కట్టంగూర్: రెండున్నర లక్షల రూపాయలు అపహరణకు గురైన సంఘటన మండల కేంద్రం పరిధిలోని జాతీయ ర హదారిపై ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండకు చెందిన గోపగోని సరిత నకిరేకల్‌లోని తమ బంధువుల ఇంటివద్ద నుంచి డబ్బును తీసుకుని మధ్యాహ్నం గం.2.30 సమయంలో ఏపీ24టీవీ1140 నంబరు గల తెల్లరంగు ఆటోమ్యాజిక్‌లో ఎక్కింది. దస్తీలో రూ.రెండున్నర లక్షలను మూటకట్టి బ్యాగు అడుగుబాగంలో పెట్టి, పైబాగంలో తన దుస్తులను పెట్టంది. అట్టి బ్యాగును తను కూర్చున్న సీటు ఎదురుగా ఉన్న సీటు కింది బాగంలో పెట్టంది. ఆటో నకిరేకల్ నుంచి బయలుదేరుతుండగా ముగ్గురు మహిళలు ఆటో ఎక్కి తన ఎదురుగా కూర్చున్నారు. కట్టంగూర్ గ్రామ శివారులోని పెట్రోలు బంక్ సమీపంలోకి రాగానే ఒక మహిళ పాపతో కలిసి ఆటో ఎక్కింది. కట్టంగూర్ నుంచి నల్లగొండ క్రాస్‌రోడ్డు దాటగానే అంబేద్కర్‌నగర్ స్టేజీ వద్ద ముగ్గురు మహిళలు దిగిపోయారు. నల్లగొండలోని ఎల్లమ్మదేవాలయం వద్ద సరిత ఆటో దిగుతూ బ్యాగును తీసుకుని తన అక్క ఇంటికి బయలుదేరింది. అనుమానంతో బ్యాగును చెక్ చేసుకోవటంతో డబ్బులు పోయినట్లు గుర్తించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
రెండున్నర లక్షలు అపహరణ
Published Mon, Aug 15 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
Advertisement
Advertisement