కాకినాడ: కాకినాడకు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ కట్టా దుర్గాప్రసాద్ పై అతని భార్య దాడి చేసింది. వివరాలు.... మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ దుర్గాప్రసాద్ భార్యకు పట్టుబడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ మహిళ దుర్గా ప్రసాద్ పై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటన సమయంలో దుర్గాప్రసాద్ ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.