వివరాలు వెల్లడిస్తున్న సీఐ వెంకటేశ్
జిన్నారం(పటాన్‌చెరు) : ఈ నెల 3 సాదుల్లానగర్‌లో జరిగిన వ్యక్తి హత్యకు అక్రమ సంబంధమే కారణమని జిన్నారం సీఐ శ్యామల వెంకటేశ్ తెలిపారు. ఇందుకు కారణమైన 8 మదిని అదుపులోకి తీసకున్నట్లు ఆయన చెప్పారు. సీఐ కథనం ప్రకారం.. హత్నూర మండలంలోని సాదుల్లానగర్‌కు చెందిన ఎర్రోళ్ల ప్రభాకర్ భార్యకు అదే గ్రామంలో నివాసం ఉంటూ అతనికి వరసకు మేన బావ అయిన చెక్కల భాస్కర్‌కు గత కొంత కాలంగా అక్రమ సంబంధం ఉంది.
ప్రభాకర్ భార్య, చెక్కల భాస్కర్‌కు వరసకు చెల్లి అవుతుంది. విషయం తెలుసుకున్న ప్రభాకర్ చాలా సార్లు భాస్కర్‌కు తన భార్యతో సంబంధం మానుకోవాలని సూచించాడు. అయినా అతనిలో మార్పు రాక పోవడంతో ప్రభాకర్ అనేక సార్లు భాస్కర్‌ను చంపుతానని హెచ్చరించాడు.
ఎలాగైన భాస్కర్‌ను చంపాలని నిర్ణయించుకున్న ప్రభాకర్ వరసకు తమ్ముళ్లయిన సాదుల్లానగర్‌కు చెందిన ఎర్రోళ్ల రమేశ్, ఎర్రోళ్ల వీరేశం, నస్తిపూర్‌లో నివాసం ఉంటున్న బోయిన శ్రీధర్‌లతో పాటు జిన్నారం మండలంలోని మంగంపేట గ్రామంలో నివాసం ఉంటూ వరసకు బావ అయిన మాచబోయిన శ్రీకాంత్‌లతో కలిసి భాస్కర్‌ను చంపేందుకు నిర్ణయించుకున్నాడు.
భాస్కర్ చాలా బలవంతుడని భావించిన ప్రభాకర్ వడ్డేపల్లి గ్రామానికి చెందిన గతంలో కొన్ని కేసులు ఉండి, ప్రసుతం నర్సాపూర్‌లో నివాసం ఉంటున్న హనుమంతు నరేష్‌గౌడ్‌ను కలిశాడు. డబ్బులు ఇస్తానని ఎలాగైన భాస్కర్‌ను చంపాలని అతడిని కోరాడు. దీంతో నరేష్‌గౌడ్ నర్సాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న తన స్నేహితులైన తొంట ప్రేమ్‌కుమార్, తొంట వినయ్‌కుమార్‌లతో కలిసి భాస్కర్‌ను చంపేందుకు సిద్దమయ్యారు.
ఈనెల 3న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భాస్కర్ ఇంట్లో ఉన్న సమయంలో ప్రభాకర్‌తో పాటు మిగతా వారు అతడిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న భాస్కర్ కళ్లల్లో కారం చల్లి బయటకు తీసుకువచ్చారు. ప్రభాకర్‌తో పాటు మిగత తమ్ముళ్లు, స్నేహితులు భాస్కర్‌ను తీవ్రంగా కొట్టారు. వీరంతా అతడిని పట్టుకుని ఉండగా ప్రభాకర్ కత్తితో అతని చేతిని విరగొట్టి హత్యచేశాడు.
ఈ సంఘటనలో అప్పట్లో సంచలనం రేపింది. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నాడు. గురువారం గుమ్మడిదల పోలీస్‌స్టేషన్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పందంగా కనిపించటంతో 8మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా భాస్కర్‌ను హత్య చేసింది వీరేనని తేలింది.
దీంతో ఏ1గా ప్రభాకర్‌తో పాటు అతని తమ్ముళ్లు రమేశ్, వీరేశం, శ్రీధర్, శ్రీకాంత్, నర్సాపూర్‌లోని నరేష్‌గౌడ్, ప్రేమ్‌కుమార్, వినయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. త్వరగా కేసును ఛేదించేందుకు కృషి చేసిన పోలీసులను సీఐ శ్యామల వెంకటేశ్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment