కడప అగ్రికల్చర్:
విద్యుత్ చౌర్యానికి పాల్పడితే జైలు శిక్ష తప్పదని దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ ఛీప్ విజిలెన్స్ ఆఫీసర్ పి. మనోహర్‌రావు తెలిపారు. మంగళవారం సాయంత్రం విద్యుత్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాలో విద్యుత్ చౌర్యం ఎక్కువగా ఉందని తెలిపారు. గాలివీడు, నందిమండలం బి. కోడూరు, చాపాడు, కోడూరు రూరల్, వల్లూరు, తొండూరు, జమ్మలమడుగు మండలాల్లో 8 జిల్లాల నుంచి వచ్చిన అధికారులతో దాడులు చేయించామన్నారు. ఆయా మండలాల్లో విద్యుత్ మీటర్‌లో వెళ్లకుండా బైపాస్ చేసిన 244 మందిని గుర్తించామన్నారు. ప్రధాన వైర్ల నుంచి కొక్కీలు తగిలించి నేరుగా కరెంటును వాడుకుంటున్న 111 మందిపైన, గహ విద్యుత్ కనెక్షన్‌ను తీసుకుని వ్యాపార సముదాయాలకు వాడుకుంటున్న 15 మందిపైన, బ్యాక్ బిల్లింగ్ కేసులో నలుగురిపైన, అదనపులోడు వాడుకుంటు మీటర్లను మార్చుకోకుండా ఉండే 50 మందిపైన, మొత్తంగా 424 మందిపైన కేసులు నమోదు చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారికి రూ. 28.80 లక్షల అపరాధ రుసుం విధించామన్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విద్యుత్ యోజన కింద రూ .125లకే సర్వీసు ఇస్తున్నామని, అలాగే రూ. 3200ల పరికరాలు కూడా ఉచితంగా అందజేస్తున్నామన్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడకుండా సంస్థకు సహకరించాలని కోరారు. ఈ దాడుల్లో తిరుపతి విజిలెన్స్ ఎస్‌ఈ వి. రవి, ఏపీటీఎస్ సీఐ గౌతమి తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.
విద్యుత్ చౌర్యానికి పాల్పడితే జైలుకే
Published Wed, Aug 31 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
Advertisement
Advertisement