
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కోదాడ: ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌వద్ద కోదాడ– హుజూర్‌నగర్ రోడ్డుపై జరిగింది. వివరాలు...బాలాజీనగర్‌కు చెందిన మాళోతు ఉపేందర్(29) బైక్‌పై కోదాడ నుంచి బాలాజీనగర్‌కు వెళుతున్నాడు అయ్యప్పస్వామి దేవాలయం వద్ద ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మరోబైక్‌ను ఢీకొట్టాడు. ఇదే సమయంలో పక్కనే వెళుతున్న లారీ కింద పడడంతో ఉపేందర్ మీదుగా లారీ వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. రెండో బైక్‌పై ఉన్న బర్మావత్ సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఉపేందర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.