
మొగుడొద్దు.. ప్రియుడే కావాలంటూ ఆత్మహత్య
అనంతపురం: అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను కాదనుకుంది. ప్రియుడి ఆకర్షణలో పడి అతడినే కావాలనుకుంది. కానీ, ప్రియుడు కుదరదనడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
గుమ్మగట్ట మండలం నేత్రపల్లి గ్రామానికి చెందిన రుద్ర అనే యవకుడికి పెళ్లయింది. అయితే, గ్రామానికే చెందిన జయలక్ష్మి అనే మహిళతో రుద్రకు వివాహేతర సంబంధం ఏర్పడింది. జయలక్ష్మికి కూడా అప్పటికే పెళ్లయింది. కానీ ఆమె తన భర్తను కాదనుకుని రుద్రతోనే ఉంటానంది.
పంచాయతీ పోలీసుల వరకూ వెళ్లింది. ఎవరి కాపురం వారు చక్కగా చేసుకోవాలని పోలీసులు చెప్పి పంపించారు. తన భార్యతోనే ఉంటానని ప్రియుడు రుద్ర తెగేసి చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. ప్రియుడు తనను కాదన్నడన్న మనస్తాపంతో జయలక్ష్మి మంగళవారం రాత్రి రుద్ర ఇంటి వద్దకు వెళ్లి పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకుంది.