కాళోజీ యాదిలో.. | Kaloji Narayana Rao Jayanthi Celebrations book release | Sakshi
Sakshi News home page

కాళోజీ యాదిలో..

Published Sat, Sep 9 2017 10:11 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM

కాళోజీ యాదిలో.. - Sakshi

కాళోజీ యాదిలో..

ఉమ్మడి జిల్లాతో నారాయణ రావుకు అనుబంధం
జలగం వెంగళరావుపై ఎన్నికల్లో పోటీ
నేడు కాళోజీ జయంతి


తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వని.. తెలంగాణ స్వేచ్ఛాగీతిక ఆలపించిన బడుగుల మనిషి.. పోరాటంలో తరించిన ప్రజాకవి మన కాళోజీ నారాయణరావు. ఆయనకు ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం జిల్లాలతో విడదీయలేని అనుబంధం ఉంది.  తెలంగాణ గోసను వినిపించిన కాళోజీ జయంతి సెప్టెంబర్‌ 9ని  తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. శనివారం కాళోజీ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కథనం.

ఖమ్మంకల్చరల్‌:
ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కాళోజీ బంధువులు, మిత్రులు న్నారు. 1972 సంవత్సరంలో ఎమర్జెనీ ఎత్తివేసిన తరువాత జరిగిన ఎన్నికల్లో అప్రజాస్వామ్యక విధానాలకు వ్యతిరేకంగా, పీడీతతాడితుల పక్షపాతిగా నిర్బంధాలను ధ్వంసం చేస్తూ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి నాటి జలగం వెంగళరావుపై పోటీకి నిలిచారు. ఈ సందర్బంగా అనేక సభల్లో తనదైన శైలిలో గళం విప్పారు. స్వేచ్ఛాయుత రాజీకీయాలకు బీజం వేసి జిల్లాలో తనదైన  ముద్ర వేసుకున్నారు.

‘నెత్తుటి ధారలు’ పుస్తకావిష్కరణ..
నాటి ఇల్లెందు ప్రాంత కాచనపల్లి ఎన్‌కౌంటర్‌ సందర్భంగా ముద్రించిన ‘నెత్తుటిధారలు’ పుస్తకాన్ని ఖమ్మం జిల్లా కేంద్రంలోని గ్రం«థాలయంలో కాళోజీ ఆవిష్కరించి ఉద్వేగభరిత ఉపన్యాసమిచ్చారు. ఇలా పలుమార్లు జిల్లాలో ప్రజాస్వామ్యవాదిగా, మానవతావాదిగా తన జీవనగమనాన్ని సాగించారు.

కలం యోధుడు...
ప్రజల సమస్యలపై పోరాడిన అలుపెరగని కలం యోధుడు కాళోజీ నారాయణరావు. నా కులం, నా ప్రాంతం, నా భాష అనే భేదం లేని గొప్ప మానవతావాది. తరాలు మారినా, యుగాలు మారినా కాళోజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన ఆవశ్యకత ఉంది.
రవీందర్, తెలుగు లెక్చరర్‌

‘కాళోజీ’ నిత్య చైతన్య స్ఫూర్తి
ప్రజాకవి కాళోజీ జయంతి తెలుగు వారి పండగ కావడం గర్వకారణం. కాళోజీ అప్రజాస్వామ్యక విధానాలపై తిరుగుబాటు కలాన్ని గళాన్నెత్తిన చైతన్యస్ఫూర్తి. అన్ని తరాలకు ఆదర్శవాదిగా భవితకు మార్గదర్శిగా కాళోజీ నిలిచారు.
–లెనిన్‌ శ్రీనివాస్, వికాస వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి

తెలుగుయాస, భాష కోసం పోరాడిన మహోన్నతుడు
అన్య భాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు సకలించు ఆంధ్రుడా! చావవెందుకురా! అంటూ తెలుగు భాష యాస, భాష కోసం విశేష కృషి చేసిన ప్రజాకవి కాళోజీ..! కాళోజీ కలానికి కోట్ల కత్తుల పదును. అందుకే ప్రతినిత్యం ప్రజల పక్షాన నిలబడి కలాన్ని ఝలిపించారు. అలాంటి మహోన్నతుడి జయంతిని అధికారింగా జరుపుకోవడం  అభినందనీయం.    –రాచమళ్ల ఉపేందర్, రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement