
భర్తను వదిలి...ప్రియుడితో వెళ్లి..
శవంగా మారిన యువతి
పెద్దపల్లి మండలం కనగర్తిలో విషాదం
పెద్దపల్లిరూరల్ : కట్టుకున్నోడిని వదిలి ప్రేమించినవాడితో వెళ్లిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పెద్దపల్లి మండలం కనగర్తిలో విషాదం నింపింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. కనగర్తి గ్రామానికి చెందిన పెద్దపల్లి బాపు వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. చిన్న కూతురు సౌందర్య (20)ను ఆదిలాబాద్ జిల్లా కొండపల్లికి చెందిన తిరుపతికిచ్చి తొమ్మిదినెలల క్రితం పెళ్లి చేశాడు. దంపతులిద్దరూ పెద్దపల్లిలోని క్రిస్టియన్‌కాలనీలో నివాసముంటూ కులవృత్తి చేసుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా నర్సింగాపూర్‌లో బాపు బంధువుల ఇంట్లో శుభకార్యం జరగగా సౌందర్య అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన నగునూరి సురేశ్‌తో పరిచయమైంది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
సౌందర్యకు పెళ్లరుునా.. సురేశ్ తరచూ ఇక్కడకు వచ్చేవాడని సమాచారం. ఈ క్రమంలో ఈనెల 16న సౌందర్య ఇంటినుంచి పారిపోరుుంది. 17న బాపు పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. వారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు సమాచారమిచ్చారు. సౌందర్య, సురేశ్ నర్సింగాపూర్‌లో ఉన్నట్లు తెలుసుకున్న హాజీపూర్ పోలీసులు ఇద్దరిని విచారణకు పిలిపించారు. తమను ఎక్కడ విడగొడుతారోనని భావించిన సౌందర్య, సురేశ్ క్రిమిసంహారక మందు తాగారు. సౌందర్య అక్కడికక్కడే మృతిచెందింది. సురేశ్‌ను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. సౌందర్య మృతివార్త తెలుసుకున్న బంధువులు హుటాహుటిన బయల్దేరి వెళ్లారు.