persondie
-
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామశివారు జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాదులోని ఉప్పల్‌కు చెందిన గుర్రం చంద్రశేఖర్(35) నకిరేకల్ జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నాడు. తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు నకిరేకల్‌లో కారు ఎక్కాడు. మండలంలోని అయిటిపాముల గ్రామశివారులో గల సబ్‌స్టేషన్ సమీపంలో రాగానే కారుడ్రైవర్ ప్రమాదవశాత్తు కల్వర్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ఎడమవైపు కూర్చున్న చంద్రశేఖర్ కారులోంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కోదాడ: ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం పట్టణ పరిధిలోని బాలాజీనగర్వద్ద కోదాడ– హుజూర్నగర్ రోడ్డుపై జరిగింది. వివరాలు...బాలాజీనగర్‌కు చెందిన మాళోతు ఉపేందర్(29) బైక్‌పై కోదాడ నుంచి బాలాజీనగర్‌కు వెళుతున్నాడు అయ్యప్పస్వామి దేవాలయం వద్ద ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మరోబైక్‌ను ఢీకొట్టాడు. ఇదే సమయంలో పక్కనే వెళుతున్న లారీ కింద పడడంతో ఉపేందర్ మీదుగా లారీ వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. రెండో బైక్‌పై ఉన్న బర్మావత్ సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఉపేందర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అధికంగా మద్యం సేవించిన యువకుడి మృతి
భువనగిరి అర్బన్ : మద్యం అధికంగా సేవించడంతో యువకుడు మృతి చెందిన సంఘటన భువనగిరిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఇందిర నగర్‌కు చెందిన బుచ్చాల శంకరయ్య, రాజమ్మ దంపతుల రెండో కుమారుడు చిరంజీవి(27) కూలి పని చేస్తున్నాడు. రోజులాగే శనివారం ఉదయం కూడా పని వెళ్లాడు. సాయంత్రం పని ముగించుకొని వస్తూ పట్టణంలోని వినాయక చౌరస్తాలో ఉన్న ఓ బార్లోకి వెళ్లి అధికంగా మద్యం సేవించాడు. దీంతో ఇంటికి వెళ్లలేని స్థితిలో ఉన్న చిరంజీవి ఆ బారు ముందు ఉన్న మెట్లపై పడిపోయాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో దప్పిక వేసి మృతి చెందినట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున మున్సిపల్ సిబ్బంది గమనించి చూడగా మృతిచెంది ఉన్నాడు. దీంతో వారు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడి చేరుకున్నారు. మృతి చెందిన తీరును పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు కిరణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పట్టణ ఎస్ఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు.