
సాక్షి, వరంగల్ : పెళ్లయి పదేళ్లయ్యింది. భర్తకి పనీపాటా లేదు. ప్రభుత్వ ఉద్యోగి అయిన భార్య సంపాదన మీదే బండి లాగిస్తున్నాడు. పైగా బుద్ధి కూడా గడ్డి తింది. కట్టుకున్న భార్యకు ద్రోహం చేశాడు. చిన్నిల్లు మొయింటైన్ చేస్తూ అడ్డంగా బుక్కయిపోయాడు. భార్య చేతిలో బడితె పూజలందుకున్నాడు. వరంగల్ అర్బన్ జిల్లా పోతన నగర్‌లోని బీట్ బజార్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.(నల్లజాతీయుడిపై పోలీసుల అమానుష వైఖరి)
రెండు నెలలుగా భర్త ఇంటికి రాకపోవడంతో, ఆరా తీసిన భార్యకు అసలు విషయం తెలిసింది. కుటుంబ సభ్యులను వెంటేసుకుని బయలుదేరింది. బీట్ బజార్‌లోని ఓ ఇంట్లో మరో మహిళతో ఉన్న తన భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆగ్రహం పట్టలేక.. ఎడాపెడా వాయించింది. అనంతరం తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.(ప్రేమపేరుతో యువతిపై అత్యాచారయత్నం!)