
కుమారుడు అడ్డుగా ఉన్నాడని...
బెంగళూరు(బనశంకరి) : వివాహేతర సంబంధానికి తన కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించిన త ల్లి తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన పీణ్యా పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాలు... పీణ్యా పరిధిలోని శివపురలో రేఖమండల్ అనే మహిళకు ఎనిమిదేళ్ల బబ్లిమండల అనే కుమారుడు ఉన్నాడు.
ఈమె విద్యుత్‌మండల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే ఈ సంబంధానికి తన కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించిన రేఖామండల్, ప్రియుడు విద్యుత్ మండల్‌తో కలిసి రెండు రోజుల క్రితం ఆ బాలుడిని హత్యచేసింది.
అనంతరం తన కుమారుడు కనబడటం లేదని పీణ్యాపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో వారే హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు రేఖామండల్, విద్యుత్ మండల్‌ను బుధవారం అరెస్ట్ చేశారు.