
కరెన్ మెక్‌డౌగల్-డొనాల్డ్ ట్రంప్ (పాత చిత్రాలు)
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో లైంగిక సంబంధం ఉన్నట్లు మరో మహిళ మీడియా ముందుకు వచ్చింది. ప్లే బాయ్ మోడల్(మాజీ) అయిన కరెన్ మెక్‌డౌగల్(46).. ట్రంప్ తనతో శారీరక సంబంధం నెరిపినట్లు ఆరోపిస్తోంది.
2006లో ట్రంప్ తనతో అఫైర్ కొనసాగించారని.. ఆదే సమయంలో ట్రంప్ భార్య మెలానియా కొడుక్కి జన్మనిచ్చిందని మెక్‌డౌగల్ తెలిపింది. తొమ్మిది నెలలపాటు వారి సంబంధం కొనసాగిందన్న ఆమె.. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాలను బయటకు పొక్కనీయకుండా ట్రంప్ డబ్బుతో ఒప్పందం చేసుకున్నాడంటూ పేర్కొంది. మెక్‌డౌగల్ ఇంటర్వ్యూను న్యూ యార్కర్ అనే పత్రిక తాజాగా ప్రచురించటంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. లక్షా 50,000 డాలర్లతో ఈ ఒప్పందం జరిగిందని ఆ కథనం వివరించింది. అయితే గతంలోనే ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ఈ వార్తపై స్పందించేందుకు వైట్ హౌజ్ నిరాకరించింది.
ట్రంప్ తో మాజీ పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫార్డ్(స్టార్మీ డేనియల్స్) అఫైర్.. అది బయటకు పొక్కకుండా అధ్యక్ష ఎన్నికల సమయంలో లక్షా 30 వేల డాలర్లతో ఒప్పందం.. కథనాలు వెలువడటం, తాజాగా అది నిజమేనని ట్రంప్ పర్సనల్ లాయర్ మైఖేల్ కోహెన్ ధృవీకరించటం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment