
ఖమ్మంక్రైం : అనైతిక సంబంధం. ప్రియుడి అనుమానం, మితికి మించిన అతి చనువు.. ఓ మహిళను చంపేశాయి. ఖమ్మంనిలో ఇది జరిగింది.
వన్ టౌన్ సీఐ రెహమాన్ తెలిపిన వివరాలు...
⇒ పాకబండ బజార్‌కు చెందిన జగసాని రూప(42) భర్త శ్రీనివాస్, ఐదేళ్ల క్రితం మృతిచెందాడు. తన భర్త చేసిన బట్టల వ్యాపారాన్ని వృత్తిగా ఆమె ఎంచుకుంది. ఒక్కగానొక్క కూతురికి వివాహం చేసింది.
⇒ ముస్తాఫానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గయాజ్ పాషాతో ఆమెకు సాన్నిహిత్యముంది. వారిద్దరూ నాలుగేళ్ల నుంచి ముస్తాఫానగర్‌లో సహజీవనం చేస్తున్నారు.
⇒ ఇటీవలి కాలంలో ముస్తాఫానగర్‌లోని బరాకత్ చర్చి ప్రాంతంలో కొత్త ఇంటిని రూప కట్టుకుంది. ఇల్లు కట్టేందుకు వచ్చిన మేస్త్రీ ప్రసాద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారు చనువుగా ఉంటున్నారు.
⇒ దీనిని గయాజ్‌పాషా గమనించాడు. రూపను పలుమార్లు హెచ్చరించాడు. మేస్త్రీ ప్రసాద్‌ను కూడా మందలించాడు. తమ మధ్య కేవలం పరిచయం మాత్రమే ఉందని పాషాతో రూప చెప్పింది. ఈ ‘పరిచయం–చనువు’ విషయమై వారి మధ్య తరచూ గొడవులు జరుగుతున్నాయి.
⇒ బుధవారం రాత్రి కూడా వారిద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. తెల్లవారుజాము వరకు గొడవ పడుతూనే ఉన్నారు. క్షణికావేశంలో రూప మెడకు వైరు బిగించాడు పాషా. క్షణాల్లోనే ఆమె ప్రాణాలొదిలింది.
⇒ తెల్లవారాక చుట్టుపక్కల వారికి తెలిసింది. వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటికి సీఐ రెహమాన్ వచ్చారు. మృతదేహాన్ని పరిశీలించారు.
⇒ గయాజ్ పాషాను అదుపులోకి తీసుకుని కేసు విచారిస్తున్నారు.