
అభివృద్ధి కోసమే టీడీపీని ఆశ్రయించా
పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ
తాడేపల్లి రూరల్: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం సీఎం నివాసం వద్ద చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణ ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే మోహనరావు మాట్లాడుతూ పాతపట్నం వెనుకబడిన నియోజకవర్గమని, ఐదు మండలాల్లో ఉన్న ప్రజలకు సమాధానం చెప్పాలంటే అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ముఖ్యంగా వంశధార ప్రాజెక్టును పూర్తి చేస్తే తమ ప్రాంతంలో మరో ఉండవల్లిలో లాగా పచ్చటి పొలాలను చూడవచ్చని చెప్పారు. తాము అమ్ముడు పోయామన్న ప్రచారం వాస్తవం కాదన్నారు.