‘కంచి కామకోటి పీఠం’ శంకుస్థాపన
కొలనుకొండ(తాడేపల్లి రూరల్): మండలంలోని కొలనుకొండ జాతీయ రహదారి మోడల్ డెయిరీ పక్కన కంచి కామకోటి పీఠం అమరావతి పుర శాఖ భవన సముదాయానికి ఆదివారం కంచి కామకోటి పీఠాధిపతులు స్వామి జయేంద్ర సరస్వతి, స్వామి విజయేంద్ర సరస్వతి శంకుస్థాపన చేశారు. అనంతరం విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ భవన నిర్మాణం అనంతరం ఇక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భవనంలో వేద పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల స్వామీజీలు పాల్గొన్నారు.