ప్రమాదం కాదు..హత్యే..!
ప్రమాదం కాదు..హత్యే..!
Published Wed, Nov 30 2016 8:56 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు
నిందితుల కోసం గాలింపు చర్యలు
రొంపిచర్ల : రొంపిచర్లకు చెందిన కల్లి చిన్నపరెడ్డి హత్యకు గురైనట్టు తెలుస్తోంది. తొలుత రోడ్డు ప్రమాదంలో మృతి చెంది ఉంటాడని భావించినా పోస్టుమార్జం అనంతరం చిన్నపరెడ్డి బంధువుల ఫిర్యాదుమేరకు హత్యకేసుగా నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. బంధువుల ఫిర్యాదుతో సంఘటనా స్థలాన్ని డీఎస్పీ కె.నాగేశ్వరరావు సందర్శించి హత్యకు సంబంధించిన ఆనవాళ్ల కోసం గాలించారు. హత్యకు ఉపయోగించిన వాహనాన్ని కోటప్పకొండ పరిసర ప్రాంతాల్లో స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. పగలే ఈ హత్య జరగడాన్ని అక్కడి వారు చూసి ఉంటారని భావించి ఆ సమయంలో పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు, పశువుల కాపర్లు ఎవరా అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా రూరల్ సీఐ ప్రభాకర్ బుధవారం కూడా పోలీసుస్టేషన్‌కు వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు ముందుభాగం పూర్తిగా దెబ్బతినడంతో పాటు కారుకు రెండువైపులా నంబర్ ప్లేట్లు లేకపోవటంతో కావాలనే ప్లేట్లు తొలగించి హత్యా ప్రయత్నంలో ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement