాటు, ఆమె కన్నతండ్రి, ప్రియుడు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరావు సోమవారం కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు అందించారు. చోడవరంలోని మారుతీనగర్‌కు చెందిన హతుడు ఉద్రాక్ష హరి విజయ్ భార్య ప్రీతి, తమ ఇంటి వెనుక ఉండే బలయాది సింహసాయి ప్రణయ్‌కుమార్‌తో వివాహేతర సంబంధంపై తరచూ గొడవలు జరిగేవి. దీనిపై భర్త తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడన్న కోపంతో భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఏప్రిల్ నెల 17 రాత్రి ఆమె తండ్రి సామిరెడ్డి శంకరరావు, ప్రియుడు ప్రణయ్ కుమార్, ప్రీతి స్నేహితుడు లావేటి లలిన్‌కుమార్(చౌడపల్లి, అచ్యుతాపురం), కర్రి రాము(అచ్యుతాపురం), పిట్లకొండ రాజు అలియాస్ బషేర్(అనకాపల్లి), అనకాపల్లి సాయి కలిసి హతుడిని బాగా మద్యం సేవించేలా చేశారు. ఆ మత్తులో నిద్రపోతున్న హరివిజయ్ను తలగడతో అదిమి హతమార్చారు. చనిపోయాడని నిర్ధారణకు వచ్చాక రాత్రి 2 గంటల సమయంలో ప్రీతి తన కారులో మృతదేహాన్ని ఎక్కించుకుని, భర్త స్వగ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్ మండలం తీసుకువెళ్తూ, మార్గం మధ్యలో తన భర్తకు గుండె పోటు వచ్చిందని పాడేరు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు అతడు చనిపోయినట్టు నిర్ధారించారు. మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో, పాడేరు పోలీసులు అనుమానాస్పద మృతిగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ప్రీతి తండ్రి సామిరెడ్డి శంకరరావు పాడేరు పోలీసులకు లొంగిపోయి వాస్తవాలను వెల్లడించడంతో హత్య కేసుగా మార్చి, చోడవరం స్టేషన్‌కు కేసును బదిలీ చేసినట్టు సీఐ వెల్లడించారు. దీంతో కేసులో భాగస్వాములైన భార్య ప్రీతి, ఆమె ప్రియుడు ప్రణయ్, వారికి సహకరించిన లలిన్‌కుమార్, రాము, రాజులను ఆదివారం అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితులను సోమవారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు సీఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
Hyderabad: వివాహేతర సంబంధం: భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
హైదరాబాద్: వేరే మహిళతో అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన భార్య బంధువులపై భర్త కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం వల్లభాయ్నగర్కు చెందిన విజయ్‌కుమార్‌కు మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగికి చెందిన స్వప్నతో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా విజయ్‌కుమార్ మూడేళ్లుగా మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. అప్పటి నుంచి భార్యను సైతం దూరం పెడుతూ విడాకులు ఇవ్వాల్సిందిగా వేధిస్తూ వస్తున్నాడు. కొన్ని నెలలుగా ఇంటి రావడంలేదు, కుటుంబ సభ్యులు ఫోన్లు చేసినా స్పందించడం లేదు. శనివారం రాత్రి సదరు మహిళతో విజయ్‌కుమార్ ఉన్నట్లు తెలుసుకున్న స్వప్న, ఆమె అక్కలు శ్యామల, మంజుల, బాబాయి శ్రీనివాస్ అక్కడికి వెళ్లారు. అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీయగా వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య స్వప్నను కొడుతున్న విజయ్‌కుమార్‌ను అడ్డుకున్న శ్రీనివాస్‌పై కత్తితో దాడి చేయగా అతని మెడభాగం, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం బాధిత మహిళ స్వప్న జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వివాహేతర సంబంధం..పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి కుమారుడ్ని దారుణంగా
ముంబై: మహారాష్ట్ర పుణెలో ఓ వ్యక్తి కిరాతక చర్యకు పాల్పడ్డాడు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమారుడ్ని దారణంగా హత్య చేశాడు. చిన్నారి అని కూడా చూడకుండా వేడి వేడి నీళ్లున్న బకెట్లో బాలుడ్ని ముంచాడు. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. 15 రోజులు మృత్యుతో పోరాడి చనిపోయాడు. నిందితుడి పేరు విక్రమ్ శరద్ కోలేకర్. ఖేడ్‌లో నివసిస్తున్నాడు. భర్త నుంచి విడిపోయిన ఓ మహిళతో చాలా కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె కూడా ఖేడ్లోనే ఉంటోంది. అయితే ఏప్రిల్ 6న ఉదయం మహిళ ఇంటికెళ్లాడు విక్రమ్. పిల్లాడిని ఇతనికి అప్పగించి ఆమె బయటకు వెళ్లింది. ఈ సమయంలో చిన్నారిని వేడి నీటిలో ముంచాడు. ఇంటికొచ్చి చూసిన తల్లి కాలిన గాయాలున్న కుమారుడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. 15 రోజులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. విక్రమ్ తనను పెళ్లి చేసుకోమని చాలా రోజులుగా అడుగుతున్నాడని, అందుకు తాను ఒప్పుకోలేదనే కోపంతోనే తన కుమారుడ్ని చంపాడని మహిళ ఆరోపించింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతనిపై కేసు పెట్టింది. దీంతో విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. చదవండి: అతీక్ అహ్మద్ కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు..ఎవరిని హత్య చేశారు? -
ఇంతకీ ట్రంప్ చేసిన నేరం ఏమిటి?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trumpపై క్రిమినల్ అభియోగాలు నమోదు కావడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన మోసాలకు పాల్పడిన ట్రంప్‌పై ఏకంగా 34 నిందారోపణలు అయ్యాయి. ఓ శృంగార తారతో పాటు ఓ ప్లేబాయ్ మాజీ మోడల్‌తో సంబంధంతో బయట పడకుండా ఉండేందుకు ఆయన చేసుకున్న అనైతిక ఒప్పందాలే ఆయన్ని ఇలా ఇరకాటంలో పడేశాయి. అనైతిక ఒప్పందాలతో వ్యాపార ఒప్పందాల్లో మోసాలకు పాల్పడడం, తద్వారా తన కంపెనీలలో పన్నుల ఎగవేత కుంభకోణం.. ఇది సంక్లిప్తంగా ట్రంప్‌పై మోపబడ్డ అభియోగాల సారాంశం. ఇంతకీ ఈ కేసులో మొదటి నుంచి ఏం జరిగింది?.. ట్రంప్ దోషిగా తేలినా ఆయన రాజకీయ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడదా? ఆ అంశాల్లోకి వెళ్తే.. ► స్టార్మీ డేనియల్స్ ఓ శృంగార తార(మాజీ). 2006లో నెవడాలోని సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ సందర్భంగా తొలిసారి ఆమె ట్రంప్‌ను కలుసుకుంది. ఆ సమయానికి ఆమె వయసు 27 ఏళ్లు. ట్రంప్ వయసు 60. ఆ తర్వాత టీవీ షోలో పాత్ర కోసం లాస్ ఏంజెల్స్‌లోని తన బేవర్లీహిల్స్ ఇంట్లో కలవాలని ట్రంప్, డేనియల్స్‌కు తన బాడీ గార్డు ద్వారా కబురు పంపారు. అక్కడే డిన్నర్ చేశాక.. ఇద్దరూ శారీరకంగా కలుసుకున్నారు. ► వాస్తవానికి 2011లోనే ఆమె ట్రంప్‌తో సంబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టినా.. అప్పుడు ఆ అంశానికి పెద్దగా ఫోకస్ దక్కలేదు. ► 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో.. తనకు ఇచ్చిన మాట తప్పడంతో ఈ శృంగార తార సంబంధం బయటపెట్టేందుకు సిద్ధమైంది. అయితే తన లాయర్ ద్వారా ఆమెతో ఒప్పందం చేసుకుని.. డబ్బు ద్వారా ఆమె నోరు మూయించే యత్నం చేశాడు ట్రంప్. ► ఆ సమయంలో ట్రంప్ వ్యక్తిగత న్యాయవాదిగా ఉన్న మైకేల్ కోహెన్.. డేనియల్స్‌కు లక్షా 30 వేల డాలర్లు చెల్లించి ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఆమె గప్‌చుప్‌గా ఉండిపోగా.. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందారు. ► 2018 జనవరిలో ఓ అంతర్జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారామె. అప్పటికి ట్రంప్ అధ్యక్ష స్థానంలో ఉండేసరికి.. ఇదొక హైప్రొఫైల్ కేసు అయ్యింది. ఆమె ఆరోపణలపై అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. ► అయితే విచారణలో కోహెన్ మాత్రం అది తన సొంత డబ్బు అని, ట్రంప్ చెల్లించలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. అదే ఏడాది.. ఫుల్ డిస్క్లోజర్ అనే పుస్తకం ద్వారా ట్రంప్‌తో తనకు జరిగిన పరిచయం, ఆపై విషయాలను ప్రచురించింది స్టార్మీ డేనియల్స్. ఈలోపు ట్రంప్ తన ప్రచార నిధి నుంచి కాకుండా.. సొంత డబ్బును ఈ అనైతిక ఒప్పందం కోసం చెల్లించాడనే వాదన తెర మీదకు వచ్చింది. ► 2018 ఫిబ్రవరిలో కోహెన్ తన సొంత డబ్బును డేనియల్స్‌కు చెల్లించినట్లు బుకాయించాడు. అయితే.. చివరకు 2018 ఆగస్టులో కోహెన్ నేరం అంగీకరించాడు. ట్రంప్ ప్రచార నిధి నుంచే ఆ డబ్బు చెల్లించినట్లు చెప్పాడు. దీంతో అదే ఏడాది డిసెంబర్లో కోర్టు కోహెన్‌కు మూడేళ్ల శిక్ష ఖరారు చేసింది. ► 2019 ఆగష్టులో.. ఆ అనైతిక ఒప్పందం చెల్లింపులకు సంబంధించిన రికార్డులను సమర్పించాలంటూ మాన్‌హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ ఆదేశించడంతో.. ట్రంప్ ఇరకాటంలో పడినట్లయ్యింది. పన్నుల కుంభకోణంలో.. ట్రంప్ సంస్థ తప్పిదం చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ► అనైతిక ఒప్పందం.. తద్వారా పన్నుల కుంభకోణానికి పాల్పడ్డారంటూ ట్రంప్ కంపెనీపై అభియోగం నమోదు అయ్యింది. 2023, జనవరిలో.. గ్రాండ్ జ్యూరీ ఎదుట ట్రంప్ అనైతిక ఒప్పందానికి సంబంధించిన ఆధారాలు సమర్పించారు. మార్చిలో.. గ్రాండ్ జ్యూరీ ఎదుట హాజరు కావాలంటూ ట్రంప్‌కు ఆదేశాలు జారీ కాగా, వాటిని ట్రంప్ తిరస్కరించాడు. ► చివరకు.. 2023 మార్చి చివరి వారంలో మాన్‌హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ ఆయనపై అభియోగాల నమోదు దిశగా సంకేతాలు ఇచ్చింది. దీంతో ఆయన లొంగిపోతారంటూ ట్రంప్ తరపు న్యాయవాది ముందుగానే సంకేతాలు ఇచ్చారు. ► కోర్టు ఆయనపై నేరాభియోగాలు మోపడానికి, అరెస్ట్‌కు ఆదేశాలు ఇవ్వడానికంటే ముందే మాన్‌హట్టన్ కోర్టులో లొంగిపోవడానికి వెళ్లారు డొనాల్డ్ ట్రంప్‌ను. కానీ, సినీ ఫక్కీలో పోలీసులు అరెస్ట్ చేశారు. అటుపై లీగల్ టీంతో కలిసి కోర్టు విచారణలో పాల్గొన్నారు ట్రంప్. గంట పాటు వాదనలు జరగ్గా.. చివరకు బయటకు వచ్చి ఫ్లోరిడాలోని ఇంటికి వెళ్లిపోవడంతో ప్రస్తుతానికి ఎపిసోడ్‌కు కామా పడినట్లయ్యింది. ► డిసెంబర్లో(4వతేదీన) ఈ కేసుకు సంబంధించి మరోసారి ట్రంప్ విచారణకు కోర్టుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ► ఇండియానాకు చెందిన మోడల్, నటి మెక్‌డగల్(52).. 90వ దశకంలో ప్లేబాయ్ మ్యాగజైన్ కోసం పని చేసింది. 2006-07 సమయంలో ట్రంప్‌తో తనకు ఎఫైర్ ఉందని, అది బయటపడకుండా ఉండేందుకు ట్రంప్ తన లాయర్ ద్వారా తనకు కొంత డబ్బు ముట్టజెప్పాడని అంటోంది. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ వ్యవహారాన్ని బయట పెట్టేందుకు ఓ మీడియా సంస్థ ద్వారా లక్షా యాభై వేల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సదరు మీడియా ఏజెన్సీ.. మాన్‌హట్టన్ డిస్ట్రిక్ అటార్నీ ముందు అంగీకరించింది కూడా. ► ఏది ఏమైనా అమెరికా చరిత్రలోనే తొలిసారి క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ట్రంప్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆయన అధ్యక్ష ఎన్నిక అభ్యర్థితత్వంపై ఎలాంటి ప్రభావం పడకపోవచ్చని న్యాయనిపుణులు చెప్తున్నారు. అలాగే.. న్యూయార్క్ చట్టాల దృష్టిలో తక్కువ తీవ్రమైనవి. ఒక్కో లెక్కన వాటన్నింటికి పడేది నాలుగేళ్ల శిక్ష మాత్రమే. ఒకవేళ దోషిగా తేలి శిక్షపడినా కూడా.. ట్రంప్ ప్రొబేషన్ శిక్షనే ఎదుర్కొంటారు తప్ప ఆయనకు పెద్దగా ఇబ్బంది ఉండదనేది అక్కడి న్యాయనిపుణుల మాట. కానీ, తొలి నుంచి ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తున్న ట్రంప్.. పరిస్థితి అంతదాకా రాదని, పోరాటం ద్వారా రాజకీయ కుట్రను తిప్పి కొడతానని అంటున్నారు. -
ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధం?
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ పో* స్టార్‌కు భారీగా నగదు ఇచ్చి.. ఒప్పందం చేసుకున్నాడనే నేరారోపణలకు గానూ ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందట. ఈ మేరకు మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం నుంచి స్పష్టమైన సంకేతాలు అందినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. వచ్చే వారంలో మంగళవారం బహుశా తాను అరెస్ట్ కావొచ్చని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సోషల్ ట్రూత్ ద్వారా వెల్లడించారు. 2016 ఎన్నికలకు ముందు ఓ పో* స్టార్‌కు భారీగా డబ్బులు ఇచ్చి ఒప్పందం చేసుకున్నారనే అభియోగాలపై ఇప్పటికే దర్యాప్తు సంస్థల విచారణ సాగుతోంది అక్కడ. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై నేరారోపణలు నమోదు చేసి.. అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తన అరెస్ట్ సంకేతాల నేపథ్యంలో మద్దతుదారులంతా నిరసనలకు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు ట్రంప్. ఈ మేరకు మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తనకు సమాచారం లీక్ అయ్యిందని ఆయన చెప్పుకొచ్చారు. ట్రంప్ తనతో ఉన్న సంబంధాన్ని బహిరంగపర్చకుండా ఉండేందుకు.. స్టార్మీ డేనియల్స్ అలియాస్ స్టెఫానీ క్లిఫార్డ్ అనే పో* స్టార్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అందుకుగానూ ఆమెకు లక్షా 30 వేల డాలర్లు ముట్టజెప్పాడు ట్రంప్. ఇది 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు జరిగింది. అయితే.. రెండేళ్ల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చింది. ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని, తమ మధ్య జరిగిన నాన్డిస్క్లోజర్ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్ఏంజెల్స్ కోర్టులో దావా వేసిందామె. అయితే.. ఈ కేసులో ట్రంప్‌పై నేరారోపణలు మోపాలా వద్దా అని ప్రాసిక్యూటర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈలోపే ఆ ఆరోపణలకు సంబంధించి 76 ఏళ్ల వయసున్న ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు సంకేతాలు అందుతున్నాయి. అదే జరిగితే నేరారోపణలు ఎదుర్కొన్న మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రకెక్కుతాడు. అదే జరిగితే అరెస్ట్ దాకా వెళ్లకుండా.. తన క్లయింట్ లొంగిపోతాడని ట్రంప్ తరపున న్యాయవాది చెబుతుండగా.. ట్రంప్ మాత్రం సదరు స్టార్‌తో ఎఫైర్‌ను అంగీకరించడం లేదు. ఇదీ చదవండి: ఇలా కోర్టుకు వెళ్లగానే.. పదివేల మంది పోలీసుల దాడి! -
పనిమనిషితో వివాహేతర సంబంధం.. బెడ్‌పై గుండెపోటుతో మృతి
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో కొద్ది రోజుల క్రితం ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఓ శవం లభించిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ 67 ఏళ్ల వ్యాపారవేత్తకు తన ఇంట్లో పనిచేసే 35 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. నవంబర్ 16న ఆమె ఇంటికి వెళ్లి శృంగారం చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. తన యజమానితో వివాహేతర సంబంధం ఉందని అందరికీ తెలిస్తే పరువు పోతుందని మహిళ భావించింది. దీంతో అతడు చనిపోయిన విషయాన్ని భర్తతో పాటు సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత వాళ్లు వచ్చాక ముగ్గురు కలిసి శవాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. అనంతరం తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు. అని పోలీసులు వివరించారు. చనిపోయిన వ్యక్తి పేరు బాల సుబ్రహ్మణ్యం. జేపీ నగర్లో నివసించేవాడు. నవంబర్ 16 సాయంత్ర 4:55 గంటలకు తన మనవడ్ని బ్యాడ్మింటన్ కోర్టులో డ్రాప్ చేసేందుకు వెళ్లాడు. ఆ తర్వాత తనకు వ్యక్తిగత పని ఉందని, ఆలస్యంగా వస్తానని కోడలుకు ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఆ తర్వాత బాల సుబ్రహ్మణ్యం ఇంటికి తిరిగివెళ్లలేదు. దీంతో ఆయన కుమారుడు మరుసటి రోజే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టాడు. ఆ మరునాడే పోలీసులకు ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో బెడ్ షీట్లు చుట్టి ఉన్న ఓ శవం కన్పించింది. అతడ్ని బాలసుబ్రహ్మణ్యంగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు పనిమనిషి అసలు విషయం చెప్పింది. ఆయనతో చాలా కాలంగా వివాహేతర సంబంధం ఉందని తెలిపింది. అతను శృంగారం చేస్తూ బెడ్‌పైనే చనిపోయాడని చెప్పింది. తామే శవాన్ని బ్యాగులో చుట్టి రోడ్డు పక్కన పడేశామని అంగీకరించింది. చదవండి: యువతి అదృశ్యం.. అర్ధరాత్రి మెలకువ రావడంతో.. -
మహాలక్ష్మికి నా భర్తతో అఫైర్.. అందుకే ఆమె భర్త వదిలేశాడు : నటి
ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ బుల్లితెర నటి వీజే మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. చూడచక్కని రూపంతో అందంగా ఉన్న మహాలక్ష్మీ.. భారీకాయుడైన రవీందర్‌ను పెళ్లాడటంతో ఈ జంట హాట్‌టాపిక్‌గా నిలిచింది. వీరి పెళ్లి గురించి తమిళనాటే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్యకాలంలో వీళ్లపై వచ్చినన్ని ట్రోల్స్ ఎవరి మీద వచ్చి ఉండవు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. తాజాగా మహాలక్ష్మి గురించి నటి జయశ్రీ సంచలన ఆరోపణలు చేసింది. మహాలక్ష్మికి తన భర్తతో అఫైర్ ఉందని, అందుకే మొదటి భర్త ఆమెను వదిలేశాడంటూ పేర్కొంది. తన ముందే ఆమెతో వీడియో కాల్స్ చేసి మాట్లాడేవాడని, అంతేకాకుండా మహాలక్ష్మి కొడుకు తన భర్తను నాన్న అని పిలుస్తున్నాడంటూ గతంలో జయశ్రీ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ వార్తలను కొట్టిపారేసిన మహాలక్ష్మి జయశ్రీ కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో రవీందర్ తనకు అండగా నిలబడ్డాడని, అందుకే అతనితో కొత్త జీవితం ప్రారంభించానని తెలిపింది. -
అడ్డు తొలగించుకునేందుకే హత్య.. భార్య అంగీకారంతోనే..
గచ్చిబౌలి: మణికొండలో అదృశ్యమై కృష్ణా నదిలో హత్యకు పాల్పడిన కేసులో వివాహేతర సంబంధమే కారణమని, అడ్డుతొలగించుకునేందుకు తోడల్లుడు పథకం రచించగా.. మృతుడి భార్య అంగీరించినట్లు రాయదుర్గం సీఐ తిరుపతి తెలిపారు. కృష్ణా నదిలో గాలించినా మృతదేహం లభ్యం కాకపోయినప్పటికీ సాంకేతిక ఆధారాలతో ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ తిరుపతి తెలిపిన మేరకు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లావుతండాకు చెందిన ధనవత్ రాగ్యానాయక్(28) క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ మణికొండ గార్డెన్లో భార్య రోజా(29)తో కలిసి నివాసం ఉంటున్నాడు. రోజా అనారోగ్యానికి గురైంది. భర్త సరిగ్గా పట్టించుకోకపోవడంతో అక్క భర్త అయిన పుప్పాలగూడలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి సభావత్ లక్పతి అలియాస్ లక్కీ(34) మందులు ఇప్పించి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వివాహేతర సంబంధం ఏర్పడింది. తరచుగా రోజా కోసం ఇంటికి వస్తుండటంతో రోజా, రాగ్యానాయక్ మధ్య గొడవలు జరిగేవి. కొద్ది నెలల క్రితం రాగ్యానాయక్‌కు చెందిన 25 గుంటల స్థలాన్ని రూ.15 లక్షలకు లక్పతి కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ చేయాలని అడగగా మరో రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. లావు తండాలో మే 23 పండుగ కోసం వచ్చిన లక్పతి రోజాతో ఓ గదిలో ఉండటం గమనించిన రాగ్యానాయక్ బంధువుల సమక్షంలోనే గొడవకు దిగాడు. కొన్న స్థలానికి పది లక్షలు ఎక్కువగా అడగడం, తమకు అడ్డుగా ఉన్నాడని భావించి హత్య చేసేందుకు పథకం పన్నాడు. అందుకు రోజా కూడా అంగీకరించింది. దీంతో లక్పతి డబ్బులు ఇస్తానని నమ్మించి ఆగస్టు 19న షేక్ పేట్‌లోని భారత్ పెట్రోల్ బంక్ వద్దకు రావాలని రాగ్యానాయక్‌కు వేరే ఫోన్‌తో ఫోన్ చేశారు. నిద్రమాత్రలు కలిపి.. అక్కడికి రాగానే పది వేలు ఇచ్చి నాగార్జున సాగర్ వైజాగ్ కాలనీకి వెళితే మిగతా డబ్బు ఇస్తానని చెప్పాడు. బాచుపల్లిలో నివాసం ఉండె టీఎంఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ చెన్నుపల్లి వెంకట శివ నాగ మల్లేశ్వర్ రావు(30)తో కలిసి ముగ్గురూ కారులో వెళ్లారు. అలకాపురిలోని విజేత సూపర్ మార్కెట్లో బాధం మిల్క్ షేక్ బాటిళ్లు కొనుగోలు చేశారు. ఒక బాటిల్లో నిద్ర మాత్రలు పొడిచేసి కలిపారు. ఇబ్రాహీంపట్నం వెళ్లిన తరువాత ఎగ్‌పఫ్‌లు కొనుగోలు చేశారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత కారు ఆపి అందరూ కలిసి తిన్నారు. నిద్ర మాత్రలు కలిపిన బాదం మిల్్కషేక్ను రాగ్యానాయక్‌కు ఇచ్చారు. తాగిన 15 నిమిషాల లోపు అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. నల్గొండ జిల్లాకు చెందిన చేపల వ్యాపారి పత్లావత్ మాన్సింగ్(32), వంకునావత్ బాలోజీ (23)లను రెడీగా ఉండాలని చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న రాగ్యానాయక్ కాళ్లు, చేతులు కట్టి, బండ రాళ్లు ఉంచి చేపల వలలో చుట్టారు. అనంతరం పడవలో వేసుకొని కృష్ణా నది బ్యాక్ వాటర్‌లో దాదాపు పది కిలో మీటర్లు ప్రయాణం చేశారు. అక్కడ అందరు కలిసి రాగ్యానాయక్‌ను కృష్ణా నదిలో విసిరేశారు. షేక్‌పేట్‌లోని భారత్ పెట్రోల్‌బంక్ నుంచి బుగ్గ తండాకు వెళ్లే వరకు సీసీ పుటేజీలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. లక్పతి, రోజా, చెన్నుపల్లి వెంకట శివ నాగ మల్లేశ్వర్ రావు, పత్లావత్ మాన్ సింగ్, వంకునావత్ బాలోజీలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: ప్రకాష్ వ్యవహారంలో ‘లక్ష్మీ’ పాత్ర వివాదాస్పదం.. ట్విస్టులే ట్విస్టులు -
వివాహేతర సంబంధం.. భర్తను చితకబాదిన భార్య
సాక్షి, వరంగల్: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ధి చేసింది భార్య. అతను ఉండే ఇంటిపై బంధువులతో కలిసి దాడి చేసింది. ఫర్నీచర్‌ను ధ్వంసం చేసింది.వరంగల్ జిల్లా పైడిపల్లిలో ఈ ఘటన జరిగింది. భార్య చేతిలో తన్నులు తిన్న ఈ భర్త పేరు జీవన్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా ఉద్యోగం చేసేవాడు. రూ.కోటి అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో రెండు సంవత్సరాల క్రితమే సస్పెండ్ అయ్యాడు. అయితే జీవన్ మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారకపోడవంతో ఆగ్రహంతో బంధువులతో కలిసివెళ్లి చితకబాదింది. చదవండి: ప్రేమ పేరుతో మోసం తిరుపతిలో నిందితుడి అరెస్టు -
భర్తపై అనుమానం .. యువతిపై కిరాతకం!
గచ్చిబౌలి (హైదరాబాద్): తన భర్తతో సంబంధం ఉందని అనుమానించింది. కోపంతో రగిలిపోతూ విచక్షణ కోల్పోయింది. తోటి యువతి అనే ఆలోచన ఏమాత్రం లేకుండా పాశవికంగా వ్యవహరించింది. పిన్నీ అని పిలిచే ఆ యువతిని పథకం ప్రకారం ఇంటికి పిలిపించి ఆమెపై లైంగిక దాడి చేయించేందుకు ప్రయత్నించింది. దాన్ని వీడియో కూడా చిత్రీకరించింది. దాదాపు 45 నిమిషాల పాటు ఈ ఘోరం చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు.. ప్రధాన నిందితురాలు సహా ఆరుగురిపై ‘అత్యాచారం’ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం ఈ అమానుష ఘటన వివరాలిలా ఉన్నాయి. సంబంధం లేదని తేల్చిన పోలీసులు శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన యువతి (26) అశోక్‌నగర్‌లోని హాస్టల్లో ఉంటూ ఓ ఇన్స్టిట్యూట్లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటోంది. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీ బీ–బ్లాక్‌లో నివసించే శ్రీకాంత్ ఈమె సహ అభ్యర్థి. గతేడాది జరిగిన ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో వీరికి పరిచయమైంది. ఇతడు తొమ్మిదేళ్ల క్రితం గాయత్రిని (36) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గాయత్రి, శ్రీకాంత్‌లను పిన్ని, బాబాయ్ అని పిలిచే బాధిత యువతి గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వారి ఇంట్లోనే ఉంది. అప్పట్లో గాయత్రి ఆమెతో బాగానే ఉండేది. షాపింగ్‌లకూ తీసుకెళ్లేది. కానీ తర్వాత అనుమానం పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఆ యువతి వారి ఇంట్లో నుంచి బయటకొచ్చేసింది. అనుమానం వీడని గాయత్రి ఏప్రిల్ 22న ఆ మేరకు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గాయత్రితో పాటు శ్రీకాంత్‌ను, ఆ యువతిని పిలిచి కౌన్సెలింగ్ చేశారు. శ్రీకాంత్, ఆ యువతి మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధం లేదని తేల్చి పంపారు. భార్య అనుమానాల నేపథ్యంలో శ్రీకాంత్ ఆమెనే మరోసారి రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. అయినా ఆమెలో అనుమానం పోలేదు. సమస్య పరిష్కరించుకుందామని పిలిపించి .. సదరు యువతిని భయభ్రాంతులకు గురి చేయాలని, దారుణంగా హింసించాలని గాయత్రి పథకం వేసింది. దీనికోసం గతంలో తన వద్ద డ్రైవర్లుగా పని చేసి ప్రస్తుతం మసీద్‌బండలోని పాన్‌షాపులో పని చేసే మస్తాన్(25), ముజాహిద్‌లతో (25) పాటు వీరి స్నేహితులైన అయ్యప్ప సొసైటీకి చెందిన విష్ణు (22) మనోజ్ (22), కడపకు చెందిన మౌలాలిలతో కలిసి రంగంలోకి దిగింది. గత గురువారం బాధిత యువతికి ఫోన్ చేసి కొండాపూర్‌కు వస్తే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామంది. దీంతో ఆమె తన తల్లిదండ్రులు, ఇద్దరు న్యాయవాదులతో మధ్యాహ్నం 3 గంటలకు గాయత్రి ఇంటి వద్దకు వెళ్లింది. ఒంటరిగా ఇంటికి తీసుకెళ్లి .. గాయత్రి ఇండిపెండెంట్ హౌస్‌కు సమీపంలో ఉన్న ఓ హోటల్ వద్దకు వెళ్లిన వీళ్లు ఆ విషయం ఆమెకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో బయటకు వచ్చిన గాయత్రి మిగిలిన వారిని హోటల్ వద్దనే ఉంచి యువతిని తనతో తీసుకువెళ్లింది. అప్పటికే ఇంట్లో ఉన్న ఐదుగురు యువకులతో కలిసి యువతి నోట్లో గుడ్డలు కుక్కింది. వివస్త్రను చేసింది. సామూహిక లైంగిక దాడి చేయించేందుకు ప్రయత్నించింది. ఓ యువకుడు యువతి జననాంగంపై దాడి చేసి దారుణంగా హింసించాడు. దీంతో బాధితురాలికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘోరాన్ని గాయత్రి తన సెల్ఫోన్లో రికార్డు చేసింది. అంతసేపూ బయటే వేచి చూస్తున్న యువతి తల్లిదండ్రులు, న్యాయవాదులు ఆమె రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రధాన గేటు దాటి, నాలుగు పెంపుడు శునకాలను తప్పించుకుని లోనికి వెళ్లడానికి దాదాపు 20 నిమిషాలు పట్టింది. అప్పటికి గాయత్రి సహా ఆరుగురూ ఇంటి వెనుక ఉన్న నిచ్చెన సాయంతో గోడ దూకి పారిపోయారు. అది కూడా అత్యాచారమే.. ఈ దారుణాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు అదేరోజు గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేయించారు. అయితే మహిళ జననాంగంపై దాడి చేయడం కూడా అత్యాచారమే అని చట్టం చెబుతోందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరుగురిపైనా అత్యాచారం, నిర్భంధం, మహిళ ఆత్మ గౌరవానికి భంగం కలిగించడం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. గాయత్రి సహా పరారీలో ఉన్న నిందితులను శనివారం అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నా కూతురికి ఏ శిక్ష వేసినా ఆనందమే ఓ ఆడపిల్లపై పాశవికంగా దాడి చేసిన నా కూతురుకు ఏ శిక్ష వేసినా ఆనందమే. ఆమె ఏ తప్పు చేసినా శ్రీకాంత్ గుడ్డిగా ప్రోత్సహిస్తుంటాడు. అతని ప్రోద్బలంతోనే గాయత్రి ఆ యువతిపై ఆ విధంగా దాడి చేసి ఉండవచ్చు. శ్రీకాంత్‌ను కూడా అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. – కృష్ణవేణి, గాయత్రి తల్లి చదవండి: వివాహేతర సంబంధం: అన్న మెడకు టవల్ చుట్టి.. -
ఎదురింటి యువకుడితో వివాహేతర సంబంధం..
గొల్లపల్లి (కరీంనగర్ ): ఓ వివాహిత మరొకరితో వివా హేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి మందలించినా ఆమెలో మార్పు రాలేదు. భార్య చేసిన మోసం అతన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఈ క్రమంలో ఆమె వివాహిత ప్రియుడు, కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి, గొడవ చేయడంతో ఇక బతకొద్దని నిర్ణయించుకొని, తనువు చాలించాడు. మృతుడి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గొల్లపల్లికి చెందిన జేరిపోతుల హన్మాండ్లు–దేవమ్మ దంప తులకు ముగ్గురు కుమారులు. వీరి చిన్న వయసు లోనే తండ్రి చనిపోయాడు. తల్లి దేవమ్మే పిల్లలను పెంచి పెద్ద చేసింది. చిన్న కుమారుడు గంగాధర్(35)కు పదేళ్ల కిందట తిరుపతమ్మతో పెళ్లి జరిపించింది . వీరికి ప్రమోద్ సంతానం. కాగా తిరుపతమ్మ పెళ్లయిన రెండేళ్లకే అనారోగ్యంతో మృతి చెందింది. తర్వాత గంగాధర్ పెగడపల్లి మండలం నంచర్లకు చెందిన మమతను రెండో వివాహం చేసుకున్నాడు. గ్రామంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ, సామాజిక కా ర్యక్రమాల్లో పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకున్నా డు. కానీ పెళ్లి జరిగి, ఆరేళ్లయినా ఈ దంపతులకు సంతానం కలగలేదు. ఈ క్రమంలో మమత జేరిపోతుల అభిషేక్ అనే ఎదురింటి యువకుడితో వివా హేతరం సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలి సిన భర్త పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు ఆమె ను హెచ్చరించాడు. అయినా మమత ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అభిషేక్‌తోపాటు అతని కు టుంబసభ్యులను మందలించాడు. ఈ నెల 11న మమత తన ప్రియుడితో కలిసి గంగాధర్‌కు పట్టుబడింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరి గింది. గత శనివారం రాత్రి అభిషేక్, అతని కుటుంబసభ్యులు గంగాధర్ ఇంటికి వచ్చి గొడవ చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఆదివారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి,∙తల్లి దేవమ్మ బోరున విలపించింది. అక్రమ సంబంధం మానుకోవాలని ఎన్నిసార్లు మందలించినా కోడలు వినలేదని తెలిపింది. ఆమె ప్రియుడు, కుటుంబసభ్యులు తమను చంపేస్తామని బెదించారని, అందువల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మమత, అభిషేక్‌లపై కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. అయితే దేవమ్మ తన కుమారుడి మృతికి అభిషేక్ తల్లి లక్ష్మి, తండ్రి కిష్ఠయ్య, జేరిపోతుల రాకేశ్, మహేశ్, శంకర్, అతని భార్య అమ్మాయిలు కూడా కారణమని చెప్పిందన్నారు. విచారణలో నిజమని తేలితే అందరిపైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఎస్పీ ప్రకాశ్ బాధితుల ఇంటికి వెళ్లి, వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబసభ్యులను మంత్రి కొప్పుల ఈశ్వర్, డీసీసీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించారు. -
బాబాయితో వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి హత్య
ఖమ్మం (తల్లాడ) : కన్నూమిన్ను కానక బాబాయి వరుసయ్యే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. ఈ విషయం భర్తకు తెలిసి గొడవలు జరుగుతుండడంతో అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి హతమార్చింది. కానీ తనపై వేధింపులు తాళలేక హత్య చేసినట్లు పోలీసులను ఏమార్చాలని చూసినా విచారణలో అసలు విషయం బయటపడింది. వైరా సీఐ వసంత్‌కుమార్ తెలిపిన వివరాలు.. గతనెల 26న కుర్నవల్లి దళితకాలనీలో ఇనుపనూరి జయరాజు హత్య జరిగింది. ఆయన్ను భార్య నిరోషా రోకలిబండతో కొట్టి చంపినట్లుగా అంగీకరించింది. మద్యం మత్తులో తనను వేధిస్తుండడంతో హత్య చేసినట్లు పోలీసులకు చెప్పింది. కానీ, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా నిరోషాకు వరుసకు బాబాయి అయ్యే కల్లూరు మండలం చిన్నకోరుకొండికి చెందిన మాడుగుల కృష్ణతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే నిరోషా, కృష్ణ కలిసి ఉండగా మద్యం మత్తులో ఉన్న జయరాజు ఈనెల 26న చూశాడు. దీంతో ఆయన గొడవ పడుతుండగా కృష్ణ తన్నడంతో కింద పడిపోయాడు. ఆ వెంటనే నిరోషా రోకలి బండతో భర్తను కొట్టి స్పృహ తప్పాక కృష్ణ గట్టిగా కాళ్లు పట్టుకున్నారు. ఆ తర్వాత నిరోషా దుప్పటితో జయరాజు నోటిని అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేశారు. ఈ విషయాలన్నీ విచారణలతో తేలడంతో ఇద్దరినీ మధిర కోర్టులో హాజరుపర్చాక రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. -
Extramarital Affair: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు!
అనంతపురం క్రైం: వివాహేతర సంబంధం పెట్టుకుని పోలీసు శాఖ పరువు తీసిన కానిస్టేబుల్ హర్షవర్దన్ రాజుతో పాటు మహిళా కానిస్టేబుల్‌ను ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సస్పెండ్ చేశారు. కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన హర్షవర్దన్ రాజు (2018వ బ్యాచ్) అనంతపురం రూరల్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ఓ మహిళతో రెండేళ్ల క్రితం వివాహమైంది. తల్లిదండ్రులకు ఆమె ఒక్కరే సంతానం. దీంతో కట్నకానుకల కింద రూ.20 లక్షల నగదు, పది తులాల బంగారం, కారు ఇచ్చినట్లు సమాచారం. (చదవండి: మాయమాటలు చెప్పి.. శారీరకంగా లొంగదీసుకొని.. గర్భవతిని చేసి) కాగా..హర్షవర్దన్‌కు కొన్నేళ్ల క్రితం ఏఆర్ విభాగంలోని ఓ మహిళా కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆమెను తరచూ ఇంటికి తీసుకెళ్లేవాడు. ఈ విషయమై భార్య అడిగితే తన చెల్లి అని చెప్పేవారు. ఓ రోజు గట్టిగా నిలదీయగా.. ‘పోలీసు శాఖలో ఇటువంటివి సహజం. లైట్‌గా తీసుకోవాలి ’ అంటూ సమాధానమిచ్చారు. దీంతో విసిగిపోయిన భార్య పుట్టింటికి వెళ్లింది. భార్యను తిరిగి తీసుకురావడానికి ఆయన ఏనాడూ వెళ్లలేదు. చివరకు పెద్దలు పంచాయితీ చేసినా ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో బాధితురాలు, ఆమె తండ్రి బ్రహ్మసముద్రం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో విచారణకు ఎస్పీ ఆదేశించారు. విచారణాధికారుల నివేదిక ఆధారంగా హర్షవర్దన్ రాజుతో పాటు మహిళా కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. చదవండి: ఒంగోలు ఆస్పత్రిలో ప్రేమ..హైదరాబాద్‌కి వచ్చి కత్తితో పొడుచుకుని.. -
వేరే మహిళతో భర్త సంబంధం.. సర్పంచ్ తట్టుకోలేక..
జడ్చర్ల టౌన్: కుటుంబ కలహాలతో ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మాచారానికి చెందిన సిరి (28)కి నసురుల్లాబాద్‌తండా వాసి శ్రీనివాస్‌తో 11 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడంతో కలహాలు మొదలయ్యాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోగా పలుమార్లు గొడవలు జరిగి పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. అయినా భర్త వైఖరిలో మార్పు రాకపోవడంతో మనోవేదనకు గురైన భార్య వారం కిందట ఇంట్లోనే గడ్డిమందు తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. శనివారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తండాకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి సోదరుడు శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఆమె భర్త ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. సర్పంచ్ల సంఘం సంతాపం నసురుల్లాబాద్‌తండా సర్పంచ్ సిరి మృతిపై సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్, మండల అధ్యక్షుడు బాల్‌సుందర్ తదతరులు సంతాపం వ్యక్తం చేశారు. జెడ్పీ వైస్‌చైర్మన్ కోడ్గల్ యాదయ్యతో పాటు సర్పంచ్ల సంఘం రాష్ట్ర నాయకులు తండాలో రాత్రి జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తాము అండగా ఉంటామని పిల్లలకు భరోసా కల్పించారు. -
వైరల్: ఇంటర్వ్యూలో ఉండగా చెల్లిని చితకబాదిన అక్క.. గ్యాప్ కూడా ఇవ్వలే..
Women Beats Sister Video: సోషల్‌మీడియా వాడకం పెరిగేకొద్ది నెట్టింట వైరల్ వీడియోల హవా పెరుగుతోంది. ఈ జాబితాలో వింతలు, విశేషాలు, డాన్స్‌లు, కొట్లాటలు ఇలా నెటిజన్లకు నచ్చితే చాలు అవి వైరల్ కావడం.. లైక్స్, వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. తాజాగా ఓ వీడియో నెట్టంట హల్చల్ చేస్తోంది. అందులో ఓ చెల్లి ఇంటర్వ్యూలో ఉండగా మధ్యలో అక్క వచ్చి ఆమెను చితకబాదుతుంది. అయితే అలా చేయడానికి ఓ బలమైన కారణమే ఉందండోయ్! వివరాల్లోకి వెళితే.. ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఓ యువతి ఇంటర్వ్యూ గదిలో కంపెనీ ప్రతినిధి ప్రశ్నలకు సమాధానమిస్తుంటుంది. అలా కొనసాగుతుండగా మధ్యలో అకస్మాత్తుగా ఆమె అక్క అక్కడికి వచ్చి మెరుపు వేగంతో తన చెల్లిపై పిడి గుద్దులు కురిపిస్తుంది. అంతటితో ఆగకండా తన చెల్లి మీద కూర్చుని ఎడాపెడా వాయిస్తుంది. క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా చితకబాదేస్తుంది. ఆమె కోపం చూసి ఆ పరిసరాల్లో ఉన్న కంపెనీ సిబ్బంది కూడా అక్కని ఆపేంత సాహసం చేయలేకపోయారు. మరీ అంతలా ఆమె ఎందుకు కొట్టిందంటే.. తన భర్తతో చెల్లి వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం అక్కకి తెలిసింది. దీంతో కోపంతో ఊగిపోయి చెల్లి ఇంటర్య్వూ జరుగుతున్న ఆఫీస్‌కు వచ్చి మరీ బాదేసి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్ పెడుతున్నారు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్ దొంగతనం వైరల్ -
మహిళతో డాక్టర్ వివాహేతర సంబంధం
-
కొడుకును కొట్టి చంపింది
జీడిమెట్ల: కడుపున పుట్టిన కొడుకును అక్రమ సంబంధానికి అడ్డుగా తలచింది ఓ కర్కశ తల్లి. ముక్కుపచ్చలారని కొడుకును చేతికందిన దాంతో విచక్షణారహితంగా కొట్టేది. ఆ దెబ్బలకు చిన్నారి తట్టుకోలేక విలవిల్లాడిపోయేవాడు. ‘అమ్మా.. నన్ను కొట్టద్దు అమ్మా’ అంటూ రోదిస్తున్నా.. ఆ తల్లి మనసు కరగలేదు. చివరికి బాలుడు కన్నుమూశాడు. అమ్మతనానికి మచ్చ తెచ్చిన ఈ అమానుష ఘటన మంగళవారం హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బాలరాజు, బాలుడి తండ్రి కథనం ప్రకారం... సూరారం ప్రాంతానికి చెందిన సురేశ్ ప్రైవేట్ ఉద్యోగి. భార్య ఉదయ, కుమారుడు ఉమేష్(3)లతో కలిసి ఉండేవాడు. కుటుంబకలహాలతో ఉదయ ఏడాదిగా భర్తకు దూరంగా ఉంటోంది. చింతల్ డివిజన్ భగత్‌సింగ్ నగర్లో నివసిస్తున్న ఈమెకు భాస్కర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరూ తరచూ ఉమేష్‌ను వేధించేవాళ్లు. ఉదయ అయితే తన భర్తపై ఉన్న కోపాన్ని కుమారుడిపై చూపించేది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కసితో బాలుడిని హింసించేది. మంగళవారం మధ్యాహ్నం కరెంట్ వైర్‌తో విచక్షణారహితంగా కొట్టింది. ఆ దెబ్బలు తాళలేక కొద్దిసేపటికి ఉమేష్ సొమ్మసిల్లి, అచేతనంగా పడిపోయాడు. దీంతో సాయంత్రం 4 గంటలకు సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించాలని కోరింది. పరీక్షించిన డ్యూటీ డాక్టర్ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. బాలుడి ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానించిన ఆస్పత్రి సిబ్బంది జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. ఉదయ, భాస్కర్ల వివాహేతర సంబంధానికి తన కుమారుడు అడ్డుగా ఉన్నాడనే కొట్టి చంపారని సురేశ్ ఆరోపిస్తున్నారు. -
వివాహేతర సంబంధం: మత్తుకు బానిసై కన్నతండ్రే..
నాగర్‌కర్నూల్ క్రైం: ఆలనాపాలనా చూడాల్సిన తండ్రే.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న కొడుకులను కడతేర్చేందుకు ప్రయత్నించాడు. నిద్రపోతున్న ఇద్దరు కుమారుల మణికట్టు కోయగా.. ఓ కుమారుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా మంతటిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ మండలం మంతటికి చెందిన శివశంకర్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి గడ్డంపల్లికి చెందిన స్వప్నతో ఎనిమిదేళ్ల కింద వివాహం కాగా, మల్లికార్జున్ (7), ప్రణయ్ ఇద్దరు కుమారులు ఉన్నారు. శివశంకర్ మద్యానికి బానిస కావడంతో పాటు వివాహేతర సంబంధానికి అలవాటుపడటంతో స్వప్న 3 నెలల కింద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కొడుకులను శివశంకర్ అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న ఇద్దరి కుమారుల కుడిచేతి మణికట్టును కత్తితో కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం తాను చనిపోతున్నానంటూ తండ్రి పుల్లయ్యకు ఫోన్‌చేసి చెప్పగా.. వెంటనే వారు పక్క గదిలోకి వెళ్లి చూశారు. అప్పటికే మల్లికార్జున్ మృతి చెంది ఉన్నాడు. గాయపడిన ప్రణయ్‌ను హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. గ్రామంలో చెరువుకట్ట వద్ద శివశంకర్‌ను గుర్తించిన గ్రామస్తులు ఇంటికి తీసుకొచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఇన్చార్జి సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్ఐలు విజయ్‌కుమార్, రాజులు పరిశీలించి వివరాలు తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ( చదవండి: బెంగళూరులో హత్య, హైదరాబాద్‌లో గాలింపు! ) -
హోంగార్డ్‌తో అఫైర్
-
భార్య వివాహేతర సంబంధం: మంచం కింద దాక్కొని హత్య
బెంగళూరు: సాఫీగా సాగిపోతున్న సంసారంలో భార్య స్నేహితుడు రావడంతో ఆ పచ్చటి సంసారంలో నిప్పు రాజేసింది. ఫలితంగా భార్యతో అతడు సాగిస్తున్న రాసలీలలు ఆగ్రహం తెప్పించాయి. తన కాపురంలో చిచ్చు పెట్టిన వ్యక్తిని హతమార్చేందుకు ఆమె భర్త పక్కా ప్లాన్ వేశాడు. భార్య ప్రేయసిని హత్య చేసేందుకు దాదాపు ఆరు గంటలకు పైగా మంచం కింద కూర్చుని అదును కోసం వేచి ఉన్నాడు. భార్య అర్ధరాత్రి బాత్రూమ్ వెళ్లగా ఇదే మంచి సమయమని భావించి పైకొచ్చి మంచంపై ఉన్న ప్రియుడిని హత్య చేశాడు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. హోసహల్లి తండాకు చెందిన వినుత, భరత్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు. నెలమంగళ సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో భార్యాభర్తలు పని చేస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఉద్యోగం పని మీద వినుత స్నేహితుడు శివరాజ్ ఇంటికి వచ్చాడు. ఓ వారం పాటు వారితో ఉన్నాడు. శివరాజ్‌కు వినుతనే ఉద్యోగం వచ్చేలా చేసింది. ఈ క్రమంలో శివరాజ్ వినుతకు ‘ఐలవ్యూ’ చెప్పాడు. ఆమె షాక్‌కు గురయి నిరాకరించింది. అయితే తనను పప్రేమించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని శివరాజ్ బెదిరింపులకు పాల్పడడంతో ఆమె మెత్తబడింది. దీంతో వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు ఈ విషయం భర్త భరత్‌కు తెలిసింది. దీనిపై నిలదీయగా భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో వినుత అతడిని వదిలేసి ఒంటరిగా నివసించడం మొదలైంది. అయితే శివరాజ్‌తో మాత్రం వినుత సంబంధం కొనసాగిస్తోంది. తన భార్య దూరం కావడానికి కారణమైన శివరాజ్‌ను అంతమొందించాలని భరత్ నిర్ణయించుకున్నాడు. దీంతో గురువారం రాత్రి భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆమె లేని సమయంలో ఇంట్లోకి దూరి మంచం కింద దాచుకున్నాడు. కొద్దిసేపటికి భార్య, ఆమె ప్రియుడు శివరాజ్ వచ్చారు. మంచంపైనే భార్యతో అతడు సాగిస్తున్న సంబంధం చూసి ఆక్రోశం పెంచుకున్నాడు. అదును కోసం చూస్తూ దాదాపు ఆరు గంటల వరకు వేచి ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భార్య బాత్రూమ్కు వెళ్లింది. ఇదే సమయమని భావించి అతడు వెంటనే మంచం కింద నుంచి బయటకు వచ్చి శివరాజ్‌పై పదునైన కత్తితో దాడి చేసి హత్య చేశాడు. దీనిపై బైదరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు భరత్ పరారవుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి.. చదవండి: ‘లేడీ సింగమ్’ ఆత్మహత్య.. మహారాష్ట్రలో ప్రకంపనలు -
అందరూ చూస్తుండగా భర్తను చితకబాదిన భార్య
సాక్షి, వరంగల్: మరో మహిళతో సహజీవనం చేస్తూ తనను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్న భర్తకు ఒక మహిళ తగిన రీతిలో బుద్ధి చెప్పింది. బ్యాంకులో పనిచేస్తున్న అతడిని అందరూ చూస్తుండగానే చొక్కా పట్టుకుని చితకబాదింది. ఈ ఘటన మంగళవారం వరంగల్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్‌కు చెందిన శ్రీనివాస్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా 10 సంవత్సరాల క్రితం ఒక మహిళను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వారికి ఒక పాప ఉంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న భార్యను పట్టించుకోవడం మానేశాడు. కాగా మహిళతో సహజీవనం చేస్తూ ఇంటికి రావడం తగ్గించిన శ్రీనివాస్‌పై అనుమానం వచ్చి అతను పని చేస్తున్న బ్యాంకుకు వెళ్లి నిలదీసింది. వేరొక మహిళతో కలిసి ఉంటూ నాకు అన్యాయం చేస్తావా అంటూ అందరు చూస్తుండగానే శ్రీనివాస్ చొక్కా పట్టుకొని చితకబాదింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన సిబ్బంది ఆమెను నిలువరించేందుకు ప్రయత్నించినా ఎవరి మాట వినకుండా మరోసారి చితకబాదింది. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. -
మరో మహిళతో దొరికిన భర్త.. కట్టేసి కొట్టిన భార్య
సాక్షి, ఖమ్మం: కట్టుకున్న భార్యను మోసం చేసిన భర్తకు తగిన శాస్తి జరిగింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను, సదరు భార్య, ఆమె తరపు బంధువులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన ఘటన ఖమ్మం పట్టణంలోని గట్టయ్య సెంటర్లో చోటు చేసుకుంది. ఖమ్మం నగర్‌కు చెందిన శీను ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కోర్ట్ కాలనీ కి చెందిన కవితతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే గత కొన్ని నెలలుగా తరచూ భార్య, పిల్లలతో గొడవ పడుతున్నాడు. ఇదే క్రమంలో గట్టయ్య సెంటర్లో భార్యకు తెలియకుండా ఓ ఇళ్లు అద్దెకు తీసుకున్నాడు. అదే ఇంట్లో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఉంటున్నాడు. రోజూ ఉదయం బయటకు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పడం అక్కడ నుంచి నేరుగా ఆ మహిళ వద్దకు వెళ్లడం చేస్తున్నాడు. దీంతో భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య బంధువులతో కలిసి నిఘా పెట్టింది. సోమవారం తెల్లవారుజామున గట్టయ్య సెంటర్‌కు భర్త వెళ్లడం చూసిన భార్య, బంధువులు కొద్దిసేపటి తర్వాత వెళ్లి రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. భర్తతో పాటు మహిళకు దేహశుద్ది చేశారు. చేతులు కట్టేసి చితకబాదారు. అనంతరం భర్తను, ఆ మహిళను ఖమ్మం టూటౌన్ పోలిసులకు అప్పగించారు. (చదవండి: పనిమనిషిపై మోజు... కటకటాలపాలు) -
వివాహేతర సంబంధం.. అనుమానంతో..
సాక్షి, సిరిసిల్ల : గతంలో తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి అతడేననే అనుమానంతో గ్రామానికి వచ్చిన వ్యక్తిని హత్య చేసిన నిందితుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహెల్హెగ్డే వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరి పల్లెకు చెందిన దొంతరవేణి బాలయ్య అనే వ్యక్తి తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని వేరుగా ఉంటున్నాడు. ఈక్రమంలో గతనెల 20న ఓ వ్యక్తి సోమరిపేట నుంచి రత్నగిరికి రాగా నీరంగా ఉండడంతో బాలయ్యకు చెందిన బంధువులు భోజనం అందించారు. ఇంటి సమీపంలోని ఇసుక దిబ్బలో నిద్రించగా అతడిని నమ్మించిన బాలయ్య గంభీరావుపేట మండలం గజసింగవరం అటవీప్రాంతంలోని దేవరగుట్టకు తీసుకెళ్లాడు. చదవండి: ఏం కష్టం వచ్చింది బిడ్డా! అతడి బట్టలు విప్పి, చేతులు కాళ్లు కట్టేశాడు. హత్యచేయాలనే ప్రణాళికలో భాగంగా వెంట తెచ్చుకున్న బ్లేడుతో మర్మాంగాన్ని కోసేశాడు. అనంతరం పక్కన ఉన్న బండరాయితో తలపై కొట్టి చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం బాలయ్య ఇంటికి చేరుకున్నాడు. గుట్టపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై గ్రామంలో దర్యాప్తు చేయగా హత్య చేసిన బాలయ్యను ఎల్లారెడ్డిపేట సర్కిల్ పోలీసులు పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది తనకు తెలియదని బాలయ్య చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలకోసం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. సమావేశంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, ఎల్లారెడ్డిపేట సీఐ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. రా ఏజెంట్.. విడాకులు తీసుకున్న మహిళతో! సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న గోదావరిఖని టూటౌన్ సీఐ–2 లక్ష్మీనారాయణ భార్యను కడతేర్చిన భర్త కమాన్‌పూర్(రామగుండం): కమాన్‌పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన కోల స్వరూప(42)ను భర్త కోల తిరుపతి కడతేర్చిన విషాద సంఘటన చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసుల వివరాలు మేరకు.. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన స్వరూపను 23 ఏళ్లక్రితం జూలపల్లి గ్రామానికి చెందిన కోల తిరుపతికి ఇచ్చి వివాహం జరిపించారు. కొన్ని సంవత్సరాల తరువాత తిరుపతి భార్యాపిల్లలను పట్టించుకోకుండా స్వరూపను డబ్బు తీసుకురావాలని వేధిస్తున్నాడు. గతంలో ఇంటి నుంచి వెళ్లిపోగా పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. కొద్దిరోజులకు తిరుపతి జూలపల్లి గ్రామానికి తిరిగొచ్చాడు. తిరిగి నెల్లూరు జిల్లాలోని పోర్టులో డ్రైవర్ పని చేస్తూ అప్పుడప్పుడు వచ్చి పోతున్నాడు. గతేడాది ఇంటికి వచ్చి అప్పటి నుంచి డబ్బు కావాలని స్వరూపను వేధిస్తున్నాడు. ఇటీవల తిరుపతికి రూ.50 వేలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఇంట్లో గొడవ జరగగా స్వరూపను గొంతు నులిమి చంపి తిరుపతి పరారయ్యాడు. కరీంనగర్ ఆస్పత్రికి వెళ్లి వచ్చిన ఆమె కుమారుడు పవన్, కూతురు శృతి ఇంటి తలుపులు తీసి చూసే సరికి మంచంపై స్వరూప మృతిచెంది ఉంది. పథకం ప్రకారం గొంతునులిమి హతమార్చిన తిరుపతిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తమ్ముడు రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరిఖని టూటౌన్ సీఐ–2 లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీఐ వెంట కమాన్‌పూర్ ఎస్సై శ్యాంపటేల్, గోదావరిఖని టూటౌన్ ఎస్సై శ్రీనివాస్ ఉన్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..
సాక్షి, నిజామాబాద్: నగరంలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. నాగారం ప్రాంతంలో నివాసం ఉంటున్న సాల్మన్ రాజు అనే వ్యక్తి గత ఏడాది కాలంగా ఆర్యనగర్‌లోని అపార్ట్మెంట్లో ప్లంబర్ వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ పక్కన నివాసం ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అర్ధరాత్రి తన ఇంటికి వచ్చిన ఆ మహిళ భర్త ఉమాకాంత్ వీళ్లిద్దరూ కలిసి ఉండడం చూసి కోపంతో రగిలిపోయాడు. ఇంట్లో ఉన్న రాడ్‌తో సల్మాన్ రాజ్ తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు ఉమాకాంత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సిఐ సత్యనారాయణ తెలిపారు. -
కూతురు ఫోన్ రికార్డుతో బయటపడ్డ మర్డర్ స్కెచ్
సాక్షి, తూర్పు గోదావరి : భార్య ఉండగానే వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. మహిళతో అక్రమ సంబంధానికి ఆమె భర్త అడ్డుగా ఉన్నాడని హత్య చేయాలని పథకం రచించాడు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మండపేట సంఘం కాలనీకి చెందిన మహిళతో సతీష్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్తా ఆమె భర్తకు తెలియడంతో పలుమార్లు ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అడ్డుగా ఉన్న ఆమె భర్తను తొలగించుకోవాలని కుట్ర పన్నాడు. దీని కోసం అతని స్నేహితుడు ప్రతాప్ సాయం కోరాడు. అతని సలహా మేరకు ఆహారంలో స్లో పాయిజన్ ఇచ్చేందుకు పథకానికి ప్రణాళిక రచించాడు. దీనికి మహిళ కూడా ఓకే చెప్పడంతో హత్య చేయాలని భావించాడు. అయితే తల్లి వ్యవహారంపై అప్పటికే అనుమానం వచ్చిన చిన్న కూతురు ఆమె ఫోన్ కాల్స్ రికార్డు చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే హత్య పథకం బయటపడింది. తండ్రిని హత్య చేసేందుకు సతీష్‌తో కలిసి భార్య కుట్ర పన్నిందన్న విషయం తెలిసి భర్త షాకయ్యాడు. అనంతరం మహిళ భర్త మండపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు.. సతీష్‌పై ఐపీసీ 307, 328 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ పథకంలో ప్రధాన పాత్రదారులైన సతీష్, ప్రతాప్‌లను నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
భర్త కోసం మౌన పోరాటం
సాక్షి, అనంతపురం : ‘పరాయి మహిళ మోజులో పడి నా భర్త నన్ను కాదంటున్నాడు.. పోలీసులు, పెద్ద మనుషులు పంచాయితీ చేసినా వినిపించుకోలేదు... న్యాయం కోసం వస్తే అత్తింటి వారు గెంటేశారు’ అని జానగాని వరలక్ష్మి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మండలంలోని హంపాపురంలో ఉన్న తన భర్త ఇంటి ముందు ఆమె భర్త, ఇద్దరు కుమారులు కావాలని దీక్షకు కూర్చుంది. ఆమెకు పలువురు మహిళలు బాసటగా నిలిచారు. జానగాని వరలక్ష్మి తెలిపిన వివరాలమేరకు.. బుక్కరాయసముద్రం మండలం బాట్లో కొత్తపల్లి గ్రామానికి చెందిన యల్లప్ప, ఈశ్వరమ్మ దంపతుల కుమారై వరలక్ష్మిని హంపాపురానికి చెందిన కాటమయ్య, ఆదెమ్మల కుమారుడు జానగాని సాంబశివాతో 2013లో వివాహం చేశారు. రూ.4 లక్షలు , 16 తులాల బంగారు నగలు కట్నకానులు ఇచ్చి పెళ్లి జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్ (7), కౌసిక్ (5) సంతానం. సాంబశివ అనంతపురంలో ఫొటో స్టూడియో పెట్టుకుని జీవనం చేస్తున్నాడు. పెళ్లి అయిన ఐదేళ్లు అతను భార్యతో బాగానే ఉన్నాడు. అయితే అతని ప్రవర్తనలో మార్పు కనిపించడంతో ఆమె భర్తపై నిఘా పెట్టగా అనంతపురంలో ఓ మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ విషయమై వరలక్ష్మి భర్తను ప్రశ్నించడంతో వివాదం రాజుకుంది. ఈ విషయంపై పోలీసులు సాంబశివకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. భార్య తనను పోలీసులతో కొట్టించిందన్న కోపంతో భర్త ఇద్దరు కుమారులను తీసుకొని అనంతపురానికి వెళ్లాడు. నాలుగు నెలల పాటు భర్త ఇంట్లోనే ఉంటున్నా భర్త, పిల్లలు గ్రామానికి తిరిగి రాకపోయే సరికి ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఆఖరికి ఆమె తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లి నాలుగు నెలలు అవుతున్న ఒక పక్క భర్త, మరో పక్క పిల్లలు గుర్తుకు రావడంతో మరోసారి ఆత్మహత్యయత్నం చేసుకోబోయింది. ఆఖరికి మంగళవారం ఉదయం హంపాపురానికి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఆమె అత్త ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. దీంతో భర్త ఇంటి ముందే దీక్షకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు. ఇరువురిని పిలిపించి విచారిస్తామని, అవసరమైతే జానగాని వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
చాటుగా కలుసుకునే వారే వీరి టార్గెట్
సాక్షి, నల్గొండ : వివాహేతర సంబంధాలతో చాటుమాటుగా కలుసుకోవడాన్ని ఆసరాగా చేసుకొని కొందరు దుండగలు వారిని బెదిరించి బంగారం, డబ్బులు దోచుకుంటున్న ఉదంతం శనివారం మండల పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డబ్బులు ఇవ్వకపోతే వారిపై దాడి చేస్తూ మహిళలను శారీరకంగా అనుభవిస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇలాంటి పలు సంఘటనలు చిలుకూరు మండలంలోని సీతారాంపురం గుట్టల్లో తరచుగా జరుగుతున్నాయి. అయినా బాధితులు బయటికి చెప్పుకోకపోవడంతో ఇన్నాళ్లూ బాహ్య ప్రపంచానికి తెలియలేదు. ఇటీవల ఓ బాధితుడు విషయం బయటపెట్టడంతో చిలుకూరు పోలీస్‌స్టేషన్‌లో పలువురిపై కేసు నమోదు అయింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం...చిలుకూరు మండల పరిధిలోని సీతారాంపురం సమీపంలో కోదాడ– హుజూర్నగర్ రహదారి పక్కన పెద్ద గుట్టలు ఉన్నాయి. ఇవి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. దాంతో దీనిని గమనించిన సీతారాంపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇక్కడకు వచ్చే జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. మొదట వీరు వివాహేతర జంటలను గుర్తించి వారి వద్దకు వెళ్తారు. బెదిరించి వారి నుంచి వివరాలు సేకరిస్తారు. ఆ విషయాలను సంబంధీకులకు చెబుతామని బ్లాక్మెయిల్ చేసి నగలు, డబ్బులు లాక్కొని పారిపోతారు. వినకుంటే గాయపరుస్తారు. మరి కొందరు దుండగులు మహిళలను శారీరకంగా అనుభవిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు గత నెల రోజుల్లోనే మూడునాలుగు జరిగినట్లుగా తెలిసింది. భయటపడింది ఇలా... దుండగులకు ఈనెల 2వ తేదీన గుట్టల్లో ఓ జంట దొరికింది. దాంతో వారి వద్దకు వెళ్లి బెదిరించారు. వారి ఫొటోలు తీశారు. పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ఇస్తామని ఒప్పుకోవడంతో యువతిని వదిలేశారు. దాంతో ఆమె పరారైంది. అనంతరం యువకుడిని డబ్బులు డిమాండ్ చేయగా తన వద్ద లేవని చెప్పడంతో చిలుకూరు ఏటీఎం వద్దకు తీసుకొచ్చి డబ్బులు డ్రా చేసి తీసుకున్నారు. అతడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లాక్కున్నారు. దాంతో బాధితుడు 3వ తేదీన తన బంధువులతో కలిసి సీతారాంపురం గ్రామంలో ఆ వ్యక్తుల కోసం వెతికారు. స్థానికుల సహాయంతో దుండగుల పేర్లు సేకరించారు. గ్రామంలోని పెద్ద మనుషుల సహకారంతో వారిని గ్రామపంచాయతీకి పిలిపించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దుండగులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేయగా నిజం ఒప్పుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
మేడ్చల్‌లో అమానుషం!
సాక్షి, ఘట్కేసర్: ఓ తల్లి వేసిన తప్పటడుగులు, ఓ యువకుడి ఆవేశం కలిసి అభం శుభం ఎరుగని ఐదేళ్ల చిన్నారిని బలి తీసుకున్నాయి. తొలుత స్నేహంగా ఉండి తర్వాత తనను నిర్లక్ష్యం చేస్తోందనే అక్కసుతో ఆమె ఐదేళ్ల కుమార్తెను అతడు దారుణంగా హత్య చేశాడు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం మున్సిపాలిటీ ఇస్మాయిల్‌ఖాన్‌గూడ విహారి హోమ్స్‌లో గురువారం జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా అత్మకూర్ మండలంలో గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న సూరనేని కళ్యాణ్‌రావుకు ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అనూష 2011లో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఇది కాస్తా ప్రేమకు దారి తీసి ఇరువురూ వివాహం చేసుకున్నారు. 2015లో వీరికి ఆద్య జన్మించింది. తమ కుమార్తె చదువు కోసమని ఇస్మాయల్‌ఖాన్‌గూడ విహారి హోమ్స్‌కు నివాసం మార్చారు. ఈ క్రమంలో ఏడాది క్రితం బజాజ్ ఫైనాన్స్‌లో సెల్‌ఫోన్ తీసుకునేందుకు వెళ్లిన అనూషకు అక్కడ పనిచేసే సిరిసిల్ల జిల్లా ముక్తాబాద్‌కు చెందిన కరుణాకర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో అతడు ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. అప్పుడప్పుడూ తనతోపాటు స్నేహితుడు రాజశేఖర్‌ని కూడా తీసుకొచ్చేవాడు. సర్జికల్ బ్లేడ్‌తో గొంతు కోసి... ఇటీవల అనూష తనతో కంటే రాజశేఖర్‌తోనే ఎక్కువ చనువుగా ఉంటుందని కరుణాకర్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో కళ్యాణ్‌రావు బుధవారం విధి నిర్వహణ నిమిత్తం ఆత్మకూరు వెళ్లగా.. గురువారం రాజశేఖర్.. వాళ్లింటికి వచ్చాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన కరుణాకర్.. రాజశేఖర్‌ని చూసి ఆగ్రహంతో రగిలిపోయాడు. దీంతో అతడు బాత్రూంలో దాక్కోగా.. అనూష, కరుణాకర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అనంతరం కోపం పట్టలేని కరుణాకర్.. తన వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడుతో చిన్నారి ఆద్య గొంతు కోశాడు. ఇది చూసి అనూష గట్టిగా కేకలు వేయడంతో బయటకు వచ్చిన రాజశేఖర్‌పై కూడా దాడి చేశాడు. తర్వాత తన మెడతోపాటు మణికట్టుపై కోసుకున్నాడు. తొలుత ఈ పరిణామాలకు షాక్‌కు గురైన అనూష వెంటనే తేరుకుని స్థానికుల సహాయంతో ఆద్యను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే, అప్పటికే ఆ చిన్నారి మరణించిందని డాక్టర్లు ధ్రువీకరించడంతో ఆమె షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనూష భర్త కళ్యాణ్‌రావు ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల కాలంలో తనను అనూష దూరం పెడుతోందని, అందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు కరుణాకర్ పోలీసు విచారణలో చెప్పినట్టు తెలిసింది. కళ్యాణ్‌రావు, రాజశేఖర్ వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేశారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్న అనూష చెప్పేవిషయాలను బట్టి ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదం చేయించి ఆపై హత్య
సాక్షి, మేడ్చల్ : కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి అంతమొందించింది ఓ మహిళ. ఈ హత్య కేసును మేడ్చల్ పోలీసులు చేధించారు. మంగళవారం మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి వివరాలు వెల్లడించారు. మేడ్చల్ మండలం సైదనిగడ్డతండాకు చెందిన సురేష్‌తో దుండిగల్–2 తండాకు చెందిన బబితతో కొన్నెళ్ళ క్రితం వివాహం జరిగింది. బబిత పెళ్ళికి ముందు నుంచి తన మేన బావ దుందిగల్ తండా–2 కు చెందిన ప్రేంసింగ్ తోచనువుగా ఉంటోంది.కాపురంలో తరచూ ఈ కారణంగానే గోడవలు రావడం పెద్దలు సర్ది చెప్పడం అలవాటు గా మారింది. అయితే బబిత తన భర్తను ఎలాగైనా తొలగించాలని ప్రియుడి ప్రేంసింగ్‌తో కలిసి పథకం పన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఆజ్మీర్ ప్రేం, రాజు, నల్గొండకు చెందిన ముజీబ్, వజ్జోత్ రాజు, రాహుల్, సూరజ్, మోతీలాల్‌లను జట్టుగా ఏర్పాటు చేసుకుని వారికి పధకం వివరించాడు ప్రేమ్‌సింగ్. లక్ష రూపాయలకు చేసుకుని 70 వేల రూపాయలు అడ్వాన్సుగా ఇచ్చాడు. మే 23న సురేష్ శామీర్‌పేట్ మండలం యాడారం శివార్లలో డ్యూటీ ముగించుకుని సైదనిగడ్డతండాకు తన బైక్ పై వస్తుండగా డీసీఎంతో ఉన్న ప్రేంసింగ్ అనుచరుడు సూరజ్ సురేష్ వాహనానికి ఎదురుగా వెళ్లి ప్రమాదం చేశాడు. దీంతో సురేష్ రోడ్డు కింద కందకంలో పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అక్కడకు చేరుకున్న ఉత్తర్‌ప్రదేశ్ రాజు, అజ్మీర్‌ప్రేం రోడ్డపై వెళుతున్న ప్రయాణికుల్లా నటిస్తూ సురేష్ వద్దకు వెళ్ళి రోడ్డుపై కారు లో వెళుతున్నట్లు నటిస్తున్న మరో అనుచరుడు రాహుల్‌ను ఆసుపత్రి తీసుకెళదామంటూ గాయాలకు గురైన సురేష్‌ను కారు వెనుక సీటులో పడుకోబెట్టారు. సురేష్‌ను ఆజ్మీర్‌ప్రేం, ఉత్తర్‌ప్రదేశ్‌రాజులు టీషర్టును నోటిలో కుక్కి హత్య చేశారు. విషయాన్ని ప్రేంసింగ్‌కు తెలియజేయడంతో ఆయన సిద్దిపేట్ జిల్లా ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాలని చెప్పడంతో అక్కడకు తీసుకెళ్ళారు. అక్కడి వైద్యులకు సురేష్ ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పడి ఉంటడంతో తమ కారులో తీసుకువచ్చామని వైద్యులకు చెప్పారు. వైద్యులు పరీక్షించి సురేష్ మృతి చెందాడని నిర్ధారించడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు.. సురేష్ గాయాలతో కాకుండా ఊపిరి ఆడకుండా మృతి చెందాడని పోస్టుమార్టంలో రావడంతో అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేయడంతో అన్ని విషయాలు బయట పడ్డాయి. సురేష్ ను ఆసుపత్రిలో చేర్పించిన రాహుల్ పై పోలీసులు నిఘా పెట్టి సోమవారం గాగిళ్ళపూర్ పట్టుకుని విచారించగా మొత్తం విషయాలు బయటకు వచ్చాయి.మృతుడి భార్య బబిత, ప్రియుడు ప్రేంసింగ్, ఆజ్మీరప్రేమ్, రాహుల్,వజ్జోత్ రాజులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. ఏసీపీ నర్సింహ్మరావు, సీఐ ప్రవీణ్‌రెడ్డి,ఎస్ అప్పారావు లు ఉన్నారు. -
భర్త ప్రభాకరన్‌ను హతమార్చిన సుకన్య
సాక్షి, మల్కాజిగిరి : వారిద్దరూ పాత నేరస్తులే... భర్త బయట, భార్య జైలులో ఉండేది. ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని సహించలేక అతనినే కడతేర్చింది. పోలీసులకు అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించింది. వివరాలు.. చెన్నైకి చెందిన ప్రభాకరన్, సుకన్య(32) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. చెన్నైలో మనీ బ్యాక్ స్కీమ్ ప్రారంభించిన ప్రభాకరన్ 2012లో ఆర్థిక నేరాలకు పాల్పడటంతో సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయన జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రభాకరన్ భార్య సుకన్య కూడా అదే కేసులో ఐదు సంవత్సరాలు జైలుకు వెళ్లి వచ్చింది. భర్త సమాచారం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరిలో బంధువుల వద్ద పిల్లలతో కలిసి ఉంటోంది. జైలు నుంచి వచ్చిన ప్రభాకరన్ మౌలాలి ఆండాళ్ నగర్లో నివాసముంటున్నాడు. చర్చి పాస్టర్‌గా, సంఘ సేవకుడిగా పనిచేసేవాడు. రెండేళ్ల కిత్రం పక్షవాతం రావడంతో తనకు తోడుగా ఒక మహిళను కేర్ టేకర్‌గా ఏర్పాటు చేసుకున్నాడు. భర్త సమాచారం తెలుసుకున్న సుకన్య పది రోజుల కిత్రం భర్త వద్దకు పిల్లలతో కలిసి వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత భర్తతో పాటు మరో మహిళ (కేర్ టేకర్) ఉండటంతో భర్త మీద అనుమానం వచ్చింది. దీంతో కేర్‌టేకర్‌ను మాన్పించింది. కేర్ టేకర్‌ను రప్పించాలని భార్యతో ప్రభాకరన్ గొడవపడుతున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను, పిల్లలను చంపుతానని ప్రభాకరన్ బెదిరిస్తున్నాడు. ఈ నెల 23వ తేదీ రాత్రి కేర్‌టేకర్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సుకన్య దిండుతో భర్త మొహం మీద ఒత్తి హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి మరుసటి రోజు ఉదయం ఆమెనే 100 నంబర్‌కు కాల్ చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు చేయడానికి సుకన్య నిరాకరించడం, సంఘటన స్థలంలో కొన్ని వస్తువులు అనుమానాస్పదంగా కనిపించడంతో సుకన్యను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం అంగీకరించింది. ఈ నేపథ్యంలో శనివారం ఆమెను రిమాండ్‌కు తరలించాము’ అని ఇన్స్పెక్టర్ జగదీశ్వర్, ఎస్ఐ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. -
భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
సాక్షి, వరంగల్ : పెళ్లయి పదేళ్లయ్యింది. భర్తకి పనీపాటా లేదు. ప్రభుత్వ ఉద్యోగి అయిన భార్య సంపాదన మీదే బండి లాగిస్తున్నాడు. పైగా బుద్ధి కూడా గడ్డి తింది. కట్టుకున్న భార్యకు ద్రోహం చేశాడు. చిన్నిల్లు మొయింటైన్ చేస్తూ అడ్డంగా బుక్కయిపోయాడు. భార్య చేతిలో బడితె పూజలందుకున్నాడు. వరంగల్ అర్బన్ జిల్లా పోతన నగర్‌లోని బీట్ బజార్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.(నల్లజాతీయుడిపై పోలీసుల అమానుష వైఖరి) రెండు నెలలుగా భర్త ఇంటికి రాకపోవడంతో, ఆరా తీసిన భార్యకు అసలు విషయం తెలిసింది. కుటుంబ సభ్యులను వెంటేసుకుని బయలుదేరింది. బీట్ బజార్‌లోని ఓ ఇంట్లో మరో మహిళతో ఉన్న తన భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆగ్రహం పట్టలేక.. ఎడాపెడా వాయించింది. అనంతరం తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.(ప్రేమపేరుతో యువతిపై అత్యాచారయత్నం!) -
భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
-
భార్యపై అనుమానం.. కరోనాతో అవకాశం
న్యూఢిల్లీ: భార్యకు ఓ హోం గార్డుతో అక్రమ సంబంధం ఉందని భావించాడు ఓ వ్యక్తి. అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. కరోనా వైరస్ రూపంలో అవకాశం రావడంతో.. హోం గార్డుతో పాటు అతడి కుటుంబ సభ్యులపై విష ప్రయోగం చేశాడు. అదృష్టం బాగుండటంతో హోం గార్డు కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది. సదరు వ్యక్తిపై కేసు నమోదయ్యింది. వివరాలు.. ప్రదీప్(42) అనే వ్యక్తి, ఓ హోం గార్డుతో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. దాంతో హోం గార్డును చంపాలని భావించాడు. కరోనా రూపంలో అవకాశం రావడంతో హోం గార్డును చంపేందుకు పథకం రచించాడు. ఇందుకు గాను ఇద్దరు మహిళల సాయం తీసుకున్నాడు. ఈ క్రమంలో సదరు స్త్రీలు ఆదివారం సాయంత్రం ఉత్తర ఢిల్లీలోని అలీపూర్‌లో నివాసం ఉంటున్న హోం గార్డు ఇంటికి వెళ్లారు. తాము ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలమని.. కరోనా చెకప్ కోసం వచ్చామని చెప్పారు. ప్రభుత్వం కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రజలకు మందులు ఇస్తుందని నమ్మబలికారు. ఆ తర్వాత హోం గార్డు, అతని కుటుంబ సభ్యుల చేత విషం తాగించారు. అనంతరం నెమ్మదిగా అక్కడ నుంచి జారుకున్నారు. కాసేపటికే హోం గార్డుతో పాటు అతని కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అనంతరం హోం గార్డు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు.(కరోనానూ క్యాష్..) బాధితుడి ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా సదరు మహిళలను గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. వారు ప్రదీప్ తమకు డబ్బులు ఇచ్చి.. హోం గార్డు కుటంబానికి విషం ఇవ్వాల్సిందిగా కోరాడని పోలీసుల విచారణలో తెలిపారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న ప్రదీప్ కోసం గాలిస్తున్నారు.(దొంగకు కరోనా.. పోలీసులకు క్వారంటైన్) -
వివాహేతర సంబంధం గుట్టురట్టు
సాక్షి, పరిగి: గుట్టుగా కాపు కాసిన భార్య.. భర్త వివాహేతర సంబంధాన్ని రట్టు చేసింది. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవటం కలకలం రేపింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి టీచర్స్ కాలనీలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామానికి చెందిన సతీష్ ఖమ్మంలోని స్వరాజ్ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్‌గా విధులు నిర్వహించే వాడు. ఇతనికి 2006లో ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన భవానితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా సతీష్ ఉద్యోగ రీత్యా గత ఏడాదిన్నర క్రితం కొత్తగూడెం బదిలీ అయ్యాడు. అక్కడ మరో మహిళతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్ది రోజుల తర్వాత భార్యకు విషయం తెలియడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో అతను తన ఉద్యోగాన్ని వికారాబాద్ జిల్లా పరిగిలోని స్వరాజ్ ట్రాక్టర్ షోరూంకు బదిలీ చేయించుకున్నాడు. కొంత కాలంగా పరిగిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటూ తన భార్యను కొత్తగూడెంలోనే ఉంచి, పరిగిలో తన ప్రేయసితో సహజీవనం చేస్తున్నాడు. విషయం పసిగట్టిన భార్య గురువారం పరిగికి చేరుకుని అతను అద్దెకు ఉండే గదికి వెళ్లింది. డోర్ పెట్టి ఉండటంతో తీయమని కోరింది. వారు డోర్ తీయకపోవటంతో 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని డోర్ తెరిపించారు. గదిలోంచి సతీష్‌తో పాటు తాను సహజీవనం చేస్తున్న మహిళ బయటకు వచ్చింది. వెంటనే సతీష్ భార్య తన భర్తతో ఉంటున్న మహిళ జుట్టు పట్టుకుని గొడవకు దిగింది. ఇద్దరూ జుట్లు పట్టుకున్నారు. ఈ క్రమంలో మహిళా పోలీసులు లేకపోవటంతో మగ పోలీసులే అతని భార్య చేతులు పట్టుకుని లాగి పడేశారు. దీంతో ఆమె తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆమెను పట్టించుకోకుండా తననే లాగి పడేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం వారిని పోలీసులు పరిగి పీఎస్‌కు తరలించారు. ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని తనకు తన భర్త వస్తే చాలు అనడంతో పోలీసులు ముగ్గురినీ వదిలేశారు. -
అల్లుడిపై అత్తామామల దాడి
-
నాకు న్యాయం చేయండి
సాక్షి, కందుకూరు : భర్తను తనకు కాకుండా చేస్తున్నారంటూ ఓ యువతి రోడ్డుపై ఆందోళనకు దిగింది. ఈ సంఘటన గురువారం స్థానిక కో ఆపరేటివ్ బ్యాంకు వద్ద జరిగింది. బాధిత యువతి కథనం ప్రకారం... చీరాలకు చెందిన హేమకు కందుకూరు పట్టణానికి చెందిన శ్రీమన్నారాయణ అలియాస్ శివతో మూడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లికి ముందు నుంచే శివకు స్థానిక కో ఆపరేటివ్ బ్యాంకులో పనిచేసే భూలక్ష్మి అనే యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శివ తనను మోసం చేశాడంటూ హేమ కేసు కూడా పెట్టింది. ఈ కేసులో శివ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత తిరిగి మళ్లీ భూలక్ష్మితోనే సహజీవనం చేయడం ప్రారంభించాడు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న హేమను పట్టించుకోవడం మానేశాడు. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. హేమ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే తన భర్తను తనకు కాకుండా చేస్తోందంటూ ఆమె గురువారం స్థానిక కో ఆపరేటివ్ బ్యాంకుకు వెళ్లి భూలక్ష్మితో వాదనకు దిగింది. అనంతరం బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టింది. తన భర్తను వలలో వేసుకుని ఇంటికి రాకుండా చేస్తోందని, పెళ్లి చేసుకోకుండా ఎలా కలిసి ఉంటారని నిలదీసింది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతికి నచ్చజెప్పారు. పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే పిలిపించి మాట్లాడతామని సర్ది చెప్పారు. -
భర్త హత్యకు భార్య కుట్ర
సాక్షి, కర్నూలు(బొమ్మలసత్రం) : భర్త హత్యకు కుట్ర పన్నిన ఓ భార్యను, ఆమె ప్రియుడిని నంద్యాల రూరల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రూరల్ ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపిన వివరాలు.. నంద్యాల పట్టణ సమీపంలోని నందమూరి నగర్‌కు చెందిన కరిముల్లా, కరిష్మా దంపతులకు ఐదుగురు సంతానం. కరిముల్లా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. రెండేళ్లుగా ఇంటి పక్కనే నివాసం ఉండే వెంకటేశ్వర్లుతో కరిష్మా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తన భర్తను కూడా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడితో చెప్పింది. అందులోభాగంగా ఈ నెల 20న రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేస్తున్న కరిముల్లాపై వెంకటేశ్వర్లు ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. అతడు తేరుకొని కేకలు వేస్తూ బయటకు పరుగెత్తడంతో స్థానికులు అక్కడికి చేరుకునేలోగా వెంకటేశ్వర్లు పరారయ్యాడు. కరిముల్లా ఫిర్యాదు మేరకు పోలీసులు నందమూరినగర్‌లో విచారించారు. భార్యపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా వివాహేతర సంబంధం విషయం వెలుగులోకి వచ్చింది. కరిష్మాను, ఆమె ప్రియుడు వెంకటేశ్వరును మంగళవారం అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు. -
భర్తకు బడిత పూజ చేసిన భార్య
-
పిన్నితో వివాహేతర సంబంధం..!
సాక్షి, తలకొండపల్లి(కల్వకుర్తి): వరుసకు పిన్ని అయ్యే మహిళతో వివాహేతర సంబంధం నెరిపాడు. విషయం తెలుసుకున్న పెద్దలు పంచాయితీ పెట్టి తీరు మార్చుకోవాలని హితవు పలికారు. అయినా, వారు మారలేదు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చిన్నాన్న వరసయ్యే వ్యక్తిని చంపేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేసి విఫలమయ్యాడు. చివరకు ఇద్దరూ కటకటాలపాలయ్యారు. కేసు వివరాలను శనివారం స్థానిక ఠాణాలో ఎస్ఐ సురేష్‌యాదవ్ కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధి సంఘాయిపల్లికి చెందిన మీసాల మల్లేశ్ (26) స్థానికంగా ఉపాధి లేకపోవడంతో ఐదేళ్ల క్రితం నగరానికి వలస వెళ్లి మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి నాగర్‌కర్నూల్ జిల్లా సిద్దాపూర్ మండలంలోని పలుగు తండాకు చెందిన సోనీతో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. కొన్ని రోజుల తర్వాత వీరు కులాంతర వివాహం చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, మల్లేశ్‌కు సమీప బంధువైన (వరుసకు కుమారుడు) మెదక్‌పల్లికి చెందిన మీసాల లాలయ్య అలియాస్ లాలూ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతను తరచూ నగరంలో ఉంటున్న మల్లేశ్ ఇంటికి వెళ్తుండేవారు. వరసకు చిన్నమ్మ అయినా సోనీతో ఇతడు పరిహాసమాడుతుండేవాడు. కుమారుడే కదా అని మల్లేశ్ పట్టించుకునేవాడు కాదు. ఈక్రమంలో సోనీ, లాలూకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బంధువులకు తెలియడంతో మల్లేశ్‌కు చెప్పారు. దీంతో ఆయన బంధువుల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. తీరు మార్చుకోవాలని పెద్దలు సోనీ, లాలూకు సూచించినా ఫలితం కనిపించలేదు. తమ బంధానికి అడ్డుగా ఉన్న మల్లేశ్‌ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని లాలూ, సోనీ నిర్ణయించుకొని అదను కోసం వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా, మల్లేశ్ పొలానికి సంబంధించి రైతుబంధు డబ్బుల కోసం ఈనెల 4న స్వగ్రామానికి వచ్చాడు. ఈ విషయాన్ని సోనీ ఫోన్ చేసి లాలూకు చెప్పింది. మరుసటి రోజు లాలూ తలకొండపల్లికి వచ్చాడు. అతడు మల్లేశ్‌కు ఫోన్ చేసి మద్యం తాగుదామని చెప్పాడు. అనంతరం చంద్రధన గ్రామానికి రప్పించుకున్నాడు. ఇద్దరూ తలకొండపల్లికి బైకుపై వెళ్లాడు. అక్కడ మద్యం తీసుకున్న తర్వాత లాలూ మల్లేశ్‌ను వైన్స్ వద్దే ఉంచి ఫర్టిలైజర్ దుకాణానికి వెళ్లి ఎలుకలను చంపే మందును తీసుకున్నాడు. అనంతరం మల్లేశ్‌ను బైక్‌పై ఎక్కించుకొని మిడ్జిల్ రోడ్డులో వెళ్లాడు. మధ్యలో సంఘాయిపల్లి గ్రామస్తులు అంజనేయులు, నర్సింలు, నరేష్‌లు ఎదురవడంతో లాలూ మల్లేశ్‌ను హత్య చేయడం విరమించుకున్నాడు. అనంతరం అందరూ కలిసి మద్యం తాగి వెళ్లిపోయారు. ఈనెల 7న లాలూ తిరిగి పథకం అమలు చేద్దామని భావించాడు. మల్లేశ్‌కు ఫోన్ చేసి సంఘాయిపల్లి గేట్ వద్దకు రమ్మని చెప్పాడు. మల్లేశ్ అక్కడికి వెళ్లగా బైకుపై ఎక్కించుకొని మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ వెళ్లారు. అక్కడ మద్యం తీసుకొని తాగారు. పథకం ప్రకారం లాలూ మల్లేశ్‌కు ఎక్కువగా మద్యం తాగించాడు. తర్వాత మండల పరిధిలోని దేవునిపడకల్ శివారులోని రిజర్వు ఫారెస్టులోకి తీసుకెళ్లి మళ్లీ మరికొంత మద్యం తాగారు. లాస్ట్ పెగ్‌లో లాలూ ఎలుకల మందును కలిపి మల్లేశ్‌తో తాగించారు. దీంతో అస్వస్థతకు గురై మృతిచెందాడు. అనంతరం లాలూ మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి స్వగ్రామానికి వెళ్లాడు. 11న హత్య విషయం వెలుగుచూసింది. ఎస్ఐ సురేష్‌యాదవ్ కేసు దర్యాప్తు చేశారు. మల్లేశ్ హత్యకు గురయ్యాడని అనుమానం వ్యక్తం చేశాడు. సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ సురేశ్‌యాదవ్ ఆధ్వర్యంలో విచారణ జరిపి హత్యగా నిర్ధారించారు. ఈమేరకు లాలూ, సోనీని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయగా హత్య విషయం అంగీకరించడంతో రిమాండుకు పంపారు. లాలూ (20)కు ఇంకా వివాహం కాలేదు. హత్య కేసును చాకచక్యంగా పరిష్కరించిన సీఐ, ఎస్ఐకి డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఈ సందర్భంగా రివార్డు ప్రకటించారు. -
పగబట్టి.. ప్రాణం తీశాడు
సాక్షి, పశ్చిమగోదావరి : వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. తన భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడన్న కక్షతో సోదరుడు వరుసైన వ్యక్తిని దారికాచి విచక్షణారహితంగా కత్తితో నరికి చంపాడు. ఆ తరువాత హత్యాయుధంతో సహా ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన మండలంలోని పంగిడిగూడెం పంచాయతీ మెట్టపంగిడిగూడెంలో మంగళవారం ఉదయం సంచలనాన్ని రేకెత్తించింది. సమాచారాన్ని అందుకున్న భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై ఎం.సూర్యభగవాన్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని రక్తనమూనాలను సేకరించి దర్యాప్తును ప్రారంభించారు. స్థానికుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన కొప్పిశెట్టి వెంకట సుబ్బారావు (38) వ్యవసాయం చేసుకుంటూ భార్య, ఇద్దరు కుమారులను పోషిస్తున్నాడు. సుబ్బారావు పెదనాన్న కుమారుడు కొప్పిశెట్టి లక్ష్మణరావు బతుకుతెరువు కోసం ఏడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. ఇదిలా ఉంటే లక్ష్మణరావు దుబాయ్‌లో ఉన్న సమయంలో అతని భార్య రమాదేవి మరిది వరసైన సుబ్బారావుతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. భర్త దుబాయ్ నుంచి వచ్చినా వీరి సంబంధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే రమాదేవి భర్త వద్దకు రాకుండా అదే గ్రామంలోని తన తల్లి ఇంట్లో ఉంటోంది. అయితే ఆమె పిల్లలకు తల్లి ప్రవర్తన నచ్చక తండ్రి లక్ష్మ ణరావు వద్ద ఉంటున్నట్లు బంధువులు చెబుతున్నారు. పక్కా పథకంతో.. లక్ష్మణరావు తన భార్యను కాపురానికి రమ్మని పలుమార్లు బతిమలాడినా ఫలితం లేకపోయింది. ఒకే వీధిలో ఉంటూ సుబ్బారావుతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. దీంతో విసుగుచెందిన లక్ష్మణరావు తన సోదరుడు సుబ్బారావును కడతేర్చేందుకు పథకం పన్నాడు. ఈ క్రమంలో సుబ్బారావు గేదెల పాలు తీసేందుకు మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో తన పొలానికి వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ కత్తితో కాపుకాసుకుని ఉన్న లక్ష్మణరావు మోటారు సైకిల్‌పై పొలానికి వచ్చిన సుబ్బారావును ఇష్టానుసారంగా తెగ నరికాడు. ముందు రెండు చేతులను నరకడంతో సుబ్బారావు కొంతదూరం పరుగులు తీశా డు. అయితే లక్ష్మణరావు అతడిని వెంబ డించి మరీ రెండు కాళ్లను సైతం నరకడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయాడు. దీంతో సుబ్బారావు మృతిచెందినట్లు భావించిన లక్ష్మణరావు, హత్యకు ఉపయోగించిన కత్తితో సహా పోలీస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కొన ఊపిరితో కొ ట్టుమిట్టాడుతున్న సుబ్బారావును స్థానిక రైతులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై భీమడోలు సీఐ సు బ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం పెట్టుకుందని..
సాక్షి, సిరిసిల్ల : వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను గ్రామస్తులు ట్రాక్టర్‌కు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోనాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే.. బోనాల గ్రామానికి చెందిన కున్న లావణ్య భర్త నాగరాజు విదేశాల్లో ఉంటాడు. అయితే ఇక్కడ ఒంటరిగా ఉంటున్న లావణ్య.. అదే గ్రామానికి చెందిన పడుగే నారాయణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. లావణ్య, నారాయణల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు బయటకి పొక్కడంతో గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. దీంతో వారిద్దరు గ్రామం నుంచి పారిపోయారు. వారు సిరిసిల్లలోని శివనగర్‌లో ఒక ఇంట్లో అద్దెకు దిగారు. ఈ విషయం నారాయణ కుటుంబసభ్యులకు తెలియడంతో బుధవారం సాయంత్రం అక్కడికి వెళ్లి అతన్ని ఇంటికి పట్టుకుని వచ్చారు. దీంతో లావణ్య నారాయణ కనిపించడం లేదని.. అతన్ని వారి బంధువులు తీసుకెళ్లారని పోలీసులను ఆశ్రయించారు. అనంతరం లావణ్య నేడు గ్రామానికి చేరుకుని.. నారాయణ ఇంటికి వెళ్లారు. లావణ్య అక్కడికి రావడంతో నారాయణ కుటుంబసభ్యులు ఆమెను బంధించారు. అనంతరం పలువురు గ్రామస్తులతో కలిసి ట్రాక్టర్ ముందు భాగంలో కట్టేసి ఆమెను చితకబాదారు. -
ప్రియుడి చేత భర్తను చంపించిన భార్య
శాలిగౌరారం(తుంగతుర్తి) : మండలంలోని చిత్తలూరు గ్రామంలో ఈనెల 10న వెలుగుచూసిన గుండెబోయిన మల్లేష్ హత్య కేసు మిస్టరీని పోలీ సులు ఛేదించారు. కట్టుకున్న భార్యే తన ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. శాలిగౌరారం సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ పద్మనాభరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. చిత్తలూరు గ్రామానికి చెందిన గుండెబోయిన మల్లేష్(29)కు భార్య మమతతో పాటు చిన్నారులైన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మల్లేష్‌కు గ్రామంలో 4ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాంతో పాటు గ్రామానికి చెందిన తరాల పద్మమ్మ వద్ద మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిపంటను సాగుచేసేవాడు. పంటసాగులో భాగంగా దుక్కి దున్నడం మొదలుకుని పత్తిని ఇంటికి చేర్చేవరకు చిత్తలూరు గ్రా మానికి చెందిన పూల సోమయ్య అలియాస్ సో మన్నకు సంబంధించిన ట్రాక్టర్‌ను మల్లేష్ కిరా యికి వినయోగించుకునేవాడు. ఈ క్రమంలో తరు చూ ఇంటికి వచ్చిపోతున్న సోమయ్యతో మల్లేష్ భార్య మమతకు పరిచయం ఏర్పడింది. అది కా స్తా ఎక్కువై అతి చనువుగా మారడంతో వివాహేతన సంబంధానికి దారి తీసిం ది. ఈ నేపథ్యంలో మల్లేష్‌కు భార్య మమత, స్నేహితుడు సోమయ్యల వ్మవహారశైలిపై అనుమానం వచ్చింది. దీంతో మల్లేష్ తన స్నేహితుడైన సోమయ్యను భార్య మమతను తీవ్రస్థాయిలో మందలించా డు. అయినా భార్య మమత, స్నేహితుడు సోమయ్యల వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంతో భార్య మమతను కొట్టేవాడు. ఈ క్రమంలో తాగుడుకు అలవాటుపడిన మల్లేష్ తాగివచ్చినప్పుడు భార్య మమతను వేధింపులకు గురిచేయడంతో పాటు చంపుతానని బెదిరించేవాడు. దీంతో ఇం ట్లో జరుగుతున్న విషయాన్ని మమత ఆమె ప్రి యుడు సోమయ్యకు వివరించింది. నేను ఇబ్బందులతో బతకలేనని, నన్ను నా భర్త మల్లేష్ చంపుతానంటున్నాడని, నేను చచ్చిపోతానని చెప్పింది. దీంతో సోమయ్య మమతకు ధైర్యం చెప్పి నీవు చావడమెందుకు ఇద్దరం కలిసి నీ భర్త మల్లేష్‌ను చంపుదామని చెప్పాడు. అందుకు మల్లేష్ భార్య మమత కూడా ఒప్పుకోవడంతో ఎలాగైనా మల్లేష్‌ను హత్య చేద్దామని నిర్ణయించుకున్నారు. పూటుగా మద్యం సేవించాడని.. ఈ నేపథ్యంలో ఈ నెల 9న రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన మల్లేష్ స్పృహ కోల్పోయి ఇంట్లోని హాలులో బెడ్‌పై నిద్రించాడు. ఈ విషయాన్ని అతని భార్య మమత ప్రియుడు సోమయ్యకు ఫోన్‌ద్వారా చేరవేసింది. దీంతో మల్లేష్‌ను హత్య చేసేందుకు ఇదే అదునుగా భావించిన సోమయ్య తన స్నేహితులైన అదే గ్రామానికి చెందిన తరాల రాములు అలియాస్ రాము, తరాల వినోద్‌కుమార్, బండారు మహేశ్‌లకు మద్యం తాపి విషయాన్ని వివరించాడు. మద్యం మత్తులో ఉన్న రాము, వినోద్‌కుమార్, మహేశ్‌లు రెండు ద్విచక్రవాహనాలపై సోమయ్యతో కలిసి అర్ధరాత్రి సమయంలో మల్లేష్ ఇంటకి వెళ్లారు. ఇంటి వెనుకభాగం నుంచి గోడదూకి మల్లేష్ ఇంట్లోకి ప్రవేశించి మమతను కలుసుకున్నారు. మద్యం మత్తులో స్పృహతప్పి నిద్రిస్తున్న మల్లేష్ ఛాతిపై సోమయ్య కూర్చొని ముఖంపై తలదిండుపెట్టి అదిమిపట్టాడు. స్పృహలోకి వచ్చిన మల్లేష్ వెంటనే సోమయ్య తలను పట్టుకునేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న మమత, తరాల రాము, తరాల వినోద్‌కుమార్, బండారు మహేశ్‌లు మల్లేష్ కాళ్లు, చేతులు గట్టిగా అదిమిపట్టి ఎటూ కదలకుండా చేశారు. దీంతో సోమయ్య మహేశ్ తలను పక్కనే ఉన్న బెడ్ అంచుకు బలంగా బాదడంతో తల వెనుకభాగం పగిలి రక్తస్రావం జరిగింది. వెంటనే బెడ్‌పై ఉన్న టవల్‌ను మల్లేశ్ నోట్లో కుక్కి ముక్కుమూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనుమానం రాకుండా చేసేందుకు అప్పటికే థమ్సప్బాటిలో సిద్ధంగా ఉంచుకున్న పురుగుల మందును మృతిచెంది ఉన్న మల్లేశ్ నోట్లో పోయడంతో పాటు అతని బట్టలు, నేలపై పోసి వెళ్లిపోయారు. మృతుడు గుండెబోయిన మల్లేశ్ తండ్రి శంభయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు కేవలం ఐదు రోజుల్లోనే కేసును ఛేదించి మల్లేశ్‌ను హత్య చేసిన గుండెబోయిన మమత, పూల సోమయ్య అలియాస్ సోమన్న, తరాల రాములు అలియాస్ రాము, తరాల వినో ద్‌కుమార్, బండారు మహేశ్‌లను సోమవారం అరెస్ట్ చేసి విచారించారు. హత్యానేరాన్ని వారు అంగీకరించడంతో వారిపై సెక్షన్ 448, 302, 120(బి), 201 రెడ్‌విత్ 34 ఐపిసి కింద కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ పద్మనాభరెడ్డి తెలి పారు. మల్లేశ్ హత్యకు పాల్పడినవారిలో తరాల వినోద్‌కుమార్, బండారు మహేశ్‌లు మైన ర్లు కావడంతో వారిని బాలనేరస్తులుగా గుర్తించినట్లు ఏఎస్పీ తెలిపారు. విచారణ అనంతరం మమత, సోమయ్య, రాములును నకిరేకల్ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ ఆదేశానుసారం మమతను హైదరాబాద్‌లోని చెంచల్‌గూడ జైలు కు, సోములు, రాములును నల్లగొండలోని జిల్లా జైలుకు తరలించారు. తరాల వినోద్‌కుమార్, బం డారు మహేశ్‌లు మైనర్లు కావడంతో నల్లగొండలోని డీపీఓ ముందు హాజరు పరచడంతో జిల్లా కేంద్రంలోని జువైనల్‌హోంకు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. త్వరితగతిన హత్య కేసును ఛేదించిన శాలిగౌరారం సీఐ క్యాస్ట్రో, ఎస్ఐ రాజు, పోలీసు సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. -
కావ్య కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, సీతమ్మధార(విశాఖపట్టణం) : ఇసుకతోట జంక్షన్ రామాలయం వద్ద మంగళవారం రాత్రి ఓ యువతి మంటలతో పరుగులు తీసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో నిందితుడు చెన్నా నరేంద్రను పోలీసులు విజయనగరంలో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ వై.వి.నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎన్ఏడీ జంక్షన్‌కి చెందిన చెన్నా నరేంద్ర అంబులెన్స్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏఎన్‌ఏంగా విధులు నిర్వహిస్తున్న కావ్య తన సోదరితో ఇసుకతోట జంక్షన్ రామాలయం వద్ద ఉంటోంది. నరేంద్రకు ఏడాది క్రితం కావ్యతో పరిచయం ఏర్పడగా.. వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తనను పెళ్లి చేసుకోవాలని కావ్య పలుమార్లు ఒత్తిడి చేయగా నరేంద్ర ముఖం చాటేశాడు. మంగళవారం రాత్రి కావ్య తాను ఇసుకతోట జంక్షన్లో ఉన్నాను.. వెంటనే రావాలని నరేంద్రకు ఫోన్ చేసింది. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. వెంటనే నరేంద్ర అక్కడకు చేరుకోగా కొద్దిసేపు వారు మాట్లాడుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని కావ్య కోరగా అందుకు అతడు నిరాకరించాడు. అప్పటికే ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఉన్న కావ్య నిప్పంటించుకుంది. మంటలు వ్యాపించడంతో నరేంద్ర ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి చేతులు కూడా కాలిపోయాయి. భయాందోళన చెందిన అతడు అక్కడ నుంచి విజయనగరం పారిపోయాడని ఏసీపీ తెలిపారు. తీవ్ర గాయాలపాలైన కావ్యను 108లో కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతోంది. కాల్ డేటా ఆధారంగా.. ద్వారకాజోన్ ఏసీపీ వై.వి.నాయుడు నేతృత్వంలో పోలీసు సిబ్బంది దర్యాప్తు ముమ్మరం చేశారు. కావ్య పనిచేస్తున్న ఆసుపత్రిలోను, తన అక్కను విచారించి కొంత సమాచారం సేకరించారు. మంగళవారం రాత్రి 8.20 గంటల సమయంలో కావ్యను ఆసుపత్రి నుంచి బైక్‌పై తీసుకెళ్లి ఆర్కే బీచ్‌లో దించినట్లు అక్కడ పనిచేస్తున్న యువకుడు తెలిపాడు. తరువాత ఆమె బస్సులో వెళ్లినట్లు తెలపడంతో పోలీసులు దర్యాప్తు మరింత ముందుకు సాగింది. ఆసుపత్రిలోని సీసీ కెమెరాలో వీడియో ఫుటేజ్‌లను పరిశీలించారు. ఆమె ఫోన్ కాల్స్ డేటాను పరిశీలించారు. చెన్నా నరేంద్రతో చాటింగ్ చేసినట్లు తేలింది. నరేంద్ర విజయనగరంలో ఉన్నట్లు కాల్ డేటా ద్వారా తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. -
స్నేహితుడిని చంపి.. ఆ తర్వాత భార్యను..
న్యూఢిల్లీ : స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ వ్యక్తి అడ్డుగా ఉన్న భర్తను దారుణంగా హతమార్చాడు. అనంతరం తనకు ఏ పాపం తెలియదు అన్నట్లుగా పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో నేరం అంగీకరించి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. దల్బీర్(30), గుల్ఖేశ్ ఇద్దరు స్నేహితులు. తరచుగా ఒకరి ఇళ్లకు ఇంకొకరు వెళ్లేవారు. ఈ క్రమంలో దల్బీర్ భార్యతో గుల్ఖేశ్కు పరిచయం ఏర్పడి...అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను వేధించసాగాడు. కానీ ఆమె ఇందుకు నిరాకరించడంతో స్నేహితుడి అడ్డు తొలగించుకుంటే ఎలాగైనా తన దగ్గరికే వస్తుందని భావించాడు. ఈ క్రమంలో జూన్ 24 అర్ధరాత్రి దల్బీర్‌కు ఫోన్ చేసి రైల్వే ట్రాక్ దగ్గర్లోని జాఖీర వద్దకు రమ్మని చెప్పాడు. అనంతరం ఇటుక రాయితో అతడి తలపై మోది చంపేశాడు. అనంతరం స్నేహితుడి శరీరాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశాడు. దీంతో దల్బీర్ ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించవచ్చని భావించాడు. తన ప్లాన్‌లో భాగంగా పోలీసులకు ఫోన్ చేసి రైల్వే ట్రాక్‌పై మృతదేహం ఉందని చెప్పాడు. అయితే గుల్ఖేశ్ ప్రవర్తనపై అనుమానం రావడంతో అతడి ఫోన్ కాల్స్ రికార్డును చెక్ చేశారు. దీంతో అసలు విషయం బయట పడింది. కాగా ప్రస్తుతం పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ హత్యలో మృతుడి భార్యకు కూడా ప్రమేయం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డొస్తున్నాడనే అంతం
సాక్షి, జడ్చర్ల: తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించిన భార్య.. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్‌గౌడ్ శనివారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని టీడీ గుట్టలో నివాసం ఉంటున్న రావుల నర్సింహ(35), లక్ష్మిదేవి భార్యాభర్తలు. నర్సింహ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి అదే ప్రాంతంలో ఓ కిరాణ దుకాణంలో కూలీగా పనిచేస్తున్న పూసల శేఖర్ ప్రవేశించాడు. నర్సింహతో పరిచయం పెంచుకుని అతని భార్య లక్ష్మిదేవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లికాని శేఖర్ లక్ష్మిదేవితో సంబంధాన్ని కొనసాగిస్తున్న విషయం తెలుసుకున్న భర్త నర్సింహ శేఖర్‌ను పలుసార్లు మందలించాడు. దీంతో నర్సింహపై శేఖర్ కసిని పెంచుకుని చాటుమాటుగా లక్ష్మిదేవితో సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఏడాదిపాటు ప్రియుడితో సహజీవనం ఈక్రమంలో ప్రియుడు శేఖర్‌తో కలిసి లక్ష్మిదేవి ఇంటి నుంచి నల్గొండ జిల్లా దేవరకొండకు వెళ్లి అక్కడే జీవనం కొనసాగించారు. దీంతో భర్త నర్సింహ జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాడు. దాదాపు ఏడాది గడిచిన అనంతరం తిరిగి నర్సింహ దగ్గరకు లక్ష్మిదేవి రాగా చేరదీశాడు. అయినా లక్ష్మిదేవి, శేఖర్లు తమ ప్రవర్తనను మార్చుకోకుండా సంబంధాన్ని కొనసాగిస్తుండగా నర్సింహ మందలించి బుద్ది చెప్పాడు. దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన వారు నర్సింహ అడ్డు తొలగించుకోవాలని, అడ్డు తొలగితే అతని ఉద్యోగంతో పాటు అతనికి సంబంధించిన ఓ ప్లాటు సైతం తమ చేతికి వస్తాయని భావించి హత్య చేసేందుకు వ్యూహరచన చేసి రెక్కీ కూడా నిర్వహించారు. అందులో భాగంగా ప్రియుడు శేఖర్ లక్ష్మిదేవి భర్త నర్సింహతో మంచిగా మసులుకోవడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఇద్దరు కలిసి మద్యం సేవించి విందులు చేసుకోవడం ప్రారంభించారు. మొదట గుర్తు తెలియని మృతదేహంగా.. ఈనెల 7న బూరెడ్డిపల్లి గ్రామ శివారులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మొదట గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేయగా.. హత్య కేసుగా గుర్తించారు. వెంటనే మృతుడి ఆచూకీని తెలుసుకుని శేఖర్, లక్ష్మిదేవి నిందితులుగా గుర్తించారు. శనివారం జడ్చర్ల రైల్వే స్టేషన్లో నిందితులు రైలు ఎక్కి పారిపోయే ప్రయత్నం చేస్తున్న సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ భాస్కర్‌గౌడ్ తెలిపారు. హత్యా ప్రదేశానికి కొద్ది దూరంలో గల ముళ్లపొదల్లో దాచిన నిందితుల రెండు మొబైల్ఫోన్లు, రక్తంతో కూడిన ప్లాస్టిక్ కవర్, బీరు బాటిల్ ముక్కలు స్వాధీన పరుచుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐ బాల్‌రాజ్‌యాదవ్, ఎస్ఐలు కృష్ణయ్య, షంషొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పని ఉంది మాట్లాడి వద్దామంటూ.. ఇదిలా ఉండగా, జడ్చర్ల శివారులో మిషన్ భగీరథ పనులు ఉన్నాయని అక్కడ పనిచేసేందుకు మాట్లాడి వద్దామంటూ ఈ నెల 3న శేఖర్ నర్సింహను తోలుకొని బూరెడ్డిపల్లి శివారు వచ్చాడు. సంబంధిత సార్లు లేరని వారు వచ్చే వరకు మద్యం సేవిద్దామంటూ ఓ దగ్గర సిట్టింగ్ చేశారు. నర్సింహకు మద్యం బాగా తాపించిన తరువాత అతని భార్య లక్ష్మిదేవికి ఫోన్ చేసి అక్కడకు రప్పించాడు శేఖర్. మద్యం మత్తులో ఉన్న నర్సింహ తలపై బీరు సీసాతో కొట్టి, గొంతుపై పగిలిన సీసాతో పొడిచారు. కొనప్రాణంతో ఉండగా నర్సింహ కాళ్లను ప్రియుడు శేఖర్ గట్టిగా పట్టుకోగా ప్రియురాలు లక్ష్మిదేవి ప్లాస్టిక్ కవర్ తలచుట్టూ చుట్టి ఊపిరి ఆడకుండా చేయడంతో నర్సింహ చనిపోయాడు. -
డెలివరీ బాయ్ది హత్యా?.. ఆత్మహత్యా!?
సాక్షి, అమరావతి బ్యూరో : మాచవరం ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఓ గృహంలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్ గత బుధవారం ఉరివేసుకొని మృతి చెందడం కలకలం రేపింది. అయితే పోలీసులు చెబుతున్నట్లు ఆ మృతదేహంపై ఉరి వేసుకున్న ఆనవాళ్లు కనిపించలేదు. పైగా మృతదేహం నడుము భాగంలో దెబ్బలు తగిలి శరీరం కందిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయని కుటుంబ సభ్యుల వాదన. మృతుడి భార్య సైతం తన భార్య ఉరి వేసుకుని చనిపోయేంత పిరికివాడు కాదంటోన్న వైనం చూస్తుంటే పథకం ప్రకారం అతడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వ్యవహరించిన తీరు కూడా వారి అనుమానాలకు బలాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. విద్యాధరపురం కొండప్రాంతంలో నివాసముంటున్న ఆవాల ప్రేమ్‌కుమార్ ఆలియాస్ అనిల్ (28) గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. మధురానగర్‌కు సమీపంలోని ఓ గ్యాస్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తుంటాడు. ఏడేళ్ల క్రితం మధురానగర్‌కు చెందిన గౌరి అనే యువతితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పనికి వెళ్లినప్పుడు ఒక్కోసారి మధ్యాహ్న భోజనానికి మధురానగర్‌లోని అత్తారింటికి వెళ్లేవాడు. ఇలా తరచూ అక్కడికి వెళ్తున్న సమయంలోనే ఓ మహిళతో స్నేహం ఏర్పడింది. అది వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధానికి దారితీసింది. గతంలో ఆ మహిళతో సన్నిత సంబంధాలు కొనసాగించిన ఓ వ్యక్తి ఇటీవల ఆ మహిళతో మాట్లాడవద్దని, వారి ఇంటికి రావొద్దని అనిల్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయినా అనిల్ అతని మాటలు పట్టించుకోకుండా ఆ మహిళ ఇంటికి తరచూ రాకపోకలు సాగించాడు. బుధవారం సాయంత్రం మధురానగర్‌లోని అత్త కళావతికి ఇంటికి వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. కొంతసేపటికి రాత్రి 8 గంటల సమయంలో ప్రేమ్‌కుమార్ అమ్మకు పోలీసులు ఫోన్ చేసి మీ అబ్బాయి చనిపోయాడని, వెంటనే రావాలని చెప్పారు. దీంతో ఆమె తన కోడలు గౌరిని తీసుకొని సంఘటనా స్థలానికి చేరుకుంది. వారు అక్కడికి చేరుకునేలోపే మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్‌లో ఉంచారు. వారు వచ్చి చూడగానే ఆ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మరుసటిరోజు గురువారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయగా, మధురానగర్‌కు సమీపంలో పూడ్చేశారు. అయితే పోలీసులు వ్యవహరించిన తీరు, మృతదేహంపై ఉన్న గుర్తులను గుర్తించిన మృతుడి కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్య కాదని కచ్చితంగా హత్యేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య వెనుక ఎవరో బాడబాబులు ఉన్నారని.. వారి ఒత్తిడి వల్లే పోలీసులు దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నా భర్తది ఆత్మహత్యకాదు.. నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడుకాదు. కావాలనే ఇంటికి రప్పించి చంపేశారు. ఆత్మహత్య చేసుకోవాలనిపించినా వివాహేతర సంబంధం ఉన్న ఆ మహిళ ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది. పైగా నా భర్త నడుము సమీప భాగాన ఫ్యాంట్ చిరిగి ఉంది. కళ్ల వెంట నీరు కార్చిన గుర్తులు ఉన్నాయి. పెనుగులాట జరిగి ఉంటుంది. దీన్ని బట్టి ఇది ఆత్మహత్య కాదు. పోలీసులు నిజాలు నిగ్గు చేల్చాలి. – గౌరీ, మృతుడి భార్య అనుమానాలున్నాయి.. గ్యాస్ డెలివరీ బాయ్ ప్రేమ్‌కుమార్ మృతిని అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశాం. మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నట్లుగానే మాకు అనుమానాలు ఉన్నాయి. విచారణ కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడే నిందితులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, సీఐ, మాచవరం -
కానోడు... కావాలనుకుని.. కట్టుకున్నోడిని చంపేసింది..
బంధం... బంధించిందని.. అనురాగం... అపహాస్యమైందని.. ఆత్మీయత... ఆవిరైందని.. అయినోడు... అదృశ్యమవాలని.. కానోడు... కావాలనుకుని.. కాళరాత్రి... కాటేసింది.. కట్టుకున్నోడు... కన్నుమూశాడు.. వైరా: ఆమెకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. కారణాలు ఏమైతేనేమి, వివాహ బంధం.. తనకొక ‘బంధనం’గా మారిందని, తాను ‘బందీ’నయ్యానని ఆమె భ్రమించింది. వారి మధ్యన ఒకప్పటి అనురాగం.. ఇప్పుడు అపహాస్యమైంది. ఆత్మీయత ఆవిరైంది. అయినోడిని (భర్తను) కాటికి పంపాలనుకుంది. కానోడిని (ప్రియుడిని) కావాలనుకుంది. ఇద్దరూ కలిసి పథకం వేశారు. (కాళ)రాత్రి వేళ... ఆ ఇద్దరూ కలిసి అతడిని చంపేశారు. ఇది, గురువారం రాత్రి ఖమ్మం జిల్లా వైరాలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... వైరాలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో నివాసముంటున్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ షేక్ అబ్దుల్లా(30)కు, జూలూరుపాడుకు చెందిన అమీదాతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం కొన్నాళ్లపాటు సజావుగా సాగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు సమ్రీన్(6), సమీరా(4) ఉన్నారు. వీరు నివసిస్తున్న ప్రాంతంలోనే షేక్ అక్బర్ ఉంటున్నాడు. ఇతడొక మెకానిక్. ఈ అక్బర్‌తో అమీదాకు కొన్నేళ్ల క్రితం పరిచయమేర్పడింది. క్రమేణా ఇద్దరూ దగ్గరయ్యారు. రెండేళ్ల నుంచి వీరి మధ్య వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ విషయం, ఆమె భర్త అబ్దుల్లాకు తెలిసింది. అభ్యంతరం చెప్పాడు. దీనిని ఆమె తట్టుకోలేకపోయింది. తమ మధ్య సంబంధం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆమె ఈ విషయాన్ని తన ప్రియుడు అక్బర్‌తో చెప్పింది. ఈ నెల 10వ తేదీన, ఆమె భర్త అబ్దుల్లాపై ప్రియుడు అక్బర్.. అకారణంగా దాడి చేశాడు. దీనిపై, పోలీస్ స్టేషన్లో అబ్దుల్లా ఫిర్యాదు చేశాడు. తమ సంబంధానికి అబ్దుల్లా అడ్డుగా ఉన్నాడని అమీదా – అక్బర్ భావించారు, సహించలేకపోయారు. అడ్డను తొలగించాలనుకున్నారు. అబ్దుల్లాను చంపేయాలనుకున్నారు. ఇద్దరూ కలిసి పథకం పన్నారు. గురువారం రాత్రి... అబ్దుల్లా, గాఢ నిద్రలో ఉన్నాడు. అక్బర్ మద్యం మత్తులో అబ్దుల్లా ఇంటికి వచ్చాడు. అతడిని లోపలికి తీసుకెళ్లింది. ఆమె తన భర్త కాళ్లను గట్టిగా పట్టుకుంది. దిండుతో అబ్దుల్లా మొహంపై అక్బర్ గట్టిగా అదిమి పట్టుకున్నాడు. అబ్దుల్లా మేల్కొన్నాడు. పైకి లేచేందుకు ప్రయత్నించాడు. అతడి మెడను అక్బర్ గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. కొద్దిసేపటికే, ఊపిరాడక అబ్దుల్లా ప్రాణాలొదిలాడు. అక్బర్ బయటకు వెళ్లిపోయాడు. ఆ తరువాత, ‘‘నా భర్తకు ఏదో అయింది. కదలడం లేదు.. మెదలడం లేదు...’’, అని ఏడుస్తూ, చుట్టుపక్కల వాళ్లను అమీదా పిలిపిచింది. చంపినట్టుగా ఒప్పుకున్నారు... పోలీసులకు సమచారం వెళ్లింది. ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్, సీఐ ఎ.రమాకాంత్, ఎస్సై టి.నరేష్ వచ్చారు. అబ్దుల్లా గొంతుపై, శరీరంపై కమిలిన గుర్తులు కనిపించాయి. అమీదాను, స్థానికుల ను విచారించారు. అక్బర్–అమీదా మధ్య సంబం ధం బయటపడింది. అక్బర్‌ను పిలిపించారు. ఇద్దరినీ విచారించారు. ‘‘ఔను.. మేమే చంపాం’’ అని వారిద్దరూ ఒప్పుకున్నారు(ట). అబ్దులా సోదరుడు ఫరీద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు పెడితే... బతికేవాడేమో...! ‘‘తనపై అక్బర్ అకారణంగా దాడి చేశాడంటూ ఈ నెల 10న పోలీస్ స్టేషన్లో షేక్ అబ్దుల్లా ఫిర్యాదు చేశాడు. తన భార్య అమీదాకు, అక్బర్‌కు వివాహేతర సంబంధం ఉందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయినప్పటికీ, పోలీసులు పట్టించుకోలేదు. అబ్దుల్లాకు, అక్బర్‌కు సర్దిచెప్పారు. దాడిలో అబ్దుల్లాకు గాయాలవడంతో, అక్బర్ నుంచి వెయ్యి రూపాయలను పరిహారంగా ఇప్పించి పంపించేశారు. ఆ రోజున, ఫిర్యాదు స్వీకరించి, అక్బర్‌పై చర్యలు తీసుకున్నట్టయితే... అబ్దుల్లా బతికేవాడు’’ అని, అతడి సోదరుడు, కుటుంబీకులు అంటున్నారు. ఫిర్యాదును పట్టించుకోని పోలీసుల తీరుపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. యువకుడిని ముక్కలుగా చేసి..
కేవీబీపురం: యువకుడు దారుణహత్యకు గురైన ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పుత్తూరు డీఎస్పీ సౌమ్యలత కథనం..మండలంలోని దిగువపూడి గ్రామానికి చెందిన గోవిందరాజులు, మునిచంద్రమ్మల రెండో కుమారుడు వంశీ(19) త్రివేణి క్రషర్లో జేసీబీ ఆ పరేటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం కట్టెల కోసమని అడవికి వెళ్లిన వంశీ ఇంటికి రాకపోవడంతో అతని కోసం గాలించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో దుర్వాసన వస్తుండడంతో అక్కడికెళ్లి చూడగా తల, కాలు, చెయ్యిలేని మొండెం కనిపిం చడంతో హడలిపోయారు. అక్కడ లభించిన సెల్‌ఫోన్, మొలతాడు ఆధారంగా మృతదేహం వంశీదిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పుత్తూరు డీఎస్పీ సౌమ్యలత, సీఐ దైవప్రసాద్, నారాయణవనం ఎస్ఐ దస్తగిరి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వంశీ తల కోసం స్థానికులు సుమారు ఐదుగంటలపాటు గాలించారు. చివరకు మొండెం ఉన్న ప్రదేశానికి సుమారు 40 మీటర్ల దూరంలో లుంగీలో కట్టి, పూడ్చిపెట్టిన తలను పోలీసులు వెలికితీసారు. మృతదేహం తీరును బట్టి రెండురోజుల క్రితం హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని అతికష్టం మీద అటవీ ప్రాంతం నుంచి గ్రామానికి, అక్కడి నుంచి పంచనామా నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. హతుడి తల్లి ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమా? అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వంశీ వివాహేతర సంబంధం కలిగి ఉండడంతో దారుణంగా హతమార్చారని హతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్ పరిశీలించాయి. హత్యకు కారణాలేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
కార్వేటినగరం: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రియుడుతో గొడవ పడి ఆ యువతి తనువు చాలించింది. ఎస్ఐ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలు.. కార్వేటినగరం మండలం పరిధిలోని గుండ్రాజు ఇండ్లు( పెళ్లిచింతమాను) గ్రామానికి చెందిన కె.గురుమూర్తి(30) రామకుప్పం మండలం గురుకుల మడుగు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ గ్రామంలో ఉంటోన్న కళావతి, చెల్లప్పనాయుడు కుమార్తె పి. శ్రావణి(21)ని గురుమూర్తి ఉద్యోగం ఇప్పిస్తానని వశపరుకున్నాడు. తిరుపతిలోని ఓ కోచింగ్ సెంటర్లో కూడా చేర్పించాడు. ఈ క్రమంలో శ్రావణి తమ సొంత గ్రామం గురుకుల మడుగుకు ఇటీవల వెళ్లి పోయింది. దీంతో రామకుప్పం మండలంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న తన సోదరుడు ప్రేమ్‌కుమార్ ద్వారా శ్రావణిని కార్వేటినగరానికి గురుమూర్తి రప్పించాడు. భార్య పుట్టింటికి అలిగిపోవడంతో.. కాగా గురుమూర్తి ఆరేళ్ల క్రితం పాదిరికుప్పం గ్రామానికి చెందిన కావేరిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా గురుమూర్తి శ్రావణితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటికి సక్రమంగా రాకపోవడంతో భార్య కావేరి మూడు నెలల క్రితం భర్తతో గొడపడి పుట్టింటికి అలిగి వెళ్లిపోయింది. దీంతో శ్రావణిని శనివారం కార్వేటినగరంలో.. సరాసరి తన మొదటి భార్యతో కాపురం ఉంటున్న అద్దె ఇంటిలోకే తీసుకొచ్చాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పెళ్లి, ఉద్యోగానికి సంబంధించి సోమవారం రాత్రి గొడవ జరిగింది. తనకు ఉద్యోగమైనా ఇప్పించాలని లేకుంటే పెళ్లి చేసుకోవాలని శ్రావణి నిలదీసింది. అందుకు గురుమూర్తి నిరాకరిండంతో శ్రావణి తీవ్ర మనస్థాపానికి గురైంది. తర్వాత వంటగదిలోకి వెళ్లి ఫ్యాన్ కొక్కీకి ఉరేసుకుని మృతి చెందింది. కాగా సోదరుడైన మరో ఉపాధ్యాయుడు ప్రేమకుమార్ కూడా ఈ వ్యవహారంలో గురుమూర్తికి సహాయం చేసినట్లు తెలిసింది. అలాగే శ్రావణిని ప్రేమకుమారే స్వగ్రామం నుంచి కార్వేటినగరానికి తీసుకొచ్చాడని సమాచారం. కాగా మృతురాలు శ్రావణి కుటుంబం కడు పేదరికంలో ఉందని, దీన్ని ఆసరాగా చేసుకుని గురుమూర్తి లోబరుచుకున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి యావజ్జీవం
ముజ్జాఫర్నగర్ : ఇటీవల ప్రియుడి మోజులో పడి భార్యలు, తమ భర్తలను కడతేర్చుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటనలకు పాల్పడిన వారికి కోర్టులు జైలు శిక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ముజ్జాఫర్నగర్లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. భర్త వారి అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించినందుకు గాను, వీరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రవిందర్ కుమార్ శుక్రవారం సాయంత్రం వీరికి ఈ శిక్ష విధించారు. అంతేకాక రహీస, ఆమె ప్రేమికుడు రిజ్వాన్‌కు రూ.7000 చొప్పున జరిమానా కూడా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఐపీఎస్ సెక్షన్లు 302(హత్యానేరం), 201(సాక్ష్యాలు కనుమరుగు చేయడం) కింద ఈ శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ ప్రకారం, రహీస, ప్రియుడి రిజ్వాన్‌తో కలిసి తన భర్త షానవాజ్‌ను 2010 జూన్ 15న హతమార్చింది. ఆ తర్వాత సాక్ష్యాలను కనుమరుగు చేసింది. షానవాజ్ దుకాణదారుడు. రహీస, రిజ్వాన్‌ల అక్రమ సంబంధాన్ని అతను వ్యతిరేకించాడు. షానవాజ్ హత్యపై అతని తమ్ముడు ఇస్లామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ అనంతరం ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
చిత్తూరు అర్బన్: తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు భార్య అంగీకరించింది. తవణంపల్లెలో జరిగిన మొగిలిరెడ్డి (45) హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతని భార్య మమత(38), ప్రియుడు వీరభద్రారెడ్డి (45)ని అరెస్టు చేశారు. డీఎస్పీ సుబ్బారావు శనివారం చిత్తూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గంగాధరనెల్లూరు మండలం వరత్తూరుకు చెందిన మొగిలిరెడ్డికి తవణంపల్లె మండలం మిట్టూరుకు చెందిన మమతతో 20 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరు మిట్టూరులోనే నివసిస్తున్నారు. వీరికి డిగ్రీ కుమార్తె, కొడుకు ఉన్నారు. కొంతకాలంగా మమతకు మిట్టూరుకు చెందిన వీరభద్రారెడ్డి అలియాస్ మిట్టూరబ్బతో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానించాడు. ఈ విషయమై పలుమార్లు గొడవ కూడా జరిగింది. భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన మమత ప్రియుడు వీరభద్రారెడ్డితో కలిసి పథకం పన్నింది. ఈ క్రమంలో గురువారం రాత్రి పొలంలో ఉన్న ఆవు ఈనుతుందని మొగిలిరెడ్డి అక్కడికెళ్లి పడుకున్నాడు. అర్ధరాత్రి ప్రాంతంలో వీరభద్రారెడ్డి వెదురుకొయ్యతో మొగిలిరెడ్డి తల, శరీరంపై బలంగా కొట్టాడు. అతను చనిపోకపోవడంతో గొంతు నులిమాడు. మొగిలిరెడ్డి కాళ్లను మమత గట్టిగా పట్టుకుంది. తెల్లారేసరికి గుర్తుతెలియని వ్యక్తులు తన భర్తను చంపేశారంటూ గ్రామస్తులను నమ్మించింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వారికి జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. పోలీసు జాగిలం మ్యాగీకి సన్మానం ఈ కేసును ఛేదించడంలో ప్రధాన పాత్ర పోషించిన పోలీసు జాగిలం మ్యాగీని అధికారులు ఘనంగా సన్మానించి గోల్డ్ మెడల్ బహూకరించారు. -
మాజీ ప్రియుడ్ని చంపి నదిలో పడేసింది
నోయిడా: తన న్యూడ్ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బ్లాక్మెయిల్ చేయడంతో ఓ మహిళ తన మాజీ ప్రియుడిని చంపేసింది. నోయిడాకు చెందిన డాలీ చౌదరీ(21), సుశీల్ కుమార్(23)లు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మనస్పర్థలు రావడంతో డాలీ చౌదరీ విడిపోయి మోహిత్ మావి(28) అనే వ్యక్తితో గ్రేటర్ నోయిడాలో సహజీవనం చేస్తోంది. మోహిత్ మావి, డాలీ చౌదరీతో సహజీవనం చేస్తున్నాడని తెలిసి మోహిత్ భార్య ఆగస్టు 7న ఆత్మహత్య చేసుకుంది. భార్య తరపు బంధువుల నుంచి బెదిరింపులు రావడంతో మోహిత్ బెంగుళూరుకు పారిపోయాడు. అయితే గత నెల 16న డాలీ మాజీ ప్రియుడు సుశీల్ కుమార్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఈ విషయమై సుశీల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి డాలీని విచారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సుశీల్ వేరొక మహిళతో రిలేషన్షిప్లో ఉన్నాడని, తన న్యూడ్ ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పెడతానని బ్లాక్‌మెయిలింగ్ పాల్పడ్డాడని విచారణలో పోలీసులకు తెలిపింది. అందువల్లే తాను మరొకరితో కలిసి హత్య చేసేందుకు పూనుకున్నానని డాలీ పోలీసులకు తెలిపింది. డాలీకి మనీష్ చౌదరీ అనే వ్యక్తితో పెళ్లి చేయాలని డాలీ తండ్రి అనుకున్నాడు. కానీ ఆ వివాహం జరగలేదు. ఇంతలో సుశీల్ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడంతో ఈ విషయం మనీష్‌కు డాలీ చెప్పింది. ఇద్దరూ కలిసి సుశీల్ హత్యకు కుట్రపన్నారు. సుశీల్‌కు డాలీ ఫోన్ చేసి మాట్లాడి పరిష్కరించరించుకుందామని చెప్పింది. దీంతో సుశీల్ బెంగుళూరు నుంచి గ్రేటర్ నోయిడాకు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఓ హోటల్లో దిగారు. కూల్ డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి సుశీల్‌కు ఇచ్చింది. స్పృహ కోల్పోయిన అనంతరం మనీష్‌ను హోటల్‌కు రమ్మని కాల్ చేసింది. ఇద్దరు కలసి సుశీల్ కుమార్‌ను చంపి ఆ తర్వాత మాధురా రైల్వే స్టేషన్ వద్ద యమునా నదిలో పడేశారు. -
ఉసురు తీసిన వివాహేతర సంబంధం
మక్తల్ : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. చివరికి ఆమెను కడతేర్చిన వ్యక్తిని భర్త దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన మండలంలోని సత్యవార్లో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్మన్న(45) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన సాకలి ఆంజనేయులు భార్య పద్మమ్మతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని ఆమెతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో కుర్మన్న పద్మమ్మను హతమార్చాడు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న కుర్మన్న నెల రోజుల క్రితం సత్యవార్‌లోని భార్య శంకరమ్మ దగ్గరికి వచ్చాడు. అయితే కుర్మన్నపై పగ పెంచుకున్న సాకలి ఆంజనేయులు అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో కుర్మన్న గ్రామ శివారులోకి వెళ్లిన విషయం తెలుసుకున్న ఆంజనేయులు అతనిపై దాడి చేసి కత్తితో పొడిచి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామంలో హత్య జరగడంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. కుర్మన్నకు భార్య శంకరమ్మ, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. -
భర్తపై కోపంతో చిన్నారిని రోడ్డుపై పడేసిన భార్య
-
మత్తు ఇంజక్షన్ ఇవ్వటం వల్లే..
విజయవాడ: బ్యూటీషియన్ హత్యాయత్నం కేసులో కొత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. హత్యాయత్నానికి గురైన పిల్లి పద్మకు మత్తు ఇంజక్షన్ ఇచ్చినట్లు నిర్ధరణ అయింది. నిందితుడు నూతన్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రెండు రోజుల క్రితం నూతన్ కుమార్‌తో పద్మగొడవపడినట్లు సమాచారం. వివాహేతర సంబంధం వికటించడం వల్లే హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన పల్లె పద్మ, హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ బ్యూటీ పార్లర్లో పని చేస్తోంది. కుటుంబకలహాలతో భర్త సూర్యనారాయణతో వేరుగా ఉంటుంది. ఏలూరుకు చెందిన బత్తుల నూతన్‌కుమార్‌తో తారకరామ కాలనీలో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో నూతన్ కుమార్, పద్మకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి కాళ్లూ, చేతులూ కట్టేసి కత్తితో రెండు చేతులూ నరికేసి హింసించినట్లు తెలుస్తోంది. అనంతరం నూతన్ కుమార్ పరారయ్యాడు. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చపాతీ కూరలో 30 నిద్రమాత్రలు.. ఆపై ఉరి
విజయనగరం టౌన్ : తన వ్యక్తిగత స్వేచ్ఛకు అడ్డువచ్చాడనే కారణంతో కన్నకొడుకుని ఓ తల్లి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.. ఈ నెల 22వ తేదీ రాత్రి స్థానిక గాయత్రీనగర్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టారు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన హరి భగవాన్ (17) తల్లి వెంకట పద్మావతిని పోలీసులు విచారించడంతో అసలు నిజం బయటకు వచ్చింది. హత్య కేసులో తల్లి వెంకట పద్మావతితో పాటు ఆమె ప్రియుడు గోవింద్ హస్తం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం సబ్‌జైల్‌కు పంపించినట్లు రూరల్ సీఐ రమేష్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అసలేం జరిగింది? గాయత్రీనగర్‌లో నివాసముంటున్న వెంకట పద్మావతికి 2000లో కొండబాబుతో వివాహం జరిగింది. వారికి హరిభగవాన్ (17)తో పాటు ఓ కుమార్తె కూడా ఉంది. కొండబాబు డ్రైవింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అయితే సంపాదన విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో 2012లో కొండబాబు నుంచి పద్మావతి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి గాయత్రీనగర్‌లోని తన సొంతిం టిలో పిన్ని సీతాలక్ష్మి, పిల్లలతో నివాసముంటోంది. ఏజెంట్‌గా పరిచయం... వెంకటపద్మావతి కొన్ని ప్రైవేట్ సంస్థలకు ఏజెంట్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యలో గోవింద్ అనే రియల్టర్‌తో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన తల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి సహించని కుమారుడు హరిభగవాన్ తల్లిని పలుమార్లు హెచ్చరించాడు. హత్యకు ముందస్తు పథకం వెంకటపద్మావతి, గోవింద్‌ల కార్యకలాపాలకు అడ్డుగా ఉన్న హరి భగవాన్ను తప్పించాలనే ఉద్దేశంతో గోవింద్ ఇచ్చిన పథకాన్ని అమలుచేయడానికి పద్మావతి పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమైంది. చివరకు నిద్రమాత్రలు ఇచ్చి హరి భగవాన్ను అడ్డు తొలగించుకోవాలని ఇరువురూ నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 21వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో పద్మావతి పిన్ని సీతాలక్ష్మి తన సోదరుడు విశ్వనాథరాజుకు ఆరోగ్యం బాగోలేనందున బాబామెట్టకు వెళ్లింది. హరిని చంపాలంటే ఇదే సమయమని గోవింద్ తన ప్రియురాలు పద్మావతికి చెప్పాడు. పైగా గోవింద్ తన ఇంటి నుంచి ఎప్పటికప్పుడు ఫోన్లో హత్య ఎలా చేయాలో వివరించడం విశేషం. చపాతి కూరలో 30 నిద్రమాత్రలు కలిపి.. గోవింద్ సలహా మేరకు పద్మావతి చపాతి కూరలో 30 నిద్రమాత్రలు కలిపింది. దీంతో చపాతి తిన్న హరిగోపాల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. నిద్రలోకి జారుకున్న కొడుకు మెడకు చీర బిగించి హత్యచేసింది. అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు చిత్రీకరించి, మార్కులు తక్కువగా రావడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించింది. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన పద్మావతి పిన్ని సీతాలక్ష్మికి హరి ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో ఆశ్చర్యపోయింది. పద్మావతిని గట్టిగా నిలదీయడంతో చేసిన తప్పు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయింది. ఇదిలా ఉంటే హత్యకు పరోక్షంగా సహకరించినా గోవింద్‌ను శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వీరిద్దరిని రిమాండ్ నిమిత్తం సబ్‌జైల్‌కు తరలించారు. -
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో..
మేడ్చల్ జిల్లా : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి యప్రల్ శైలి గార్డెన్స్‌లోని జూపల్లి హోమ్స్‌లో విషాదం చోటుచేసుకుంది. వివరాలు..స్థానికంగా నివాసముంటున్న రమేష్(36) అనే యువకుడు అదే ప్రాంతంలో పనిచేస్తోన్న సుజాత అనే వివాహితతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం సుజాత భర్తకు తెలియడంతో ఆయన తీవ్రంగా మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రమేశ్ బుధవారం ఉదయం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
వివాహేతర సంబంధం నెపంతో.. వృద్దుడి హత్య
మర్పల్లి : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మండల కేంద్రంలోని కోట్‌మర్పల్లి చౌరస్తా సమీపంలో కల్లు దుకాణం సమీపంలో గు రువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థాని కుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మర్పల్లి గ్రామానికి చెందిన బేగరి తుల్జయ్య (70) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో కల్లు దుకాణంలో కల్లు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తుండగా కోట్‌మర్పల్లి చౌరస్తా సమీపంలో కల్లు దుకాణం పక్కనే అదే గ్రామానికి చెందిన బక్క మొల్లయ్య కత్తితో తుల్జయ్యపై దాడి చేశాడు. మెడ, కడుపులో దారణంగా పొడిచాడు. తుల్జయ్య కడుపులో నుంచి అవయవాలు బయటపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తుండగా, చిన్నవాడు రాజు గ్రామంలోనే కరెంట్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. లొంగిపోయిన నిందితుడు... తుల్జయ్యను హత్య చేసిన అనంతరం బక్క మొల్లయ్య కిలోమీటర్ దూరంలో ఉన్న మర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న తుల్జయ్యను తానే కత్తితో పొడిచి హత్య చేశానని పోలీసులకు వివరించాడు. వివరాలు సేకరించిన పోలీసులు తుల్జయ్య హత్య విషయం తెలుసుకున్న మర్పల్లి పోలీసులు మోమిన్‌పేట్, ధారూరు సీఐల సా యంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను స్థానికులను, కుటుంబసభ్యుల ను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకొని తుల్జయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పథకం ప్రకారమే హత్య చేశారు.. వయస్సు పైబడి వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రిని పథకం ప్రకారమే హత్య చేశారని తుల్జయ్య కుమారుడు రాజు కన్నీటి పర్యంతమయ్యాడు. తన తండ్రిని హత్య చేసిన బక్క మొల్లయ్యను పూర్తి స్థాయిలో విచారిస్తే అతని వెనక ఉన్నవారు బయటకొస్తారన్నాడు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని తుల్జయ్య కుటుంబీకులు పోలీసులను కోరారు. ఈ విషయమై మర్పల్లి ఎస్ఐ విఠల్‌రెడ్డికి వివరణ కోరగా హత్యకు గల కారణాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని, కేసు దర్యాప్తులో ఉందన్నారు. -
వివాహేతర సంబంధం పెట్టుకుందని..
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా తిరుమలగిరి మండలం అల్వాల్‌లో సోమవారం దారుణం చోటుచేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ ఓ వివాహిత, ఆమె తరపు బంధువులు మరో మహిళను స్తంభానికి కట్టేసి చితకబాదారు. తీవ్రగాయాలు కావడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అనుమానంతో భార్యపై దాడి..ఆపై ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా : కేతేపల్లి మండలం తుంగతుర్తిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కత్తితో దాడి చేసి కాళ్లు చేతులు నరికేశాడు. వివరాలు..తుంగతుర్తి గ్రామానికి చెందిన జాతంగి శ్రీనివాస్(35)కు 13 ఏళ్ల క్రితం రజిత అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, ఒక కూతురు. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కొద్ది రోజుల నుంచి గొడవలు మొదలయ్యాయి. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నదనే అనుమానం శ్రీనివాస్‌లో మొదలైంది. ఈ నేపథ్యంలోనే కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ మంగళవారం భార్యపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి అనంతరం కరెంటు తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య రజితకు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురిని బలిగొన్న వివాహేతర బంధం
ఆత్మకూరు(పరకాల) వరంగల్ : తన తండ్రి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఓ యువకుడు విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. క్షణికావేశంతో ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి ముగ్గురి మృతికి కారణమయ్యాడు. ఈ ఘటనలో మహిళతోపాటు నిందితుడి తండ్రి, నానమ్మ కూడా మృతిచెందా రు. దామెర మండలం కంఠాత్మకూరులో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దామెర మండలం కంఠాత్మకూరుకు చెందిన మామిడి కుమారస్వామి(50), తన భార్య కౌసల్య, కుమారుడు, కుమార్తెతో హన్మకొండలోని ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్నాడు. ప్లంబర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి కంఠాత్మకూరు సమీప గ్రామమైన పులుకుర్తికి చెందిన వితంతువు పోతరాజు సుమలత(38)తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమెకు గతంలో హసన్పర్తికి చెందిన ఓ వ్యక్తితో వివాహం కాగా భర్త మృతిచెందడంతో ప్రస్తుతం పైడిపల్లి సమీపంలో నివాసముంటోంది. ఈ క్రమంలో సుమలత, కుమారస్వామి పరిచయం పెరిగి తరచు కంఠాత్మకూరుకు వచ్చివెళ్తున్నారు. అప్పటి నుంచి అతడు హన్మకొండకు రాకుండా కుటుం బాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో కుమారస్వామి కుమారుడు కార్తీక్ సుమలతపై కక్ష పెంచుకున్నాడు. ఆదివారం అతడు తన తండ్రికి ఫోన్ చేయగా కంఠాత్మకూరులో ఉన్నట్లు చెప్పాడు. దీంతో కార్తీక్ ఆగ్రహంతో వెంటనే కంఠాత్మకూరుకు బయల్దేరాడు. నేరుగా రాత్రి ఇంట్లోకి పెట్రోల్ డబ్బాతో ప్రవేశించాడు. ముందుగా సుమలతపై పెట్రోల్ పోస్తుండగా కుమారస్వామి అడ్డుకోబోయాడు. ఈ క్రమంలో కుమారస్వామిపై కూడా పెట్రోల్ పడింది. వెంటనే సుమలతకు కార్తీక్ నిప్పంటించాడు. దీంతో కుమారస్వామి మంటలార్పే ప్రయత్నం చేయగా అతడిపై కూడా పెట్రోల్ ఉండడంతో అతడు కూడా అగ్నికీలల్లో దగ్ధమయ్యాడు. అదేసమయంలో మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి కుమారస్వామి తల్లి మామిడి రాజమ్మ(70) మంటల్లో కాలిపోయింది. మంటలు ఎగిసిపడడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన జరుగుతుండగానే కుమారస్వామి తండ్రి లింగయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసుల అదుపులో నిందితుడు? నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మోహన్‌బాబు తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, డీసీపీ సంఘటనా స్థలాన్ని డీసీపీ వెంకటేశ్వర్లు , ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తు చేసి దర్యాప్తు చేస్తామని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. కాలిన మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఘటన వివరాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అడిగి తెలుసుకున్నారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే.. వేరొక మహిళతో కుమారస్వామి వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే కార్తీక్ సజీవ దహనానికి పాల్పడినట్లు స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. గతంలో ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోలేదని, దీంతో కార్తీక్ తరచుగా ఇదే విషయంలో తండ్రితో గొడవపడేవాడని స్థానికులు వెల్లడించారు. -
భార్య వివాహేతర సంబంధాన్ని బయటపెట్టిన భర్త
కోదాడ అర్బన్ : సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ భార్యతో రాష్ట్ర పోలీస్ విభాగంలో పనిచేసే ఏఆర్ కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గతంలో పంచాయతీలు జరిగినా వారిలో మార్పురా లేదు. తన భార్య వైఖరిపై అనుమానంతో ఉన్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ డ్యూటీకి వెళుతున్నానని చెప్పి రహస్యంగా తిరిగివచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడు. ఈ సంఘటనపై పోలీసులకు, స్థానికులకు సమాచారం అందించి వారి ఎదుట ఈ నిర్వాకాన్ని బయటపెట్డాడు. పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని అరెస్ట్ చేశారు. ఈ∙సంఘటన ఆదివారం కోదాడ పట్టణంలో జరిగింది. పట్టణ ఎస్ఐ మహిపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం బూరుగుగడ్డ గ్రామానికి చెందిన కుక్కడపు వెంకటేశ్వర్లు సూర్యాపేటలో ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వరంగల్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కొండల్రావు అనే కానిస్టేబుల్‌కు 2016లో బూరుగుగడ్డకు చెందిన మహిళతో వివాహమైంది. వివాహానికి పూర్వమే ఆమెకు వెంకటేశ్వర్లుతో వివాహేతర సంబంధం ఉంది. వివాహం అనంతరం కూడా సంబంధం కొనసాగడం ఆమె భర్త దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో అతడు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా ఆమె ఇకపై తాను సక్రమంగా నడుచుకుంటానని తెలపడంతో పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో కాపురం పెట్టారు. శనివారం రాత్రి తను డ్యూటీకి వెళ్తున్నానని చెప్పడంతో ఆమె వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసింది. తన ఫోన్లో రికార్డింగ్ విన్న కొండల్రావు విషయం తెలుపుకుని డ్యూటీకి వెళ్లినట్లే వెళ్లి తిరి గి వచ్చే సరికి ఆమె వెంకటేశ్వర్లుతో ఉంది. దీం తో కొండల్రావు బయట నుంచి తలుపు గడియ పెట్టి ఇరుగు పొరుగు వారిని పిలవడంతో పాటు పోలీసులకు సమాచారమందించాడు. దీనితో పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు తీసిన సమయంలో వ్యవహారం బట్టబయలైంది. దీంతో పోలీసులు వారిరువురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనలో కొండల్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రియుడిపై కోపంతో బాలిక కిడ్నాప్
నందిపేట(ఆర్మూర్): వివాహేతర సంబంధం ఆరేళ్ల బాలికను కిడ్నాప్‌నకు చేసేలా చేసింది. తనతో వివాహేతర సం బంధం కొనసాగిస్తున్న వ్యక్తి తన మాటలు విన డం లేదని గొడవ పడిన యువతి అతడి బిడ్డను కిడ్నాప్ చేసేందుకు పన్నాగం పన్నింది. పాఠశాలకు వెళ్లి చాక్లెట్లు కొనిస్తానని మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిన సంఘటన నందిపేటలో గురువారం చోటుచేసుకుంది. కిడ్నాప్‌నకు గురైన బాలి క తల్లి, పోలిసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రెండు కుటుంబాల మధ్య తగాదాలు మండలంలోని వన్నెల్ కే గ్రామానికి చెందిన మద్ది రమేష్, హరిత దంపతులకు ఆరేళ్ల కూతురు మనీశ్వరీ, ఏడాది వయస్సున్న కూతురు అహల్య ఉ న్నారు. మనీశ్వరీ నందిపేటలోని శ్రీగీతా హైస్కూల్లో యూకేజీ చదువుతుంది. మద్ది రమేష్ వన్నెల్ కే గ్రామానికి పక్కనే గల ఆర్మూర్ మండలం మ చ్చర్లలో మీసేవ కేంద్రం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కొంత కాలంగా మచ్చర్లలోని ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలితో పరిచయం ఏర్పడింది. క్రమేణ వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరికి కూడా ఓ కూతురు జన్మించింది. అయితే కొన్ని రోజులుగా వీరిద్దరితో పాటు రెండు కుటుంబాల మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. దీంతో కోపంతో యువతి, రమేశ్ దంపతుల కూతురును కిడ్నాప్ చేసేందుకు నిర్ణయించింది. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి.. మండల కేంద్రంలోని శ్రీగీతా హైస్కూల్లో చదువున్న మనీశ్వరీని ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకుంది. బుధవారం పాఠశాలకు వెళ్లి పాఠశాలలో ఏవైనా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయా అని ఆరా తీసింది. ఖాళీలు లేవని యాజమాన్యం చెప్పడంతో వెనుదిరిగి వెళ్తూ పాప గురించి ఆరా తీసింది. ఆ రోజు పాప పాఠశాలకు రాలేదని తెలియడంతో వెళ్లిపోయింది. తిరిగి గురువారం మళ్లీ పాఠశాలకు వచ్చి పాప గురించి ఆరా తీయగా గమనించిన పాఠశాల సిబ్బంది ఖాళీలు లేవని మళ్లీ ఎందుకు వచ్చావని సదరు యువతిని ప్రశ్నించారు. మనీశ్వరీ తన బంధువుల అమ్మాయి అని చెప్పి తనతో పంపిచాలని కోరడంతో పంపించ డం కుదరదని చెప్పినా అక్కడే ఉండి, మధ్యా హ్నం లంచ్ సమయంలో మనీశ్వరీ చేతులు కడుక్కునేందుకు బయటకు రాగా పాపను పక్కకు పిలిచి చాక్లెట్లు కొనిస్తానని చెప్పి మరో వ్యక్తితో కలిసి బైక్‌పై ఎక్కించుకుని పరారైంది. దీంతో పాఠశాల యాజమాన్యం గుర్తించి వెంటనే పాప తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు పాపను తీసుకెళ్లిన యువతి గురించి వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల వెతికిన ఫలితం లేదు. గురువారం సాయంత్రం పాప తల్లి హరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పాప ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ సంతోషకుమార్ తెలిపారు. పాప తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
అశ్లీల వీడియో చూసి ఆగ్రహంతో భర్త..
ఛంఢీగఢ్: భార్య అశ్లీల వీడియో చూసి భరించలేకపోయిన భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్య, పిల్లలపై పెట్రోల్ పోసి తగలబెట్టిన అతను.. తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కపుర్తలా జిల్లా కలసింగియా గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుల్విందర్ సింగ్(35) జోర్డాన్‌లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. భార్య, పిల్లలు స్వగ్రామం కలసింగియాలోనే ఉంటున్నారు. అయితే గ్రామంలోని ఓ వ్యక్తితో కుల్విందర్ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో సదరు వ్యక్తితోపాటు మరో ముగ్గురు ఆమె అశ్లీల వీడియోను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. చివరకు ఆ వీడియోను భర్తను పంపటంతో కుల్విందర్ ఇండియాకు తిరిగొచ్చాడు. భార్య వ్యవహారం బయటపడటంతో తట్టుకోలేక పెట్రోల్ పోసి కుటుంబాన్ని చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కపుర్తలా పోలీసులు వెల్లడించారు. -
భర్తను చంపిన భార్య జైలుపాలు
అత్తాపూర్ : ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఓ మహిళను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. రాజేంద్రనగర్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలానికి చెందిన ఆనంద్, మహేశ్వరి దంపతులు కొన్నేళ్ల క్రితం రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లికి వలస వచ్చారు. ఆనంద్ హోటల్లో వంట పని చేస్తుండగా మహేశ్వరి ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తుండేది. కొన్ని నెలల క్రితం తను పనిచేస్తున్న మాల్లో మహేశ్వరి అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో తోటి సిబ్బంది ఆటోను పిలిచి ఆమెను ఆస్పత్రికి తరలించారు. సదరు ఆటో డ్రైవర్ సంజూ మహేశ్వరికి సపర్యలు చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. ఈనేపథ్యంలో వారికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. మహేశ్వరిని భర్త ఆనంద్ నిత్యం తాగి వచ్చి కొడుతుండగా.. సంజూ బాగా చూసుకునేవాడు. ఈనేపథ్యంలో ఇద్దరూ కలిసి ఆనంద్‌ను చంపేయాలని పథకం వేశారు. మహేశ్వరి మే 7న ఇంట్లో భర్త ఆనంద్ పీకలదాకా తాగేలా చేసింది. మత్తులో ఉన్న అతడిని ఆమె తన ప్రియుడు సంజూతో కలిసి ఓ ప్లాస్టిక్ వైర్‌తో ఉరి బిగించి చంపేసింది. అనంతరం ఆటోలో మృతదేహాన్ని గండిపేట మండల పరిధిలోని గంధంగూడ సమీపంలో ఉన్న మూసి నది ఒడ్డుకు తీసుకువెళ్లారు. అక్కడ పెట్రోల్ పోసి మృతేహాన్ని కాల్చేశారు. మరుసటి రోజు అస్తికలను మూసినదిలో పడేశారు. అనంతరం పది రోజుల పాటు ఏమీ తెలియనట్లు ఉన్న మహేశ్వరి మే 20న తన భర్త కనిపించడం లేదని రాజేంద్రనగర్ పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆనంద్ కుటుంబీకుల వివరాల ద్వారా పోలీసులు మహేశ్వరితోపాటు సంజూను అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరం అంగీకరించారు. దీంతో బుధవారం వారిద్దరిని రిమాండ్‌కు తరలించారు. డీసీపీ పద్మజారెడ్డి బుధవారం ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ ఆశోక్, ఇన్స్పెక్టర్ సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం..హత్య కుట్ర భగ్నం
బుక్కరాయసముద్రం(అనంతపురం జిల్లా): ఓ వ్యక్తి హత్యకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. బుక్కరాయసముద్రం మండలంలోని ఓ గ్రామంలో ఓ వివాహితకు ఏడాది క్రితం కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన కోటేశ్వరరావు నుంచి రాంగ్ కాల్ వచ్చింది. అప్పటి నుంచి వారి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కర్నూలు నుంచి కోటేశ్వరరావు అనంతపురానికి వచ్చి ఆ వివాహితను తరచూ కలుసుకునేవాడు. తన వివాహేతర సంబంధంపై భర్తకు అనుమానం రాకుండా ఆమె జాగ్రత్త పడింది. భర్త అడ్డు తొలగించుకుని ప్రియునితో శాశ్వతంగా ఉండిపోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ప్రియునితో కలిసి భర్త హత్యకు పథకం రచించింది. దీంతో కోటేశ్వర రావు రూ.2.50 లక్షలతో అనంతపురానికి చెందిన ఆరుగురు కిరాయి హంతకముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వివాహిత భర్తను హత్య చేసేందుకు రెండు రోజుల క్రితం కారులో వస్తున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారంతో ఎస్ఐ వెంకటేశ్వర్లు తన బృందంతో నార్పల క్రాసింగ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ మార్గంలో వచ్చిన కోటేశ్వరరావుతో సహా ఆరుగురు కిరాయి రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయం వివాహిత భర్తకు ఇంకా తెలియలేదని ఎస్ఐ తెలిపారు. -
టీనేజీ అమ్మాయితో ఎమ్మెల్యే రాసలీలలు
భార్య ఉండగానే.. టీనేజీ యువతితో సంబంధం నెరిపిన బీజేపీ నేత బాగోతం హాట్ టాపిక్‌గా మారింది. జమ్ము కశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యే గగన్ భగత్‌పై ఆయన భార్య మోనికా శర్మ సంచలన ఆరోపణలకు దిగారు. 19 ఏళ్ల ఓ యువతితో అఫైర్ నడపటమే కాకుండా.. రహస్యంగా ఆమె వివాహం చేసుకున్నాడంటూ ఆరోపిస్తూ మోనికా మీడియా ముందుకు వచ్చారు. సాక్షి, న్యూఢిల్లీ/శ్రీనగర్: ఆర్ఎస్ పుర నియోజకవర్గ ఎమ్మెల్యే గగన్.. ఆయన భార్య మోనికా శర్మ జమ్ము బీజేపీ మహిళా విభాగానికి కార్యదర్శి. గగన్ పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల ఓ యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్నారని ఆరోపిస్తూ మోనికా శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘నా భర్త మంచోడు కాదు. గత కొంతకాలంగా ఓ కాలేజీ యువతితో అఫైర్ నడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆ అమ్మాయిని రహస్య వివాహం కూడా చేసుకున్నారు. ఇంతకాలం సాక్ష్యాలు లేక ఆగిపోయా. ఇప్పుడు ఈ ఆధారాలతో(ఫోటోలు) మీ ముందుకు వచ్చా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. మీ బిడ్డకు జరుగుతున్న అన్యాయమనుకుని న్యాయం చేయండి’ అని ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాలకు ఆమె విజ్ఞప్తి చేశారు. నా భార్య విడాకులడిగింది... అయితే మోనికా ఆరోపణలను గగన్ సింపుల్‌గా తోసిపుచ్చారు. ‘మా మధ్య కొంతకాలంగా మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆమె విడాకులు కోరింది. పిల్లల భవిష్యత్ దృష్ట్యా వద్దని వారించా. ప్రస్తుతం కౌన్సిలింగ్ జరుగుతోంది. అందుకే ఈ ఆరోపణలు’ అని గగన్ చెబుతున్నారు. అయితే కౌన్సిలింగ్ జరుగుతున్న మాట వాస్తవమేనని, కానీ, చెల్లించాల్సిన భరణం కూడా గగన్ ఇవ్వట్లేదని మోనికా చెబుతున్నారు. మరోవైపు పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు భార్యభర్తలు ఇద్దరూ హాజరుకాగా, అదే సమయంలో పార్టీ కార్యాలయం వెలుపల సదరు యువతి తాత నిరసన ప్రదర్శన చేపట్టడం గమనార్హం. గగన్ చాలా మంచాయన... గత నెల చివర్లో తన కూతురిని గగన్ అపహరించాడంటూ పంజాబ్‌కు చెందిన ఓ మాజీ సైనికాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతిని ఎట్టకేలకు రక్షించి మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో యువతి.. ‘గగన్ చాలా మంచి వ్యక్తి అని.. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆమె అంటోంది. తన తల్లిదండ్రులను ప్రలోభపెట్టి గగన్పై ఆరోపణలు, అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని వెల్లడించటం విశేషం. మరోవైపు గగన్ తనపై కుట్ర జరుగుతోందని.. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెబుతున్నారు. -
భార్యకు అడ్డంగా దొరికిపోయాడు..
సాక్షి, యాదాద్రి : భర్త అక్రమ సంబంధాలను భార్య బయటపెట్టారు. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వివరాలిలా.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఏఓగా పనిచేసిన హరిప్రసాద్ సస్పెండ్ అయ్యారు. హరిప్రసాద్‌కు నిర్మల అనే మహిళతో 2002లో వివాహం జరిగింది. అయితే గత రెండేళ్లుగా మయూరి అనే మహిళతో భర్త అక్రమ సంబంధం పెట్టుకుని తనను, తమ పిల్లలను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎన్ని సార్లు చెప్పినా పద్దతి మార్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి నుంచి ఇంటికిరాని భర్తపై అనుమానం వచ్చిన నిర్మల తన సోదరుడు, కొందరు బంధువులతో కలిసి వెళ్లి మయూరితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్మల, సహా ఆమెతో పాటు వచ్చిన బంధువులు హరిప్రసాద్‌కు, మయూరికి దేహశుద్ధి చేశారు. అనంతరం భర్తను పోలీసులకు అప్పగించారు. కాగా, హరిప్రసాద్ భార్య నిర్మల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. భర్త బాగోతంపై నిర్మల మీడియాతో మాట్లాడుతూ.. హరిప్రసాద్‌కు మయూరి అనే మహళతో శారీరక సంబంధాలున్నాయి. ఈ కారణంగా గత కొంతకాలం నుంచి నాపై, నా పిల్లలపై దాడులకు పాల్పడుతున్నారు. నా కొడుకుకు ఇటీవల యాక్సిడెంట్ చేశారు. అయినా మమ్మల్ని వదిలిపెట్టడం లేదు. సంవత్సరం నుంచి గొడవ ముదురుతోంది. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో పనిచేసినప్పుడు నా భర్తకు మయూరితో పరిచయం ఏర్పడింది. అక్రమ సంబంధాలపై హెచ్చరిస్తే.. మా ఇద్దరి మధ్య ఏం సంబంధం లేదని బాండ్ పేపర్ల మీద నా భర్త, మయూరి రాసిచ్చారు. అందుకు సంబంధించి వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయని తెలిపారు. కొడుకుకు యాక్సిడెంట్ అయి నేను ఇబ్బంది పడుతుంటే ఆయన మాత్రం వేరే మహిళల వద్దకు వెళ్తున్నాడంటూ హరిప్రసాద్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లావ్ అని అడిగితే విజయవాడ వెళ్లానంటూ బుకాయిస్తున్నారు. తెల్లారేసరికల్లా ఇంటికి వచ్చేయాలి కానీ వేరే మహిళ ఇంటికి ఎందుకు వచ్చాడని భర్తను నిలదీశారు. -
భర్త అక్రమ సంబంధం..రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
-
ఒక తప్పిదం..రెండు కుటుంబాల్లో విషాదం
యాచారం : వివాహేతర సంబంధం ఘటన రెం డు కుటుంబాల్లో విషాదం యాచారం మం డలం నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన లలిత అదే గ్రా మానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధంపై మనస్తాపంచెందిన ఆమె భర్త లింగం శనివారం రాత్రి ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. అయితే లింగం మరణానికి ఆయన భార్య లలిత అక్రమ సంబంధమే కారణమంటు గ్రామస్తులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆదివారం రాత్రి లలితను పోలీసులు అరెస్టు చేశారు. భార్య లలిత లేకుండా సోమ వా రం నక్కర్తమేడిపల్లిలో లింగం అంత్యక్రియలు పూర్తి చేశా రు. సోమవారం జరిగిన లింగం అంత్యక్రియల్లో బంధువులు, గ్రామస్తులు.. నీ బిడ్డ వివాహేతర సంబంధమే లింగం ప్రాణతీసిందని లలిత తండ్రి బీరయ్యను మందలించారు. గ్రామస్తుల సూటిపోటి మాటలతో మనస్తాపం చెందిన బీరయ్య సోమవారం రాత్రి కొత్తపల్లి గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి మార్చురికి తరలించి పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహన్ని కొత్తపల్లికి తరలించారు. భర్త మృతికి కారణమైన లలితను మంగళవారం పోలీసులు రిమాండ్‌కు పంపించారు. వివాహేతర సంబంధం వల్ల భర్త ఆత్మహత్య చేసుకోవడం.. ఆమె జైలు పాలు కావడం, ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారడం.. తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో నక్కర్తమేడిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లోని రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
యాచారం: భార్య అక్రమ సంబంధం పెట్టుకుం దని మనస్తాపానికి గురైన భర్త ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మృతి చెందడం, తల్లి కటకటాల్లోకి వెళ్లే పరిస్థితి రావడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపిన వివరాలు... నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన మోటె లింగం(36)కు కొత్తపల్లి గ్రామానికి చెందిన లలితతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి అఖిల(10), గోపిచంద్(6), సిరి(3) ముగు ్గరు పిల్లలున్నారు. లలిత గ్రామానికి చెందిన నరేందర్ అనే వ్యక్తితో కొన్నేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. పసిగట్టిన భర్త లింగం పలుమార్లు భార్య లలితను హెచ్చరించాడు. అయినా లలితలో మార్పు రాలేదు. పక్షం రోజుల క్రితం లింగం పిల్లలను చూసైనా పద్ధతి మార్చు కోవాలని లలితను గట్టిగా హెచ్చరించాడు. భర్తపై కోపంతో లలిత చెప్పకుండానే తల్లిగారిళ్లు కొత్తపల్లికి వెళ్లిపోయింది. భార్య, భర్తల మధ్య ఘర్షణ చిన్నారులపై పడుతుందని తెలుసుకున్న సర్పంచ్ బాషా, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ మోటె శ్రీశైలంలు లింగంకు నచ్చజెప్పి కొత్తపల్లిలో ఉన్న లలితను కొద్ది రోజుల కిందే నక్కర్తమేడిపల్లికి తీసుకువచ్చారు. మళ్లీ ఏమైందో ఏమో గాని శనివారం ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అక్రమ సంబంధం వద్దంటే కొనసాగిస్తున్నావ్... గ్రా మంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా పో యిందని మనుస్తాపానికి గురైన లింగం శనివారం రాత్రి ఇంట్లోనే ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అదే రాత్రి నక్కర్తమేడిపల్లికి చేరుకుని లింగం మృతదేహన్ని ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. తండ్రి మృతిచెందడం, తల్లిని దాచిపెట్టడం చూసిన పిల్లలు బోరున విలపిస్తున్న తీరు గ్రామస్తులు, బంధువులను కన్నీరు పెట్టించింది. లలిత, నరేందర్‌లను అరెస్టు చేయాలి... ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి నుంచి ఆదివారం సాయంత్రం లింగం మృతదేహన్ని నక్కర్త మేడిపల్లిలోని ఆయన ఇంటికి తరలించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన లింగం బంధువులు, గ్రామస్తులు భర్త మృతికి కారణమైన లలితను చంపేయాలి, అక్ర మ సంబంధం పెట్టుకున్న నరేందర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు చర్యలు తీసుకోనిదే అంత్యక్రియలు జరిపేది లేదని గ్రామస్తులు, బంధువులు నిరసనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. లలితను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ కృష్ణంరాజు హామీ ఇచ్చారు. నరేందర్‌పై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. శాంతించిన బంధువులు, గ్రా మస్తులు సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. -
హత్య చేసి..పోలీసులతోనే తిరిగిన నిందితుడు
నస్ల్రుల్లాబాద్ : హత్య చేసి తప్పించుకుందామని అనుకున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని నెమ్లీ గ్రామానికి చెందిన కంతి గంగవ్వ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని బాన్సువాడ రూరల్ సీఐ శ్రీనివాస్ రావు, ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. నెమ్లీ గ్రామానికి చెందిన కంతి గంగవ్వకు, బందెబోయి అనే వ్యక్తికి చాలా కాలంగా వివాహేతర సంబంధం ఉంది. తరచూ గంగవ్వ ఇంటికి వస్తూ ఉండేవాడు. అయితే రెండు నెలలుగా గంగవ్వ బందె బోయిని దూరం పెట్టి వేరే వారితో చనువుగా ఉండటం బందె బోయి భరించలేకపోయాడు. తనను దూరంగా ఉంచడం సహించలేని బందె బోయి కంతి గంగవ్వను హత్య చేయాలని అనుకున్నాడు. అదును కోసం చూస్తున్న బందె బోయి ఆదివారం మైలారం గ్రామంలో గల కొచ్చరు మైసమ్మ ఆలయం వద్ద బంధువుల కార్యక్రమానికి వెళ్లడం గమనించాడు. ఇదే సరైన సమయమనుకుని గంగవ్వతో చనువుగా ప్రవర్తించి నస్రుల్లాబాద్ వద్ద ఉన్న కర్షగుట్ట ప్రాంతానికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఎవ్వరూ లేని ప్రదేశంలో ఏకాంతంగా గడపాలని గంగవ్వను ప్రేరేపించగా ఆమె వారించి ఒప్పుకోలేదు. ముందుగానే చంపాలని అనుకున్న బందె బోయి కోపోద్రిక్తుడై ఇష్టారీతిన కొట్టాడు. దీంతో పెద్ద బండపై పడ్డ గంగవ్వకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్తావం అయింది. ఫలితంగా అక్కడికక్కడే మరణించింది. గంగవ్వ ఒంటిపై ఉన్న దాదాపు రూ.23వేల విలువ గల బంగారు నగలు, వెండి పట్టీలు, కడాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్లి పోయాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఊరిలోనే ఉంటూ, గ్రామ ప్రజలతో పాటు శవాన్ని చూసేందుకు రావడమే కాక, పోలీసులకు సహకరిస్తునట్లు ప్రవర్తించాడు. శవ పంచనామతోపాటు, అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. పోలీసుల తమ విచారణలో బందె బోయితో సంబంధం ఉందన్న విషయం తెలుసుకుని అతన్ని విచారించగా నిజం ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. ఎస్ఐతోపాటు సిబ్బందికి అభినందనలు మండలంలో జరిగిన రెండు హత్య కేసులను చాకచక్యంగా తక్కువ సమయంలోనే మండల పోలీసులు ఛేదించారని సీఐ తెలిపారు. గతంలో బొమ్మన్‌దేవ్‌పల్లిలో హత్యకు గురైన కుర్మ గంగవ్వ ఎటువంటి ఆధారాలు లేని హత్య కేసులోను, ప్రస్తుత కంతి గంగవ్వ హత్య కేసులోనూ కీలక పాత్ర పోషించిన ఎస్ఐ అనిల్ రెడ్డి, పోలీసులు సంఘమేశ్వర్, సుభాష్‌ను సీఐ అభినందించారు. -
ప్రియుడి బైక్‌పై వెళ్తున్న భార్యను లారీతో గుద్దిన భర్త
చీపురుపల్లి: అక్రమ మార్గంలో నడుస్తున్న భార్యను సరిదిద్దాలనుకున్నాడు.. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు. ప్రియుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యను చూసి రగిలిపోయాడు. చివరకు తాను నడుపుతున్న లారీతోనే వారిని ఢీకొట్టాడు. ఈ సంఘటనలో భార్య మృతి చెందగా, ప్రియుడు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. గురువారం మధ్యాహ్నం చీపురుపల్లి పట్టణం నుంచి లావేరు వెళ్లే రోడ్డులో శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో జరిగిన ఈ సంఘటనతో అంతా ఉలిక్కిపడ్డారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి సీఐ సీహెచ్.శ్యామలరావు, ఎస్సై టి.కాంతికుమార్, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గరివిడి మండలంలోని కాపుశంభాం గ్రామానికి చెందిన రేగాన తవిటయ్య, రమణమ్మలు భార్యాభర్తలు. తవిటయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇదిలా ఉంటే రమణమ్మకు అదే గ్రామానికి చెందిన రేగాన రామకృష్ణతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్త తవిటయ్య చాలా కాలం కిందటే గుర్తించి భార్యను పలుమార్లు హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. సుభద్రాపురం రమ్మని.. ఇదిలా ఉంటే తవిటయ్య హుజూరాబాద్ నుంచి పర్లాకిమిడికి లారీతో బుధవారం బయలుదేరాడు. అదే సమయంలో భార్య రమణమ్మకు ఫోన్ చేసి డ్వాక్రా అప్పు చెల్లించేందుకు డబ్బులు ఇస్తానని గురువారం ఉదయం సుభద్రాపురం రావాలని సమాచారం ఇచ్చాడు. తాను కూడా చెప్పిన సమయానికి సుభద్రాపురం చేరుకుని భార్య కోసం ఎదురు చూశాడు. మధ్యాహ్నం వరకు భార్య రాకపోవడంతో ఆమె కోసం ఆరా తీశాడు. ఇంతలో ప్రియుడు రేగాన రామకృష్ణతో కలిసి మధ్యాహ్నం చీపురుపల్లిలో బయిలుదేరినట్లు తెలుసుకున్నాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన తవిటయ్య ఎలాగైనా ఇద్దరినీ హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అదే తడువుగా లారీతో చీపురుపల్లి వైపు వస్తుండగా కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు వచ్చేసరికి ఎదరుగా ద్విచక్ర వాహనంపై రామకృష్ణతో కలిసి వస్తున్న భార్యను చూశాడు. వెంటనే వారి వాహనాన్ని లారీతో ఢీకొట్టాడు. దీంతో రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. తవిటయ్య లారీను అక్కడే వదిలి పరారయ్యాడు. హత్య కేసు నమోదు చేశాం.... ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలా నికి వెళ్లాం. ఆ తర్వాత లారీ డ్రైవరే మృతురాలి భర్తని తెలిసింది. దీంతో ఆరా తీస్తే వివాహేతర సంబంధాలే కారణమని తెలు స్తోంది. లారీ క్యాబిన్లో వీరిద్దరి ఫొటోలు కూడా లభించాయి. హత్య కేసుగా నమోదు చేస్తున్నాం. పోలీసుల అదుపులో తవిటయ్య..? ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి భార్య మృతికి కారణమైన తవిటయ్య పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. కాని ఆయన కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలంలోనే లారీని వదిలి పట్టణంలోకి వచ్చిన తవిటయ్య ఓ హోటల్లో మద్యం సేవించి భోజనం చేసి ఆ హోటల్ యాజమాన్యంతో గొడవ పడినట్లు తెలి సింది. దీంతో వారు హోటల్ నుంచి బయటకు గెంటేసినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. అక్కడి నుంచి ఓ మద్యం దుకాణంలో మద్యం సేవిస్తూ ఉండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
అక్రమ సంబంధమే హత్యకు కారణం
జిన్నారం(పటాన్చెరు) : ఈ నెల 3 సాదుల్లానగర్‌లో జరిగిన వ్యక్తి హత్యకు అక్రమ సంబంధమే కారణమని జిన్నారం సీఐ శ్యామల వెంకటేశ్ తెలిపారు. ఇందుకు కారణమైన 8 మదిని అదుపులోకి తీసకున్నట్లు ఆయన చెప్పారు. సీఐ కథనం ప్రకారం.. హత్నూర మండలంలోని సాదుల్లానగర్‌కు చెందిన ఎర్రోళ్ల ప్రభాకర్ భార్యకు అదే గ్రామంలో నివాసం ఉంటూ అతనికి వరసకు మేన బావ అయిన చెక్కల భాస్కర్‌కు గత కొంత కాలంగా అక్రమ సంబంధం ఉంది. ప్రభాకర్ భార్య, చెక్కల భాస్కర్‌కు వరసకు చెల్లి అవుతుంది. విషయం తెలుసుకున్న ప్రభాకర్ చాలా సార్లు భాస్కర్‌కు తన భార్యతో సంబంధం మానుకోవాలని సూచించాడు. అయినా అతనిలో మార్పు రాక పోవడంతో ప్రభాకర్ అనేక సార్లు భాస్కర్‌ను చంపుతానని హెచ్చరించాడు. ఎలాగైన భాస్కర్‌ను చంపాలని నిర్ణయించుకున్న ప్రభాకర్ వరసకు తమ్ముళ్లయిన సాదుల్లానగర్‌కు చెందిన ఎర్రోళ్ల రమేశ్, ఎర్రోళ్ల వీరేశం, నస్తిపూర్లో నివాసం ఉంటున్న బోయిన శ్రీధర్‌లతో పాటు జిన్నారం మండలంలోని మంగంపేట గ్రామంలో నివాసం ఉంటూ వరసకు బావ అయిన మాచబోయిన శ్రీకాంత్‌లతో కలిసి భాస్కర్‌ను చంపేందుకు నిర్ణయించుకున్నాడు. భాస్కర్ చాలా బలవంతుడని భావించిన ప్రభాకర్ వడ్డేపల్లి గ్రామానికి చెందిన గతంలో కొన్ని కేసులు ఉండి, ప్రసుతం నర్సాపూర్‌లో నివాసం ఉంటున్న హనుమంతు నరేష్గౌడ్ను కలిశాడు. డబ్బులు ఇస్తానని ఎలాగైన భాస్కర్‌ను చంపాలని అతడిని కోరాడు. దీంతో నరేష్‌గౌడ్ నర్సాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న తన స్నేహితులైన తొంట ప్రేమ్‌కుమార్, తొంట వినయ్‌కుమార్‌లతో కలిసి భాస్కర్‌ను చంపేందుకు సిద్దమయ్యారు. ఈనెల 3న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భాస్కర్ ఇంట్లో ఉన్న సమయంలో ప్రభాకర్‌తో పాటు మిగతా వారు అతడిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న భాస్కర్ కళ్లల్లో కారం చల్లి బయటకు తీసుకువచ్చారు. ప్రభాకర్‌తో పాటు మిగత తమ్ముళ్లు, స్నేహితులు భాస్కర్‌ను తీవ్రంగా కొట్టారు. వీరంతా అతడిని పట్టుకుని ఉండగా ప్రభాకర్ కత్తితో అతని చేతిని విరగొట్టి హత్యచేశాడు. ఈ సంఘటనలో అప్పట్లో సంచలనం రేపింది. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నాడు. గురువారం గుమ్మడిదల పోలీస్‌స్టేషన్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పందంగా కనిపించటంతో 8మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా భాస్కర్‌ను హత్య చేసింది వీరేనని తేలింది. దీంతో ఏ1గా ప్రభాకర్‌తో పాటు అతని తమ్ముళ్లు రమేశ్, వీరేశం, శ్రీధర్, శ్రీకాంత్, నర్సాపూర్‌లోని నరేష్‌గౌడ్, ప్రేమ్‌కుమార్, వినయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. త్వరగా కేసును ఛేదించేందుకు కృషి చేసిన పోలీసులను సీఐ శ్యామల వెంకటేశ్ అభినందించారు. -
డబ్బులిస్తావా.. వీడియో నీ భర్తకు పంపమంటావా..?
బంజారాహిల్స్ : వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమెకు తెలియకుండా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి జిల్లా, చౌటుప్పల్‌కు చెందిన వివాహిత, దిల్షుక్నగర్ పీ అండ్ టీ కాలనీలో భర్తతో కలిసి ఉంటోంది. అయిదు నెలల క్రితం ఇందిరానగర్‌కు చెందిన ఏవీ.సుబ్బారావు అనే వ్యక్తితో ఆమెకు ఫోన్లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సుబ్బారావు ఆమె వద్ద రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇవ్వాలని కోరగా, మరోసారి అడిగితే నగ్న వీడియోలు బయట పెడతానని బెదిరించాడు. అంతేగాక మరింత డబ్బు కావాలంటూ ఆమెను బ్లాక్మెయిల్ చేయసాగాడు. శుక్రవారం ఉదయం ఆమెకు ఫోన్ చేసి మరో రూ.5 లక్షలు ఇవ్వాలని లేని పక్షంలో వీడియోలను నీ భర్తకు పంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య ప్రియుడితో భర్తను హత్య చేయించిన సంఘటన నామక్కల్‌లో సంచలనం కలిగించింది. నామక్కల్ జిల్లా పల్లిపాళయం ఆండికాడు ప్రాంతానికి చెందిన ఆనందన్ అద్దకం పట్ర నడుపుతున్నాడు. ఇతని భార్య జయలక్ష్మి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అద్దకం పట్రలో ఆనందన్ తీవ్రగాయాలతో శవంగా పడి ఉన్నాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పల్లిపాళయం పోలీసులు విచారణ చేపట్టారు. ఈ లోపు కార్తికేయన్ (సెంట్రింగ్ కార్మికుడు) పల్లిపాళయం వీఏఓ గోవిందరాజ్ వద్ద ఆనందన్‌ను హత్య చేశానని లొంగిపోయాడు. దీంతో గోవింద్రాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కార్తికేయన్‌ను అరెస్టు చేశారు. పోలీసు విచారణలో కార్తికేయన్‌కు ఆనందన్ భార్య జయలక్ష్మికి వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలిసి ఆనందన్ భార్యను మందలించాడు. ఈ క్రమంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న ఆనందన్‌ను హత్య చేయడానికి జయలక్ష్మి కార్తికేయన్ పథకం వేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒంటరిగా నిద్రపోతున్న ఆనందన్ తలపై బండరాయి వేసి హత్య చేసినట్టు తెలిసింది. -
పోర్న్‌స్టార్‌తో డీల్ నిజమే: ట్రంప్
వాషింగ్టన్: పోర్న్‌స్టార్ స్టోర్మీ డేనియల్స్ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆమెతో జరిగిన డీల్ గురించి తనకూ తెలుసని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీటర్లో ఆయన వరుస ట్వీట్లు చేశారు. డేనియల్స్‌తో శారీరక సంబంధం కొనసాగించిన కారణంగా ట్రంప్ ఆమెకు నగదు చెల్లించారంటూ న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియాని వెల్లడించిన మరుసటి రోజే ట్రంప్ ఈ ట్వీట్లు చేయటం గమనార్హం. ‘ఇది ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యవహారం. నా లాయర్‌గా పనిచేసిన కోహెన్ ఆమెకు డబ్బు చెల్లించారు. వారిద్దరి మధ్య రహస్యంగా జరిగిన ఒప్పందం ఇది. ప్రైవేట్ ఒప్పందాలను బయటపెట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. సంపన్నుల మధ్య ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. అంతేగానీ ఆమె ఆరోపిస్తున్నట్లు ఎలాంటి లైంగిక సంబంధం లేదు.’ అంటూ ట్రంప్ ట్వీట్లు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఎక్కడా తన ప్రమేయం ఉన్నట్లు ఆయన పేర్కొనకపోవటం విశేషం. ట్రంప్ తనతో కొంత కాలంపాటు(2006లో) లైంగిక సంబంధం నడిపారని, ఆ విషయం బయటపెట్టొద్దంటూ తన లాయర్ ద్వారా ఒప్పందం చేసుకున్నారంటూ ప్రకటించి డేనియల్స్ ప్రకంపనలు రేపారు. ఈ ఆరోపణలపై ట్రంప్ స్పందిస్తూ.. అవి వాస్తవం కాదని కొట్టిపారేశారు. ఇక ఇప్పుడు ఒప్పందం మాట వాస్తవమేనని చెప్పటంతో వ్యవహారం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు లాయర్ కోహెన్ ద్వారా ట్రంప్ 1,30,000 డాలర్లకు ఈ డీల్ కుదిర్చారు. ఆపై కొన్ని నెలల తర్వాత ట్రంప్ ఆ నగదును కోహెన్‌కు ఇచ్చి వేశారు. అయితే అది ఆయన వ్యక్తిగత నగదో.. లేక ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చారో తనకు తెలిదని రుడీ గిలియానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోర్న్‌స్టార్ ఎన్నికలకు పనిచేసి ఉంటే అది ప్రచారం చేసినందుకు ఇచ్చిన మొత్తంగా భావించవచ్చే వాళ్లమని.. కానీ, అలాంటిది జరగలేదంటూ రుడీ గిలియాని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించినట్లు స్పష్టమౌతోంది. -
గాడి తప్పిన ఖాకీ
చేర్యాల(సిద్దిపేట) : భార్య ఉండగా.. మరో వివాహితతో సహజీవనం చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్‌కు దేహశుద్ధి జరిగిన సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాలలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మద్దూరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గూడెల్లి రమేశ్(పీసీ 3903) 2006లో మహబూబాబాద్ జిల్లా మరిపెడబంగ్లా మండలంలోని బావుజీగూడెంకు చెందిన మమతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. ఉద్యోగ రీత్యా మద్దూరులో పనిచేస్తున్న రమేశ్‌కు ఇదే మండలానికి చెందిన గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన మరో వివాహితతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈక్రమంలో ఇద్దరు కలిసి చేర్యాలలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. వీరికి ఒక కూతురు కూడా జన్మించింది. రమేశ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య.. భర్తను పలుమార్లు మందలించినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. ఈక్రమంలో శుక్రవారం తెల్లవారుజామున మమత తన తల్లితండ్రులతో కలిసి రమేశ్ అద్దెకుంటున్న ఇంటికి వచ్చింది. రమేశ్, అతనితో ఉంటున్న మహిళను పట్టుకున్న మమత తరపు బంధువులు వారిని చితకబాదారు. విషయం తెలుసుకున్న చేర్యాల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరువురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేసి నివేదికను సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్‌కు అందజేశారు. దీంతో రమేశ్‌ను సస్పెండ్ చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారు. -
పోలీసు వివాహేతర సంబంధం.. చితకబాదిన భార్య
-
వివాహేతర సంబంధం.. అడ్డంగా దొరికిన పోలీస్
సాక్షి, చేర్యాల: మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఓ కానిస్టేబుల్ ఆయన భార్యకు దొరికిపోయాడు. ఈ సంఘటన చేర్యాల మండలంలో చోటుచేసుకుంది. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలకేంద్రంలో కానిస్టేబుల్‌గా పని చేస్తోన్న గూడెళ్లి రమేష్, మమతలు 2006లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీరి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మర్పడగాబంగ్లా మండలం బావూజీగూడెం. 2011లో రమేశ్‌కు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అయితే కొంతకాలంగా భార్యా, పిల్లలకు దూరంగా ఉంటూ చేర్యాలలో మరో మహిళతో కలిసి ఉంటున్నాడు. ఈ విషయం తెలిసి మమత ఆయన ఉంటున్న ఇంటి దగ్గరకు వచ్చి ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. కోపంలో ఇరువురిపై దాడి చేసింది. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. -
వివాహేతర సంబంధం.. కుటుంబం నాశనం
వల్లూరు : వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. మొన్న భార్య, నిన్న భర్త ఆత్మహత్య చేసుకోవడంతో.. వారి ఏడాదిన్నర కూతురు అనాథలా మారింది. వివరాల్లోకి వెళితే.. వల్లూరు మండలంలోని పుల్లారెడ్డిపేట ఎస్సీ కాలనీకి చెందిన గొడ్డు సన్నీకుమార్, దుగ్గాయపల్లెకు చెందిన కల్పన ప్రేమించుకుని, నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఒకటిన్నరేళ్ల కూతురు ఉంది. కల్పన గర్భవతి. సన్నీకుమార్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో నిలదీసింది. దీంతో ఆమెను భర్త వేధించడం మొదలు పెట్టాడు. నమ్మిన భర్తే తనను మోసం చేయడంతో ఆమె శుక్రవారం ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకుంది. అప్పటి నుంచి సన్నీకుమార్ కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో ఆయన కడప సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కల్పన మృతదేహానికి శనివారం, సన్నీ కుమార్ మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో వారి కూతురుకు.. నాన్నమ్మే అన్నీ చూసుకోవాల్సి వస్తోంది. -
స్నేహితుడిని చంపి ఏడు ముక్కలు చేశాడు
సాక్షి, న్యూఢిల్లీ : వివాహేతర సంబంధం ఇద్దరి జీవితాలను కకావికలం చేసింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో ఓ వ్యక్తి.. తన ప్రాణ స్నేహితుడిని అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటనతో ఢిల్లీ పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. ఈ కేసును అధ్యయనం చేసిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు సైతం దీన్నొక అరుదైన కేసుగా వర్ణిస్తూ.. పలు సదస్సులో చర్చించటంతో జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం... మాంసం దుకాణంలో పని చేసే ఓ వ్యక్తి.. బార్లో పని చేసే వ్యక్తి... ఇద్దరు ప్రాణ స్నేహితులు. అయితే బార్లో పని చేసే వ్యక్తి తన స్నేహితుడి భార్యతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరి బాగోతం తెలుసుకున్న సదరు వ్యక్తి.. తన భార్యను పుట్టింటికి పంపించి స్నేహితుడిని పార్టీకి పిలిచాడు. మద్యం మత్తులో ఉన్న తన స్నేహితుడిని అతి కిరాతకంగా హతమార్చాడు. ఆపై శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టి.. తర్వాత బయటపడేయాలన్న ఆలోచన చేశాడు. అయితే మద్యం మత్తు దిగిన తర్వాత భయంతో నిందితుడు పారిపోయాడు. ఇక తన సోదరుడు కనిపించటం లేదంటూ మృతుడి సోదరుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా నిందితుడి ఇంటిని సోదాచేసిన పోలీసుల ఇంటి లోపలి పరిస్థితులను చూసి షాక్ తిన్నారు. ఫ్రిజ్ నుంచి శరీర భాగాలను ఎయిమ్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరిశీలనకు పంపారు. ఆ ఏడు శరీర భాగాలు అదృశ్యమైన వ్యక్తివేనని ఫోరెన్సిక్ అధికారులు దృవీకరించారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపం, కసి పెంచుకున్న ఆ వ్యక్తి.. మానసిక స్థితి కోల్పోయి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. శరీర అవయవాలను నరికిన విధానమే ఆ విషయాన్ని వెల్లడిస్తోందని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. -
వివాహేతర సంబంధం..వ్యక్తి దారుణ హత్య
కర్నూలు జిల్లా: గోస్పాడు మండలం యళ్లూరు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డె సంజీవ కర్ణ (35) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఒంటరిగా వెళ్తున్న సమయంలో కత్తులతో పొడిచి చంపారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండవచ్చు అని గోస్పాడు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బావను పెళ్లి చేసుకోవడం కోసం అక్కను చంపేసింది!
సాక్షి, చెన్నై(అన్నానగర్) : మానవత్వం మంట కలిసింది. వివాహేతర సంబంధం మోజులో ప్రియుడితో కలిసి అక్కను కడతేర్చిన యువతిని, ఆమె ప్రియుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు..తిరువణ్ణామలై జిల్లా సెంగనికి చెందిన భూపాలన్ (28), నదియ (24) దంపతులకు దక్షిత, సుదర్శన్‌లు సంతానం. భూపాలన్ తిరుప్పూర్ జిల్లా వీరపాండి సమీపం ఇడువమ్ పాళయంలో నివాసం ఉంటున్నాడు. బనియన్ సంస్థల్లో కార్మికులను పెట్టి జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో నదియ పిన్ని కుమార్తె రేఖ (22) ఉండేది. ఆమె అప్పుడప్పుడు నదియ ఇంటికి వచ్చి వెళుతుంటుంది. ఈ స్థితిలో గత 14న భూపాలన్, అతని తమ్ముళ్లు పనికి వెళ్లారు. పనికి వెళ్లిన భూపాలన్ తమ్ముడు మణివాలన్ రాత్రి ఇంటికి వచ్చాడు. అన్న కుమారుడు ఏడుస్తుండటంతో ఇంటి లోపలికి వెళ్లగా నదియా రక్తపు మడుగులో శవంగా పడి ఉండడం చూసి అన్నకు, వీరపాండి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఎస్ఐ మణిమోలి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేయగా నదియ ఐదు సవర్ల నగలు చోరీ అయినట్లు తెలిసింది. అనంతరం నదియ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరుప్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించి కేసు నమోదు చేశారు. విచారణలో అసలు విషయం వెలుగులోకి.. నదియ హత్యలో దోషులను పట్టుకోవడానికి జాయింట్ కమిషనర్ కయల్విలి పర్యవేక్షణలో ప్రత్యేకబృందం విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు ముందుగా నదియ ఇంటికి రేఖ వచ్చి హతురాలి కుమార్తెను తీసుకుని వెళ్లినట్లు తెలిసింది. అనంతరం ప్రత్యేక బృందం ఆమెని పట్టుకుని తీవ్ర విచారణ చేయగా ప్రియుడు నాగరాజ్‌తో కలిసి హత్య చేసినట్లుగా రేఖ ఒప్పుకోవడంతో వారిద్దరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తిరువణ్ణామలైకు చెందిన రేఖకు భర్త గజేంద్రన్‌ఖ, కుమారుడు ధనుష్కోటి, కుమార్తె నివేదా ఉన్నారు. అయితే సెంగమ్‌కు చెందిన నాగరాజ్‌తో వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో ఆమెను వదిలేసి వెళ్లడంతో పిల్లలను తీసుకుని రెండేళ్ల కిందట తిరుప్పూరుకి వచ్చింది. నాగరాజన్ కూడా ఆమెతో పాటే వచ్చాడు. అయితే అక్క భర్త భూపాలన్ ఆర్థికంగా బలంగా ఉండటంతో అతడిని పెళ్లి చేసుకువాలని తలచింది. నదియ ప్రాణాలతో ఉంటే భూపాల్‌ను పెళ్లి చేసుకోవడం కుదరదని ప్రియుడు నాగరాజ్‌తో కలిసి అక్కను కడతేర్చింది. అయితే నదియాను రేఖ హత్య చేయటానికి మరో కారణం ఉన్నదని ప్రత్యేకబృందం పోలీసులు తెలిపారు. రేఖకి నదియా భర్తతో సహా పలు మందితో సంబంధం ఉంది. నదియా భర్తతో రేఖ ఉన్న వీడియో మెమరీ కార్డు నదియాకి దొరికింది. దీనిని తిరిగి ఇవ్వమని రేఖ అడగటంతో నదియా ఇవ్వలేదు. దీని గురించి ఇద్దరికి గత కొన్ని రోజులుగా తగాదా ఏర్పడింది. భర్తతో ఉన్న వీడియోను చూపించి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తానని నదియా బెదిరించింది. దీంతో రేఖ తన ప్రియుడితో కలిసి నదియాని హత్య చేసిందని పోలీసులు తెలిపారు. -
వివాహేతరం సంబంధం.. చేతులు నరికేసిన భర్త
విజయనగరం జిల్లా: గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడలో దారుణం చోటుచేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కోపంలో ఓ వ్యక్తి, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి చేతులు నరికేశాడు. కొత్తగూడ గ్రామానికి చెందిన నరేష్, సుహాసిని(పేరు మార్చాం) భార్యభర్తలు. సుహాసినితో అదే గ్రామానికి చెందిన బిడ్డిక ధనుంజయ్ అనే వ్యక్తి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి మహిళ భర్త పథకం ప్రకారం మరో ముగ్గురు వ్యక్తుల సహాయంతో ధనుంజయ్‌ను గ్రామం బయటికి తీసుకువెళ్లారు. ఉన్నట్టుండి కత్తితో ధనుంజయ్ రెండు చేతులూ నరికేశారు. ఈ విషయం గమనించిన గ్రామస్తులు ధనుంజయ్‌ను దగ్గరిలోని భద్రగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడికి తరలించారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళపై దాడి.. వ్యక్తి అరెస్టు
గుమ్మిడిపూండి: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి భార్యపై కత్తితో దాడిచేసిన సంఘటన ఆరంబాక్కంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు..గుమ్మిడిపూండి సమీపంలోని ఆరంబాక్కంలోని చెల్లియమ్మన్ ఆలయ వీధికి చెందిన శంకర్ భార్య సత్యకు అదేప్రాంతానికి చెందిన మొహిద్దీన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై శంకర్ తన భార్యతో తరచూ గొడవలు పడుతుండటంతో ఈనెల 15న సత్య ఆదంబాక్కంలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మొహిద్దీన్ భార్య షకీలా శంకర్ ఇంటి మీదుగా పోతుండుగా, నీభర్త కారణంగా నా కుటుంబం నాశనమైందని ఆగ్రహంతో కత్తితో షకీలాపై దాడి చేశాడు. దాడిలో చేతులకు, తల, నోటిపై తీవ్ర గాయాలు కావడంతో చుట్టుపక్కల వాళ్లు అడ్డుకుని ఆరంబాక్కం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ చంద్రశేఖర్ వచ్చి గాయపడిన షకీలాను చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడిచేసిన శంకర్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
వెంటాడి.. వేటాడి
మేడిపెల్లి(వేములవాడ): వివాహేతరం సంబంధం యువకుడి ప్రాణం తీసింది. పలుమార్లు సదరు విషయమై మందలించినా వినడం లేదని ఆ మహిళ తండ్రి, సోదరుడు ఆ యువకుడిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం తొంబర్రావుపేటలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన రాగుల సురేశ్(31) రెవెన్యూశాఖలో ఉద్యోగిగా చేస్తున్నాడు. ఇతడికి భార్య శైలజ, కూతురు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ విషయమై సదరు మహిళ తండ్రి నల్ల గంగారెడ్డి సురేశ్‌ను పలుమార్లు హెచ్చరించాడు. అయినా పద్దతి మార్చుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. దారికాసి ఘాతుకం.. సురేశ్ తన మిత్రుడితో కలిసి ద్విచక్రవాహనంపై బుధవారం విధులకు వెళ్తున్నాడు. అదే సమయంలో గ్రామశివారులో కాపుకాసిన సదరు మహిళ తండ్రి నల్ల గంగారెడ్డి, సోదరుడు సంతోష్‌రెడ్డి సురేశ్‌పై దాడి చేశారు. మొదట కర్రలతో దాడిచేయగా స్పృహ కోల్పోయాడు. అనంతరం కొడవలితో మెడ, కడుపులో పొడిచి పారిపోయారు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మెట్‌పెల్లి డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, కోరుట్ల సీఐ సతీష్‌చందర్‌రావు, ఎస్సై కిరణ్‌కుమార్ ఘటనాస్థలంలో విచారించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాగా నిందితులిద్దరూ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. దళిత సంఘాల ఆందోళన అగ్రవర్ణాల చేతిలో హత్యకుగురైన సురేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండు చేశారు. సురేశ్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మృతుడి భార్యకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. మేడిపల్లిలో ఆందోళన చేశారు. -
వివాహేతర జంట ఆత్మహత్యాయత్నం
దమ్మపేట: ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. మండలంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన సవలం ప్రసాద్‌కు, ఏపీలోని బుట్టాయిగూడెం మండలం తోటపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంతంతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆలస్యంగా సంతానం కలిగింది. ఇద్దరు కుమారుల్లో ఒకరు మృతిచెందారు. తరచూ తోటపల్లి వెళుతుండే ప్రసాద్‌కు అక్కడ ఓ వ్యక్తితో, అతని భార్యతో పరిచయం ఏర్పడింది. ఆమెతో ప్రసాద్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. తోటపల్లి సమీపంలో జాతర ఉత్సవాలకు వెళ్లిన ప్రసాద్, అక్కడి నుంచి తన బంధువులు ఉంటున్న రెడ్యాలపాడు కొమ్ముగూడెం గ్రామానికి విజయశాంతితో కలిసి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీకాంతం, తన భర్త ప్రసాద్‌ను మందలించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడి నుంచి ప్రసాద్ వెళ్లిపోయాడు. విజయశాంతిని కొమ్ముగూడెం గ్రామానికి ప్రసాద్ తీసుకెళ్లాడని తెలుసుకున్న వెంటనే తోటపల్లి నుంచి విజయశాంతి తల్లి, భర్త, బంధువులు కలిసి కొమ్ముగూడెం వెళ్లారు. ఈ సమాచారమందుకున్న ప్రసాద్, విజయశాంతి.. బుధవారం మధ్యాహ్నం పురుగు మందు తాగారు. వారిని 108 సిబ్బంది దమ్మపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ జలకం ప్రవీణ్ తెలిపారు. -
సొంత తమ్ముడితోనే వివాహేతర సంబంధం
కాకినాడ రూరల్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే భార్య చంపిన సంఘటన శనివారం కాకినాడలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఐశ్వర్యా కాలనీలో నివాసముంటున్న ట్యాక్సీ డ్రైవర్ రాయుడు హరిప్రసాద్, భార్య హిమచందుకు ముగ్గురు ఆడ పిల్లలు. హిమచందు తండ్రి రెండో భార్య కొడుకు (సొంత తమ్ముడు) భానుప్రసాద్‌తో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుం ది. ఈ విషయం హరిప్రసాద్‌కు తెలిసి అనేక సార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పూలేదు. దీంతో భా ర్యా భర్తలు నిత్యం గొడవలు పడుతుండేవారు. ఈ నేపథ్యంలో హరిప్రసాద్‌ను అడ్డు తొలగించుకోవాలని హిమచందు, భానుప్రసాద్ భావించారు. హత్య చేసేందుకు పథకం రూపొందించారు. శుక్రవారం రాత్రి హరిప్రసాద్ తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉండడంతో హరిప్రసాద్‌ను కొట్టి, ముఖంపై తలగడ పెట్టి నొక్కి చంపేశారు. భానుప్రసాద్ తన స్నేహితులతో కలిసి చనిపోయిన హరిప్రసాద్‌ను మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లి రమణయ్యపేట కాలువ పక్కన ఉన్న డంపింగ్ యార్డులో టైర్లు, చెత్త వేసి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఉదయం హరిప్రసాద్ కోసం తండ్రి ఇంటికి వెళ్లగా హిమచందు బయటకు వెళ్లారని చెప్పింది. ఎంతకూ కన్పించకపోవడంతో హరిప్రసాద్ తమ్ముడు రాయుడు శ్రీను శనివారం ఉదయం సర్పవరం పో లీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈలోగా సగం కాలి ఉన్న మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సగం కాలిన మృతదేహం రాయుడు హరిప్రసాద్‌దేనని గుర్తించారు. ఈ నేపథ్యంలో హరిప్రసాద్ భార్య హిమచందును, భానుప్రసాద్‌ను అతని తల్లిని, హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రవివర్మ వివరించారు. సర్పవరం పోలీసులు కేసు నమోదు చేయగా త్రీటౌన్ సీఐ దుర్గారావును దర్యాప్తునకు ఆదేశించినట్లు డీఎస్పీ రవివర్మ తెలిపారు. హరిప్రసాద్‌ను తగులబెట్టిన స్థలాన్ని డీఎస్పీ రవివర్మతో పాటు సర్పవరం సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై స్వామినాయుడు పరిశీలించారు. -
సిరంజీతో కళ్లలో యాసిడ్ కొట్టి...
పట్నా : యజమాని భార్యతో వివాహేతర సంబంధం నడిపిన ఓ వ్యక్తికి స్థానిక ప్రజలు దారుణమైన శిక్షను విధించారు. వివాహితతో పారిపోయిన ఆ వ్యక్తిని పట్టుకుని కళ్లలో యాసిడ్ పోశారు. దీంతో అతను కంటి చూపును కోల్పోయాడు. బిహార్ పిప్రా చౌక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... సమస్తిపూర్ జిల్లా బరౌనీ గ్రామానికి చెందిన వ్యక్తి(30) ఓ రైతు దగ్గర ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతను యజమాని భార్యతోనే వివాహేతర సంబంధం నడిపాడు. ఫిబ్రవరి 6న ఆమెతోపాటు కొంత డబ్బుతో ఉడాయించాడు. దీనిపై ఆ యాజమాని తెగ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కిడ్నాప్, దొంగతనం కేసులు నమోదు అయ్యాయి. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ ఫిబ్రవరి 16న ఆమె స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి భర్త దగ్గరకు వెళ్తానని చెప్పింది. దీంతో పోలీసులు అనుమానంతో అసలు విషయం ఆరా తీశారు. అదే రోజు ఉదయం పిప్రా చౌక్ వద్ద ఓ హోటల్ వీరిని పట్టుకున్న గ్రామస్థులు దాడికి తెగబడ్డారు. ఆపై సిరంజీతో ఆ యువకుడి కళ్లలో యాసిడ్ కొట్టారు. దాడి అనంతరం హనుమాన్ చౌక్‌లో అతన్ని పడేసి వెళ్లిపోగా.. మహిళను బెదిరించటంతో ఆమె స్టేషన్‌కు వచ్చి భర్త దగ్గరికి వెళ్తానంటూ చెప్పింది. ఇక బాధితుణ్ణి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి ఆస్పత్రిలో చేర్పించాడు. బాధితుడి స్టేట్మెంట్ ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెగ్రా పోలీసులు వెల్లడించారు. -
‘ట్రంప్ నాతో అఫైర్ నడిపారు’
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో లైంగిక సంబంధం ఉన్నట్లు మరో మహిళ మీడియా ముందుకు వచ్చింది. ప్లే బాయ్ మోడల్(మాజీ) అయిన కరెన్ మెక్‌డౌగల్(46).. ట్రంప్ తనతో శారీరక సంబంధం నెరిపినట్లు ఆరోపిస్తోంది. 2006లో ట్రంప్ తనతో అఫైర్ కొనసాగించారని.. ఆదే సమయంలో ట్రంప్ భార్య మెలానియా కొడుక్కి జన్మనిచ్చిందని మెక్‌డౌగల్ తెలిపింది. తొమ్మిది నెలలపాటు వారి సంబంధం కొనసాగిందన్న ఆమె.. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాలను బయటకు పొక్కనీయకుండా ట్రంప్ డబ్బుతో ఒప్పందం చేసుకున్నాడంటూ పేర్కొంది. మెక్‌డౌగల్ ఇంటర్వ్యూను న్యూ యార్కర్ అనే పత్రిక తాజాగా ప్రచురించటంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. లక్షా 50,000 డాలర్లతో ఈ ఒప్పందం జరిగిందని ఆ కథనం వివరించింది. అయితే గతంలోనే ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ఈ వార్తపై స్పందించేందుకు వైట్ హౌజ్ నిరాకరించింది. ట్రంప్ తో మాజీ పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫార్డ్(స్టార్మీ డేనియల్స్) అఫైర్.. అది బయటకు పొక్కకుండా అధ్యక్ష ఎన్నికల సమయంలో లక్షా 30 వేల డాలర్లతో ఒప్పందం.. కథనాలు వెలువడటం, తాజాగా అది నిజమేనని ట్రంప్ పర్సనల్ లాయర్ మైఖేల్ కోహెన్ ధృవీకరించటం తెలిసిందే. -
రైలు కిందపడి కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: ఫేస్బుక్ ద్వారా ఓ వివాహిత పరిచయం కానిస్టేబుల్ ఆత్మహత్యకు దారితీసింది. ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు, రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని ఆమె భర్త ఫిర్యాదు మేరకు శంషాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఉన్నతాధికారులు బదిలీ వేటు వేయడంతో మస్తాపానికి గురైన కానిస్టేబుల్ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను ఎస్ఐ మీడియా కు వెల్లడించారు. మౌలాలి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. మృతదేహం వద్ద లభించిన గుర్తింపు కార్డులు, సెల్‌ఫోన్ ఆధారంగా లాలాపేటకు చెందిన పి.సందీప్‌కుమార్ (24)గా గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మనస్తాపానికి గురై...: సందీప్ మొఘల్‌పుర పీఎస్‌లో కానిస్టేబుల్. కొంత కాలం క్రితం ఒక వివాహితతో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీయడంతోపాటు తన భార్యను సందీప్ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ఆమె భర్త నాగార్జున శంషాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉన్నతాధికారులు సందీప్‌ను హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సందీప్ తండ్రి ఆటోడ్రైవర్. చేతికందిన ఒక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
ప్రేమ జంట ఆత్మహత్య
వేలూరు: భర్త, కుమార్తెను వదిలి ఇంటి నుంచి వెళ్లిన ఓ మహిళ, ఆమె ప్రియుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వేలూరు జిల్లా తిరుపత్తూరు తాలుకా ముత్తంబట్టిలో జరిగింది. వివరాలు.. వేలూరు జిల్లా తిరుపత్తూరు తాలుకా ముత్తం బట్టి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బాబుకి నిత్య(20)తో మూడేళ్లక్రితం వివాహమైంది. వీరికి కుమార్తె జన్మించింది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన రాజంద్రన్ కుమారుడు హేమంత్ అలియాస్ ఎళిల్(21)కు నిత్యతో అక్రమ సంబంధం ఏర్పడింది. ప్రభు ఇంట్లోలేని సమయంలో నిత్య ఎళిల్‌తో ఉల్లాసంగా గడిపినట్లు తెలుస్తుంది. అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న ప్రభు నిత్యను మందలించినప్పటికీ వారి అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉండేది. దీంతో గత రెండు నెలల క్రితం నిత్య ఎళిల్‌తో కలిసి గ్రామం వదిలి వెళ్లి పోయింది. అనంతరం రెండు నెలలుగా వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. వారం క్రితం నిత్య భర్తకు ఫోన్ చేసి తాను ఇంటికి వచ్చేస్తానని తెలిపింది. ఇందుకు భర్త ప్రభు ‘నీవు వచ్చి పాపను తీసుకొని ఎళిల్తోనే జీవించేలా ఉంటే..’ గ్రామానికి రావద్దని స్పష్టం చేశాడు. ఆదివారం రాత్రి గ్రామానికి బైకుపై వచ్చిన నిత్య, ఆమె ప్రియుడు ఎళిల్ తిరువణ్ణామలై రోడ్డు వద్ద విషం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు గమనించి తిరుపత్తూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
వివాహేతర సంబంధం.. బలవన్మరణం
సాక్షి, కడప(పెనగలూరు) : వాళ్లు వావి వరుసలు మరిచి వివాహేతర సంబంధం కొనసాగించారు. అదికాస్తా శ్రుతి మించి ఇద్దరూ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. విషయం పోలీసు స్టేషన్ వరకు వెళ్లడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. చివరకు వారి పిల్లలు ఒకరు తల్లిని.. మరొకరు తండ్రిని కోల్పోయి అనాథలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. నారాయణ నెల్లూరుకు చెందిన లక్ష్మిదేవి(30)కి 13 ఏళ్ల క్రితం కొత్తసింగనమల గ్రామానికి చెందిన నరసింహులు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం. బతుకు దెరువుకోసం లక్ష్మిదేవి భర్త గల్ఫ్‌కు వెళ్లడంతో అదే గ్రామంలో ఉన్న వరుసకు చిన్నాన్న అయిన కడప శ్రీనివాసులు(41)తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. కడప శ్రీనివాసులుకు కూడా వివాహమై ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో నాలుగురోజుల క్రితం వీరిద్దరూ ఇంటినుంచి వెళ్లిపోయారు. లక్ష్మిదేవి సంబంధీకులు కేసు పెట్టడంతో ఆదివారం తిరిగి ఇంటికివచ్చారు. ఆ తర్వాత తాము తప్పు చేశామనే మనస్తాపంతో ఇద్దరూ మరణించాలని నిర్ణయించుకుని కూల్‌డ్రింక్స్‌లో విషపు గుళికలు వేసుకుని తాగారు. వీరిని వెంటనే రాజంపేటకు తరలించగా మార్గమధ్యంలో లక్ష్మిదేవి మృతిచెందగా మరికొద్ది సేపటికి శ్రీనివాసులు కూడా మృతి చెందాడు. నారాయణనెల్లూరుకు చెందిన లక్ష్మిదేవి తండ్రి గండికోట సుబ్బనరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. ఇద్దరి మృతదేహాలను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. -
ఆ పనికి అడ్డు తగిలిందని.. ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్
సాక్షి, శ్రీకాకుళం : తన అక్రమ సంబంధానికి అడ్డుతగిలిందనే నెపంతో ఓ కామాంధుడు ఓ మహిళ మనుమరాలును కిడ్నాప్ చేసిన సంఘటన శ్రీకాకుళంలో కలకలం సృష్టించింది. తనతో ఆమెను పంపించకపోతే ఆ పసిప్రాణాన్ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామంలో ఏడేళ్ల బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. లంకపల్లి సురేష్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్దికాలంపాటు గుట్టుగా సాగింది. వీరిద్దరి మధ్య దండి పార్వతి అనే మహిళ మద్యవర్తిత్వం వహించింది. కొద్ది రోజుల తర్వాత తప్పు తెలుసుకున్న పార్వతి, సురేష్ చేసే పని తప్పంటూ వారించింది. దీంతో పార్వతికి, సురేష్‌కు వివాదాలు వచ్చాయి. సదరు మహిళ సైతం సురేష్‌కు దూరంగా ఉంటోంది. ఈ విషయమై ఇరువురి మధ్య కొంత కాలంగా గొడవలు వస్తున్నాయి. దీంతో పార్వతిపై కోపం పెంచుకున్న సురేష్ పార్వతి మనుమరావలు ఏడేళ్ల దండి శరణ్యను కిడ్నాప్ చేశాడు. మహిళను తనతో పంపిస్తేనే బాలికను విడిచపెడతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో పార్వతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
అక్రమ సంబంధానికి అడ్డొస్తోందని హత్య
-
అక్రమ సంబంధానికి అడ్డొస్తోందని హత్య
కమలాపూర్(హుజూరాబాద్): అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని బాలికను సవతి తల్లే హత్య చేసిన సంఘటన కమలాపూర్ మండలం గూడూరులో జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో పిల్లల కావేరి(16) హత్య కేసులో సవతి తల్లి పిల్లల హారిక(28), గూడూరుకు చెందిన పాక ఐలుమల్లమ్మ (65)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎల్కతుర్తి సీఐ టి.రవికుమార్ వెల్లడించారు. గూడూరుకు చెందిన పిల్లల కరుణాకర్, శ్రీదేవి పదిహేడేళ్ల క్రితం ప్రేమ వివా హం చేసుకోగా వీరికి ఇద్దరు కూతుర్లు కావేరి, దీపిక ఉన్నారు. 2009లో శ్రీదేవి మృతిచెందగా తనకున్న ఆస్తిని కరుణాకర్ ఇద్దరు కూతుర్ల పేరుపై రాశాడు. ఆ తర్వాత 2011లో కరుణాకర్ హారికను రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఒక బాబు జన్మించాడు. అప్పట్నుంచి హారిక కావేరిని వేధింపులకు గురి చేస్తుండగా పలుమార్లు పంచాయతీలు జరిగాయి. ఈ క్రమంలోనే కరుణాకర్ ఈ నెల 2న శబరిమలైకి వెళ్లాడు. అదే రోజు హారిక గూడూరుకు చెందిన ఒకరితో, ఈ నెల 5న మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతుండగా కావేరి చూసింది. ఈ విషయాన్ని నాన్న రాగానే చెప్తానంది. అప్పటికే ఆస్తిపై కన్నేసిన హారిక ఇటు ఆస్తి కోసం, అటు వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని భావించి కావేరి హత్యకు పాక ఐలుమల్లమ్మతో కలిసి ప్రణాళిక రచించింది. ఈ నెల 5న రాత్రి కావేరి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఐలుమల్లమ్మ కావేరి కాళ్లు పట్టుకోగా హారిక కావేరి మెడకు చున్నీ చుట్టి హతమార్చింది. కావేరి చనిపోయిందని నిర్ధారించుకుని ఆ మరునాడు ఉదయమే లేచి తన భర్త కరుణాకర్ శబరిమల నుంచి ఇంటికి వస్తున్నాడనే సాకుతో ఇళ్లంతా కడిగి శుభ్రం చేసింది. ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న కావేరి రాత్రి పడుకుని తెల్లారేసరికి చనిపోయిందని ప్రచారం చేసింది. విషయం కావేరి అమ్మమ్మకు తెలిసి అక్కడకు చేరుకుంది. కావేరి మెడకు కుడివైపు, ముందు వైపున కమిలిన గాయాలున్నాయని, కరుణాకర్ ఇంట్లో లేని సమయంలో సవతి తల్లి హారికనే చంపి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ కావేరి అమ్మమ్మ భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా కేసు పోలీసులు నమోదు చేశారు. ఆ తర్వాత కావేరిని గొంతు నులిమి హత్య చేశారని పోస్టుమార్టం నివేదిక రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐలుమల్లమ్మ సాయంతో సవతి తల్లి హారిక హత్య చేసిందని నిర్ధారణకొచ్చారు. నిందితుల కోసం వెతుకుతున్న క్రమంలో కమలాపూర్‌లో నివాసం ఉంటున్న గూడూరు సర్పంచ్ భర్త సాంబయ్య ఇంట్లో హారిక, ఐలుమల్లమ్మ ఉన్నారన్న సమాచారంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కావేరిని హత్య చేసింది తామేనని హారిక, ఐలుమల్లమ్మ అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. ఈ సమావేశంలో ఎస్సైలు నాగబాబు, సందీప్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మెసేజ్‌లో పెళ్లి ప్రపోజల్..
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం కేసులో అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ సునీతారెడ్డి, కల్వకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ మంగళ వారం ఆదేశాలు వెలువడ్డాయి. సీఐ మల్లికార్జున్ రెడ్డిని వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేయగా, ఏఎస్పీ సునీతారెడ్డిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారని పోలీస్ శాఖ తెలిపింది. వీరిద్దరి వ్యవహారంపై సునీతారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి మంగళవారం డీజీపీని కలసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆయన తెలిపారు. విచారణ ముమ్మరం చేసిన పోలీసులు మరోవైపు ఇరువురి అక్రమ సంబంధం విషయంలో కేపీహెచ్‌బీ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా ఏఎస్పీ భర్త సురేందర్‌రెడ్డి, తల్లి ప్రమీలమ్మ, పెద్దమ్మ సునంద, సురేందర్‌రెడ్డి స్నేహితుడు సురేష్ కుమార్‌లను పోలీసులు విచారించి ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన వివరాలు నమోదు చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజిలు, ఇరువురి ఫోన్ కాల్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. మల్లికార్జున్‌రెడ్డి తమ కుటుంబంలో నిప్పులు పోశాడని, ఏవేవో ఆశలు చూపి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాడని ఏఎస్పీ తల్లి, పెద్దమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురి కుటుంబాలు రోడ్డున పడొద్దని తాము ఎంతగానో ఓపికపట్టి వివాదం లేకుండా సర్దిచెప్పినా వినిపించుకోలేదని పోలీసులకు తెలిపారు. నా కుటుంబాన్ని నాశనం చేయవద్దని అభ్యర్థించినా సీఐ తీరు మార్చుకోకపోగా తమనే చంపుతానంటూ హెచ్చరించడంతో బట్టబయలు చేయాల్సి వచ్చిందని భర్త సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 2016లోనే దొరికినా తీరు మారలేదు ఏఎస్పీకి, సీఐకి నడుమ సాగుతున్న అక్రమ సంబంధం విషయాన్ని 2016 జూలైలోనే భర్త సురేందర్‌రెడ్డి, కుటుంబసభ్యులు కనిపెట్టి వారిని ప్రశ్నించారు. తమ మధ్య ఎలాంటి సంబంధాల్లేవని బుకాయించడంతో పాటు అనుమానించవద్దని ఇరువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తతో పాటు కుటుంబసభ్యులు గట్టిగా నిలదీయడంతో మరోమారు ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి ఇరువురు క్షమాపణ చెప్పారు. ఇకపై ఎలాంటి సంబంధాలను కలిగి ఉండనని చెప్పడంతో భార్య మాటలను నమ్మిన సురేందర్‌రెడ్డి కాపురం సాగించాడు. ఇటువంటి చర్యలను ఉపేక్షించబోం: నాయిని పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన ఏఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో పోలీస్ శాఖలో ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎంతటి స్థాయి అధికారులనైనా ఉపేక్షించ బోమని ఆయన స్పష్టం చేశారు. మెసేజ్‌లో పెళ్లి ప్రపోజల్.. కొన్ని రోజుల తర్వాత మల్లికార్జున్‌రెడ్డి నుంచి సునీత ఫోన్‌కు మెసేజ్‌లు రావడం, తనకంటే ఉన్నతస్థాయిలో ఉన్న అధికారిణి పట్ల గౌరవం లేకుండా ఏక వాక్యంగా మెసేజ్‌లు పంపడం చూసిన సురేందర్‌రెడ్డికి అనుమానం మొదలైంది. మల్లికార్జున్‌రెడ్డి ఏఎస్పీ సెల్‌కు పంపిన మెసేజ్‌లో వివాహం చేసుకుందామని ప్రతిపాదించడం చూసిన ఆయన ఇరువురు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారని నిర్ధారణకు వచ్చాడు. ఈ క్రమంలో మల్లికార్జున్‌రెడ్డి తనను చంపేస్తానని బెదిరించడంతో మనోవేదనకు గురైన ఆయన భార్య తరఫు కుటుంబీకుల మద్దతు తీసుకుని ఇరువురి బండారం బట్టబయలు చేయాలని నిర్ణయించు కున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి ఇరువురు తన నివాసానికి 11.30 సమయంలో వచ్చి సుమారు రెండున్నర గంటల పాటు కలసి ఉన్న విషయాన్ని బట్టబయలు చేశాడు. -
మహిళా ఏఎస్పీ, ఇన్స్పెక్టర్ మధ్య వివాహేతర సంబంధం
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలో (ఏసీబీ) ఏఎస్పీగా పని చేస్తున్న ఓ మహిళా అధికారి, కల్వకుర్తి సీఐగా పని చేస్తున్న మల్లికార్జున్‌రెడ్డి మధ్య కొన్నాళ్ళుగా సాగుతున్న వివాహేతర సంబంధం ఆదివారం అర్ధరాత్రి బట్టబయలైంది. ఏఎస్పీ భర్త, అతని బంధువులు ఇన్స్పెక్టర్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారిణి భర్త సురేందర్‌రెడ్డి ఫిర్యా దు మేరకు ఇన్స్పెక్టర్పై కేపీహెచ్‌బీ ఠాణాలో సోమ వారం కేసు నమోదైంది.వివరాల్లోకి వెళితే.. మల్లికార్జున్‌రెడ్డి సైతం గతంలో ఏసీబీలో పని చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన, ‘ఓటుకు కోట్లు’ కేసును దర్యాప్తు చేసిన బృందంలో అప్పట్లో డీఎస్పీ çహోదాలో ఉన్న మహిళా అధికారిణి తో అతను కలిసి పనిచేశాడు. అలా వీరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం అమెరికాలో ఉంటున్న సదరు అధికారిణి భర్తకు తెలియడంతో అతను, ఆయన కుటుంబీకులు ఏడాది క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఇరువురినీ మందలించడంతో పాటు మల్లికార్జున్‌రెడ్డిని ఏసీబీ నుంచి తప్పిస్తూ.. పోలీసు విభాగానికి పంపారు. ప్రస్తుతం అతడు కల్వకుర్తి సీఐగా పని చేస్తున్నారు. అయితే కొన్నాళ్ళుగా మళ్లీ మహిళా అధికారి, మల్లిఖార్జున్ రెడ్డి తమ పరిచయం కొనసాగిస్తున్నారు. అతను తరచూ కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అధికారిణి ఇంటికి రాకపోకల సాగిస్తున్నాడు. ఎక్కువగా రాత్రి వేళల్లో ఈ వ్యవహారం సాగుతుండటాన్ని గుర్తించిన సురేందర్‌రెడ్డి కుటుంబీకులు విషయాన్ని అమెరికాలో ఉన్న అతడికి సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం రహస్యంగా అమెరికా నుంచి వచ్చిన సురేందర్‌రెడ్డి భార్య వ్యవహారం బట్టబయలు చేసేందుకు కాపుకాశాడు. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత మల్లికార్జున్‌రెడ్డి సదరు అధికారిణి ఇంటికి వచ్చినట్లు గుర్తించిన ఆయన తన తల్లి, బంధువులతో కలిసి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సురేందర్‌రెడ్డి బంధువులు మల్లికార్జున్‌రెడ్డిని చెప్పుతో కొడుతూ అక్కడి నుంచి తరిమారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున్‌రెడ్డి వారిని తీవ్రస్థాయిలో బెదిరించాడు. ఈ మొత్తం వ్యవహారం మీడియా కెమెరాలకు చిక్కింది. తన భార్యను మల్లిఖార్జున్ రెడ్డి ట్రాప్ చేశాడని, దాదాపు రెండేళ్లుగా వారిద్దరి మధ్య సంబంధం కొనసాగుతుందని సురేందర్‌రెడ్డి ఆరోపించాడు. తన భార్య వ్యవహారం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపాడు. సోమవారం మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వ్యవహారశైలిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. శాఖాపరమైన విచారణ అనంతరం వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఏఎస్పీతో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని చెప్పిన మల్లికార్జున్‌రెడ్డి... ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, మంజూరైన తర్వాత వివాహం చేసుకోనున్నామని మీడియాతో పేర్కొన్నాడు ఆదివారం రాత్రి ఆమెను దించేందుకే వారింటికి వెళ్ళానని చెబుతుండగా, ఈ వాదనను సురేందర్‌రెడ్డి ఖండిస్తున్నాడు. సోమవారం మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్‌ను కలిసి తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన మల్లికార్జున్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు.పోలీసులు మల్లికార్జున్‌రెడ్డిపై ఐపీసీలోని 447, 497, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నాగర్‌కర్నూల్ ఎస్పీతో పాటు ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నారు. -
వివాహేతర సంబంధం గుట్టు రట్టు చేసిందని..
-
అడ్డు తొలగించుకున్నారు!
సాక్షి, శెట్టూరు (కళ్యాణదుర్గం): యువకుడి హత్య గుట్టు రట్టయ్యింది. మిస్సింగ్ కేసు నమోదుతో విచారణ చేపట్టిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. ఏడాది కిందట లేపాక్షి సమీపంలో జరిగిన హత్య కేసు వివరాలను కళ్యాణదుర్గం డీఎస్పీ టీఎస్ వెంకటరమణ, సీఐ శివప్రసాద్, పట్టణ ఎస్ఐ శంకర్‌రెడ్డిలు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. నిందితులైన భార్య, ఆమె ప్రియుడుతోపాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. భర్త అడ్డు తొలగించుకున్నదిలా.. తమ వివాహేతర సంబంధం సాఫీగా సాగిపోవాలంటే నందిని భర్త మంజునాథ్‌ను అడ్డు తొలగించుకోవాలని బొల్లు విశ్వేశ్వరరెడ్డి కుట్రపన్నాడు. ఇందు కోసం యలగలవంక గ్రామానికి చెందిన స్నేహితుడు మాదిగ హనుమంతరాయుడుతో కలిసి 2017 జనవరి మూడో తేదీన మంజునాథ్‌కు హిందూపురంలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తమ బైకులో ఎక్కించుకెళ్లారు. మంజునాథ్‌కు మార్గం మధ్యలో మద్యం తాపించారు. లేపాక్షి దాటిన తర్వాత కనుమగుడి దగ్గర ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లారు. అక్కడ మరోమారు మద్యం పూటుగా తాపారు. మత్తులో ఉన్న మంజునాథ్ కాళ్లను హనుమంతరాయుడు కాళ్లు గట్టిగా పట్టుకోగా.. విశ్వేశ్వరరెడ్డి అతని గొంతు కోసి చంపేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని కిరోసిన్ పోసి నిప్పంటించారు. కాలిన అనంతరం శవాన్ని అక్కడే ఓ గుంతలో పూడ్చి వచ్చేశారు. వెలుగు చూసిన హత్య కేసు బోయ దాసరి మంజునాథ్ కనిపించడం లేదంటూ తమ్ముడు దాసరి అనిల్ ఈ నెల ఆరో తేదిన కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న ఎస్ఐ శంకర్‌రెడ్డి.. మంజునాథ్ భార్య నందినిని పలు కోణాల్లో విచారించారు. భర్త కొన్ని నెలలుగా కనిపించపోయినా తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఆమె స్వగ్రామం సింగేపల్లికి వెళ్లడంపై పోలీసులకు అనుమానం కలిగింది. లోతుగా దర్యాప్తు చేయడంతో యలగలవంక గ్రామానికి చెందిన విశ్వేశ్వరరెడ్డితో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. వీఆర్వో ఎదుట లొంగిపోయిన నిందితులు పోలీసుల విచారణతో హత్య విషయం తెలుస్తుందని భయపడిన నిందితులు ఇటీవల ఇళ్ల నుంచి పారిపోయారు. ఎట్టకేలకు గురువారం ఉదయం నందిని, విశ్వేశ్వరరెడ్డి, హనుమంతరెడ్డిలు మానిరేవు వీఆర్వో ఇంటి వద్ద లొంగిపోయారు. నిందితులు వాడిన కత్తి, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సంఘటన స్థలంలో లభ్యమైన హతుడి పుర్రెను డీఎన్ఏ పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య నేపథ్యం.. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన బోయ దాసరి మంజునాథ్(32)కు బొమ్మనహళ్ మండలం సింగేపల్లికి చెందిన దాసరి నందినితో వివాహమైంది. వీరిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కూలి పనులకెళ్లే సమయంలో బెళుగుప్ప మండలం యలగలవంక గ్రామానికి చెందిన బొల్లు విశ్వేశ్వరరెడ్డితో నందినికి ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. -
భార్యకు దెయ్యం పట్టిందని.. మాంత్రికుడితో భర్త.!
సాక్షి, హైదరాబాద్ : అక్రమ సంబందాన్ని రట్టుచేసిన ఓ భార్య పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించగా భార్యను బాగా చూసుకుంటానని చెప్పాడు ఓ షాడిస్టు భర్త. కొంతకాలానికి తన భార్యకు ఆరోగ్యం బాగుండడం లేదని, దెయ్యం పట్టిందని చెప్పి మాంత్రికుడితో పూజలు చేయించి ఆమెకు ఎక్కడపడితే అక్కడ వాతలు, గాయాలు పెట్టించాడు. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు, భాదితురాలి కథనం ప్రకారం శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేట గ్రామానికి చెందిన కంచుగంట్ల నాగేశ్‌తో గత 10 సంవత్సరాల క్రితం కంచుగంట్ల మంగ(26)కు వివాహనం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కాగా గత 5 సంవత్సరాలుగా నాగేశ్ శ్రీలత అనే మహిళతో అక్రమ సంబందం పెట్టుకుని భార్య మంగను శారీరకంగా, మానసికంగా వేదించడం మొదటు పెట్టాడు. దీంతో భర్త అక్రమ సంబందాన్ని తెలుసుకుని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించింది. పంచాయతీ పెద్దలు నాగేశ్‌ను మందలించడంతో భార్య మంగను బాగా చూసుకుంటానని ఒప్పుకున్నాడు. భార్య పంచాయతీ పెట్టిదన్న పగతో ఉన్న నాగేశ్ గత నెల రోజుల కిందట ఇంట్లో ఉన్న పిండి పదార్ధాల్లో భార్య మంగకు తెలియకుండా భాస్వారం(మత్తు పదార్ధాలు) కలుగపగా వంట చేసే సమయంలో గమనించి వాటిని బయట పడేసింది. దీంతో తన భార్య మంగకు పిచ్చిపట్టి ఇంట్లో వస్తువులను బయట పారేస్తుందంటూ గ్రామంలో అందరికి చెబుతూ వేదించడం మొదలు పెట్టాడు. కాగా ఈ నెల 18న ఉదయం తన పుట్టింటికి వెళ్లివస్తానని మంగ తన భర్త నాగేశ్‌ను అడగగా ఎక్కడికి వెళ్లేది లేదని తేల్చి చెప్పాడు. అనంతరం తనకు తెలిసిన ఓ మాంత్రికుడిని ఇంటికి తీసుకువచ్చాడు. మాంత్రికుడు ఇంట్లో ముగ్గు వేశారు. మంగకు బలవంతంగా మత్తు ట్యాబ్లెట్స్ వేసి ముగ్గు వద్ద కూర్చోవెట్టారు. -
కోరికతో వచ్చి.. ఖతమయ్యాడు
సాక్షి, హన్వాడ(మహబూబ్‌నగర్): వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా రామయ్యపాలెంకు చెందిన గంగిరెడ్డి (34), అదేజిల్లా మార్కాపురంకు చెందిన సాదిక్ పాష భార్యతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న సాదిక్ తన భార్యను గంగిరెడ్డి నుంచి దూరం చేసేందుకు మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం శేక్‌పల్లికి వలసవచ్చి మిషన్‌భగీరథ పనుల్లో మేస్త్రీగా పనికి కుదిరాడు. వారి అడ్రస్ తెలుసుకున్న గంగిరెడ్డి శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. సాదిక్ భార్య అతన్ని మందలించి వెళ్లిపొమ్మని చెప్పింది. నిద్రలేచిన సాదిక్ అతన్ని గుర్తించేలోగా గంగిరెడ్డి పరారయ్యాడు. చాలాసేపటి వరకు సాదిక్ ఇంట్లోకి రాకుండా ఆరుబయటే కావలి కాశాడు. గంగిరెడ్డి అతని కళ్లుగప్పి మళ్లీ ఇంటికి వచ్చాడు. కామంతో సాదిక్ భార్యను కలిసే ప్రయత్నం చేయగా గమనించిన సాదిక్ ఇంట్లో ఉన్న చాకుతో పొడిచాడు. గంగిరెడ్డి అరుస్తూ దూషిస్తుండగా అదే కత్తితో గొంతు కోశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటనపై మహబూబ్‌నగర్ రూరల్ సీఐ, ఏఎస్ఐ వెంకట్‌స్వామి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. గంగిరెడ్డి మృతదేహాన్ని మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. -
వివాహేతర సంబంధం..యువకుడి హత్య
మహబూబాబాద్ : కురవి మండలం బలపాల శివారు లింగ్యా తండాలో బాణోత్ రవీందర్(29) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాలు..లింగ్యా తండాకు చెందిన బాణోత్ రవీందర్‌కు సునీత, ప్రమీల అనే ఇద్దరు భార్యలున్నారు. వీరిద్దరితో కలిసి హైదరాబాద్‌లోని షాపూర్లో నివాసం ఉంటున్నాడు. అందరూ కలిసి ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం మొదటి భార్య సునీత, భర్తల గొడవలు జరిగాయి. మొదటి భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలియడంతో ఆమెను అత్తగారింటికి తీసుకొచ్చి పంచాయతీ చేశాడు. ఇదే విషయంలో పంచాయతీ కొనసాగుతుండగా రవీందర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ముసుగు ధరించి కారులో వచ్చారని, వాళ్లే గొంతు నులిమి చంపేశారని రవీందర్ కుమారుడు మనోజ్ చెబుతున్నాడు. పెనుగులాటలో ముఖంపై గోళ్లతో గీకిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. పెద్ద భార్య సునీతనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు..
సాక్షి, పీలేరు: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన మరిదిని ప్రియుడితో కలసి వదిన హతమార్చింది. శుక్రవారం చిత్తూరు జిల్లా పీలేరు మండలం తలపులలో ఈ దుర్ఘటన జరిగింది. పీలేరు ఎస్ఐ పీ.వీ. సుధాకర్‌రెడ్డి కథనం మేరకు తలపులకు చెందిన కోళ్ల బాషాకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మస్తాన్ టైలర్‌గా, మరో కుమారుడు కోళ్ల యాసిన్ పీలేరులో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్. ఇద్దరూ తలపులలో కాపురం ఉంటున్నారు. మస్తాన్ భార్య దిల్షాద్ ఇదే గ్రామానికి చెందిన యోగేంద్రనాయుడుతో వివాహేతర సంబందం పెట్టుకుంది. శుక్రవారం సాయంత్రం వారిద్దరూ కలసి ఉండటాన్ని యాసిన్ గుర్తించి ప్రశ్నించారు. దీంతో వారు తమ అక్రమ కార్యకలాపాల గుట్టు రట్టవుతుందని భావించి యాసిన్(37)ను హతమార్చారు. కళ్లు తిరిగి పడిపోయాడని నమ్మబలికి ఇంటి వద్ద మంచంపై పడుకోబెట్టారు. డాక్టర్‌ను పిలిపించి చూపించారు. పల్స్ దొరకలేదని, వెంటనే పీలేరుకు తీసుకెళ్లమని డాక్టర్ సూచించారు. దీంతో పీలేరుకు తీసుకొచ్చారు. అప్పటికే చనిపోయాడని ధ్రువీకరించడంతో మృతదేహాన్ని తలపులకు తరలించారు. పోలీసులు దిల్షాద్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు యోగేంద్రనాయుడు పరారయ్యాడు. మృతుడికి భార్య సుబహాని, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భార్య ఉండగానే ప్రియురాలితో భర్త!
విజయనగరం టౌన్: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్లగా ఎంచక్కా ప్రియురాలితో సహజీవనం సాగిస్తున్న ఓ ప్రబుద్ధుడి బండారం భార్య బయటపెట్టిన సంఘటన ఇది. విజయనగరంలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలివి. పట్టణంలోని ధర్మపురి వసంత్‌విహార్ ఎఫ్ బ్లాక్‌లో నివాసముంటున్న వినోద్ విశాఖలోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం సునీత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో రూ. 30 లక్షల కట్నం, 25 తులాల బంగారం తీసుకున్నాడు. వారిద్దరికి ఓ పాప పుట్టింది. సునీత డెలివరీకి పుట్టింటికి వెళ్లగా వినోద్ తన ప్రియురాలు, సహోద్యోగి అయిన యువతితో సహజీవనం చేయసాగారు. బిడ్డ పుట్టినా పెద్దగా పట్టించుకోకపోవడంతో అనుమానం వచ్చిన భార్య విచారించగా అసలు విషయం తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని అత్తమామలు, ఆడపడుచుకు చెప్పినా వారు స్పందించలేదు. భర్త ప్రియురాలితో విశాఖలో సహజీవనం చేస్తున్న విషయం తెలుసుకుని సునీత ఈ ఏడాది మే నెలలో అక్కడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు వినోద్‌కు కౌన్సెలింగ్ ఇచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. అనంతరం ఇటీవల తన భర్త వినోద్, ప్రియురాలితో కలసి విజయనగరంలోని స్వగృహంలో ఉన్నట్లు తెలుసుకున్న మహిళా సంఘ సభ్యులతో కలిసి వెళ్లి ఇద్దరినీ రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్సై వెంకటరావు వినోద్‌ను ప్రియురాలితోసహా స్టేషన్‌కు తరలించారు. మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ కె.కుమారస్వామి మాట్లాడుతూ వినోద్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పారు. -
చెట్టుకు కట్టేసి.. రాయితో కొట్టి హత్య
సాక్షి, బెంగళూరు (బాగలకొటె): తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఒక వ్యక్తిని గ్రామంలో చెట్టుకు కట్టివేసి దారుణంగా కొట్టిచంపాడో వ్యక్తి. గ్రామస్తులు చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవరూ దీనిని అడ్డుకోలేదు. బాగల్కోటె జిల్లాలో బాదామి తాలూకాలో ఉన్న నెలవిగి గ్రామంలో మంగళవారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హతుడు మల్లప్ప హొరకేరి కాగా, నిందితుడు ఆదప్ప మిడి. ఈ హత్యోదంతాన్ని కొందరు సెల్ఫోన్లో వీడియో తీసి పోస్ట్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో సంచలనాత్మకమైంది. తన భార్యతో మల్లప్ప అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆదప్ప అనుమానించసాగాడు. దీనిపై అతన్ని పలుమార్లు మందలించాడు కూడా. అయినా పద్ధతి మార్చుకోలేదని ఆదప్ప ఆగ్రహంతో ఉన్నాడు. మంగళవారం ఉదయం ఇద్దరి మధ్య గ్రామంలోనే గొడవ జరిగింది. ఆగ్రహంతో ఆదప్ప మల్లప్పను కొట్టి లాక్కు వచ్చి గ్రామం మధ్యలోనున్న వేపచెట్టుకు కట్టివేసి తలపైన పెద్ద రాయితో కొట్టాడు. దీంతో మల్లప్ప అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గ్రామస్తులు ఊరికే చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవరూ అడ్డుకోలేదు. కొందరు ఫోన్లలో వీడియో తీశారు. బాదామి పోలీసులు గ్రామానికి వచ్చి ఆదప్పను అకరదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.!
వనపర్తి : కట్టుకున్న భర్తను వదిలేసిన ఓభార్య.. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అభం శుభం తెలియని ఓ మూడేళ్ల చిన్నారిని బలి తీసుకుంది. తనతో కాపురం చేయకున్నా పర్వాలేదు.. తన సంతానాన్ని తనకు ఇవ్వాలని కాళ్లు మొక్కినా కనికరించని ఆ కసాయి తల్లి.. చివరికి కన్నపేగును తనే చిదేమిసిన సంఘటన వనపర్తిలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బిజినేపల్లి మండలం కొట్టాల్‌గడ్డ గ్రామానికి చెందిన నర్సింహగౌడ్‌కు అదే మండలం పాలెం గ్రామానికి చెందిన పద్మతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. నర్సింహగౌడ్ వికలాంగుడు కావడంతో గ్రామంలో కల్లు దుకాణం నిర్వహిస్తూ వచ్చే ఆదాయంతోపాటు వికలాంగ పింఛన్‌తో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి మీనాక్షి(6), కార్తీక్(3) సంతానం ఉన్నారు. భార్య పద్మ పాలెం అగ్రికల్చర్ యూనివర్శిటీలో దినసరి కూలీగా పనిచేస్తుండగా అక్కడే పనిచేస్తున్న మల్లేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయాన్ని తెలుసుకున్న భర్త నర్సింహగౌడ్ పద్ధతి మార్చుకోవాలని సూచించినా ఆమెలో మార్పురాలేదు. దీంతో కుటుంబంలో కలహాలు ప్రారంభమై పంచాయతీ దాకా వచ్చాయి. పంచాయతీలో పిల్లల భవిష్యత్ నాశనం చేయవద్దని ప్రాదేయపడినా భార్య వినలేదు. వనపర్తికి మకాం.. సరిగ్గా రెండు నెలల క్రితం భర్తను వదిలి ఇద్దరు పిల్లలతోపాటు మల్లేష్‌తో కలిసి వనపర్తిలోని శంకర్‌గంజ్ కాలనీలో అద్దెగదిలో నివాసం ఉంటున్నారు. ప్రతి రోజు పద్మ కూలి పనిచేయగా వచ్చిన డబ్బులను మల్లేష్‌కు ఇచ్చేది. ఈ క్రమంలో పద్మ శనివారం ఉదయం కార్తీక్(3) అనారోగ్యంతో మృతి చెందాడని మృతదేహాన్ని తీసుకుని అత్తారింటికి కొట్టాల్‌గడ్డకు వెళ్లింది. దీంతో భర్త నర్సింహగౌడ్, అతని కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి బాబు ఎలా చనిపోయాడో చెప్పాలని.. పాప మీనాక్షి ఎక్కడ ఉందని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పింది. దీంతో నర్సింహగౌడ్, కుటుంబ సభ్యులు పాపను కూడా చంపివేసిందన్న అనుమానంతో కార్తీక్ మృతదేహాంతో పాటు పద్మను వాహనంలో ఎక్కించుకొని పాపను చూయించాలని కొట్టాల్‌గడ్డ నుంచి బయలుదేరారు. కర్నూలు తదితర ప్రాంతాలను తిప్పించి చివరికి వనపర్తిలోనే పాప ఉందని చెప్పడంతో వారు వనపర్తికి వచ్చారు. మల్లేష్ దగ్గర ఉన్న పాప మీనాక్షిని తమతో తీసుకుని మల్లేష్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులకు ఫిర్యాదు.. కార్తీక్ గొంతు నులిమి ఉండడం, చెవుల్లో రక్తం రావడాన్ని గమనించిన తండ్రి నర్సింహగౌడ్ తన కుమారుడిని హత్య చేశారని వనపర్తి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వనపర్తి సీఐ వెంకటేశ్వర్లు శనివారం రాత్రి 9 గంటలకు పద్మ అద్దెకు ఉంటున్న శంకర్‌గంజ్ కాలనీకి వెళ్లి గది తలుపులు తెరిపించి ప్రాథమిక విచారణ చేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పద్మ, మల్లేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. కార్తీక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
హోంమంత్రి చాంబర్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదంటూ.. హైదరాబాద్‌కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సాయికుమార్ భార్య, కూకట్పల్లి నివాసి స్వప్న హోంమంత్రికి విన్నవించుకునేందుకు శుక్రవారం సచివాలయానికి వచ్చింది. హోంమంత్రి చాంబర్ ఎదురుగానే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సాయికుమార్‌కు పెళ్లయిన విషయం దాచిపెట్టి మోసం చేయడంతో పాటు, తాజాగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని స్వప్న ఆరోపించింది. ఈ విషయమై ప్రశ్నించినందుకు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని వాపోయింది. దీనిపై ఇప్పటికే కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, విచారించి సాయికుమార్‌ను సస్పెండ్ చేసినట్టు వివరించింది. సస్పెన్షన్ తర్వాత మరింత చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వాపోయింది. ఆత్మహత్యకు పాల్పడ్డ స్వప్నను సైఫాబాద్ పోలీసులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్వప్నకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
కృష్ణా జిల్లాలో ఓ ఎస్సై రాసలీలలు
-
అనుమానం + అతి చనువు = హత్య
ఖమ్మంక్రైం : అనైతిక సంబంధం. ప్రియుడి అనుమానం, మితికి మించిన అతి చనువు.. ఓ మహిళను చంపేశాయి. ఖమ్మంనిలో ఇది జరిగింది. వన్ టౌన్ సీఐ రెహమాన్ తెలిపిన వివరాలు... ⇒ పాకబండ బజార్‌కు చెందిన జగసాని రూప(42) భర్త శ్రీనివాస్, ఐదేళ్ల క్రితం మృతిచెందాడు. తన భర్త చేసిన బట్టల వ్యాపారాన్ని వృత్తిగా ఆమె ఎంచుకుంది. ఒక్కగానొక్క కూతురికి వివాహం చేసింది. ⇒ ముస్తాఫానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గయాజ్ పాషాతో ఆమెకు సాన్నిహిత్యముంది. వారిద్దరూ నాలుగేళ్ల నుంచి ముస్తాఫానగర్‌లో సహజీవనం చేస్తున్నారు. ⇒ ఇటీవలి కాలంలో ముస్తాఫానగర్‌లోని బరాకత్ చర్చి ప్రాంతంలో కొత్త ఇంటిని రూప కట్టుకుంది. ఇల్లు కట్టేందుకు వచ్చిన మేస్త్రీ ప్రసాద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారు చనువుగా ఉంటున్నారు. ⇒ దీనిని గయాజ్పాషా గమనించాడు. రూపను పలుమార్లు హెచ్చరించాడు. మేస్త్రీ ప్రసాద్‌ను కూడా మందలించాడు. తమ మధ్య కేవలం పరిచయం మాత్రమే ఉందని పాషాతో రూప చెప్పింది. ఈ ‘పరిచయం–చనువు’ విషయమై వారి మధ్య తరచూ గొడవులు జరుగుతున్నాయి. ⇒ బుధవారం రాత్రి కూడా వారిద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. తెల్లవారుజాము వరకు గొడవ పడుతూనే ఉన్నారు. క్షణికావేశంలో రూప మెడకు వైరు బిగించాడు పాషా. క్షణాల్లోనే ఆమె ప్రాణాలొదిలింది. ⇒ తెల్లవారాక చుట్టుపక్కల వారికి తెలిసింది. వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటికి సీఐ రెహమాన్ వచ్చారు. మృతదేహాన్ని పరిశీలించారు. ⇒ గయాజ్ పాషాను అదుపులోకి తీసుకుని కేసు విచారిస్తున్నారు. -
మనస్తాపంతో భర్త ఆత్మహత్య
చిలకలూరిపేటటౌన్ : భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలిసిన భర్త మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం రాత్రి చిలకలూరిపేట పట్టణంలో జరిగింది. అర్బన్ సీఐ బండారు సురేష్‌బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వడ్డి కాలనీలో నివశించే షేక్ బషీర్ అహ్మద్ (32) స్థానిక ఐరన్ దుకాణంలో కూలీగా పని చేస్తున్నాడు. భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో తరచూ గొడవ పడేవాడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. ఎవరితో మాట్లాడుతున్నావని నిలదీశాడు. తన ఇంటి సమీపంలో నివశించే ఆటో డ్రైవర్ సురేష్‌తో మాట్లాడుతున్నానని, నీకు చేతనైంది చేసుకో.. అని తేల్చి చెప్పింది. ఆ సమయంలో 12 ఏళ్ల కొడుకు సమీర్ కూడా అక్కడే ఉన్నాడు. భార్య, కొడుకు ఇద్దరూ నిద్రకు ఉపక్రమించాక బషీర్ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం సీఐ విలేకరులతో మాట్లాడుతూ మృతుడి కొడుకు సమీర్, తల్లి నూర్జహాన్, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని చెప్పారు. భార్య వివాహేతర సంబంధం కారణంగానే బషీర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామన్నారు. భార్య హసీనాతో పాటు ఆటో డ్రైవర్ గుంజి సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంటాడుతున్న మరణాలు.. బషీర్ తండ్రి ఇరవై ఏళ్ల కిందట ప్రమాదంలో మరణించాడు. అప్పటి నుంచి తల్లి నూర్జహాన్ తన ముగ్గురు పిల్లలను కష్టపడి పెంచి పోషించింది. మూడో సంతానమైన బషీర్‌కు స్థానికంగా ఉండే హసీనాతో 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఆరేళ్ల కిందట బషీర్ పెద్దకొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రెండో కుమారుడు సమీర్ ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్నాడు. తల్లి ప్రవర్తనపై విసిగి వేసారిన కొడుకు సమీర్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు బషీర్ కూడా మరణించడటంతో ఆ కుటుంబంలో విషాదం నిండింది. -
ఆదోనిలో అన్నదమ్ముల హత్య
- వివాహేతర సంబంధమే కారణం - ఆదివారం రాత్రి అన్న కిడ్నాప్ - అడ్డుకోబోయిన అతని తమ్ముడిపై వేటకొడవళ్లతో దాడి - చికిత్స పొందుతూ మృతి - కిడ్నాప్ అయిన వ్యక్తి దారుణ హత్య - ఎమ్మిగనూరు సమీపంలో చంపేసి, శవాన్ని తగులబెట్టిన దుండగులు - ముగ్గురు నిందితుల గుర్తింపు ఆదోని టౌన్/ఎమ్మిగనూరు రూరల్: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన ఆదోనిలో చోటు చేసుకుంది. సోమవారం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు జంట హత్యల వివరాలను వెల్లడించారు. ఆదోని పట్టణంలోని విక్టోరియ పేటలో నివాసముంటున్న రాజు, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు నాగేంద్ర (38) రైస్ మిల్లులో పని చేస్తున్నాడు. రెండో కుమారుడు నాగరాజు (34) బెంగళూరు ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. మూడో కుమారుడు నరేష్(32) ఇంటి పట్టునే ఉంటున్నాడు. నాగేంద్రకు భార్య, కుమార్తె ఉన్నారు. ఇతనికి అదే కాలనీకి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి భార్య శిరీషను మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో 2016లో అతనిపై వేధింపుల కేసు నమోదైంది. వివాహేతర సంబంధం మానుకోవాలని భార్య, బంధువులు చెబుతున్నా పెడచెవినా పెడుతూ వచ్చాడు. ఈ విషయం మహిళ ఇంట్లో తెలియడంతో నాగేంద్రను చంపేందుకు కుట్ర పన్నారు. అడ్డొచ్చిన తమ్ముడిని కడతేర్చారు.. ఆదివారం రాత్రి నాగేంద్ర భోజనం ముగించుకుని ఇంటి ముందు కూర్చున్నాడు. తూపాన్ వాహనంలో తెల్ల దుస్తులు ధరించిన కొందరు గుర్తు తెలియని అక్కడికి వచ్చి అతడిని బలవంతంగా వాహనంలోకి ఎక్కిస్తుండగా కేకలు వేశాడు. కొంత దూరంలో ఉన్న అతని తమ్ముడు నరేష్ అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి వాహనానికి అడ్డుగా నిలిచాడు. తమ అన్నను ఎక్కడికి తీసుకెళ్తారని ప్రశ్నించేలోగా దుండగులు కత్తులతో దాడి చేయడంతో కుప్పకూలి పోయాడు. వాహనం మాధవరం రోడ్డువైపు వేగంగా వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన నరేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఇతనికి వివాహం కాలేదు. చేతి కడియంతో మృతదేహం గుర్తింపు ఆదివారం రాత్రి కిడ్నాప్‌నకు గురైన బోయ నాగేంద్రను దుండగులు ఎమ్మిగనూరు మండల బనవాసి ఫారం ఎల్లెల్సీ కాల్వ దగ్గరకు తీసుకువచ్చి హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తించకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. శరీర భాగాలు పూర్తిగా కాలిపోయాయి, అయితే కుడిచేయి మాత్రం కాలలేదు. సోమవారం ఉదయం కాలువ గట్టుపై నుంచి పొలాలకు వెళ్తున్న రైతులు మృతదేహాన్ని గుర్తించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సీఐ జీ.ప్రసాద్, రూరల్ ఎస్ఐ వేణుగోపాల్‌లు సంఘటన స్థలానికి చేరుకొని çపరిశీలించారు. ఆదివారం రాత్రి ఆదోనిలో కిడ్నాప్ ఘటనపై వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు కావటం, పత్రికల్లో కథనాలు రావటంతో ఆదోని పోలీసులకు, బంధువులకు ఎమ్మిగనూరు పోలీసులు సమాచారం అందించారు. ఈ మేరకు ఆదోని త్రీ టౌన్ సీఐ చంద్రశేఖర్, వన్‌టౌన్ ఎస్ఐ మన్మధవిజయ్ మృతుడి బంధువులను సంఘటన స్థలం దగ్గరకు తీసుకువచ్చారు. కుడిచేయి కాలిపోకుండా ఉండటం, చేతికి వెండి కడియం, దారం ఉండటంతో గుర్తించారు. అనంతరం ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హత్యకు గల కారణాలు వివాహేతర సంబంధం అని అనుమానాలను బంధువులు వ్యక్తం చేస్తున్నారన్నారు. అదే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు. కేసును త్వరలోనే ఛేదిస్తాం: డీఎస్పీ అన్నదమ్ముల హత్య కేసును త్వరలో ఛేదిస్తాం. నిందితులను అరెస్ట్ చేసేందుకు 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాం. మృతుడు నాగేంద్ర భార్య, మామ ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో ఈరన్న, రవి, సత్యనారాయణపై కేసు నమోదు చేశాం. ఈ ఘటనలో పది మంది నిందితుల వరకు పాల్గొని ఉండవచ్చు. -
భర్త ప్రియురాలిపై భార్య..!
► చిక్సిత పొందుతూ బాధితురాలి మృతి ► నిందితురాలి అరెస్టు తిరువళ్లూరు: భర్త ప్రియురాలిపై ఓ మహిళ కిరోసిన్ పోసి నిప్పటించింది. ఈ సంఘటనలో బాధితురాలు చిక్సిత పొందుతూ శుక్రవారం మృతి చెందింది. తిరువళ్లూరు జిల్లా వెళ్లవేడు ప్రాంతానికి చెందిన రాజేశ్వరికి అదే ప్రాంతానికి చెందిన వైరం అనే వ్యక్తికి 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి సంతోష్, సంజయ్ అనే ఇద్దరు కుమారులున్నారు. వైరం తరచూ ఇంటికి రాకుండా ఉంటుండంతో రాజేశ్వరికి అనుమానం ఏర్పడి విచారించింది. తన భర్తకు వెళ్లవేడులో టీ స్టాల్ నిర్వహిస్తున్న అమ్ములుతో వివాహేత సంబంధం ఉన్నట్టు తెలుసుకుంది. వెళ్లవేడు పోలీసులకు, జిల్లా కలెక్టర్‌కు రాజేశ్వరి వినతి పత్రం సమర్పించింది. అయినా తనకు న్యాయం జరగలేదని పది రోజుల క్రితం రాజేశ్వరి తన ఇద్దరు పిల్లలతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. పోలీసులు వారిని సముదాయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇంటికి పంపారు. అనంతరం బుధవారం వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లవేడుకు వెళ్లిన రాజేశ్వరికి తన వైరం, అమ్ములు సన్నిహితంగా ఉండడం కనిపించింది. దీంతో ఆగ్రహించిన రాజేశ్వరి టీస్టాల్లో ఉన్న కిరోసిన్‌ను తీసుకుని అమ్ములుపై పోసి నిప్పంటించింది. 90 శాతం వరకు కాలిపోయిన అమ్ములును పోలీసులు చెన్నైలోని వైద్యశాలకు తరలించారు. చిక్సిత పొందుతూ శుక్రవారం అమ్ములు మృతి చెందింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి రాజేశ్వరిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. -
సిగపట్లు.. మహిళల బహిరంగ పోరు
భువనేశ్వర్(ఒడిశా): నగరంలో శుక్రవారం ఉదయం సంచలనాత్మక సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ మరో మహిళను నడిరోడ్డు మీద జుట్టు పట్టి జాడించేసింది. ఇదంతా స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో జరిగింది. దీంతో నగరంలో ఈ సంఘటన వాడిగా వేడిగా చర్చకు దారితీసింది. తన భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మరో మహిళపై అకస్మాత్తుగా భార్య బహిరంగ దాడికి దిగడంతో అంతా అవాక్కయ్యారు. వీరిలో ఒకరు పాత్రికేయులు కావడంతో గొడవ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యాధికులు ఇలా వీరంగానికి పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పెళ్లికి ముందు నుంచే కొనసాగుతున్న వివాహేతర సంబంధం గురించి తదుపరి దశలో తెలిసిన తరువాత భర్తకు పలు విధాలా భార్య నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది. కొద్ది కాలం గడువు ఇస్తే ఈ సంబంధానికి తెర దించేస్తానని తరచూ భర్త బూటకపు హామీలు ఇస్తూ యథాతథంగా వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని సహించలేకపోయినట్లు భార్య వాపోయింది. దీనిపై నగర పోలీసు డిప్యుటీ కమిషనర్ సత్యబ్రొతొ భొయి స్పందించి బాధిత వర్గం ఫిర్యాదు చేయనంత వరకు చేసేదేమీ ఉండదన్నారు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కోసం అభ్యర్థన దాఖలైతే రాజీ కుదిర్చేందుకు మధ్యమ విభాగానికి సిఫారసు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. విచారణ జరగాల్సిందే భర్తతో వివాహేతర సంబంధం వివాదం నేపథ్యంలో రెండు సార్లు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు నమోదు చేసినట్లు బాధిత భార్య పేర్కొంది. మరో వైపు భర్తకు పలు విధాలా నచ్చజెప్పి సంస్కరించేందుకు విఫలయత్నం చేసినట్లు ఆమె వాపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు చొరవకల్పించుకుని విచారణ జరపాలని ఆమె కోరింది. -
రాముడు కాదు రాక్షసుడు..
♦ అక్రమ సంబంధానికి భార్య అడ్డుగా ఉందనే హత్య ♦ ఓ యువతితో వివాహేతర సంబంధం పహాడీషరీఫ్: పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమై యాచారం అడవుల్లో ప్రత్యేక్షమైన మహిళ హత్యోదంతంలో కొత్త కోణం వెలుగుజూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భార్యను కడతేర్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడు మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఆది నుంచి వక్రబుద్ధే.. ఆమనగల్లు మండలం పలుగుతాండకు చెందిన రామావత్ శ్రీరామ్ నాయక్‌కు ఐదేళ్ల క్రితం జడ్చర్ల మండలం, నేలబండ తాండకు చెందిన లలిత(23)తో వివాహం జరిగింది. మూడేళ్ల క్రితం తుక్కుగూడకు వలస వచ్చిన శ్రీరామ్ ఓ కంపెనీలో ఆఫీస్ బాయిగా పని చేస్తూ భార్య, ఇద్దరు కుమారులు ప్రవీణ్(3), అఖిల్(1.5 సంవత్సరాలు)తో కలి ఉంటున్నాడు. నిందితుడు సొంత ఊరిలో ఏడాది క్రితం ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు పట్టుకుని రూ.40 వేలు జరిమానా విధించారన్నారు. దీంతో అతని భార్య లలిత బంగారు పుస్తెల తాడును విక్రయించి చెల్లించిందని మృతురాలి తల్లిదండ్రులు దస్రూనాయక్, తల్లి జానకి తెలిపారు. నిద్రమాత్రలు మింగించి చంపేందుకు కుట్ర.. తుక్కుగూడలో యువతితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న శ్రీరామ్ తమ కుమార్తె అడ్డుతొలగించుకునేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె తల్లితండ్రులు తెలిపారు. సదరు యువతికి ఆస్తి ఉన్నందున ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది భార్యతో పాటు చిన్న కుమారుడు అఖిల్‌కు 12 నిద్ర మాత్రలు మింగించి చంపేందుకు ప్రయత్నించగా, అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి బతికించుకున్నట్లు తెలిపారు. లలితను హత్య చేయాలని భావించిన శ్రీరామ్ గత కొన్ని రోజుల నుంచి ఆమెపై చెడుగా ప్రచారం చేస్తున్నాడు. లలితకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని శ్రీరామ్ తన కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 31న ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్న నిందితుడు అనుమానం రాకుండా కొద్ది రోజులుగా లలితతో మంచిగా ఉన్నాడు. 31న పెద్ద కుమారుడితో పాటు, చిన్న కుమారుడు అఖిల్‌ను కూడా బలవంతంగా(పాఠశాల నిర్వాహకులు వారించినా) స్కూల్‌కు పంపాడు. అనంతరం ఆమెను తీసుకెళ్లి హత్య చేశాడు. తన భార్యను చంపేందుకు సహకరించాలని సోదరుడు మల్లేష్ అలియాస్ మణిపాల్, స్నేహితులు సతీష్, తరుణ్, మరో మహిళ సహకారం కోరినట్లు తెలిపారు. హత్య అనంతరం అదేరోజు రాత్రి ఇద్దరు కుమారులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్య ఎవరితో వెళ్లిపోయిందంటూ ఫిర్యాదు చేశాడు. నిందితుడి రిమాండ్ నిందితుడు శ్రీరామ్ నాయక్‌ను పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడికి సహకరించిన అతని సోదరుడు మల్లేష్ అలియాస్ మణిపాల్, స్నేహితులు సతీష్, తరుణ్, మరో మహిళ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
కూతురిని వ్యభిచార ముఠాకు..
కూతురిని విక్రయించడానికి ప్రియునితో కలిసి తల్లి కుట్ర చాకచక్యంగా తప్పించుకున్న బాలిక పోలీసుల అదుపులో నిందితులు కూతురిని కంటికి రెప్పలా పెంచి, ఉజ్వల భవితను ఇవ్వాల్సిన తల్లి, తప్పుదారిని ఎంచుకుంది. విలాసాలు, డబ్బుల కోసం కూతురినే వ్యభిచార ముఠాకు అమ్మడానికీ వెనుకాడలేదు. మానవతా విలువలను ప్రశ్నించే ఈ సంఘటన బీదర్ నగరంలో వెలుగుచూసింది. బెంగళూరు (బీదర్): డబ్బుల కోసం తనను వేశ్యవాటికకు విక్రయించడానికి ప్రయత్నించిన తల్లిని, ఆమె ప్రియుడిని ఒక బాలిక చాకచక్యంగా పోలీసులకు పట్టించిన ఘటన బీదర్‌లో గురువారం వెలుగు చూసింది. బీదర్ పట్టణంలోని కాలేజీలో చదువుతున్న బాలిక (17), తల్లి, చెల్లెళ్లలతో కలసి శివార్లలోని ఓ లేఅవుట్లో ఉంటున్నారు. కొద్దికాలం క్రితం ఆ మహిళ ప్రవర్తనతో విసిగి భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అదే ప్రాంతానికి చెందిన ఖాజామియా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. అప్పటి నుంచి ఖాజామియా ప్రతిరోజు వారింటికి వస్తూ బాలికను, ఆమె చెల్లెళ్లను దూషిస్తూ హింసించేవాడు. ఈ క్రమంలో డబ్బుపై మోజుతో ఇద్దరూ కలిసి బాలికను విక్రయించాలని కుట్ర పన్నారు. రాజస్థాన్ నుంచి పెళ్లి సంబంధం వచ్చిందని, వెంటనే దుస్తులు మార్చుకొని ప్రయాణానికి సిద్ధం కావాలంటూ బుధవారం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన బాలికను ఒత్తిడి చేశారు. కొద్దిసేపటికి ఖాజామియా బాలికను తీసుకువస్తున్నామని, వెంటనే తన బ్యాంకు ఖాతాలోకి రూ. 2 లక్షలు జమ చేయాలంటూ ఫోన్లో వేరే వ్యక్తులతో మాట్లాడడాన్ని పసిగట్టిన బాలిక తనను వేశ్యవాటికకు విక్రయిస్తున్నట్లు తెలుసుకుంది. దీంతో కిటికీ నుంచి పక్కింటి వాళ్లకి విషయాన్ని తెలపడంతో వారు బాలిక బంధువులకు సమాచారమిచ్చారు. వెంటనే వారు బీదర్ గ్రామీణ పోలీసులకు తెలిపి, అందరూ కలిసి బాలిక ఇంటికి వచ్చి ఆమెను రక్షించారు. బాలిక ఫిర్యాదు మేరకు తల్లి, ఆమె ప్రియుడు ఖాజామియాలను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ప్రకాశ్ అమృత్ నికమ్ స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే బీదర్ గ్రామీణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాలికను రక్షించారని చెప్పారు. తన తల్లి రమా, ఆమె ప్రియునితో కలిసి వేశ్యవాటికకు విక్రయించడానికి ప్రయత్నించందని బాలిక ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
బంధువే రాబంధువు
♦ చిన్నారులను హతమార్చిన యువకుడు ♦ గోదారి చూపిస్తానని.. కాలువలో తోశాడు ♦ నిందితుడి ఇంటిని ధ్వంసం చేసిన గ్రామస్తులు కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లా దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన కైకవరపు చిన్నారావు, మంగ దంపతులకు ప్రశాంత్ (10), విక్కీ(5)లు సంతానం. గత ఆదివారం పాలు తీసుకురావడానికి బయటకు వచ్చిన వారిని చిన్నారావు బంధువైన కైకవరపు రవిశేఖర్ గోదావరి కాలువ చూపిస్తానంటూ బైక్‌పై ఎక్కించుకుని పట్టిసీమ ఎత్తిపోతల పథకం జీరో పాయింట్ వద్దకు తీసుకువెళ్లాడు. కాలువ చూస్తున్న ఇద్దరు చిన్నారులను వెనుక నుంచి ప్రవాహంలోకి నెట్టివేయడంతో వారు మృత్యువాత పడ్డారు. ప్రశాంత్ మృతదేహం పోలవరం మండలం రేపల్లెవాడ, ఇటికిలకోట సమీపంలో మంగళవారం ఉదయం లభించగా, విక్కీ మృతదేహాన్ని గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం సమీపంలో గుర్తించారు. చిన్నారులు అదృశ్యమైన రోజునే వారి తండ్రి కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అప్పటికే చిన్నారులను బలితీసుకున్న రవిశేఖర్ ఏమీ ఎరగని వాడిలా చిన్నారావుతోపాటు పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. చిన్నారుల అదృశ్యం మెట్టప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో డీఎస్పీ చిటికెన మురళీకృష్ణ దర్యాప్తు చేపట్టారు. 24వ తేదీ దిప్పకాయలపాడు వెళ్లి విచారణ చేపట్టిన అనంతరం రవిశేఖర్‌పై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ఫోన్‌కాల్స్‌తో పోలీసుల వల దిప్పకాయలపాడు చిన్నారుల మృతికి కారణమైన రవిశేఖర్‌ని పోలీసులు ఫోన్ కాల్స్‌తో పట్టుకోగలిగారు. డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో రవిశేఖర్‌ను అనుమానించి 24వ తేదీ రాత్రి అతనికి ఫోన్ చేసి చిన్నారులు ఇరువురూ సేఫ్‌గా ఇంటికి తిరిగి వచ్చారని తెలిపారు. దీంతో పోలీసులకే రవిశేఖర్ పలుసార్లు తిరిగి ఫోన్ చేసి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, వారిని ఎవరైనా ఏదైనా చేశారా అంటూ పదే పదే సందేహాలు వ్యక్తంచేయడం పోలీసుల అనుమానానికి మరింత బలమైన ఆధారం ఏర్పడింది. ఇరువురు చిన్నారులు దిప్పకాయపాడు ఇంటి వద్దకు వచ్చారని పోలీసులు తెలపగా రవిశేఖర్ మాత్రం దిప్పకాయలపాడు రాకపోవడంతో నిందితుడు అతనే అని అనుమానించారు. దీంతో అతని గురించి విచారణ చేపట్టి పట్టుకుని కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. విచారణలో రవిశేఖర్ నిజం వెల్లడించాడు. ఆ సమాచారంతో తెల్లవారు ప్రాంతంలో పోలీసులు కాలువ వెంబడి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి. వివాహేతర సంబంధమే కారణం చిన్నారులను బలితీసుకోవడానికి కారణం వివాహేతర సంబంధం అని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. చిన్నారుల తల్లితో రవిశేఖర్ గతంలో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. అయితే రెండు నెలలుగా ఆమె రవిశేఖర్‌తో కలవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పిల్లలే అడ్డుగా భావించిన రవిశేఖర్ వారిని చంపడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుని ఈ నెల 23న కాలువలోకి నెట్టి హతమార్చినట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. గ్రామస్తుల ఆగ్రహం కొయ్యలగూడెం : చిన్నారులను హతమార్చిన యువకుడు రవిశేఖర్‌ను తమకు అప్పగించండి, వాడికి సరైన శిక్షను అమలు చేసి మరొక వ్యక్తి ఇటువంటి అకృత్యం చేయకుండా ఉండటానికి గుణపాఠం నేర్పుతాం అంటూ దిప్పకాయలపాడు గ్రామస్తులు మంగళవారం తీవ్ర ఆగ్రహావేశాలతో పేర్కొన్నారు. చిన్నారులు ప్రశాంత్, విక్కీలను రవిశేఖర్ దారుణంగా హతమార్చాడన్న విషయం తెల్లవారే సరికల్లా దావానలంలా చేరడంతో దిప్పకాయలపాడు దళితవాడలో 500 మందికి పైగా ప్రజలు చేరుకుని రవిశేఖర్ ఇంటిని ధ్వంసం చేశారు. ఆగ్రహం చల్లారక అతని తండ్రి కాంతారావుపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను పక్కకు తోశారు. అయినా స్థానికులు శాంతించకపోవడంతో కాంతారావును పోలీసు జీపులో ఎక్కించుకుని కొయ్యలగూడెం తరలిస్తుండగా మహిళలు జీపునకు అడ్డంగా కూర్చొని అందోళనకు దిగారు. జీపు టైర్లలో గాలిని తీసివేసి కాంతారావును తమకు అప్పగించాలని నినాదాలు చేశారు. అప్పటికే కొందరు పెద్దలు నిందితుడు రవిశేఖర్ అని, కాంతారావు, అతని మరో కొడుకు, కుటుంబ సభ్యులకు ఏ సంబంధం లేదని నచ్చజెప్పారు. దీంతో వివాదం కొంత సర్దుమణిగింది. -
ఆమెతో సెల్ఫీలు..ఆయనతో బేరాలు
గుంటూరు: పట్టణ పరిధిలోని ఎదురింటి మొగుడు.. పక్కింటి పెళ్లాం మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వారు సెల్ఫీలు దిగారు. అనంతరం ఆ ఫోటోలను ఫేస్బుక్, వాట్సప్‌లో అప్లోడ్ చేస్తానంటూ రెండు రోజులుగా ఆమె భర్తకు ఫోన్ చేసి బెదిరించడం మొదలెట్టాడు. దీంతో ఆ మహిళ భర్త తాడేపల్లి పోలీసుస్టేషన్లో కేసు పెట్టాడు. వివరాల ప్రకారం.. నులకపేటలో నివాసముండే యువకుడికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి పక్కింట్లో నివాసముండే మరో వ్యక్తి, ఆ యువకుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడ పోలీసులు రాజీ చేసి పంపారు. అయితే 15 రోజులు తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగారు. వాటిని ఆమె భర్తకు పంపించి డబ్బులిస్తావా లేకపోతే ఫేస్బుక్, వాట్సప్‌లలో అప్లోడ్ చేస్తానంటూ పక్కింటి వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడిపై వెంటనే ఆ యువతి భర్త తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని..
హైదరాబాద్: భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. స్థానిక న్యూ రక్షాపురంలో నివాసముంటున్న గోపాల్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య జ్యోతి, ఓ కుమారుడు ఉన్నాడు. కాగా.. జ్యోతి మూడేళ్లుగా స్థానికంగా నివాసముంటున్న రాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ అంశంపై గోపాల్ ఆమెను పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో మనస్తాపానికి గురైన గోపాల్ సూసైడ్ నోట్ రాసి ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మామతో సంబంధం: కోడలు ఆత్మహత్య
-
మామతో సంబంధం: కోడలు ఆత్మహత్య
ఖమ్మం: కన్నకూతురితో సమానంగా చూసుకోవాల్సిన కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో మామ. ఆ విషయం ఇంట్లో తెలియడంతో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. బోనకల్లు మండలం ఎర్రవోడుకు చెందిన బానోతు వీరన్న(40) తన కోడలు అనిత(25)తో సంబంధం పెట్టుకున్నాడు. రెండు నెలల క్రితం ఇద్దరూ ఇంట్లో ఉన్న రూ. 2 లక్షల నగదు, బంగారం తీసుకుని ఎవ్వరికి తెలియకుండా చెన్నై వెళ్లిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే మామకోడలు తిరిగి శుక్రవారం ఖమ్మం వచ్చారు. వారి కోసం పోలీసులు వెతుకుతుండటం, కుటుంబంలో గొడవలతో ఇంటికి వెళితే పట్టుబడతామనే ఆందోళనతో రఘునాథపాలెం మండలం మంచుగొండకు వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఎలుకల మందు తాగి చేతులు గాయపరుచుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు గుర్తించి వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోడలు గుగులోతు అనిత శనివారం మృతిచెందింది. మామ చికిత్స పొందుతున్నాడు. -
ఏలూరు హత్యకేసులో నిందితుల అరెస్ట్
పెదపాడు: పెదపాడు మండలం నాయుడు గూడెంలో మే 16న జరిగిన కొల్లి మోహన్ హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తన భార్య భార్గవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కొల్లి నాగమోహన్ అనే వ్యక్తిని భార్గవి భర్త బేతపూడి ఉదయకుమార్ మరో ముగ్గురితో కలిసిన మే 16న దారుణంగా హత్య చేశారు. ఏలూరులో డీఎస్పీ జి. వెంకటేశ్వరరావు, ఏలూరు రూరల్ సీఐ ఏఎన్ మురళి, పెద్దపాడు ఎస్ఐ కె.రామకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. -
వివాహేతర సంబంధానికి అడ్డున్నాడని..
- మిస్టరీ వీడిన హత్యకేసు - పోలీసుల అదుపులో నిందితుడు డోన్ టౌన్: తన వివాహేతర సంబంధానికి అడ్డున్నాడని ఓ మహిళ తన భర్తనే హత్య చేయించిన ఘటన ఇది. వెంకటనాయినిపల్లె గ్రామానికి చెందిన రామచంద్రుడు(40) హత్య కేసు మిస్టరీ వీడింది. కేసు వివరాలను డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్ మంగళవారం విలేకరులకు వివరించారు. డోన్ పరిధిలోని ఎర్రగుంట్ల గ్రామ పొలిమేరలోని అటవీ ప్రాంతంలో ఈనెల 4వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం లభించింది. సీఐ శ్రీనివాసులు గౌడ్ ఆధ్వర్యంలో ఎస్ఐ రామసుబ్బయ్య కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం వెంకటనాయినిపల్లె గ్రామానికి చెందిన రామచంద్రుడు(40)గా గుర్తించి విచారణ చేపట్టారు. పోలీసులు అతని భార్య నాగమద్దమ్మను అదుపులోకి తీసుకొని విచారించగా కృష్ణగిరి మండలం ఎస్ ఎర్రగుడి గ్రామానికి చెందిన తిమ్మరాజుతో కలసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. నాగమద్దమ్మ కూలీ పనులకు వెళ్తూ తిమ్మరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలని ఇద్దరు కుట్ర పన్నారు. గత నెల 27వ తేదీన తిమ్మరాజు పథకం ప్రకారం రామచంద్రుడిని ఎర్రగుంట్ల కొండకు తీసుకువెళ్లి అతిగా మద్యం తాగించి, తర్వాత తలపై బండరాతితో బలంగా మోది, గొంతుకు టవాల్‌ను బిగించి హత్య చేశాడు. ఈనెల 4వ తేదీన మృతదేహం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసును ఛేదించారు. మంగళవారం నిందితుడు తిమ్మరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నాగమద్దమ్మ పాత్రపై కూడా విచారణ చేస్తున్నామని డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్ తెలిపారు. -
ప్రియుడి కోసం భార్య దొంగతనం
ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు రూ.35 లక్షల సొత్తు స్వాధీనం పోలీస్ అధికారులకు ఐజీ ప్రశంసలు నెల్లూరు (క్రైమ్) : తన ప్రియుడితో కలిసి ఒకట్నిర కేజీల బంగారు ఆభణాలను దోపిడీ చేసిన ఘటనలో ఆమెతో పాటు అతన్ని నగర డీఎస్పీ జి. వెంకటరాముడు ఆధ్వర్యంలో ఒకటో నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.35 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ నిందితుల వివరాలను వెల్లడించారు. నెల్లూరు నగరంలోని శిఖరంవారి వీధిలో ఈ నెల 4వ తేదీ సాయంత్రం రంజిత్‌జైన్ ఇంట్లో సుమారు 1500 గ్రాముల బంగారు ఆభరణాలను ఓ యువకుడు దోచుకెళ్లిన ఘటన తెలిసిందే. ఈ సంఘటన నగరంలో కలకలం రేకెత్తించింది. సంఘటనా స్థలాన్ని నగర డీఎస్పీ జి. వెంకటరాముడు, ఒకటో నగర ఇన్చార్జి ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరు, రంజిత్ జైన్ భార్య పూజ చెబుతున్న వివరాలు పొంతనలేకపోవడంతో పోలీసు అధికారులకు అనుమానం వచ్చింది. రంజిత్‌జైన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఒకటో నగర ఇన్స్పెక్టర్ ఎస్కే అబ్దుల్కరీం విచారణ వేగవంతం చేశారు. పూజ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఆ కోణంలో కేసు దర్యాప్తు చేపట్టారు. మిస్టరీ వీడింది ఇలా.. బాధితురాలి ప్రవర్తనపై ఆది నుంచి పోలీసులకు అనుమానం ఉంది. ఆమె గురించి లోతుగా విచారించారు. పూజ రెండు, మూడు సిమ్‌లను వాడుతుందని, రెండు రోజులకొకసారి రూ. 500 వరకు రీచార్జ్ చేయించుకునేదని తెలిసింది. దీంతో కాల్ డిటైల్స్‌ను సేకరించి దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రాజస్థాన్‌లోని ఇండోర్ సిల్వర్నగర్కు చెందిన రమీజ్షా అనే వ్యక్తికి అనేక సార్లు ఫోన్ చేసినట్లు, సంఘటన జరిగిన రోజు సైతం అనేక సార్లు ఫోన్ చేసినట్లు నిర్ధారించుకున్నారు. విచారణలో పలు విషయాలు వెలుగుచూశాయి. పూజది ఇండోర్. ఆమెకు రమీజ్షాతో వివాహేతర సంబంధం ఉంది. భర్త వద్ద నుంచి పారిపోయి వివాహం చేసుకోవాలని వారిద్దరు నిశ్చయించుకున్నారు. అదను కోసం చూస్తుండగా, శంకర్ 1,500 గ్రాముల బంగారాన్ని తమ ఇంట్లో పెట్టడాన్ని పూజ గమనించింది. ఆ బంగారాన్ని కాజేసి ప్రియుడితో పాటు ఉడాయించాలని నిశ్చయించుకుంది. రమీజ్షాకు ఫోన్ చేసి నెల్లూరుకు పిలిపించింది. అనంతరం ఇద్దరు కలిసి దోపిడీ పథక రచన చేశారు. మంగళవారం నెల్లూరు రైల్వేస్టేషన్ వద్ద పూజ, ఆమె ప్రియుడు రమీజ్షాను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.35 లక్షలు విలువ చేసే 1,270 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందికి అభినందనలు రోజుల వ్యవధిలోనే దోపిడీ ఘటనను ఛేదించిన నగర డీఎస్పీ జి. వెంకటరాముడు, ఒకటో నగర ఇన్స్పెక్టర్ ఎస్కే అబ్దుల్కరీం, ఎస్ఐ పి. జిలానిబాషా, హెచ్‌సీలు రఫి, శ్రీనివాసులు, విజయకుమారి, కానిస్టేబుల్స్ పి. శ్రీనివాసులు, దేవకిరణ్, వేణు, వెంకటేశ్వర్లు, రాజు, రమేష్, రామారావు, సురేష్‌ను ఐజీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ సమావేశంలో ఎస్పీ విశాల్‌గున్నీ, ఏఎస్పీ బి. శరత్‌బాబు, నగర డీఎస్పీ జి. వెంకటరాముడు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కుటుంబం పరువు తీస్తోందని..
హైదరాబాద్: వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. కుటుంబం పరువు తీస్తోందని ఓ యువకుడు తన పిన్నిపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన నగరంలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న జ్యోతి అనే మహిళ భర్త స్నేహితునితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం పై కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం జ్యోతికి వరుసకు కొడుకయ్యే గణేష్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉరివేసుకుని మహిళ బలవన్మరణం
బొమ్మలరామారం : ఉరివేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో మంగళవారంచోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జలాల్పూర్ గ్రామానికి చెందినపత్తి పుష్ప(30) కుటుంబ తగాదాలతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజుల క్రితం పుష్పకు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందంటూ పంచాయతీ జరిగింది. దాంతో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన మృతురాలి భర్త గంగారాం ఇంటికి వచ్చి తలుపు తీయగాపుష్ప దూలానికి ఉరి వేసుకుని కనిపించింది. మృతురాలి తండ్రి మోతె పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
డ్రైవర్ హత్య
టీనగర్: వివాహేతర సంబంధం వ్యవహారంలో లారీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు. చిదంబరం సమీప వడక్కు తిలై్లనాయకపురంకు చెందిన సురేష్(36), లక్ష్మి దంపతులు. కాగా మూడేళ్ల క్రితం లక్ష్మి, కార్తీ అనే వ్యక్తితో ఇంటినుంచి వెళ్లిపోయి చిదంబరం సమీపంలోని కొత్తన్కుడి ప్రాంతంలో నివసిస్తోంది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం లక్ష్మి సురేష్ దగ్గరికి వెళ్లి తనకు జీవన భృతి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఇది తెలిసిన సురేష్ బంధువు దండపాణి కార్తీని మందలించాడు. దండపాణి తనను మందలించడంతో కార్తీ ఆగ్రహించి అతన్ని హత్య చేసేందుకు కుట్రపన్నాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి దండపాణి స్నేహితుడైన మినీ లారీ డ్రైవర్ సెల్వం(40) చిదంబరంతో కలిసి వండిమేడు ప్రాంతంలో టీ తాగేందుకు వెళ్లారు. ఆ సమయంలో కారులో అక్కడికి వచ్చిన ఐదుగురు వ్యక్తులు దండపాణిపై కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించారు. సెల్వం వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో అతనిపై విచక్షణారహితంగా కత్తులతో దాడిచేసిన దుండగులు అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. వీరిని గుర్తించిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్సలు ఫలించక సెల్వం మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన అతని బంధువులు కార్తీ ఇంటిని ముట్టడించి వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చిదంబరం వడక్కు తిలై్లనాయగపురంకు చెందిన కార్తీ, కదిర్, కందమంగళంకు చెందిన స్టాలిన్, ఉత్తమచోళమంగళంకు చెందిన జయచంద్రన్, చిదంబరం కస్పా ప్రాంతానికి చెందిన చంద్ర అనే ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు సంబంధించి వడక్కు తిలై్లనాయగపురంలో ఉద్రిక్తత ఏర్పడింది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు భద్రత ఏర్పాటుచేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు మహిళల హత్య
వేలూరు: వివాహేతర సంబంధం కారణంగా వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు.వానియంబాడి రెడ్డియూర్ గ్రామానికి చెందిన అచ్చుదన్, మాలతి దంపతులు. మనస్పర్థల కారణంగా వీరిద్దరు ఆరేళ్ల క్రితం విడిపోయారు. ప్రస్తుతం మాలతి ఆం బూరులోని ప్రయివేటు షూ కంపెనీలో పనిచేస్తోంది. బుధవారం రాత్రి కంపెనీ నుంచి వానియంబాడి బస్టాండ్‌కు 7 గoటల సమయంలో వచ్చిన ఆమె అప్పటినుంచి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో ముళై రాణిపేట అటవీ ప్రాంతంలో మెడపైన గాయాలతో మా లతి విగతజీవిగా పడిఉండడాన్ని గుర్తిం చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీ ప్రాం తానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ పగలవన్ పరిశీలించారు. మాలతి వానియంబాడి నుంచి ప్రతిరోజూ షూ కంపెనీ బస్సులో వెళ్లేదని ఈ క్రమంలో బస్సు డ్రైవర్ కేశవన్‌తో అక్రమ సంబంధం ఏర్పడినట్లు సమాచారం అందింది. దీంతో కేశవన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. భార్యను కడతేర్చిన భర్త: అదే విధంగా తిరుపత్తూరు సమీపంలోని పెరియ కులమేడు గ్రామానికి చెం దిన రాజ భార్య సుమతి(34). వీరికి ఇ ద్దరు పిల్లలు. కాగా సుమతికి అదే ప్రాం తానికి చెందిన మరో యువకుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాజా, సుమతిలకు ఘర్షణ ఏర్పడింది. ఆ సమయంలో రాజ కత్తితో పొడిచి భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తిరుపత్తూరు వీఏవో మణిగంటన్ వద్ద రాజా లొంగిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న వానియంబాడి పో లీసులు అక్కడికి చేరుకుని నిందితుడు రాజాను అరెస్టు చేశారు. -
వేధిస్తున్నాడనే హత్య
వీడిన కేసు మిస్టరీ ఐదుగురు నిందితుల రిమాండ్ సీఐ నాగరాజు వెల్లడి జహీరాబాద్ టౌన్: వేధింపులను భరించలేకే కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిని హతమార్చారు. వివాహేతర బంధాన్ని నిలిపివేయాలని చెప్పినా వినకపోవడంతో సదరు వ్యక్తులు అంతమొందించినట్టు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు మంగళవారం రిమాండ్‌కు పంపారు. జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ డి.నాగరాజు వెల్లడించిన హత్య కేసు వివరాలు ఇలా... మండలంలోని మన్నాపూర్‌కు చెందిన వెంకటవిజయ్ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటూ జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పట్టణంలోని బాగారెడ్డి పల్లికి చెందిన బుజ్జమ్మను భర్త వదిలేయడంతో ఆమెతో వెంకట్‌విజయ్ వివాహేతర సంబధాన్ని కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన బుజ్జమ్మ సోదరులు అక్కను మందలించారు. దీంతో ఆమె వెంకట్‌విజయ్‌తో కొంతకాలంగా దూరంగా ఉంటుంది. వెంకట్‌విజయ్ అప్పుడప్పుడు తాగి ఆమె ఇంటికి వచ్చి అల్లరిచేస్తుండగా మందలించి పంపించేవారు. ఈ క్రమంలో వెంకట్‌విజయ్ ఈనెల 2వ తేదీ రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. బుజ్జమ్మ ఆమె తమ్ముళ్లు శ్రీనివాస్, కుమార్, అరుణ్‌కుమార్‌తో పాటు బేగరి సురేష్, గడికి చెందిన చిలపల్లి అరుణ్‌కుమార్‌లు ఇంటి వద్ద రాత్రంతా చితకబాదారు. మరుసటి రోజు పట్టణ సమీపంలోని రాంనగర్ ప్రాంతంలో గల దాల్మిల్ వద్ద గల అటవీ ప్రాంతంలోని తీసుకెళ్లారు. అక్కడే మద్యం తాగి కర్రలతో వెంకట్‌విజయ్‌ను చితకబాది హత్య చేశారని సీఐ తెలిపారు. శవంపై చెట్టు కొమ్మలు వేసి పరారైనట్టు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేశామన్నారు. అయితే సురేష్ పరారీలో ఉన్నాడని సీఐ వివరించారు. విలేకరుల సమావేశంలో జహీరాబాద్ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ పాల్గొన్నారు. -
నటి రాధ నుంచి నా భర్తను విడిపించండి
తమిళసినిమా: నటి రాధ బారి నుంచి తన భర్తను విడిపించాలని కోరుతూ స్థానిక కోడంబాక్కమ్, కామయరాజర్ కాలనీకి చెందిన ఉమాదేవి అనే మహిళ గురువారం చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అందులో ఆమె పేర్కొంటూ తన భర్త మునివేల్ సుందరాట్రావెల్స్ చిత్ర నాయకి రాధతో కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. ఈ విషయమై తాను స్థానిక విరుగమ్‌బాక్కమ్, టీ.నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాన ంది. దీంతో పోలీసులు తన భర్తను, నటి రాధను పిలిపించి విచారించి అనంతరం తన భర్తను తనతో పంపించార ని తెలిపింది. అయితే అప్పటి నుంచి నటి రాధ తన భర్తకు తరచూ ఫోన్ చేస్తూ తమ కుటుంబ సంతోషాన్ని దూరం చేస్తోందని అంది.అదే విధంగా తనకు వేరే వ్యక్తితో సంబంధం కలుపుతూ అసభ్యంగా మాట్లాడుతోందని చెప్పింది. తనను తన కూతురిని బెదిరిస్తోందిని పేర్కొంది. దీంతో తన కూతురు ఆమెకు భయపడి నాలుగు రోజులుగా కాలేజ్‌కు కూడా వెళ్లడం లేదని తెలిపింది. కొన్ని రోజులుగా తన భర్త కూడా కనిపించడం లేదని చెప్పింది. నటి రాధ నుంచి తన కుటుంబాన్ని కాపాడాలని, తన భర్తను ఆమె బారి నుంచి విడిపించి తనకు అప్పగించాలని ఫిర్యాదు పత్రంలో పేర్కొంది. ఉమాదేవి ఫిర్యాదును పరిశీలించిన పోలీస్‌కమిషనర్ టీకే.రాజేంద్రన్ వెంటనే విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫిర్యాదును టీ.నగర్ మహిళా పోలీస్ స్టేషన్‌కు పంపారు. దీంతో అక్కడి పోలీసులు ఒకటి రెండు రోజుల్లో నటి రాధను పిలిపించి విచారించే అవకాశం ఉంది. నటి రాధ ఇంతకు ముందొకసారి తనను ఒక వ్యాపారవేత్త మోసం చేశారని పోలీసులను ఆశ్రయించిందన్నది గమనార్హం. -
గుజరాత్లో అమానుషం
-
కుమారుడు అడ్డుగా ఉన్నాడని...
బెంగళూరు(బనశంకరి) : వివాహేతర సంబంధానికి తన కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించిన త ల్లి తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన పీణ్యా పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాలు... పీణ్యా పరిధిలోని శివపురలో రేఖమండల్ అనే మహిళకు ఎనిమిదేళ్ల బబ్లిమండల అనే కుమారుడు ఉన్నాడు. ఈమె విద్యుత్‌మండల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే ఈ సంబంధానికి తన కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించిన రేఖామండల్, ప్రియుడు విద్యుత్ మండల్‌తో కలిసి రెండు రోజుల క్రితం ఆ బాలుడిని హత్యచేసింది. అనంతరం తన కుమారుడు కనబడటం లేదని పీణ్యాపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో వారే హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు రేఖామండల్, విద్యుత్ మండల్‌ను బుధవారం అరెస్ట్ చేశారు. -
బస్సులో భార్యను అలా చూసి..
చీరాల: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఆమె సహోద్యోగిపై కత్తితో దాడిచేసి, పీకకోశాడో హెడ్ కానిస్టేబుల్. ప్రకాశం జిల్లా చీరాల బస్ స్టాండ్ లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ సంఘటనలో కానిస్టేబుల్ చెయ్యికూడా తెగిపోయింది. పోలీసులు తెలిపిన వివరాలనుబట్టి.. భార్యాపిల్లలతో కలిసి చీరాలలో నివసిస్తోన్న బాలిగ శ్రీనివాసరావు కారంచేడు పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య అదే ఊళ్లోని ఎల్ఐసీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తోంది. అదే ఆఫీసులో అసిసెంట్ మేనేజర్ సునీల్(35)తో ఆమెకు చనువు ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం శ్రీనివాసరావుకు తెలియడంతో పలు మార్లు భార్యను హెచ్చరించాడు. మాట వినకపోయేసరికి ఎలాగైనా సునీల్ ను అంతం చేయాలనుకున్నాడు. మంగళవారం తన భార్య సునీల్ తో కలిసి బస్సులో ఉండటాన్ని శ్రీనివాసరావు గమనించాడు. ఒక్కసారిగా బస్సులోకి వెళ్లి వెంటతెచ్చుకున్న కత్తితో సునీల్ పై దాడిచేసి పీకకోశాడు. ఈ పెనుగులాటలో హెడ్ కానిస్టేబుల్ చెయ్యి కూడా తెగిపోయింది. ఈ సంఘటనతో బస్టాండ్ ప్రాంతమంతా నివ్వెరపోయింది. రక్తపుమడుగులో పడిఉన్న సునీల్ ను, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావును కొందరు ప్రయాణికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సునీల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. -
ప్రియురాలి కోసం భార్యను చంపేశాడు
కాకినాడ రూరల్ : వివాహేతర బంధానికి అడ్డొస్తుందన్న నెపంతో భార్యను కడతేర్చాడు భర్త. కాకినాడ విద్యుత్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటనలో కిలిం నూకరత్నం దేవి( 27) బలైంది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రతాప్‌నగర్‌కు చెందిన పచ్చిపాల సత్యనారాయణకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె నూకరత్నందేవి విజయవాడ గవర్నర్‌పేటలో సెంట్రల్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్‌గా పనిచేస్తోంది. రమణయ్యపేటకు చెందిన కిలిమ్ శ్రీనివాసరావు కాకినాడ కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహం కాగా, ఏడాదిన్నర బాబు ఉన్నాడు. విద్యుత్‌నగర్‌లోని నాన్సిస్ట్రీట్‌లో ఉన్న ఓ అపార్టమెంట్లో శ్రీనివాసరావు, నూకరత్నందేవి ఉంటున్నారు. ఉద్యోగరీత్యా నూకరత్నందేవి వారానికి ఒకసారే కాకినాడకు వచ్చేది. దీనిని ఆసరాగా తీసుకున్న శ్రీనివాసరావు మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. అనుమానం వచ్చిన నూకరత్నం దేవి అప్పుడప్పుడూ భర్తను నిలదీసేది. ఆదివారం రాత్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లొచ్చాక వీరిమధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం ఉదయం కూడా గొడవ జరగడంతో శ్రీనివాసరావు తన భార్యను కొట్టి, తువాలును ఆమె మెడకు బిగించి చంపేశాడు. అనంతరం ప్రతాప్‌నగర్‌లో ఉంటున్న నూకరత్నందేవి తండ్రి సత్యనారాయణకు ఫోన్ చేసి, ‘మీ అమ్మాయికి దెబ్బ తగిలింది, ఆస్పత్రిలో చేర్చాం’ అని చెప్పాడు. తండ్రి, బంధువులు ఆస్పత్రికి వెళ్లగా, నూకరత్నందేవి చనిపోయి ఉంది. గొంతు నుమిలినట్టు ఉండడం, అపార్టమెంట్లో తువాలు చుట్టి ఉండడంతో.. ఆమెను హతమార్చారని నిర్ధారణకు వచ్చిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మురళీకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
మదనపల్లె: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ శివారులోని నక్కలదిన్నె తండాకు చెందిన మురళీనాయక్ వద్ద రమేష్‌నాయక్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే, రమేష్ భార్యతో మురళీనాయక్ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో రమేష్ నాయక్ భార్యతో గొడవలు జరిగేవి. పెద్దల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలోనే రమేష్‌నాయక్ మరొకరి వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనికి కుదిరాడు. ఇది మురళీనాయక్‌కు నచ్చలేదు. అతన్ని చంపేందుకు ప్లాన్ వేశాడు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో మరికొందరితో కలసి స్థానిక గంగమ్మ గుడి వద్ద కాపు కాశాడు. ట్రాక్టర్‌పై వస్తున్న రమేష్‌ను ఆపి కత్తులతో పొడిచి చంపి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను వదిలి...ప్రియుడితో వెళ్లి..
శవంగా మారిన యువతి పెద్దపల్లి మండలం కనగర్తిలో విషాదం పెద్దపల్లిరూరల్ : కట్టుకున్నోడిని వదిలి ప్రేమించినవాడితో వెళ్లిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పెద్దపల్లి మండలం కనగర్తిలో విషాదం నింపింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. కనగర్తి గ్రామానికి చెందిన పెద్దపల్లి బాపు వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. చిన్న కూతురు సౌందర్య (20)ను ఆదిలాబాద్ జిల్లా కొండపల్లికి చెందిన తిరుపతికిచ్చి తొమ్మిదినెలల క్రితం పెళ్లి చేశాడు. దంపతులిద్దరూ పెద్దపల్లిలోని క్రిస్టియన్‌కాలనీలో నివాసముంటూ కులవృత్తి చేసుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా నర్సింగాపూర్‌లో బాపు బంధువుల ఇంట్లో శుభకార్యం జరగగా సౌందర్య అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన నగునూరి సురేశ్‌తో పరిచయమైంది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. సౌందర్యకు పెళ్లరుునా.. సురేశ్ తరచూ ఇక్కడకు వచ్చేవాడని సమాచారం. ఈ క్రమంలో ఈనెల 16న సౌందర్య ఇంటినుంచి పారిపోరుుంది. 17న బాపు పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. వారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు సమాచారమిచ్చారు. సౌందర్య, సురేశ్ నర్సింగాపూర్‌లో ఉన్నట్లు తెలుసుకున్న హాజీపూర్ పోలీసులు ఇద్దరిని విచారణకు పిలిపించారు. తమను ఎక్కడ విడగొడుతారోనని భావించిన సౌందర్య, సురేశ్ క్రిమిసంహారక మందు తాగారు. సౌందర్య అక్కడికక్కడే మృతిచెందింది. సురేశ్‌ను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. సౌందర్య మృతివార్త తెలుసుకున్న బంధువులు హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. -
మొగుడొద్దు.. ప్రియుడే కావాలంటూ ఆత్మహత్య
అనంతపురం: అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను కాదనుకుంది. ప్రియుడి ఆకర్షణలో పడి అతడినే కావాలనుకుంది. కానీ, ప్రియుడు కుదరదనడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గుమ్మగట్ట మండలం నేత్రపల్లి గ్రామానికి చెందిన రుద్ర అనే యవకుడికి పెళ్లయింది. అయితే, గ్రామానికే చెందిన జయలక్ష్మి అనే మహిళతో రుద్రకు వివాహేతర సంబంధం ఏర్పడింది. జయలక్ష్మికి కూడా అప్పటికే పెళ్లయింది. కానీ ఆమె తన భర్తను కాదనుకుని రుద్రతోనే ఉంటానంది. పంచాయతీ పోలీసుల వరకూ వెళ్లింది. ఎవరి కాపురం వారు చక్కగా చేసుకోవాలని పోలీసులు చెప్పి పంపించారు. తన భార్యతోనే ఉంటానని ప్రియుడు రుద్ర తెగేసి చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. ప్రియుడు తనను కాదన్నడన్న మనస్తాపంతో జయలక్ష్మి మంగళవారం రాత్రి రుద్ర ఇంటి వద్దకు వెళ్లి పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకుంది. -
కన్న కొడుకునే..కడతేర్చిన కన్న తల్లి
-
పురుగుల మందు తాగి.. జంట బలన్మరణం
గుంటూరు: వివాహేతర సంబంధం ఓ జంట బలవన్మరణానికి దారి తీసింది. గుంటూరు జిల్లా మాచర్ల పట్టణం శివారులోని పొలాల్లో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. మాచర్లకు చెందిన శ్రీనివాసరావు బాపట్లలో ఎలక్ర్టిషియన్ గా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు అదే మండలంలోని జమ్మలపాలెనికి చెందిన ఝాన్సీతో కలిసి పొలాల్లో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం పొలాల్లో పనులకు వెళ్లిన వారు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు శుక్రవారమే జంట ఆత్యహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. సంఘటనాస్థలంలో ఓ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని రాసినట్టు పోలీసులు తెలిపారు. కాగా వివాహేతర సంబంధమే జంట ఆత్యహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమేదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (మాచర్ల) -
వివాహేతర సంబంధమే అంతం చేసిందా ?
మెదక్ : మెదక్ జిల్లా పుల్కల్ మండలం బద్రిగూడెంలో శుక్రవారం రాత్రి ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మున్నూర్ అశోక్ (40)ను రాత్రి సమయంలో కొందరు వచ్చి, పని ఉందంటూ సమీపంలోని బైరి ఆశయ్య ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అతన్ని కొట్టి, గొంతుకు వైర్‌ను బిగించడంతో మృతి చెందాడు. కాగా దీనిపై సమాచారం అందుకున్న పుల్కల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనలో ఐదుగురు వరకు పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధం వల్లే అతన్ని హతమార్చి ఉంటారని సమాచారం. కాగా, అశోక్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు లావణ్య(11), జ్యోతి(8), శ్రీలత (4)తో పాటు 20 రోజుల బాబు ఉన్నాడు. వీరంతా అశోక్పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. మృతుని భార్య మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితులను కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రియురాలితో పట్టుబడ్డ కానిస్టేబుల్
కాకినాడ: కాకినాడకు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ కట్టా దుర్గాప్రసాద్ పై అతని భార్య దాడి చేసింది. వివరాలు.... మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ దుర్గాప్రసాద్ భార్యకు పట్టుబడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ మహిళ దుర్గా ప్రసాద్ పై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటన సమయంలో దుర్గాప్రసాద్ ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. -
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..
జీవితాంతం తోడూనీడగా ఉంటానని ప్రమాణం చేసి తాళికట్టించుకుంది.. పద్నాలుగేళ్లు అతడితో జీవితాన్ని పంచుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.. వివాహేతర బంధం మోజులో పడి చివరకు కట్టుకున్న భర్త ఊపిరినే తీసేసింది.. ఆ ఇల్లాలు. ఈ దారుణ ఘటన బీబీనగర్ మండల కేం ద్రంలో ఆదివారం వెలుగుచూసింది. పోలీ సులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. -బీబీనగర్ బీబీనగర్ మండలం పడమటిసోమారం గ్రామానికి చెందిన మెడబోయిన ప్రభాకర్‌కు(32) మండల కేంద్రానికి చెందిన గుండెగళ్ల సత్తయ్య కూతురు రేణుకతో 14ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం ప్రభాకర్ తన కుటుంబంతో పదేళ్ల క్రితం బీబీనగర్‌కు వలసవచ్చాడు. రైల్వేస్టేషన్ సమీపంలో తన అత్తమామ ఇంటి పక్కనే అద్దె ఇంట్లో నివాసాముంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ప్రభాకర్ భార్య రేణుక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని నచ్చజెప్పాడు. మారకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. దీంతో రేణుక తన కార్యకలాపాలకు అడ్డొస్తున్న భర్తనే ఎలాగైనా కడతేర్చాలని నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి ప్రభాకర్ నిద్రిస్తున్న సమయంలో రేణుక గొంతు నులిపి చంపివేసింది. ఈ విషయం ఆదివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. కాగా రేణుక ఒక్కతే ప్రభాకర్‌ను హతమార్చిందా లేక వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలసి ఈఘాతుకానికి ఒడిగట్టిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు ఎస్ఐ ప్రణీత్‌కుమార్ తెలిపారు. రేణుక పథకం ప్రకారం ప్రభాకర్‌ను హతమార్చిందని మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ హత్య విషయం తెలుసుకున్న సీఐ తిరుపతిరెడ్డి,ఎస్ఐ ప్రణీత్‌కుమార్, దేవేందర్‌రెడ్డి ఆదివారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం రేణుకను అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెలుగులోకి వచ్చాయి. తానే ప్రభాకర్‌ను నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిపి హత్య చేసినట్టు రేణుక విచారణలో ఒప్పుకున్నట్టు ఎస్ఐ ప్రణీత్‌కుమార్ తెలిపారు.