కిడ్నాప్‌కు గురైన మనీశ్వరి తల్లిదండ్రులు
నందిపేట(ఆర్మూర్): వివాహేతర సంబంధం ఆరేళ్ల బాలికను కిడ్నాప్‌నకు చేసేలా చేసింది. తనతో వివాహేతర సం బంధం కొనసాగిస్తున్న వ్యక్తి తన మాటలు విన డం లేదని గొడవ పడిన యువతి అతడి బిడ్డను కిడ్నాప్ చేసేందుకు పన్నాగం పన్నింది. పాఠశాలకు వెళ్లి చాక్లెట్లు కొనిస్తానని మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిన సంఘటన నందిపేటలో గురువారం చోటుచేసుకుంది. కిడ్నాప్‌నకు గురైన బాలి క తల్లి, పోలిసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రెండు కుటుంబాల మధ్య తగాదాలు
మండలంలోని వన్నెల్ కే గ్రామానికి చెందిన మద్ది రమేష్, హరిత దంపతులకు ఆరేళ్ల కూతురు మనీశ్వరీ, ఏడాది వయస్సున్న కూతురు అహల్య ఉ న్నారు. మనీశ్వరీ నందిపేటలోని శ్రీగీతా హైస్కూల్‌లో యూకేజీ చదువుతుంది. మద్ది రమేష్ వన్నెల్ కే గ్రామానికి పక్కనే గల ఆర్మూర్ మండలం మ చ్చర్లలో మీసేవ కేంద్రం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో కొంత కాలంగా మచ్చర్లలోని ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలితో పరిచయం ఏర్పడింది. క్రమేణ వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరికి కూడా ఓ కూతురు జన్మించింది. అయితే కొన్ని రోజులుగా వీరిద్దరితో పాటు రెండు కుటుంబాల మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. దీంతో కోపంతో యువతి, రమేశ్ దంపతుల కూతురును కిడ్నాప్ చేసేందుకు నిర్ణయించింది.
చాక్లెట్లు కొనిస్తానని చెప్పి..
మండల కేంద్రంలోని శ్రీగీతా హైస్కూల్‌లో చదువున్న మనీశ్వరీని ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకుంది. బుధవారం పాఠశాలకు వెళ్లి పాఠశాలలో ఏవైనా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయా అని ఆరా తీసింది. ఖాళీలు లేవని యాజమాన్యం చెప్పడంతో వెనుదిరిగి వెళ్తూ పాప గురించి ఆరా తీసింది. ఆ రోజు పాప పాఠశాలకు రాలేదని తెలియడంతో వెళ్లిపోయింది. తిరిగి గురువారం మళ్లీ పాఠశాలకు వచ్చి పాప గురించి ఆరా తీయగా గమనించిన పాఠశాల సిబ్బంది ఖాళీలు లేవని మళ్లీ ఎందుకు వచ్చావని సదరు యువతిని ప్రశ్నించారు.
మనీశ్వరీ తన బంధువుల అమ్మాయి అని చెప్పి తనతో పంపిచాలని కోరడంతో పంపించ డం కుదరదని చెప్పినా అక్కడే ఉండి, మధ్యా హ్నం లంచ్ సమయంలో మనీశ్వరీ చేతులు కడుక్కునేందుకు బయటకు రాగా పాపను పక్కకు పిలిచి చాక్లెట్లు కొనిస్తానని చెప్పి మరో వ్యక్తితో కలిసి బైక్‌పై ఎక్కించుకుని పరారైంది. దీంతో పాఠశాల యాజమాన్యం గుర్తించి వెంటనే పాప తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.
పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు పాపను తీసుకెళ్లిన యువతి గురించి వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల వెతికిన ఫలితం లేదు. గురువారం సాయంత్రం పాప తల్లి హరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పాప ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ సంతోషకుమార్ తెలిపారు. పాప తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment