బావను పెళ్లి చేసుకోవడం కోసం అక్కను చంపేసింది! | Elder Sister Kills Her Sisters Husband | Sakshi
Sakshi News home page

బావను పెళ్లి చేసుకోవడం కోసం అక్కను కడతేర్చిన చెల్లెలు

Published Sat, Mar 24 2018 7:24 AM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

Elder Sister Kills Her Sisters Husband - Sakshi

అరెస్టు అయిన రేఖ, నాగరాజ్‌

సాక్షి, చెన్నై(అన్నానగర్‌) : మానవత్వం మంట కలిసింది. వివాహేతర సంబంధం మోజులో ప్రియుడితో కలిసి అక్కను కడతేర్చిన యువతిని, ఆమె ప్రియుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు..తిరువణ్ణామలై జిల్లా సెంగనికి చెందిన భూపాలన్‌ (28), నదియ (24) దంపతులకు దక్షిత, సుదర్శన్‌లు సంతానం. భూపాలన్‌ తిరుప్పూర్‌ జిల్లా వీరపాండి సమీపం ఇడువమ్‌ పాళయంలో నివాసం ఉంటున్నాడు. బనియన్‌ సంస్థల్లో కార్మికులను పెట్టి జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో నదియ పిన్ని కుమార్తె రేఖ (22) ఉండేది. ఆమె అప్పుడప్పుడు నదియ ఇంటికి వచ్చి వెళుతుంటుంది. ఈ స్థితిలో గత 14న భూపాలన్, అతని తమ్ముళ్లు పనికి వెళ్లారు. పనికి వెళ్లిన భూపాలన్‌ తమ్ముడు మణివాలన్‌ రాత్రి ఇంటికి వచ్చాడు. అన్న కుమారుడు ఏడుస్తుండటంతో ఇంటి లోపలికి వెళ్లగా నదియా రక్తపు మడుగులో శవంగా పడి ఉండడం చూసి అన్నకు, వీరపాండి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఎస్‌ఐ మణిమోలి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేయగా నదియ ఐదు సవర్ల నగలు చోరీ అయినట్లు తెలిసింది. అనంతరం నదియ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరుప్పూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించి కేసు నమోదు చేశారు. 

విచారణలో అసలు విషయం వెలుగులోకి..
నదియ హత్యలో దోషులను పట్టుకోవడానికి జాయింట్‌ కమిషనర్‌ కయల్‌విలి పర్యవేక్షణలో ప్రత్యేకబృందం విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు ముందుగా నదియ ఇంటికి రేఖ వచ్చి హతురాలి కుమార్తెను తీసుకుని వెళ్లినట్లు తెలిసింది. అనంతరం ప్రత్యేక బృందం ఆమెని పట్టుకుని తీవ్ర విచారణ చేయగా ప్రియుడు నాగరాజ్‌తో కలిసి హత్య చేసినట్లుగా రేఖ ఒప్పుకోవడంతో వారిద్దరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తిరువణ్ణామలైకు చెందిన రేఖకు భర్త గజేంద్రన్‌ఖ, కుమారుడు ధనుష్కోటి, కుమార్తె నివేదా ఉన్నారు. అయితే సెంగమ్‌కు చెందిన నాగరాజ్‌తో వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో ఆమెను వదిలేసి వెళ్లడంతో పిల్లలను తీసుకుని రెండేళ్ల కిందట తిరుప్పూరుకి వచ్చింది. నాగరాజన్‌  కూడా ఆమెతో పాటే వచ్చాడు.

అయితే అక్క భర్త భూపాలన్‌ ఆర్థికంగా బలంగా ఉండటంతో అతడిని పెళ్లి చేసుకువాలని తలచింది. నదియ ప్రాణాలతో ఉంటే భూపాల్‌ను పెళ్లి చేసుకోవడం కుదరదని ప్రియుడు నాగరాజ్‌తో కలిసి అక్కను కడతేర్చింది. అయితే నదియాను రేఖ హత్య చేయటానికి మరో కారణం ఉన్నదని ప్రత్యేకబృందం పోలీసులు తెలిపారు.  రేఖకి నదియా భర్తతో సహా పలు మందితో సంబంధం ఉంది. నదియా భర్తతో రేఖ ఉన్న వీడియో మెమరీ కార్డు నదియాకి దొరికింది. దీనిని తిరిగి ఇవ్వమని రేఖ అడగటంతో నదియా ఇవ్వలేదు. దీని గురించి ఇద్దరికి గత కొన్ని రోజులుగా తగాదా ఏర్పడింది. భర్తతో ఉన్న వీడియోను చూపించి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని నదియా బెదిరించింది. దీంతో రేఖ తన ప్రియుడితో కలిసి నదియాని హత్య చేసిందని పోలీసులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement