భార్య వివాహేతర సంబంధం: మంచం కింద దాక్కొని హత్య | Illegal Affair: Man Kills Her Wife Lover In Karnataka | Sakshi
Sakshi News home page

భార్య వివాహేతర సంబంధం: మంచం కింద దాక్కొని హత్య

Mar 26 2021 6:10 PM | Updated on Mar 26 2021 7:30 PM

Illegal Affair: Man Kills Her Wife Lover In Karnataka - Sakshi

సాఫీగా సాగిపోతున్న సంసారంలో భార్య స్నేహితుడు ఎంట్రీ. ఆ పచ్చటి సంసారంలో నిప్పు రాజేసింది

బెంగళూరు: సాఫీగా సాగిపోతున్న సంసారంలో భార్య స్నేహితుడు రావడంతో ఆ పచ్చటి సంసారంలో నిప్పు రాజేసింది. ఫలితంగా భార్యతో అతడు సాగిస్తున్న రాసలీలలు ఆగ్రహం తెప్పించాయి. తన కాపురంలో చిచ్చు పెట్టిన వ్యక్తిని హతమార్చేందుకు ఆమె భర్త పక్కా ప్లాన్‌ వేశాడు. భార్య ప్రేయసిని హత్య చేసేందుకు దాదాపు ఆరు గంటలకు పైగా మంచం కింద కూర్చుని అదును కోసం వేచి ఉన్నాడు. భార్య అర్ధరాత్రి బాత్రూమ్‌ వెళ్లగా ఇదే మంచి సమయమని భావించి పైకొచ్చి మంచంపై ఉన్న ప్రియుడిని హత్య చేశాడు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది.

హోసహల్లి తండాకు చెందిన వినుత, భరత్‌ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు. నెలమంగళ సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో భార్యాభర్తలు పని చేస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఉద్యోగం పని మీద వినుత స్నేహితుడు శివరాజ్‌ ఇంటికి వచ్చాడు. ఓ వారం పాటు వారితో ఉన్నాడు. శివరాజ్‌కు వినుతనే ఉద్యోగం వచ్చేలా చేసింది. ఈ క్రమంలో శివరాజ్‌ వినుతకు ‘ఐలవ్యూ’ చెప్పాడు. ఆమె షాక్‌కు గురయి నిరాకరించింది. అయితే తనను పప్రేమించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని శివరాజ్‌ బెదిరింపులకు పాల్పడడంతో ఆమె మెత్తబడింది. దీంతో వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు ఈ విషయం భర్త భరత్‌కు తెలిసింది. దీనిపై నిలదీయగా భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో వినుత అతడిని వదిలేసి ఒంటరిగా నివసించడం మొదలైంది. అయితే శివరాజ్‌తో మాత్రం వినుత సంబంధం కొనసాగిస్తోంది. 

తన భార్య దూరం కావడానికి కారణమైన శివరాజ్‌ను అంతమొందించాలని భరత్‌ నిర్ణయించుకున్నాడు. దీంతో గురువారం రాత్రి భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆమె లేని సమయంలో ఇంట్లోకి దూరి మంచం కింద దాచుకున్నాడు. కొద్దిసేపటికి భార్య, ఆమె ప్రియుడు శివరాజ్‌ వచ్చారు. మంచంపైనే భార్యతో అతడు సాగిస్తున్న సంబంధం చూసి ఆక్రోశం పెంచుకున్నాడు. అదును కోసం చూస్తూ దాదాపు ఆరు గంటల వరకు వేచి ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భార్య బాత్రూమ్‌కు వెళ్లింది. ఇదే సమయమని భావించి అతడు వెంటనే మంచం కింద నుంచి బయటకు వచ్చి శివరాజ్‌పై పదునైన కత్తితో దాడి చేసి హత్య చేశాడు. దీనిపై బైదరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు భరత్‌ పరారవుతుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి..
చదవండి: ‘లేడీ సింగమ్‌’ ఆత్మహత్య.. మహారాష్ట్రలో ప్రకంపనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement