పురుగుల మందు తాగి.. జంట బలన్మరణం | 2 suicide in guntur distirict | Sakshi

పురుగుల మందు తాగి.. జంట బలన్మరణం

Published Sat, Apr 25 2015 10:37 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

2 suicide in guntur distirict

గుంటూరు: వివాహేతర సంబంధం ఓ జంట బలవన్మరణానికి దారి తీసింది. గుంటూరు జిల్లా మాచర్ల పట్టణం శివారులోని పొలాల్లో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. మాచర్లకు చెందిన  శ్రీనివాసరావు బాపట్లలో ఎలక్ర్టిషియన్ గా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు అదే మండలంలోని జమ్మలపాలెనికి చెందిన ఝాన్సీతో కలిసి పొలాల్లో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం పొలాల్లో పనులకు వెళ్లిన వారు మృతదేహాలను చూసి  పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు శుక్రవారమే జంట ఆత్యహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. సంఘటనాస్థలంలో ఓ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని రాసినట్టు పోలీసులు తెలిపారు. కాగా వివాహేతర సంబంధమే జంట ఆత్యహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమేదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(మాచర్ల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement