
ఇద్దరు మహిళల హత్య
వేలూరు: వివాహేతర సంబంధం కారణంగా వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు.వానియంబాడి రెడ్డియూర్ గ్రామానికి చెందిన అచ్చుదన్, మాలతి దంపతులు. మనస్పర్థల కారణంగా వీరిద్దరు ఆరేళ్ల క్రితం విడిపోయారు. ప్రస్తుతం మాలతి ఆం బూరులోని ప్రయివేటు షూ కంపెనీలో పనిచేస్తోంది. బుధవారం రాత్రి కంపెనీ నుంచి వానియంబాడి బస్టాండ్‌కు 7 గoటల సమయంలో వచ్చిన ఆమె అప్పటినుంచి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో ముళై రాణిపేట అటవీ ప్రాంతంలో మెడపైన గాయాలతో మా లతి విగతజీవిగా పడిఉండడాన్ని గుర్తిం చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీ ప్రాం తానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌పీ పగలవన్ పరిశీలించారు. మాలతి వానియంబాడి నుంచి ప్రతిరోజూ షూ కంపెనీ బస్సులో వెళ్లేదని ఈ క్రమంలో బస్సు డ్రైవర్ కేశవన్‌తో అక్రమ సంబంధం ఏర్పడినట్లు సమాచారం అందింది. దీంతో కేశవన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
భార్యను కడతేర్చిన భర్త: అదే విధంగా తిరుపత్తూరు సమీపంలోని పెరియ కులమేడు గ్రామానికి చెం దిన రాజ భార్య సుమతి(34). వీరికి ఇ ద్దరు పిల్లలు. కాగా సుమతికి అదే ప్రాం తానికి చెందిన మరో యువకుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాజా, సుమతిలకు ఘర్షణ ఏర్పడింది. ఆ సమయంలో రాజ కత్తితో పొడిచి భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తిరుపత్తూరు వీఏవో మణిగంటన్ వద్ద రాజా లొంగిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న వానియంబాడి పో లీసులు అక్కడికి చేరుకుని నిందితుడు రాజాను అరెస్టు చేశారు.