నేడు ‘ఇండిపెండెన్స్‌ రైడ్‌’ | Independence day ride today | Sakshi
Sakshi News home page

నేడు ‘ఇండిపెండెన్స్‌ రైడ్‌’

Published Sun, Aug 14 2016 11:57 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

నేడు ‘ఇండిపెండెన్స్‌ రైడ్‌’ - Sakshi

నేడు ‘ఇండిపెండెన్స్‌ రైడ్‌’

 
 నెల్లూరు(బృందావనం): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు బైకర్‌ హుడ్‌ ఆధ్వర్యంలో సోమవారం ఇండిపెండెన్స్‌ రైడ్‌ నిర్వహిస్తున్నట్లు ఎంజీబీ ఫెలిసిటీ మాల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎంజీ గోపాలకృష్ణ తెలిపారు. నగరంలోని ఎంజీబీ ఫెలిసిటీమాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. యువతకు బైక్‌ రైడింగ్, ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు హార్లీ డేవిడ్‌సన్, ట్రైంప్, బెన్నిలీ, తదితర ప్రఖ్యాత కంపెనీలకు చెందిన మోటారుసైకిళ్లతో రైడ్‌  నిర్వహిస్తున్నట్లు వివరించారు. బైకర్‌హుడ్‌ సభ్యుడు ఎంజీ రాఘవ మాట్లాడుతు ఎంజీబీ మాల్‌ నుంచి సోమవారం ఉదయం 9.30గంటలకు 11 మోటారుసైకిళ్లతో రైడ్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్, మినీబైపాస్‌రోడ్డు, వేదాయపాళెం మీదుగా ఎంబీజీ మాల్‌కు చేరుకుంటుందన్నారు. ఈ సమావేశంలో బైకర్‌హుడ్‌ సభ్యులు కస్తూరితిలక్, శివకుమార్,మాల్‌ జనరల్‌ మేనేజర్‌ రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement