‘నకిలీ కులం’పై జేసీ విచారణ
‘నకిలీ కులం’పై జేసీ విచారణ
Published Fri, Aug 12 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
హన్మకొండ అర్బన్ : నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఆరోపణలు ఎదుర్కొంటున్న 12మంది ఉద్యోగులను జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ శనివారం విచారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అందజేసిన వివరాలు, పత్రాలను పరిశీలిచిన జేసీ వాటిపై సమగ్ర విచారణ జరిపి ఈ నెలాఖరు నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదేరోజు తదుపరి విచారణ ఉంటుందని తెలిపారు. అధికారుల విచారణలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు తేలితే వాటిని రద్దు చేయడంతో పాటు నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని జేసీ పేర్కొన్నారు. కాగా, విచారణ కమిటీ ముందు మున్నూరుకాపు సంఘం రాష్ట్ర నాయకుడు వినయ్ తదితరులు హాజరై 25మంది ఉద్యోగులు తప్పుడు మున్నూరు కాపు కుల ధ్రువీకరణపత్రలతో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు వారిని తొలగించి ఆ స్థానంలో అర్హులైన మున్నూరుకాపులకు అవకాశం కల్పించాలని కోరారు. విచారణలో డీఆర్వో శోభ, వరంగల్ ఆర్డీవో వెంకట మాధవరావు, తహశీల్దార్ రాజ్‌కుమార్, సూపరింటెండెంట్ విశ్వనారాయణ, ఈడీ నర్సింహస్వామి పాల్గొన్నారు.
Advertisement