కోలుకోలేక.. మృత్యువాత... | injured boy died | Sakshi
Sakshi News home page

కోలుకోలేక.. మృత్యువాత...

Published Fri, Dec 16 2016 12:37 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

injured boy died

గుమ్మఘట్ట: మండలంలోని బేలోడుకు చెందిన ఈడిగ అంజినమ్మ, వన్నూరప్ప దంపతుల కుమారుడు ఆంజినేయులు(15) ఎట్టకేలకు గురువారం మృతి చెందినట్లు ఎస్‌ఐ హైదర్‌వలి తెలిపారు. రెండు నెలల కిందట గ్రామంలో నిర్వహించిన మొహర్రం సందర్భంగా పీరుతో సహా అగ్నిగుండంలో ప్రవేశించాడన్నారు. గుండంలో నుంచి పైకి ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోవడంతో శరీరమంతా కాలి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు.

బళ్లారి విమ్స్‌లో చికిత్స పొందిన అనంతరం స్వగ్రామానికి వచ్చాడు. ఆ తరువాత రెగ్యులర్‌ చెకప్‌ కింద రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో అతను మరణించడంతో తల్లిదండ్రులు విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement