మహిళపై దాడి.. వ్యక్తి అరెస్టు | Attack on woma..person arrest | Sakshi
Sakshi News home page

మహిళపై దాడి.. వ్యక్తి అరెస్టు

Published Mon, Mar 19 2018 8:22 AM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM

Attack on woma..person arrest - Sakshi

నిందితుడు శంకర్, గాయపడిన షకీలా

గుమ్మిడిపూండి: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి భార్యపై కత్తితో దాడిచేసిన సంఘటన ఆరంబాక్కంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు..గుమ్మిడిపూండి సమీపంలోని ఆరంబాక్కంలోని చెల్లియమ్మన్‌  ఆలయ వీధికి చెందిన శంకర్‌ భార్య సత్యకు అదేప్రాంతానికి చెందిన మొహిద్దీన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై శంకర్‌ తన భార్యతో తరచూ గొడవలు పడుతుండటంతో ఈనెల 15న సత్య ఆదంబాక్కంలోని తన తల్లి ఇంటికి వెళ్లింది.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం మొహిద్దీన్‌ భార్య షకీలా శంకర్‌ ఇంటి మీదుగా పోతుండుగా, నీభర్త కారణంగా నా కుటుంబం నాశనమైందని ఆగ్రహంతో కత్తితో షకీలాపై దాడి చేశాడు. దాడిలో చేతులకు, తల, నోటిపై తీవ్ర గాయాలు కావడంతో చుట్టుపక్కల వాళ్లు అడ్డుకుని ఆరంబాక్కం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ చంద్రశేఖర్‌ వచ్చి గాయపడిన షకీలాను చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడిచేసిన శంకర్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement