
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
కట్టంగూర్
మండలంలోని అయిటిపాముల గ్రామశివారు జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాదులోని ఉప్పల్‌కు చెందిన గుర్రం చంద్రశేఖర్(35) నకిరేకల్ జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నాడు. తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు నకిరేకల్‌లో కారు ఎక్కాడు. మండలంలోని అయిటిపాముల గ్రామశివారులో గల సబ్‌స్టేషన్ సమీపంలో రాగానే కారుడ్రైవర్ ప్రమాదవశాత్తు కల్వర్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ఎడమవైపు కూర్చున్న చంద్రశేఖర్ కారులోంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.