తెలంగాణలో లోక్‌జనశక్తిని విస్తరిస్తాం | janasakti party will expand in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో లోక్‌జనశక్తిని విస్తరిస్తాం

Published Sat, Dec 3 2016 2:15 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

తెలంగాణలో లోక్‌జనశక్తిని విస్తరిస్తాం

తెలంగాణలో లోక్‌జనశక్తిని విస్తరిస్తాం

రాష్ట్ర ఏర్పాటులో  పాశ్వాన్‌పాత్ర మరువలేనిది
ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు సైతం కృషి
పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భీంరావు

 
 పెద్దపల్లి : తెలంగాణలోని అట్టడుగు వర్గాలను కలుపుకుపోతూ లోక్‌జనశక్తి పార్టీని విస్తరిస్తామని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనుగాల భీంరావు తెలిపారు. పెద్దపల్లిలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో పేదరిక సమస్య పరిష్కారానికి పార్టీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు ఆయన చేసిన ప్రతిపాదనలే ఫలించాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియాగాంధీ దృష్టికి ఇక్కడి పోరాటాన్ని తీసుకెళ్లి రాష్ట్ర ఏర్పాటుకు పాశ్వన్ విశేష కృషి చేశారన్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. సమావేశంలో మద్దెల ప్రశాంత్, గద్దల వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement