రూ.6.35లక్షలకు ఐపీ దాఖలు | IP for 6.35 lacks | Sakshi
Sakshi News home page

రూ.6.35లక్షలకు ఐపీ దాఖలు

Published Wed, Sep 14 2016 11:57 PM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM

IP for 6.35 lacks

ఖమ్మం లీగల్‌: ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన సిరిగిరి కృష్ణ స్థానిక జిల్లా కోర్టులో తనను దివాలాదారుగా ప్రకటించాలని ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చుతూ బుధవారం రూ.6.35లక్షలకు దివాలాపిటిషన్‌ దాఖలు చేశారు. కేసులోని వివరాలిలా ఉన్నాయి. దివాలాదారు గత 10 సంవత్సరాలుగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో గృహోపకరణాల వస్తువుల వ్యాపారం వాయిదాల పద్ధతిలో చెల్లించేలా నిర్వహిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి కోసం ప్రతివాదుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని..వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించేలా గృహోపకరణాలు విక్రయించే వ్యాపారం చేశాడు. ఈ వ్యాపారంలో నష్టం రావడంతో రుణదాతలకు అప్పు›తీర్చలేక.. వారినుంచి ఒత్తిడి అధికమవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో తనను దివాలాదారునిగా ప్రకటించమని జిల్లా కోర్టులో ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చుతూ రూ.6.35లక్షలకు దివాలాపిటిషన్‌ను బుధవారం దాఖలు చేశాడు. దివాలాదారు తరుపున న్యాయవాదులుగా దిరిశాల కృష్ణారావు, టి.వెంకటరామారావు వ్యవహరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement